చిత్రం: బడిపంతులు (1972) సంగీతం: కె.వి.మహదేవన్, సాహిత్యం: ఆత్రేయ, డా॥ సి. నారాయణరెడ్డి, ఆరుద్ర, దాశరథి కృష్ణమాచార్య గానం: ఘంటసాల, పి.సుశీల, యస్.పి. బాలు నటీనటులు: యన్.టి.రామారావు, అంజలీదేవి, విజయ లలిత, కృష్ణం రాజు, రామకృష్ణ, టి.పద్మిని, జయంతి, బేబీశ్రీదేవి దర్శకత్వం: పి.చంద్రశేఖరరెడ్డి నిర్మాత: పి. పేర్రాజు విడుదల తేది: 22.11.1972 (శ్రీదేవి చైల్డ్ ఆర్టిస్ట్ గా యన్.టి.రామారావు గారితో ఈ సినిమాలో నటించింది)
Songs List:
భారతమాతకు జేజేలు పాట సాహిత్యం
చిత్రం: బడిపంతులు (1972) సంగీతం: కె.వి.మహదేవన్, సాహిత్యం: ఆత్రేయ గానం: ఘంటసాల, బృందం పల్లవి: భారత మాతకు జేజేలు బంగరు భూమికి జేజేలు భారత మాతకు జేజేలు బంగరు భూమికి జేజేలు ఆసేతుహిమాచల సస్యశ్యామల జీవధాత్రికి జేజేలు ఆసేతుహిమాచల సస్యశ్యామల జీవధాత్రికి జేజేలు భారత మాతకు జేజేలు బంగరు భూమికి జేజేలు చరణం: 1 త్రివేణి సంగమ పవిత్రభూమి... నాల్గు వేదములు పుట్టిన భూమి నాల్గు వేదములు పుట్టిన భూమి త్రివేణి సంగమ పవిత్రభూమి... నాల్గు వేదములు పుట్టిన భూమి గీతామృతమును పంచిన భూమి... పంచశీల బోధించిన భూమి పంచశీల బోధించిన భూమి భారత మాతకు జేజేలు... బంగరు భూమికి జేజేలు చరణం: 2 శాంతిదూతగా వెలసిన బాపూ... జాతి రత్నమై వెలిగిన నెహ్రూ శాంతిదూతగా వెలసిన బాపూ జాతి రత్నమై వెలిగిన నెహ్రూ విప్లవ వీరులు.. వీర మాతలు …విప్లవ వీరులు... వీర మాతలు … ముద్దుబిడ్డలై మురిసే భూమి .. భారత మాతకు జేజేలు... బంగరు భూమికి జేజేలు చరణం: 3 సహజీవనము సమభావనము... సమతా వాదము వేదముగా సమతా వాదము వేదముగా సహజీవనము సమభావనము... సమతా వాదము వేదముగా ప్రజా క్షేమము ప్రగతి మార్గము... లక్ష్యములైన విలక్షణ భూమి లక్ష్యములైన విలక్షణ భూమి భారత మాతకు జేజేలు... బంగరు భూమికి జేజేలు ఆసేతు హిమాచల సస్యశ్యామల జీవధాత్రికి జేజేలు భారత మాతకు జేజేలు బంగరు భూమికి జేజేలు
పిల్లలము బడి పిల్లలము పాట సాహిత్యం
చిత్రం: బడిపంతులు (1972) సంగీతం: కె.వి.మహదేవన్, సాహిత్యం: ఆత్రేయ గానం: పి.సుశీల, బృందం పల్లవి: పిల్లలము బడి పిల్లలము... పిల్లలము బడి పిల్లలము... నడుములు కట్టి కలిశాము...పిడికిలి బిగించి కదిలాము పిల్లలము బడి పిల్లలము చరణం: 1 పలక బలపం పట్టిన చేతులు పలుగు పార ఎత్తినవి.. పలుగు పార ఎత్తినవి పలక బలపం పట్టిన చేతులు పలుగు పార ఎత్తినవి ఓనమాలను దిద్దిన వేళ్ళు...ఒకటై మట్టిని కలిపినవి ఒకటై మట్టిని కలిపినవి.. పిల్లలము బడి పిల్లలము చరణం: 2 ప్రతి అణువు... మా భక్తికి గుర్తు ప్రతి రాయి.. మా శక్తికి గుర్తు ప్రతి అణువు... మా భక్తికి గుర్తు ప్రతి రాయి.. మా శక్తికి గుర్తు చేతులు కలిపి చెమటతో తడిపి.. చేతులు కలిపి చెమటతో తడిపి... కోవెల కడదాం గురుదేవునికి పిల్లలము..పిల్లలము... బడి పిల్లలము.. బడి పిల్లలము చరణం: 3 తెలియని వాళ్ళకు తెలివిగల వాళ్ళకు తెరిచుంటవి ఈ ఇంటి తలుపులు..తెరిచుంటవి ఈ ఇంటి తలుపులు తెలియని వాళ్ళకు తెలివిగల వాళ్ళకు తెరిచుంటవి ఈ ఇంటి తలుపులు..తెరిచుంటవి ఈ ఇంటి తలుపులు వెలుగును ఇచ్చే ఈ కిటికీలు ...పంతులు గారి చల్లని కళ్ళు... వెలుగును ఇచ్చే ఈ కిటికీలు ...పంతులు గారి చల్లని కళ్ళు... పిల్లలము..పిల్లలము... బడి పిల్లలము.. బడి పిల్లలము నడుములు కట్టి కలిశాము...పిడికిలి బిగించి కదిలాము పిల్లలము బడి పిల్లలము..ల.లాలా..లా..లా.లా
నిన్న మొన్న పాట సాహిత్యం
చిత్రం: బడిపంతులు (1972) సంగీతం: కె.వి.మహదేవన్, సాహిత్యం: ఆత్రేయ గానం: ఘంటసాల, పి.సుశీల పల్లవి: నిన్న మొన్న రేకు విప్పిన లేత మొగ్గా నీకు ఇంతలోనె నన్ను చూస్తే అంత సిగ్గా నిన్న మొన్న రెక్కలొచిన గండు తుమ్మెద నీకు అంతలోనె నన్ను చూస్తే ఇంత తొందరా చరణం: 1 పరికిణీలు కట్టినపుడు లేని సొగసులు నీ పైట కొంగు చాటున దోబూచులాడెను పసితనాన ఆడుకొన్న తొక్కుడు బిళ్ళలు నీ పరువానికి నేర్పినవి దుడుకు కోర్కెలు చరణం: 2 పాల బుగ్గలు పూచె లేత కెంపులు వాలు చూపులందుతోటె వయసు జోరులు చిరుత నవ్వులు ఒలికె చిలిపితనాలు చిన్ననాటి చెలిమి తీసె వలపు దారులు నిన్న మొన్న రేకు విప్పిన లేత మొగ్గా నీకు ఇంతలోనె నన్ను చూస్తే అంత సిగ్గా నిన్న మొన్న రెక్కలొచిన గండు తుమ్మెద నీకు అంతలోనె నన్ను చూస్తే ఇంత తొందరా చరణం: 3 ఇన్నాళ్ళు కళ్ళు కళ్ళు కలిపి చూస్తివి ఇపుడేల రెప్పలలా రెపరెపన్నవి ఇన్నాళ్ళు కళ్ళు కళ్ళు కలిపి చూస్తివి ఇపుడేల రెప్పలలా రెపరెపన్నవి ఇన్నాళ్ళు నీ కళ్ళు ఊరుకున్నవి ఇపుడేవేవో... ఇపుడేవేవో మూగబాస లాడుతున్నవి ఇన్నాళ్ళు నీ కళ్ళు ఊరుకున్నవి ఇపుడేవేవో... ఇపుడేవేవో మూగబాస లాడుతున్నవి నిన్న మొన్న రేకు విప్పిన లేత మొగ్గా నీకు ఇంతలోనె నన్ను చూస్తే అంత సిగ్గా నిన్న మొన్న రెక్కలొచిన గండు తుమ్మెద నీకు అంతలోనె నన్ను చూస్తే ఇంత తొందరా
ఓ లమ్మో పాట సాహిత్యం
చిత్రం: బడిపంతులు (1972) సంగీతం: కె.వి.మహదేవన్, సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి గానం: పి.సుశీల బృందం ఏవని ఏవని చెప్పను ఏవని ఏవని చెప్పను ఓ లమ్మో వాడు ఎన్నెన్ని
మీ నగుమోము నా కనులారా పాట సాహిత్యం
చిత్రం: బడిపంతులు (1972) సంగీతం: కె.వి.మహదేవన్, సాహిత్యం: ఆత్రేయ గానం: పి.సుశీల పల్లవి: మీ నగుమోము నా కనులారా కడదాకా కననిండు మీ నగుమోము నా కనులారా కడదాకా కననిండు ఈ సూత్రముతో ఈ కుంకుమతో నను కడతేరి పోనిండు మీ నగుమోము నా కనులారా కడదాకా కననిండు చరణం: 1 ఉపచారాలే చేసితినో.. ఎరగక అపచరాలే చేసితినో ఉపచారాలే చేసితినో.. ఎరగక అపచరాలే చేసితినో ఒడుదుడుకులలో తోడై ఉంటిని .. మీ అడుగున అడుగై నడిచితిని మీ నగుమోము నా కనులారా కడదాకా కననిండు చరణం: 2 రెక్కలు వచ్చి పిల్లలు వెళ్ళారు...రెక్కలు అలిసి మీరున్నారు రెక్కలు వచ్చి పిల్లలు వెళ్ళారు...రెక్కలు అలిసి మీరున్నారు పండుటాకులము మిగిలితిమి.. పండుటాకులము మిగిలితిమి..ఇంకెన్ని పండుగలు చూడనుంటిమి మీ నగుమోము నా కనులారా కడదాకా కననిండు చరణం: 3 ఏ నోములు నే నోచితినో .. ఈ దేవుని పతిగా పొందితిని ఏ నోములు నే నోచితినో .. ఈ దేవుని పతిగా పొందితిని ప్రతి జన్మ మీ సన్నిధిలోనా... ప్రమిదగ వెలిగే వరమడిగితిని మీ నగుమోము నా కనులారా కడదాకా కననిండు ఈ సూత్రముతో ఈ కుంకుమతో నను కడతేరి పోనిండు మీ నగుమోము నా కనులారా కడదాకా కననిండు
ఓరోరి పిల్లగాడా పాట సాహిత్యం
చిత్రం: బడిపంతులు (1972) సంగీతం: కె.వి.మహదేవన్, సాహిత్యం: ఆత్రేయ గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల ఓరోరి పిల్లగాడా వగలమారి పిల్లగాడా నీ ఉరకలు ఊపులు
ఎడబాటెరుగని పాట సాహిత్యం
చిత్రం: బడిపంతులు (1972) సంగీతం: కె.వి.మహదేవన్, సాహిత్యం: దాశరథి గానం: ఘంటసాల పల్లవి: ఎడబాటు ఎరుగని పుణ్య దంపతుల విడదీసింది విధి నేడు ఎడబాటు ఎరుగని పుణ్య దంపతుల విడదీసింది విధి నేడు తోడు నీడగా వుండే వయసున గూడు విడిచి వేరైనారు .. గూడు విడిచి వేరైనారు... ఎడబాటు ఎరుగని పుణ్య దంపతుల విడదీసింది విధి నేడు చరణం: 1 జంటను వీడిన ఒంటరి బ్రతుకై జాలిగ కుమిలేరు జంటను వీడిన ఒంటరి బ్రతుకై జాలిగ కుమిలేరు ఎదలోదాగిన మూగ వేదన ఎవరికి చెప్పేరు.. ఎలా భరించేరు... ఎడబాటు ఎరుగని పుణ్య దంపతుల విడదీసింది విధి నేడు చరణం: 2 ఒకే తనువుగ ఒకే మనువుగా ఆ దంపతులు జీవించారు ఒకే తనువుగ ఒకే మనువుగ ఆ దంపతులు జీవించారు ఆస్తిపాస్తివలె అన్నదమ్ములు ఆ తలిదండ్రుల పంచారు .. ఆ తలిదండ్రుల పంచారు ఎడబాటు ఎరుగని పుణ్య దంపతుల విడదీసింది విధి నేడు
రాక రాక వచ్చావు పాట సాహిత్యం
చిత్రం: బడిపంతులు (1972) సంగీతం: కె.వి.మహదేవన్, సాహిత్యం: ఆరుద్ర గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల రాక రాక వచ్చావు రంభలాగ ఉన్నావు
బూచాడమ్మా బూచాడు పాట సాహిత్యం
చిత్రం: బడిపంతులు (1972) సంగీతం: కె.వి.మహదేవన్, సాహిత్యం: ఆరుద్ర గానం: పి.సుశీల, బృందం పల్లవి: బూచాడమ్మా...బూచాడు...బుల్లి పెట్టె లో వున్నాడు... బూచాడమ్మా...బూచాడు...బుల్లి పెట్టె లో వున్నాడు కళ్ళకెపుడు కనపడడు కబురులెన్నో చెపుతాడు బూచాడమ్మా...బూచాడు...బుల్లి పెట్టె లో వున్నాడు... బూచాడమ్మా...బూచాడు...బుల్లి పెట్టె లో వున్నాడు కళ్ళకెపుడు కనపడడు కబురులెన్నో చెపుతాడు బూచాడమ్మా...బూచాడు...బుల్లి పెట్టె లో వున్నాడు... చరణం: 1 గుర్ గుర్ మంటూ గోలెడతాడు.. హెల్లో అని మొదలెడతాడూ... గుర్ గుర్ మంటూ గోలెడతాడు.. హెల్లో అని మొదలెడతాడూ... ఎక్కడ వున్న ఎవ్వరినైనా.. ఎక్కడ వున్న ఎవ్వరినైనా.. పలుకరించి కలుపుతాడు... బూచాడమ్మా...బూచాడు...బుల్లి పెట్టె లో వున్నాడు... బూచాడమ్మా...బూచాడు...బుల్లి పెట్టె లో వున్నాడు కళ్ళకెపుడు కనపడడు కబురులెన్నో చెపుతాడు బూచాడమ్మా...బూచాడు...బుల్లి పెట్టె లో వున్నాడు... చరణం: 2 తెలుగు తమిళ హిందీ కన్నడ భాషా భేధాలెరుగని వాడూ తెలుగు తమిళ హిందీ కన్నడ భాషా భేధాలెరుగని వాడూ కులము మతము జాతేదైనా... కులము మతము జాతేదైనా .. గుండెలు గొంతులు ఒకటంటాడు బూచాడమ్మా...బూచాడు...బుల్లి పెట్టె లో వున్నాడు... చరణం: 3 డిల్లీ మద్రాస్ హైద్రాబాద్ రష్యా అమెరికా లండన్ జపాన్ ఎక్కడికైనా వెళుతుంటాడు ఎల్లలు మనసుకు లేవంటాడు.. ఎక్కడికైనా వెళుతుంటాడు ఎల్లలు మనసుకు లేవంటాడు.. ఒకే తీగ పై నడిపిస్తాడు... ఒకే ప్రపంచం అనిపిస్తాడు... బూచాడమ్మా...బూచాడు...బుల్లి పెట్టె లో వున్నాడు... బూచాడమ్మా...బూచాడు...బుల్లి పెట్టె లో వున్నాడు కళ్ళకెపుడు కనపడడు కబురులెన్నో చెపుతాడు బూచాడమ్మా...బూచాడు...బుల్లి పెట్టె లో వున్నాడు...
No comments
Post a Comment