చిత్రం: భార్యా బిడ్డలు (1972) సంగీతం: కె.వి.మహదేవన్ నటీనటులు: అక్కినేని నాగేశ్వరరావు, జయలలిత, బేబీ శ్రీదేవి దర్శకత్వం: తాతినేని రామారావు నిర్మాత: ఏ.వి.సుబ్బారావు విడుదల తేది: 15.01.1972
శ్రీదేవి చైల్డ్ ఆర్టిస్ట్ గా నాగేశ్వరరావు గారితో కలిసి నటించిన సినిమాలు
1. భార్యా బిడ్డలు (1972) 2. భక్త తుకారాం (1973) 3. మరపురాని మనిషి (1973)
Songs List:
ఆకులు పొకలు పాట సాహిత్యం
చిత్రం: భార్యా బిడ్డలు (1972) సంగీతం: కె.వి.మహదేవన్ సాహిత్యం: ఆచార్య ఆత్రేయ గానం: ఘంటసాల, ఎల్.ఆర్.ఈశ్వరి ఆకులు పొకలు
భలే భలే నచ్చారు పాట సాహిత్యం
చిత్రం: భార్యా బిడ్డలు (1972) సంగీతం: కె.వి.మహదేవన్ సాహిత్యం: ఆచార్య ఆత్రేయ గానం: పి. సుశీల భలే భలే నచ్చారు
చల్ మోహనరంగా పాట సాహిత్యం
చిత్రం: భార్యా బిడ్డలు (1972) సంగీతం: కె.వి.మహదేవన్ సాహిత్యం: ఆచార్య ఆత్రేయ గానం: ఘంటసాల చల్ మోహనరంగా
అందమైన తీగకు పాట సాహిత్యం
చిత్రం: భార్యా బిడ్డలు (1972) సంగీతం: కె.వి.మహదేవన్ సాహిత్యం: ఆచార్య ఆత్రేయ గానం: ఘంటసాల అందమైన తీగకు పందిరుంటె చాలును పైకి పైకి పాకుతుంది చినదానా పరవశించి సాగుతుంది చినదానా అందమైన తీగకు పందిరుంటె చాలును పైకి పైకి పాకుతుంది చినదానా పరవశించి సాగుతుంది చినదానా గువ్వకెగిరే కోరికుంటే రెక్కలొస్తాయి తప్పటడుగులె ముందు ముందు నడకలౌతాయి ఆశ ఉంటే మోడుకూడా చిగురు వేస్తుంది అందమున కానందమపుడే తోడువస్తుంది అందమైన తీగకు పందిరుంటె చాలును పైకి పైకి పాకుతుంది చినదానా పరవశించి సాగుతుంది చినదానా పాదులోని తీగవంటిది పడుచు చిన్నది పరువమొస్తే చిగురు వేసి వగలుబోతుంది మొగ్గ తొడిగీ మురిసిపోతూ సిగ్గు పడుతుందీ తగ్గ జతకై కళ్లతోటే వెతుకుతుంటుంది అందమైన తీగకు పందిరుంటె చాలును పైకి పైకి పాకుతుంది చినదానా పరవశించి సాగుతుంది చినదానా కళ్లు కళ్లు కలిసినపుడు కలలు వస్తాయి కన్నెపిల్ల కలలకెపుడో కాళ్లు వస్తాయి అడుగులోన అడుగు వేస్తూ అందమొస్తుంది నడవలేని నడకలే ఒక నాట్యమౌతుంది అందమైన తీగకు పందిరుంటె చాలును పైకి పైకి పాకుతుంది చినదానా పరవశించి సాగుతుంది చినదానా
చక్కనయ్యా చందమామా పాట సాహిత్యం
చిత్రం: భార్యా బిడ్డలు (1972) సంగీతం: కె.వి.మహదేవన్ సాహిత్యం: ఆచార్య ఆత్రేయ గానం: ఘంటసాల చక్కనయ్యా చందమామా
బ్రతుకు పూలబాట కాదు పాట సాహిత్యం
చిత్రం: భార్యా బిడ్డలు (1972) సంగీతం: కె.వి.మహదేవన్ సాహిత్యం: ఆచార్య ఆత్రేయ గానం: ఘంటసాల లేని బాట వెతుకుతున్న పేద వానికి రాని పాట పాడుకున్న పిచ్చివానికి బ్రతుకు పూలబాట కాదు అది పరవశించి పాడుకునే పాట కాదు బ్రతుకు పూలబాట కాదు అది పరవశించి పాడుకునే పాట కాదు బ్రతుకు పూలబాట కాదు దోబూచులాడుతుంది విధి మనతో దొంగాటలాడుతుంది మనసులతో దోబూచులాడుతుంది విధి మనతో దొంగాటలాడుతుంది మనసులతో కనిపించే నవ్వులన్ని నవ్వులు కావు అవి బ్రతుకు తెరువు కోసం పెదవులాడు కల్లలు బ్రతుకు పూలబాట కాదు అది పరవశించి పాడుకునే పాట కాదు బ్రతుకు పూలబాట కాదు మాటలలో చిక్కుబడి మనసు నలిగిపోతుంది మనసులేని మాటలనే మనం నమ్ముతున్నది పలుకలేని ప్రతి గుండె బాధతో నిండినది ఆ ఆ ఆ ఒలికే ప్రతి కన్నీటి చుక్క వెచ్చగా ఉంటుంది బ్రతుకు పూలబాట కాదు అది పరవశించి పాడుకునే పాట కాదు బ్రతుకు పూలబాట కాదు చీకటిలో వెలుగును చూడ నేర్చుకో చమటలో స్వర్గాన్ని సృష్టి చేసుకో చీకటిలో వెలుగును చూడ నేర్చుకో చమటలో స్వర్గాన్ని సృష్టి చేసుకో విధి వ్రాసిన వ్రాతలకు విరుగుడొక్కటే పదిమందితోటి పంచుకునే రోజు వచ్చుటే ఆ రోజు వచ్చులే బ్రతుకు పూలబాట కాదు అది పరవశించి పాడుకునే పాట కాదు బ్రతుకు పూలబాట కాదు
చక్కనయ్యా చందమామా పాట సాహిత్యం
చిత్రం: భార్యా బిడ్డలు (1972) సంగీతం: కె.వి.మహదేవన్ సాహిత్యం: ఆచార్య ఆత్రేయ గానం: పి.సుశీల చక్కనయ్యా చందమామా ఎక్కడున్నావూ నీవు లేక దిక్కులేని చుక్కలైనామూ చక్కనయ్యా చందమామా ఎక్కడున్నావూ నీవు లేక దిక్కులేని చుక్కలైనామూ మొన్న పున్నమి రాతిరి నీవొడిని నిద్దురపోతిమి మొన్న పున్నమి రాతిరి నీవొడిని నిద్దురపోతిమి తెల్లవారి లేచి చూచి తెల్లబోయ్యామూ గొల్లుమన్నాము చక్కనయ్యా చందమామా ఎక్కడున్నావూ నీవు లేక దిక్కులేని చుక్కలైనామూ మబ్బు మబ్బు మాటున ఈ మసక చీకటి చాటున మబ్బు మబ్బు మాటున ఈ మసక చీకటి చాటున బిక్కు బిక్కున దిక్కులన్నీ తిరుగుతున్నామూ వెతుకుతున్నామూ చక్కనయ్యా చందమామా ఎక్కడున్నావూ నీవు లేక దిక్కులేని చుక్కలైనామూ దారి తప్పి పోతివో నీ వారి సంగతి మరచినావో దారి తప్పి పోతివో నీ వారి సంగతి మరచినావో ఏ రాణి వాసములోన చేరి రాజువై నావో రాలేకవున్నావో చక్కనయ్యా చందమామా ఎక్కడున్నావూ నీవు లేక దిక్కులేని చుక్కలైనామూ
వలచీనానమ్మ హమ్మా హమ్మా పాట సాహిత్యం
చిత్రం: భార్యా బిడ్డలు (1972) సంగీతం: కె.వి.మహదేవన్ సాహిత్యం: ఆచార్య ఆత్రేయ గానం: ఘంటసాల, పి.సుశీల వలచీనానమ్మ హమ్మా హమ్మా హమ్మా హమ్మా వలచీనానమ్మ వలచినానని తెలిసికూడా నే పలకరించినా పలకడమ్మా వలచీనానమ్మ వలచీనానమ్మ హేయ్ వలచీనావమ్మా హమ్మా హమ్మా హమ్మా హమ్మా వలచీనావమ్మా వలచినావని తెలిసినంతనే పలుకరాక నే నిలిచానమ్మా వలచీనావమ్మా వలచీనావమ్మా కళ్ళున్నందుకు ఒకసారైనా కలపాలోయి కమ్మని కబురులు సరదాకైనా చెప్పాలోయి కళ్ళున్నందుకు ఒకసారైనా కలపాలోయి కమ్మని కబురులు సరదాకైనా చెప్పాలోయి కబురులు కమ్మగ ఉండవమ్మ జరగకపోతేనూ కబురులు కమ్మగ ఉండవమ్మ జరగకపోతేనూ కళ్ళు కలిపితే ఊరకపోదు కలతేరేగేను వలచీనానమ్మ హమ్మా హమ్మా హమ్మా హమ్మా వలచీనానమ్మ వలచినావని తెలిసినంతనే పలుకరాక నే నిలిచానమ్మా వలచీనావమ్మా వలచీనావమ్మా వయసంటేనే నీ ఒంటికి పడదా ఊరకుంటావు సొగసంటే నీ కంటికి చేదా చూడనంటావు వయసంటేనే నీ ఒంటికి పడదా ఊరకుంటావు సొగసంటే నీ కంటికి చేదా చూడనంటావు సొగసులోనా సొగసే లేదు సొంతం కాకుంటే సొగసులోనా సొగసే లేదు సొంతం కాకుంటే వయసే ఒంటికి చెరుపౌతుంది వదలి ఊరుకుంటే వలచీనానమ్మ హమ్మా హమ్మా హమ్మా వలచీనానమ్మ వలచినావని తెలిసినంతనే పలుకరాక నే నిలిచానమ్మా వలచీనావమ్మా వలచీనావమ్మా ఓఓఓ హోఓఓ ఓఓఓ హోఓఓ
Search Box
Subscribe to:
Post Comments
(
Atom
)
Most Recent
Default
No comments
Post a Comment