చిత్రం: చెల్లెలు కాపురం (1971) సంగీతం: కె.వి.మహదేవన్ సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి, దేవులపల్లి కృష్ణ శాస్త్రి, కొసరాజు, దాశరధి గానం: పి.సుశీల, యస్.పి.బాలు, యస్.జానకి, పి.బి.శ్రీనివాస్, బి.వసంత నటీనటులు: శోభన్ బాబు, వాణిశ్రీ, మణిమాల, చంద్రమోహన్ కథ: మన్నవ. బాలకృష్ణ మాటలు: గొల్లపూడి మారుతీరావు దర్శకత్వం: కె.విశ్వనాధ్ నిర్మాత: మన్నవ వెంకటరావు విడుదల తేది: 27.11.1971
Songs List:
పిల్లగాలి ఊదింది పిల్లనగ్రోవి పాట సాహిత్యం
చిత్రం: చెల్లెలు కాపురం (1971) సంగీతం: కె.వి.మహదేవన్ సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి గానం: యస్.పి.బాలు పిల్లగాలి ఊదింది పిల్లనగ్రోవి
భలే భలే మా అన్నయ్య పాట సాహిత్యం
చిత్రం: చెల్లెలు కాపురం (1971) సంగీతం: కె.వి.మహదేవన్ సాహిత్యం: కొసరాజు గానం: యస్.జానకి భలే భలే మా అన్నయ్య
ఈ దారి నా స్వామి నడిచేనే.. పాట సాహిత్యం
చిత్రం: చెల్లెలు కాపురం (1971) సంగీతం: కె.వి.మహదేవన్ సాహిత్యం: దేవులపల్లి కృష్ణశాస్త్రి గానం: పి. బి. శ్రీనివాస్, యస్.జానకి పల్లవి: ఈ దారి నా స్వామి నడిచేనే... పాదాల జాడలివిగోనే రానే వచ్చాడు తీరా తానే వచ్చాడూ కృష్ణుడు రానే వచ్చాడు తీరా తానే వచ్చాడూ లేవండీ పొదరింటా లేవండీ పొదరింటా లెండే పొగడా గోరింటా రానే వచ్చాడు తీరా తానే వచ్చాడూ ఎవరే ఎవరే ఎవరే మువ్వల మురళిని నవ్వే పెదవుల ముద్దాడే వాడే నన్నేలువాడు కన్నుల చల్లని వెన్నెల జల్లులు విరజిమ్మే వాడే.. నన్నేలువాడు ఓ... ఓ... ఓహో ఈ నల్లని రూపం చూచీ ఈ పిల్ల సోయగము వలచీ ఈ నల్లని రూపం చూచీ ఈ పిల్ల సోయగము వలచీ రేపల్లె విడిచి రేయల్ల నడచి మన పల్లెకు దయచేసాడటే లేవండీ పొదరింటా లెండే పొగడా గోరింటా రానే వచ్చాడు తీరా తానే వచ్చాడూ కృష్ణుడు రానే వచ్చాడు తీరా తానే వచ్చాడూ చరణం: 1 అటు అడుగిడితే నా తోడూ ఇటు చూడూ అడుగిడితే నా తోడూ ఇటు చూడూ ఇట నిలిచినాడు నీ కోసం లీలా ప్రియుడూ ఇటు చూడూ వలచి వలచి వచ్చినదెవరో పిలిచి పిలిచి అలసిన ఈ పిల్లనగ వలచి వలచి వచ్చినదెవరో పిలిచి పిలిచి అలసిన ఈ పిల్లగ్రోవినడుగు పిల్లగ్రోవినడుగూ ఇటు చూడూ చరణం: 2 కృష్ణా.. ఏల స్వామీ దయమాలీ ఈ దీనురాలిని ఎగతాలీ ఏల స్వామి దయమా నీ కళ్ళ ఎదుటా నిలువలేనీ పాదధూళిని పొందలేనీ నీడకైనా నోచుకోనీ రేయి కనులా నల్లనైన దీనురాలిని ఎగతాలీ కనులకు తోచేది కాదు సోయగమూ మనసులో పూచేటీ మధురిమగానీ నీ చెలులు చూసేదీ నీ బాహ్యమూర్తీ నేను వలచేదీ నా నీలలోదీప్తి
చెలువ పంపిన పూల రేకులు పాట సాహిత్యం
చిత్రం: చెల్లెలు కాపురం (1971) సంగీతం: కె.వి.మహదేవన్ సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి గానం: యస్.పి. బాలు చెలువ పంపిన పూల రేకులు
విరహమోపగలేక పాట సాహిత్యం
చిత్రం: చెల్లెలు కాపురం (1971) సంగీతం: కె.వి.మహదేవన్ సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి గానం: యస్.పి. బాలు విరహమోపగలేక
నా చిట్టీ నా చిన్నీ పాట సాహిత్యం
చిత్రం: చెల్లెలు కాపురం (1971) సంగీతం: కె.వి.మహదేవన్ సాహిత్యం: దాశరథి గానం: పి. సుశీల, బి. వసంత పల్లవి: రాణీ రమణీ మల్లీ వల్లీ రాజీ రోజా సరోజా ష్... నా చిట్టి నా చిన్నీ నా చిట్టి నా చిన్నీ ఆనక అన్నీ చెబుతాలే లిల్లీ లిల్లీ అల్లరి పెట్టకు అందరిలో తల్లీ తల్లీ ఆనక అన్నీ చెబుతాలే లిల్లీ లిల్లీ అల్లరి పెట్టకు అందరిలో తల్లీ తల్లీ నా చిట్టీ నా చిన్నీ నా చిట్టీ నా చిన్నీ చరణం: 1 ఎన్నడు లేనీ ఈ పులకింతా ఎందుకోసమే నీ వళ్ళంతా ఎన్నడు లేనీ ఈ పులకింతా ఎందుకోసమే నీ వళ్ళంతా ఎందుకే ఎందుకే ఎందుకే మల్లెల గాలీ చల్లగ వీచి ఝల్లని పించెను ఒళ్ళంతా మల్లెల గాలీ చల్లగ వీచి ఝల్లని పించెను ఒళ్ళంతా అందుకే అందుకే అందుకే ఆ.. ఉం బేబీ రూబీ సీతా గీతా షీలా మాలా సుశీలా ష్.. నా చిట్టీ నా చిన్నీ నా చిట్టీ నా చిన్నీ చరణం: 2 నీ బుగ్గలలోనా సిగ్గుల రోజా మొగ్గలు తొడిగే ఏ ఎందుకనీ నీ బుగ్గలలోనా సిగ్గుల రోజా మొగ్గలు తొడిగే ఏ ఎందుకనీ ఎందుకే ఎందుకే ఎందుకే చెలి చేతులలో చిక్కిన వేళా సిగ్గే మొగ్గై విరిసెనులే చెలి చేతులలో చిక్కిన వేళా సిగ్గే మొగ్గై విరిసెనులే అందుకే అందుకే అందుకే అంతేనా హా రాజు రామూ వేణూ శీనూ సోమూ గోపీ బాలయ్యా ష్.. నా చిట్టీ నా చిన్నీ నా చిట్టీ నా చిన్నీ
ఎవరికోసం రాధ పాట సాహిత్యం
చిత్రం: చెల్లెలు కాపురం (1971) సంగీతం: కె.వి.మహదేవన్ సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి గానం: యస్.పి. బాలు ఎవరికోసం రాధ
పరిమళించు వెన్నెల నీవే పాట సాహిత్యం
చిత్రం: చెల్లెలు కాపురం (1971) సంగీతం: కె.వి.మహదేవన్ సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి గానం: యస్.పి. బాలు, పి. సుశీల పల్లవి: పరిమళించు వెన్నెల నీవే - మ్మ్ పలకరించు మల్లిక నీవే - మ్మ్ నా జీవన బృందావనిలో - మ్మ్ నడయాడే రాధిక నీవే కనుల ముందు నీవుంటే కవిత పొంగి పారదా - మ్మ్ తొలి చిగురుల చూడగానే కల కోకిల కూయదా - మ్మ్ కనుల ముందు నీవుంటే కవిత పొంగి పారదా తొలి చిగురుల చూడగానే కల కోకిల కూయదా చరణం: 1 అలనాటి జనకుని కోలువులో తొలి సిగ్గుల మేలి ముసుగులో అలనాటి జనకుని కోలువులో తొలి సిగ్గుల మేలి ముసుగులో ఆ..ఆ..రాముని చూసిన జానకివై అభిరాముని వలపుల కానుకవై వాల్మీకి కావ్య వాకిట వెలసిన.. వసంత మూర్తివి నీవే కనుల ముందు నీవుంటే కవిత పొంగి పారదా తొలి చిగురులు చూడగానే కల కోకిల కూయదా చరణం: 2 అలనాటి సుందరవనములో వనములో ఎల ప్రాయం పోంగిన క్షణములో అలనాటి సుందరవనములో ఎల ప్రాయం పోంగిన క్షణములో ఆ..ఆ..రాజును కనిన శకుంతలవై రతిరాజు భ్రమించిన చంచలవై కాళిదాసు కల్పనలో మెరిసిన కమనీయ మూర్తివీవే కనులముందు నీవుంటే కవిత పొంగి పారదా తొలి చిగురుల చూడగానే కల కోకిల కూయదా చరణం: 3 అజంతా చిత్ర సుందరివై ఎల్లోరా శిల్ప మంజరివై అజంతా చిత్ర సుందరివై ఎల్లోరా శిల్ప మంజరివై రామప్ప గుడి మోమున విరిసిన రాగిణివై నాగినిపై అమరశిల్పులకు ఊపిరిలూది అమృతమూర్తివి నీవే కనుల ముందు నీవుంటే కవిత పొంగి పారదా తోలి చిగురుల చూడగానే కల కోకిల కూయదా
చరణ కింకిణులు (ఆడవే మయూరీ) పాట సాహిత్యం
చిత్రం: చెల్లెలు కాపురం (1971) సంగీతం: కె.వి.మహదేవన్ సాహిత్యం: డా॥ సి.నారాయణరెడ్డి గానం: యస్.పి. బాలు చరణ కింకిణులు ఘల్లుఘల్లుమన కర కంకణములు గలగలలాడగ అడుగులందు కలహంసలాడగా నడుములో తరంగమ్ములూగగా వినీల గజభర విలాస బంధుర తనూలతిక చంచలించిపోగ ఆడవే మయూరీ నటనమాడవే మయూరీ నీ కులుకును గని నా పలుకు విరియ నీ నటనను గని నవ కవిత వెలయగ ఆడవే మయూరీ నటనమాడవే మయూరీ ఆడవే మయూరీ అది యమునా సుందర తీరము అది రమణీయ బృందావనము అది విరిసిన పున్నమి వెన్నెల అది వీచిన తెమ్మెర ఊయల అది చల్లని సైకత వేదిక అట సాగెను విరహిణి రాధిక అది రాధ మనసులో మాధవుడూదిన రసమయ మురళీ గీతిక ఆడవే మయూరీ నటనమాడవే మయూరీ నా పలుకులకెనయగు కులుకు చూపి నా కవితకు సరియగు నటన చూపి ఇక ఆడవే మయూరీ నటనమాడవే మయూరీ పాలనేత్ర సంప్రభవత్ జ్వాలలు ప్రసవశరుని దహియించగా పతిని కోలు పడి రతీదేవి దుఖిఃతమతియై రోదించగా హిమగిరీంద్ర శిఖరాగ్ర తాండవత్ ప్రమధ గణము కనిపించగా ప్రమదనాద కర పంకజ భ్రాంకృత ఢమరుధ్వని వినిపించగా ప్రళయ కాల సంకలిత భయంకర జలదరార్భటుల జలిత దిక్ తటుల జహిత దిక్కరుల వికృత ఘీంకృతుల సహస్రఫణ సంచలిత భూత్క్రుతుల కనులలోన కనుబొమలలోన అధరమ్ములోన వధనమ్ములోన కనులలోన కనుబొమల లోన అధరమ్ము లోన వధనమ్ము లోన కళ సీమలోన కటి సీమలోన కరయుగములోన పదయుగము లోన ఈ తనువులోని అణువణువు లోన అనంత విధముల అభినయించి ఇక ఆడవే ఆడవే ఆడవే...
No comments
Post a Comment