చిత్రం: కన్నకొడుకు (1973) సంగీతం: టి.చలపతి రావు సాహిత్యం: దాశరథి, ఆరుద్ర, డా॥ సి.నారాయణరెడ్డి గానం: ఘంటసాల, పి.సుశీల, జయదేవ్, షరావతి , రమేష్ నటీనటులు: అక్కినేని నాగేశ్వరరావు, అంజలి దేవి, లక్ష్మీ, కృష్ణంరాజు దర్శకత్వం: వి.మధుసూధనరావు నిర్మాతలు: జి.రాధాకృష్ణ మూర్తి, ఎ.రామచంద్ర రావు విడుదల తేది: 11.05.1973
Songs List:
తింటే గారెలే తినాలి పాట సాహిత్యం
చిత్రం: కన్నకొడుకు (1973) సంగీతం: టి. చలపతి రావు సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి గానం: ఘంటసాల, పి. సుశీల తింటే గారెలే తినాలి ... వింటే భారతం వినాలి ఉంటే నీ జంటగా వుండాలి. సైఁ యంటే స్వరాలే దిగిరావాలి మొలక మబ్బులు ముసిరితే.... ఓహో.... చిలిపి గాలులు విసిరితే... ఓహో.... పచ్చపచ్చని పచ్చిక బయలే పాన్పుగా అమరితే అమరితే అమరితే..... వీడని కౌగిట వేడి వేడిగా చూడని రుచులే చూడాలి...... నీ నల్లని కురులను నే దువ్వీ యీ సిరిమల్లెలు నీ జడలో నే తరిమీ పట్టుచీరే కట్టించి పైట నేనే సవరించి, సవరించి, సవరించి నిగనిగలాడే నీ సొగసంతా నే నొక్కడినే చూడాలి.... తీయగా నువు కవ్విస్తే - ఓహో తీగలా నను పెనవేస్తే - ఓహో పూలతోట పులకరించీ యీల పాటలు పాడితే, పాడితే, పాడితే పొంగే అంచుల పల్లకి పైన నింగి అంచులను దాటాలి....
లోకం శోకం మనకొద్దు పాట సాహిత్యం
చిత్రం: కన్నకొడుకు (1973) సంగీతం: టి. చలపతి రావు సాహిత్యం: ఆరుద్ర గానం: ఘంటసాల, పి. సుశీల, జయదేవ్, షరావతి , రమేష్ పలవి : లోకం శోకం మనకొద్దు మైకం తదేకం_వదలొద్దు అను అను అను హరేరామ్ అను అను అను అను హరేకృష్ణ అను హరేరాం.... హరేరాం.... రామ్ రామ్ హరేరామ్ .. కృష్ణ కృష్ణ ఘనశ్యాం చరణం: నీతి నియమంబూడిద పాత సమాజం గాడిద ఇల్లూ వాకిలీ..తల్లీ తండ్రీ ఎవరూ లేరు—ఎవరూ రారు నీతో నీవే నీలో నీవే బతకాలి బతకాలి బతకాలి .... పల్లవి: అయ్యో రామా -అయ్యో కృష్ణా చూశారా నరుడెంత మారాడో మీ భజన చేస్తూ ఎంతకు దిగజారాడో. చరణం: ఆడాళ్ళకు మగవాళ్ళకు తేడా తెలియదు అయ్య పంపే డబ్బులకే అర్థం తెలియదు కలసి మెలసి విందు - కైపులోన చిందు ఈ పోకడ దగా దగా బతుకంతా వృధా వృధా ... చరణం: సౌఖ్యాలకు దొడ్డిదారి వెతికేవాళ్ళు బ్లాకులోన డబ్బులెన్నో నూకేవాళ్లు ఏ పాటు పడనివాళ్ళు సాపాటు రాయుళ్ళు అందరికీ మీ పేరే అతి తేరగ దొరికిందా.... చరణం: కష్టాల్లో పేదాళ్ళకు మీరు అవసరం కలవాళ్ళ దోపిడీకి మీరు ఆయుధం ఆపదలో ముడుపు ఆ పైన పరగడుపు అనాదిగా ఇదే ఇదే రివాజుగ సాగాలా ?
అందమైన పిలగాడు పాట సాహిత్యం
చిత్రం: కన్నకొడుకు (1973) సంగీతం: టి. చలపతి రావు సాహిత్యం: కొసరాజు గానం: పి. సుశీల, షరావతి పల్లవి: అందమైన పిల్లగాడూ అందకుండా పోతున్నాడూ నెత్తిమీద గోరువంక నిలిచిందే చూడడూ - అయ్యో రామా పిలిచిందే చూడడూ చరణం: 1 బూరెల బుగ్గల బుడగడే ఏమన్నా యిటు తిరగడే కొట్టిన రాయిలాగా బిర్రబిగుసుకొని వున్నాడే - అయ్యో రామా బుర్ర గోక్కుంటున్నాడే.... చరణం: 2 ప్రేమ జబ్బులో పడ్డాడమ్మా బిత్తరి చూపులు చూస్తాడమ్మా ఏ యమ్మగన్న పిల్లోడోగాని ఎంత జెప్పినా వినడమ్మా అయ్యో రామా ఏమైపోతాడో యమ్మా - చరణం: 3 కలిగిన పిల్లను కాదంటాడే పేదపిల్లపై మోజంటాడే డబ్బున్న వాళ్ళకు ప్రేమ వుండదా లేనివాళ్ళకే వుంటుందా అయ్యో రామా పిచ్చి యింతగా ముదిరిందా...
ఎన్నడైనా అనుకున్నానా పాట సాహిత్యం
చిత్రం: కన్నకొడుకు (1973) సంగీతం: టి. చలపతి రావు సాహిత్యం: దాశరథి గానం: పి. సుశీల పల్లవి: ఎన్నడైనా అనుకున్నానా ? ఎప్పుడైనా కలగన్నానా ? ఇంత చల్లని మనసు నీ కుందనీ .... ఆ మనసులో నా కెంతో చోటుందనీ..... చరణం: 1 నీ చిరునవ్వుల నీడలలోన మేడకడతాననీ అల్లరిచేసే నీచూపులతో ఆడుకుంటాననీ ఎవరికి అందని నీ కౌగిలిలో వాలిపోతాననీ నీ రూపమునే నా కన్నులలో దాచుకుంటాననీ చరణం: 2 వలపులు చిందే నా గుండెలలో నిండివుంటావనీ పెదవుల దాగిన గుసగుసలన్నీ తెలుసుకుంటావనీ నా గుడిలోపల దైవము నీవై వెలుగుతుంటావనీ విరిసే సొగసులు విరజాజులతో పూచేసెననీ
దేవుడిచ్చిన వరముగా పాట సాహిత్యం
చిత్రం: కన్నకొడుకు (1973) సంగీతం: టి. చలపతి రావు సాహిత్యం: దాశరథి గానం: పి. సుశీల పల్లవి : దేవుడిచ్చిన వరముగా కోటి నోముల ఫలముగా ఇంటిలోని దివ్వెగా - కంటిలోని వెలుగుగా చిన్ని నాన్నా ! నవ్వరా ! చిన్ని కృష్ణా ! నవ్వరా ? చరణం : 1 నన్ను దోచిన దేవుడే ఈ నాటితో కరుణించెలే కన్న కలలే నిజములై - నీ రూపమున కనిపించెలే బోసినవ్వులు ఒలకబోసి లోకమే మరపించరా చరణం : 2 మామ ఆస్తిని మాకు చేర్చే మంచి పాపా నవ్వవే ఆదిలక్ష్మివి నీవేలే మా ఆశలన్నీ తీర్చవే గోపి బావను చేసుకొని – కోటికే పడగెత్తవే
ఉన్నది నాకొక ఇల్లు పాట సాహిత్యం
చిత్రం: కన్నకొడుకు (1973) సంగీతం: టి. చలపతి రావు సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి గానం: ఘంటసాల పల్లవి: ఉన్నది నాకొక ఇల్లు ఉన్నది నాకొక తలి ఇల్లే బంగరు కోవెల తల్లే చల్లని దేవతా..... చరణం: 1 చిన్నబాబుగారున్నారు వెన్నపూసతో పెరిగారు సరదాబాబుల సహవాసంలో దారితప్పి పోతున్నారు చేయిజారి పోతున్నారు.... చరణం: 2 పెదయ్యగారి పేరు చెప్పితే పెద్దపులే భయపడుతుంది ఛెళ్లున కొరడా ఝళిపిస్తేనే ఇలు దదరిలి పోతుంది మా ఒళ్ళు హూనమైపోతుంది చరణం: 3 పాపమ్మలాంటి అత్తమ్మగారు ప్రతి ఇంటిలోన వుంటారు ఆయమ్మగారు మహమ్మారి తీరు అన్నీ స్వాహా చేస్తారు - గుటకాయస్వాహా చేస్తారు ... చరణం: 4 అమ్మ అనే రెండక్షరాలలో కోటి దేవతల వెలుగుంది - అమృత మనేది వుందంటే అది అమ్మ మనసులోనే వుంది మా అమ్మమనసులోనేవుంది ఆ తలి చల్లని దీవెన చాలు .... ఎందుకు వేయి వరాలు ఇంకెందుకు వేయి వరాలు ....
నేను నేనేనా నువ్వు నువ్వేనా పాట సాహిత్యం
చిత్రం: కన్నకొడుకు (1973) సంగీతం: టి. చలపతి రావు సాహిత్యం: ఆరుద్ర గానం: పి. సుశీల నేను - నేనేనా నువ్వు నువ్వేనా ఎక్కడికో - ఎక్కడికో రెక్కవిప్పుకొని ఎగిరిపోతోంది హృదయం చిక్కని చక్కని సుఖంలో మునిగిపోతోంది దేహం హాయ్... చరణం: 1 ఇదా మనిషి కోరుకోను మైకం ఇదా మనసు తీరగల లోకం జిగేలు మంది జీవితం పకాలుమంది యవ్వనం చరణం: 2 ఓహో ఈ మత్తు చాల గమ్మత్తు ఊహూఁ ఇంకేది మనకు వద్దు నిషాలు గుండె నిండనీ ఇలాగె రేయి సాగనీ ....
కళ్ళతో కాటేసి పాట సాహిత్యం
చిత్రం: కన్నకొడుకు (1973) సంగీతం: టి. చలపతి రావు సాహిత్యం: దాశరథి గానం: ఘంటసాల, పి. సుశీల పల్లవి: కళ్ళలో కాటేసి-వొళ్ళు ఝల్లుమనిపించి రమ్మంటే రానంటా వెట్టాగే - పిల్ల యెట్టాగే-పిల్ల యెట్టాగే.... బుగ్గమీద సిటికేసి సిగ్గులోన ముంచేసి నన్నెట్టా రమ్మంటవ్ పిలగాడ భలే పిల గాడ - కొంటె పిల గాడ చరణం: తోటలోనా మాటు వేసీ వెంటబడితే బాగుందా పంటసేనూ గట్టుమీద పైనబడితే బాగుందా? సెంగావి సీరెలో - బంగారు రైకలో పొంగులన్ని చూపిస్తే బాగుందా ॥కళ్ళతో॥ చరణం: మొదటిసారి చూడగానే.. మత్తుమందూ చల్లావే మాయజేసీ—మనసు దోచీ తప్పునాదే అంటావే బెదురెందుకు నీకనీ_ ఎదురుగ నుంచోమనీ, పెదవిమీద నా పెదవిమీద .... అమ్మమ్మో బాగుందా ॥బుగ్గమీద॥ చరణం: సైగ చేసి సైకిలెక్కి సరసమాడితే బాగుందా పైట సెంగూ నీడలోన నన్నుదాస్తే బాగుందా కందిరీగ నడుముతో, కన్నెలేడి నడకతో కైపులోన ముంచేస్తే బాగుందా.... ॥కళ్ళతో॥ చరణం: పెంచుకున్న ఆశలన్నీ పంచుకుంటానన్నావే ఊసులాడీ–బాసలాడీ—వొళ్లుమరచీ పోయావే జాబిల్లి వెలుగులో - తారల్ల తళుకులో ఏవేవో కోరికలు కోరావే
ఉన్నది నాకొక ఇల్లు (Sad Version) పాట సాహిత్యం
చిత్రం: కన్నకొడుకు (1973) సంగీతం: టి. చలపతి రావు సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి గానం: ఘంటసాల ఉన్నది నాకొక ఇల్లు
No comments
Post a Comment