Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Khiladi Bullodu (1972)




చిత్రం: కిలాడి బుల్లోడు (1972)
సంగీతం: టి. చలపతి రావు
సాహిత్యం: దాశరధి, సినారే, వీటూరి
గానం: యస్.పి.బాలు,  జయదేవ్, సుశీల , యస్.జానకి, ఎల్.ఆర్.ఈశ్వరి. రమోలా 
నటీనటులు: శోభన్ బాబు, చంద్రకళ
కథ: ఆర్.కె.ధర్మరాజ్
మాటలు: టి.పి.మహారధి
స్క్రీన్ ప్లే , దర్శకత్వం: నందమూరి రమేష్ 
నిర్మాత: నందమూరి సాంబశివరావు
విడుదల తేది: 02.06.1972



Songs List:



హాల్లో ఖిలాడి బుల్లి బాబు పాట సాహిత్యం

 
చిత్రం: కిలాడి బుల్లోడు (1972)
సంగీతం: టీ చలపతిరావు
సాహిత్యం: డా॥ సి.నారాయణరెడ్డి
గానం: రమోలా

పల్లవి : 
హల్లో కిలాడి బుల్లి బాబూ !
ఎందుకో మగాడికింత సిగ్గు 
వేసుకో మరొక్క చిన్న పెగ్గు
బలే బలే బలే బలే మజా
ఓఓ హో హూ బుల్లి బాబూ

చరణం: 1
మదువు పొంగుతుంది మగువచెంతవుంది.
పెదవి కలిపి కలిపి రుచులు చూడు చూడు

చరణం: 2
వయసు కోడెనాగు
మనసు కొండవాగు
బుసలుకొడుకు విసురుతుంది చూడు 





హాబ్బాబా హాబ్బాబా వాయించు దిల్ రూబా పాట సాహిత్యం

 
చిత్రం: కిలాడి బుల్లోడు (1972)
సంగీతం: టి. చలపతి రావు
సాహిత్యం: వీటూరి వెంకటసత్య సూర్యనారాయణమూర్తి 
గానం: ఎల్.ఆర్.ఈశ్వరి 

(గమనిక: వేటూరి సుందరరామ మూర్తి, వీటూరి వెంకట సత్య సూర్యనారాయణమూర్తి ఇద్దరు వేరు వేరు, కానీ వీరిద్దరు పాటలు రచయితలు. ఈ పాట రాసింది వీటూరి వెంకట సత్య సూర్యనారాయణమూర్తి)

హే బాబ్బా ఓ  బాబ్బా
వాయించు దిల్ రుబా !
దీవానా | ఓయ్! మస్తానా !
వెలిగించవోయ్ ! మోహాల మతాబా

చరణం: 1
అందరాని అందముంది నాలోన !
జతకూడవోయి– నేటి రేయి ఏదిఏమైనా
చాలించవోయ్ మనా !
చెలించవోయ్ నజరానా !
నీరంగుచూసి_పొంగిపోయి.. తేరగవసానా !

చరణం: 2
వన్నెలాడి చూపులోనె వుంది కైజారు !
అది గుండెలోన గుచ్చుకుంటే బేజారు
నావయసైతే_పదహారు 
నా వలసేమో సెలయేరు
ఏ కొమ్ములు తిరిగిన మగవారైనా-వెనక్కి పోలేరు 



నిన్ను చూచి ఈ లోకం పాట సాహిత్యం

 
చిత్రం: కిలాడి బుల్లోడు (1972)
సంగీతం: టీ చలపతిరావు
సాహిత్యం: దాశరథి
గానం: పి.సుశీల, యస్.పి.బాలు 

పల్లవి: 
నిన్ను చూసి యీ లోకంచూస్తే
అన్ని వైపులా అందాలే అందాలే అందాలే

చరణం: 1
గాలితరగలో కైపుంది 
పూలతీగలో ఊపుంది
నిన్నా మొన్నా లేని సోయగం 
కొమ్మ కొమ్మలో కురికింది

చరణం: 2
పిల్లవాగులో విసురుంది 
కన్నెచూపులో కసివుంది
నిన్నా మొన్నా లేనిసోయగం 
కన్నులముందే మెరిసింది?

చరణం: 3
మనసు మనసులో కలిసింది 
పెదవి పెదవినే పిలిచింది
నిన్నా మొన్నా లేనిసోయగం 
ఈ జగమంతా పెరిగింది





ప్రతి పుట్టిన రోజు పాట సాహిత్యం

 
చిత్రం: కిలాడి బుల్లోడు (1972)
సంగీతం: టీ చలపతిరావు
సాహిత్యం: డా॥ సి.నారాయణరెడ్డి
గానం: యస్. జానకి 

పల్లవి: 
ప్రతి పుట్టినరోజు పండుగకాదు
ప్రతిరేయి వెన్నెలరాదు
వలచినవాడే కలిసిననాడే
వనితకు పండుగరోజు
అదే అసలైన పుట్టినరోజు

చరణం: 1
చెలికన్నుల లేఖలు చదువుకొనీ
తొలి వలపుల బాసలు తెలుసుకొని
వలచినవాడే పిలచిననాడే
పెదవులు చిందును మధురిమలు
మదిలో మ్రోగును సరిగమలు

చరణం: 2
ఒక రేయి మురిపెం చాలదనీ
ఒకనాటితో అది తీరదనీ
వలచినవాడే - ఎరిగిననాడే
తరగక నిలుచును అనురాగం
కలలే పండును కలకాలం




ఓ మై లవ్లీ డార్లింగ్... పాట సాహిత్యం

 
చిత్రం: కిలాడి బుల్లోడు (1972)
సంగీతం: టీ చలపతిరావు
సాహిత్యం: దాశరథి 
గానం: యస్.పి.బాలు, పి.సుశీల 

ఓ మై లౌలీ డార్లింగ్
లెట్ మీ టెల్ యూ సంథింగ్

నీ బుగ్గలబో నిగనిగలాడే
మొగ్గలే బ్లూమింగ్
ఓ మై లౌలీ డార్లింగ్
లెట్ మీ టెల్ యూ పంథింగ్
ఊ ఊ 

నీ కన్నులలో, తళతళలాడే
చిలిపి తలపులే చార్మింగ్
మురిపించే నీ అందం
వేసిందీ తొలి బంధం
పిలుపులలో తీయదనం
చిలికిందీ మకరందం
ఎంజాయ్ - ఊ
ఎంజాయి ది డ్రింక్

ఏయ్ ! ఏయ్ !
షెల్ వుయ్ డాన్సు
రాదూ ? - నేర్పనా ?
నడుము పైన నీచేయి
నాజూగా పెనవేయ్
ఆయ్ - డోంట్ బి సిల్లీ 
ఎందుకు భయం ? ఎవరున్నారని ?
నువ్వూ నేనూ 
ఎంజాయ్ - ఊc !
ఎంజాయి డ్రింక్

No comments

Most Recent

Default