చిత్రం: మాతృమూర్తి (1972) సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు నటీనటులు: హరనాధ్, బి.సరోజాదేవి, చంద్రమోహన్, కృష్ణం రాజు మాటలు: రాజశ్రీ, దాసరి నారాయణరావు Executive Director: దాసరి నారాయణరావు దర్శకత్వం: మానాపురం అప్పారావు నిర్మాతలు: వి.వి. రాజేంద్ర కుమార్, కె. సత్యనారాయణ విడుదల తేది: 6.10.1972
Songs List:
అమ్మకు మీరిద్దరు ఒకటే పాట సాహిత్యం
చిత్రం: మాతృమూర్తి (1972) సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు సాహిత్యం: రాజశ్రీ గానం: పి.సుశీల అమ్మకు మీరిద్దరు ఒకటే ఒకటే నీ కంటిలోన నలుసుపడిన బాధ ఒక్కటే ఒక్కటే చెడ్డవారితో చెలిమి చేయకూడదు ఎగతాళి కైననూ, కల్లలాడ కూడదు కలిమి కలిగినా మనిషి మారకూడదు నీ మనసులోని మంచితనం విడువ కూడదు ఈ తల్లి మాట జీవితాన మురువ కూడదు శ్రద్దగాను చదువు లెన్నో చదవాలి మీకు బుద్ధిమంతులనే పేరు రావాలి రామ లక్ష్మణుల రీతి మెలగాలి మీరు కలకాలం కలిసి మెలిసి ఉండాలి ఈ తల్లి కన్న పసిడికలలు పండాలి
కళ్ళజోడు పెట్టుకున్న అమ్మాయీ పాట సాహిత్యం
చిత్రం: మాతృమూర్తి (1972) సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు సాహిత్యం: కొసరాజు గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం డిర్ ర్ ర్ కళ్ళజోడు పెట్టుకున్న అమ్మాయీ నల్ల కళ్ళజోడు పెట్టుకున్న అమ్మాయీ కాసేపు ఆపవమ్మ నీ బడాయీ ! ఒళ్ళు దగ్గరుంచుకుంటె ఉంది హాయి దింతక్క దింతక్క దొరికిందిరా పిట్టా డిర్ ర్ ర్ కారుమీద ఎక్కగానే కన్నుగానవు పక్కన మనిషున్నాడని తెలుసుకోవు బురద నెత్తిమీద చల్లి పోయావు చేతిలోన చిక్కావిపుడేమౌతావు.... ఇపుడేమౌతావూ దింతక్క దింతక్క దొరికిందిరా పిట్టా డిర్ ర్ ర్ ఉన్నదానిననే గర్వముండకూడదు లేనివాళ్ళలో అసూయ రేపకూడదు మునుపటి కాలంకాదు డబ్బుకు విలువే లేదు హెయ్ హెయ్ మంచితనం లేకుంటే మనిషి క్రింద జమకాదు మన దెబ్బంటే ఎప్పుడు రుచి చూచి ఎరుగవు రబ్బరు బొమ్మలే గింగిరాల్ తిరిగేవు చక్కని అబ్బాయి చెయ్యి పడితేగాని నీ తిక్క కాస్త వదలదే డైమన్ రాణి
నీ నీడగా నన్ను కదలాడనీ పాట సాహిత్యం
చిత్రం: మాతృమూర్తి (1972) సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు సాహిత్యం: రాజశ్రీ గానం: ఘంటసాల, పి.సుశీల నీ నీడగా నన్ను కదలాడనీ నీ గుండెలో నన్ను నిదురించనీ నీ చూపులోన ప్రణయాల వీణ శతకోటి రాగాలు వినిపించనీ మై మరపించనీ జాజులు తెలుపు జాబిల్లి తెలుపు నను మురిపించే నీ మనసు తెలుపు కుంకుమ ఎరుపు, కెంపులు ఎరుపు సుధలూరే నీ అధరాలు ఎరుపు అనురాగాలే అనుబంధాలె నిన్ను నన్ను ముడి వేయనీ మది పాడనీ హరివిలు చూశా, నీ మేను చూశా హరి విల్లులో లేని హోయలుంది నీలో సెలయేరు చూశా, నీ దుడుకు చూశా సెలయేటిలో లేని చొరవుంది నీలో తీయని చెలిమి తరగని కలిమి మనలో మదిలో కొనసాగనీ ఊయలూగని
ఎడమొగం పెడమొగం పాట సాహిత్యం
చిత్రం: మాతృమూర్తి (1972) సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు సాహిత్యం: రాజశ్రీ గానం: జమునారాణి పల్లవి: ఎడమొగం పెడమొగం ఏంది ఈ కత ఉలకరూ పలకరూ ఏంది ఈ జత చరణం: 1 పాల గువ్వలాంటి పసందైన చిన్నది మొగలి పూవులాగ మొగం ముడుచు కున్నది అందగాడి పచ్చనైన పసిడి బుగ్గలు మందార పూలలాగ కందెనెందుకో ఇది సిరాకో పరాకో గడుసరి అలుకో కోరి కట్టుకున్నదని ఏడిపించక అలుసుచేసి ఆడితే అందదు సిలక ఆడదాని దోర మనసు వెన్నలాంటిది ఆశ తెలిసి మసలితే కరిగిపోతది ఈ సిరాకూ పరాకూ ఎగిరి పోతది ఆలుమగల తగవు రచ్చకెక్క కూడదు పటు విడుపు లేకుంటే మనువే కాదు వగలు చూపి పడుపుగా వల విసరాలి మగవాడిని నీ కొంగున ముడివెయ్యాలి. నా పలుకులోని కిటుకును తెలిసి మసులుకో
ఆడాలి అందాల జూదం పాట సాహిత్యం
చిత్రం: మాతృమూర్తి (1972) సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు సాహిత్యం: రాజశ్రీ గానం: ఎల్.ఆర్.ఈశ్వరి విస్కీ గ్లాసు ఇస్పేట్ ఆసు మూడు చుక్కలు వేసుకో పదమూడు ముక్కలు ఆడుకో ఈ సుఖము....పరవశము ఇహ నీదే.... నీదే.... నీదే.... అహ అహ ఆడాలి అందాల జూదం అది కావాలి మనకింక వేదం ఆరార త్రాగాలి అమృతం ఆ కసిలోన కొటాలి పందెం ఇక్కడే .... ఇప్పుడే.... మార్చుకో జాతకం లలల్ల.... లలల్ల .... లలల్ల .... నా కళ్ళలో వాడి ఉంది నీ గుండెలో వేడి ఉంది నా నవ్వులో మైకముంది నీ జేబులో పైకముంది చూసుకో... కాచుకో... గెలుచుకో తురు తురు తురు.... తూ
ఇంతే ఈ లోకం తీరింతే పాట సాహిత్యం
చిత్రం: మాతృమూర్తి (1972) సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు సాహిత్యం: దాశరథి గానం: ఘంటసాల సాకి : తెంచుకున్నావు రక్తపాశం పెంచుకున్నావు ప్రేమపాశం ఫలితం ఇంతే నమ్మా త్యాగానికి ప్రతిఫల మింతేనమ్మా పల్లవి: పాము కాటు వేసిందమ్మా అనురాగం చూపావమ్మా అవమానం పొందావమ్మా... అమ్మా ఇంతే ఈ లోకం తీరింతే ప్రతిఫల మింతే సమ్మా కన్నకొడుకునే కాదన్నావు కడుపు తీపితో విలపించేవు కన్నీరైనా తుడిచేవారు కనరారమ్మా ఈ నాడు పసిడి కలలనే కన్నావమ్మా పచ్చని బ్రతుకులు కోరావమ్మా కన్న కలలే కల్లలు కాగా కారుచీక టే మిగిలిందమ్మా
No comments
Post a Comment