Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Simha Baludu (1978)




చిత్రం: సింహ బలుడు  (1978)
సంగీతం: ఎం.యస్.విశ్వనాథన్ 
సాహిత్యం: వేటూరి (All)
నటీనటులు: యన్.టి.రామారావు , వాణిశ్రీ, మోహన్ బాబు 
దర్శకత్వం: కె.రాఘవేంద్రరావు
నిర్మాత: డి.శ్రీరంగ రాజు 
విడుదల తేది: 11.08.1978



Songs List:



ఏందమ్మో చురుక్కుమంది పాట సాహిత్యం

 
చిత్రం: సింహ బలుడు  (1978)
సంగీతం: ఎం.యస్.విశ్వనాథన్ 
సాహిత్యం: వేటూరి 
గానం: యస్.పి. బాలు, పి. సుశీల

ఏందమ్మో చురుక్కుమంది 
ఏదేదో కలుక్కుమంది 
కన్నేదో చిటుక్కుమంటూ 
కాటేస్తే కసుక్కుమంది
ఇదేం తాకిడి అబ్బబ్బబ్బ ఇదేం రాపిడి 

ఏందబ్బో మగాన్నండి
నా దెబ్బ చూడమంది 
తీగ నేనులాగగానే 
డొంకంతా బైటపడ్డది
ఇదేం తాకిడి ఆమ్మమ్మమ్మ ఇదేం రాపిడి

ఆ చూపు సోకితే చుర చుర నన్ను 
నమిలేసినట్టుంది కరకర 
ఆ చెయ్యి తాకితే సలసల 
ఒళు మెలిదిరిగిపోయింది గిలగిల

నీ ఎత్తు తెలిసింది పిల్లో 
ఆ కత్తి నీ కెందుకమ్మో 
మెలిదిరిగి పోతుంటే నువ్వు 
చలి పెరిగిపోతుంది నాకు

ఇది వింత కవ్వింత ఎదలోతు సలపరింత
మగగాలి సెగలోని దిగుతుంది తిమ్మిరంత
నువ్వులికి పడుతుంటే ఎలా కిలా 
నేనుడికి ఉడికి పోతున్నా విలా విలా 
నీ గాలి కొడుతుంటే అలా అలా
నీ గాలి మళ్ళించే ఇలా ఇలా
నా గుండె అదిరింది తల్లో 
నా గుట్టు చెదిరింది అమ్మమ్మో 
ముట్టుకుంటే చాలు నువ్వు 
ముచ్చెమట పడుతోంది నాకు

అది అంతే ఇది ఇంతే పడుచోళ వరసవింతే
ఇక చాలు సరసాలు తెలిసింది సంగతంత



చూపుల్తో ఉడకేసి పాట సాహిత్యం

 
చిత్రం: సింహ బలుడు  (1978)
సంగీతం: ఎం.యస్.విశ్వనాథన్ 
సాహిత్యం: వేటూరి 
గానం: యస్.పి. బాలు, పి. సుశీల

చూపులో ఉడకేసి - సోకులో తడిచేసే
బండకేసి ఉతికేస్తాలే తకమానతక   కిన మాన తక 
కొండమీద ఆరేసాలే 

పాలెట్లో పారేసి - కౌగిట్లో కాగేసి 
కోకలన్ని ఉతికేసాలే తక మాన తిక... కిన మాన తక 
నీ గుండెమీద అరేసాలే

కోకచాటు నీ సోకులు చూసుంటే
కోరిక మారాకు లెన్నో వేస్తుంటే

తడిసీ తడవని అందం - తడిపి ఆరవెయ్యాలని 
తడిమి తడిమి చూడాలని వున్నది
నీ జాణతనం చూస్తుంటే - ఆ జానపదం వింటుంటే 
నీలో నాలో ఒకటే కోరిక బుసగొడుతుంటే
కలవరింత లెన్నాళ్ళులే - కలుసుకుంటే నూరేళ్లులే

అందనోడు చందమామ అవుతుంటే 
అందినోడు మేనమామ నేనంటే
సరసాలాడే నీతో - వరస కలువు కోవాలని
తడి గుడిసె కట్టాలని వున్నది.

నీ ఆడగాలి వీస్తుంటే - నా వేడి ఎక్కువౌతుంటే 
నింగి నేలా మనలో కౌగిలింత కొస్తుంటే
పలకరింత లెన్నాళ్లులే - మన- పులకరింత శాన్నాళ్ళులే.....




సన్నజాజులోయ్...పాట సాహిత్యం

 
చిత్రం: సింహ బలుడు  (1978)
సంగీతం: ఎం.యస్.విశ్వనాథన్ 
సాహిత్యం: వేటూరి 
గానం: యస్.పి. బాలు, ఎల్.ఆర్.ఈశ్వరి 

పల్లవి:
సన్నజాజులోయ్... కన్నెమోజులోయ్
సన్నజాజులోయ్... కన్నెమోజులోయ్
అల్లిబిల్లి సంతలోన పిల్ల గాలి జాతరాయే తళుకు బెళుకు కనవేరా
పాలవెల్లి పుంత కాడ పైట కొంగు జారిపోయె పడుచు గొడవ వినవేరా

సన్నజాజులోయ్... కన్నెమోజులోయ్
సన్నజాజులోయ్... కన్నెమోజులోయ్
హా..కన్ను కన్ను గీటుకుంటె సన్న సన్న మంటరేగే.. కలికి చిలుక ఇటు రావే
హాయ్ ...హాయ్...
వళ్ళు వళ్ళు మీటుతుంటే వగలమారి సెగలు పుట్టె వలపు పిలుపు విని పోవే 

చరణం: 1
బానిసగా వచ్చావు
నన్నే నీ బానిసగా చేసుకున్నావు
మగతనం చూపావు
నాలో ఆడతనాన్ని నిద్ర లేపావు

రేయి తెల్లారి తెల్లారి పోతుందిరా 
రారా నా దొరా
తీగ అల్లాడి మాల్లాడి పోతుందిరా 
రారా సుందరా

ఒకటున్నది నీలో ఒడుపున్నది నాలో 
అది వున్నది లేనిది తెలుసుకో హా
మెరుపున్నది నాలో ఉరుమున్నది నీలో
అది నీదని ఇది నాదని హా మరిచిపో

సన్నజాజులోయ్ కన్నెమోజులోయ్
అల్లిబిల్లి సంతలోన పిల్ల గాలి జాతరాయే తళుకు బెళుకు కనవేరా
వళ్ళు వళ్ళు మీటుతుంటే వగలమారి సెగలు పుట్టె వలపు పిలుపు విని పోవే 

చరణం: 2
ఈ ద్వీపానికి దీపానివి నువ్వు 
ఈ లంకకే నెలవంకవి నువ్వు హ హ హా 
మల్లె పువ్వంటి రవ్వంటి మనసున్నదిలే  మగతోడుందిలే
చింత చిగురంటి పొగరుంది
వగరుందిలే.. సెగ రేగిందిలే
వలపున్నది నాలో  బలమున్నది నీలో 
ఆ పట్టుని ఈ విడుపుని హా కోరుకో
సగమున్నది నాలో సగమున్నది నీలో 
రెంటిని జంటగా మలచుకో హోయ్

సన్నజాజులోయ్... కన్నెమోజులోయ్
అల్లిబిల్లి సంతలోన పిల్ల గాలి జాతరాయే తళుకు బెళుకు కనవేరా
వళ్ళు వళ్ళు మీటుతుంటే 
వగలమారి సెగలు పుట్టె వలపు పిలుపు విని పోవే 

సన్నజాజులోయ్... కన్నెమోజులోయ్ 
సన్నజాజులోయ్... కన్నెమోజులోయ్





ఓ చెలీ చలి చలి పాట సాహిత్యం

 
చిత్రం: సింహ బలుడు  (1978)
సంగీతం: ఎం.యస్.విశ్వనాథన్ 
సాహిత్యం: వేటూరి 
గానం: యస్.పి. బాలు, పి. సుశీల

ఓ చెలీ చలీ చలీ ఇవి ఏమి మంటలే
నా ప్రియా చలిగిలీ మన ప్రేమమంటలే
నడిరేయిలో ఏదో ఏదో తొలి హాయిరేగేలే
అందమైన ఆకలికోరే కౌగిలీ
ఆపలేని నా చలి తీర్చవే చలీ
నేనే గువ్వనై నాను నువ్వే గూడువై
తోడుగా నీడగా ఈడుగా జోడుగా నువ్వుంటే చాలులే

గుడిలో గంటగా నా ఒడిలో జంటగా
నీవు నా ప్రాణమై నేను నీ దాననై మనముంటే చాలులే
నవ్వే కన్నుల నా నువ్వే వెన్నెలా
నింగినై పొంగనా తారనై చేరనా ఇక నీలో నీవుగా

ఎదలో కోరిక నా ఎదుటే తీరగ
అందమే పండగా బంధమై వుండనా ఇక నేనే నీవుగా




ఈ గంట ఘణ ఘణ పాట సాహిత్యం

 
చిత్రం: సింహ బలుడు  (1978)
సంగీతం: ఎం.యస్.విశ్వనాథన్ 
సాహిత్యం: వేటూరి 
గానం: పి. సుశీల

ఈ గంట గణగణ మోగాలి 
ఆ కోట గజగజ లాడాలి 
సింహబలుడు గరించాలి
ప్రళయ తాండవం చెయ్యాలి

రాతిబొమ్మ రాజరికం ఈ జాతిని బలిచేస్తుంటే 
రాతిగుండె పెద్దరికం నీతిని వెలివేస్తుంటే 
దైవం బ్రతికే వుంటే
ధర్మం మిగిలే వుంటే

నెత్తురు చిందిన ఉన్మత్తుల పెనుకత్తులు విరగాలి 
ధర్మదేవతను చెరబట్టిన దుర్మార్గం అంతంకావాలి 
మా అడుగులే అగ్గి పిడుగులై
అన్యాయం భగ్గున మండాలి 
అధర్మం భస్మం కావాలి.
స్వామి ద్రోహుల జన విద్రోహుల 
రక్త దాహమిక సాగదు
దనుజ విభంజన ప్రళయ ప్రభంజన 
ధర్మ చక్రమిక ఆగదు
నరక పాలనను నరక యాతనకు
ఇది నా అంతిమ గీతం
ఇది నాదు ఆర్తనాదం ఇది నా అగ్నిగీతం
ఇదే సుప్రభాతం 

No comments

Most Recent

Default