Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Vikrant Rona (2022)




చిత్రం: విక్రాంత్ రోణా (2022)  
సంగీతం: బి. అజనేష్ లోక్ నాథ్ 
నటీనటులు: కిచ్చా సుదీప్, నీతా అశోక్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్
దర్శకత్వం: అనూప్ బండారి
నిర్మాతలు: జాక్ మంజునాథ్, షాలిని మంజునాథ్
విడుదల తేది: 28.07.2022



Songs List:



రా రా - రక్కమ్మ పాట సాహిత్యం

 
చిత్రం: విక్రాంత్ రోణా (2022)  
సంగీతం: బి. అజనేష్ లోక్ నాథ్ 
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి 
గానం: మంగ్లీ, నకాష్ అజీజ్

గడ గడ గడ గడ
గడాంగ్ రక్కమ్మ
గడాంగ్ రక్కమ్మ

హే బాగున్నారా అందరు - గడాంగ్ రక్కమ్మ
మీ కోసం నేను హాజరు
రింగ రింగ రోజులంగా ఏసుకొచ్చాలే 
నచ్చి మెచ్చే నాటు సరుకు తీసుకొచ్చాలే

రా రా - రక్కమ్మ
రా రా - రక్కమ్మ
అరె ఎక్కా సక ఎక్కా సక ఎక్కా సక
ఎక్కా సక ఎక్కా సక ఎక్కా సక

కోర మీసం నేను కొంటె సరసం నువ్వు
మన మందు మంచింగ్ కాంబినేషన్ హిట్టమ్మా 
చిట్టి నడుమే నువ్వు సిటికినేలే నేను
నిన్ను ముట్టకుండా వదిలిపెట్టేదెట్టమ్మా
కిక్కిచ్చే నీకే కిక్కిస్తా రక్కమ్మా 

రా రా - రక్కమ్మ
రా రా - రక్కమ్మ
అరె ఎక్కా సక ఎక్కా సక ఎక్కా సక
ఎక్కా సక ఎక్కా సక ఎక్కా సక

పిస్తోలు గుండల్లే దూకేటి మగాడే ఇష్టం
ముస్తాబు చెడేలా ముద్దుటలాడేవో కష్టం
అయ్యో ఎందుకో నా కన్ను నిన్ను
మెచ్చుకున్నది
నా వెన్ను మీటే ఛాన్స్ నీకు ఇచ్చుకున్నది

నువ్వు నాటు కోడి బాడీ నిండా వేడి
నిన్ను చూస్తే థర్మామీటర్ దాక్కుంటాదమ్మ
లలలాలి పాడి కాళ్ళ గజ్జలాడి
సలవా పలవరింతలు నీలో పుట్టిస్తానమ్మా
నచ్చిందే నీ ఇంటి రాస్తా రక్కమ్మో

రా రా - రక్కమ్మ
రా రా - రక్కమ్మ
అరె ఎక్కా సక ఎక్కా సక ఎక్కా సక
ఎక్కా సక ఎక్కా సక ఎక్కా సక



లాలీ జో లాలీ లాలీ పాట సాహిత్యం

 
చిత్రం: విక్రాంత్ రోణా (2022)  
సంగీతం: బి. అజనేష్ లోక్ నాథ్ 
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి 
గానం: విజయ్ ప్రకాష్ 

లాలీ జో లాలీ లాలీ
అన్నదీ చల్లని గాలి, మ్ మ్

లాలీ జో లాలీ లాలీ
అన్నదీ చల్లని గాలి
పాటలో పరిసరాలు
మరచిపోవాలి, మరచిపోవాలి

చందమామ వెన్నెలంత
నీకే కానుక
పక్క మీది పువ్వయ్యింది
నింగి తారక

వెండిరంగు దారాలల్లి
వెన్నెలమ్మ ఊయల వేసే
వెచ్చగా నిదురపోవే
రాజకుమారి… నా రాజకుమారి

బూచి బాబు వస్తాడని భయమా
బుజ్జి తల్లి నీ తోడై నేను లేనా
పిచ్చికల రానిస్తాన కన్నమ్మా
దూరముంచలేనా ఏ చీకటైనా

చింతలేని ముఖము అలా
చిందనివ్వు పున్నమి కల
ప్రాణాలైదూ నీకు కాపాలా

మేఘమాల కరిగి
చినుకైనా క్షణమిది
పచ్చనాకు పైనా
మెరిసిందే చిరు తడి

ఆకసాల వాకిలి దాటి
నేలతల్లి దోసిలి చేరే
నీటిబొట్టు పాడిన పాటే
ముత్యాల లాలీ, ముత్యాల లాలీ

జీవితాన నువ్వున్నావు చాల్లే
కంటితడిని తుడిచే కొన వేలై
వెంట వెంట వస్తా… నీ వెనకాలే
పాదాలతో కదిలే జత నీదై

ఊసుపోని అలకవైనా
పలుకుల చిలకవైనా
నీ సవ్వడే నాకు సందడి

సద్దు చేయకుండ నిలిపానే ఊపిరి
జాగు చేయకుండా నిదరోగ, రా మరి

చప్పున రెప్పలు మూసి
చెయ్యవే కలల స్వారి
నిండుగా నిదురపోవే
చిట్టి చిన్నారి, చిట్టీ చిన్నారి
చిట్టి చిన్నారి, మ్ మ్



హేయ్ ఫకీరా పాట సాహిత్యం

 
చిత్రం: విక్రాంత్ రోణా (2022)  
సంగీతం: బి. అజనేష్ లోక్ నాథ్ 
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి 
గానం: సంజిత్ హెగ్డే, చిన్మయి శ్రీపాద, బి. అజినేష్ లోకనాథ్, అనూప్ బండారి 

హేయ్ ఫకీరా హేయ్ ఫకీరా
డుక్కు డుక్కు బండి
దూసుకెల్లే బండి
ఎక్కు ఎక్కమంటూ రమ్మన్నది

ఎత్తి కుదేస్తూనే ఎత్తుకెళ్ళి
నిన్ను ఊరు చేరుస్తుంది

వెలిగించ రారా నా కంటి చీకటి
రా రా కుమారా నీ గూటికి

హేయ్, పిల్లగాడు వచ్చాడయ్యా ఊరికి
వచ్చాడిన్ని నాళ్ళకి వచ్చాడెన్నో ఏళ్ళకి
హ హ… బహు పరాక్

హేయ్ ఫకీరా ఈ ఊరు నీకు దోస్తే
హేయ్ ఫకీరా ఈ నేల నీకు దోస్తే
హేయ్ ఫకీరా సలాం సలాం నమస్తే
హే నీ రాకకీ

డుక్కు డుక్కు బండి
దూసుకెల్లే బండి
ఎక్కు ఎక్కమంటూ రమ్మన్నది
ఎత్తి కుదేస్తూనే ఎత్తుకెళ్ళి
నిన్ను ఊరు చేరుస్తుంది

ఇచటే పొదిగి ఉంది
చిన్నతనపు అడుగుజాడ
నిన్నిలా గుర్తుపట్టి
పలకరించే గాలి కూడా
జతగా జ్ఞాపకంగా వెంట తిరిగే
గతము నీడా టెన్ టు ఫైవ్

పుట్టినూరు మట్టిలోన ఇంద్రజాలముంది
ఎంతలేసి వయసునైనా
బాల్యమల్లే మార్చుతుంది

నువు రాకముందరే
ఈ అమ్మ ఆవిరై పోయిన
వస్తావుగా నువు కడసారి చూపుగానైనా

హే పిల్లగాడు వచ్చాడయ్యా ఊరికి
వచ్చాడిన్ని నాళ్ళకి… వచ్చాడెన్నో ఏళ్ళకి
హ హ… బహు పరాక్

హేయ్ ఫకీరా ఈ ఊరు నీకు దోస్తే
హేయ్ ఫకీరా ఈ నేల నీకు దోస్తే
హేయ్ ఫకీరా సలాం సలాం నమస్తే
హే నీ రాకకీ





గుమ్మ బంద గుమ్మ పాట సాహిత్యం

 
చిత్రం: విక్రాంత్ రోణా (2022)  
సంగీతం: బి. అజనేష్ లోక్ నాథ్ 
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి & Ve.మదన్ కుమార్ 
గానం: హర్షిక దేవనాథ్ , దీపక్ బ్లూ, బి. అజినేష్ లోకనాథ్, అనూప్ బండారి 

రాత్రి గుర్రం మీద స్వారి
వీచే గాలి జతగా చేరి
కొల్లగొట్టే బందిపోటు
చీకటిలో దొంగలాగా

గుమ్మ బంద గుమ్మ గుమ్మ
గుమ్మ బంద గుమ్మ గుమ్మ
గుమ్మ బంద గుమ్మ గుమ్మ
గుమ్మ బంద గుమ్మ గుమ్మ
గుమ్మ బంద గుమ్మ గుమ్మ

గుమ్మ బంద గుమ్మ గుమ్మ
గుమ్మ బంద గుమ్మ గుమ్మ
గుమ్మ బంద గుమ్మ గుమ్మ

నిత్యం అన్నం తినిపిస్తూనే
బూచోదోస్తాడు అనింది అమ్మ
గుమ్మ బంద గుమ్మ గుమ్మ
గుమ్మ బంద గుమ్మ గుమ్మ

వేటగాళ్లు అంతా మాయం
గర్జిస్తూనే అడవి సింహ
గుమ్మ బంద గుమ్మ గుమ్మ
గుమ్మ బంద గుమ్మ గుమ్మ
గుమ్మ బంద గుమ్మ గుమ్మ
గుమ్మ బంద గుమ్మ గుమ్మ

మెరుపులు తర తర బడెలే
గగనముకే గడగడలే
భయముకే అలజడి మొదలే
వచ్చాడు తలొంచరా




సక్కనమ్మ పాట సాహిత్యం

 
చిత్రం: విక్రాంత్ రోణా (2022)  
సంగీతం: బి. అజనేష్ లోక్ నాథ్ 
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి 
గానం: విజయ్ ప్రకాష్, కార్తిక్, హర్షిక దేవనాథ్

సక్కనమ్మ

No comments

Most Recent

Default