Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Vimala (1960)




చిత్రం: విమల (1960)
సంగీతం: యస్.ఎం.శ్రీరాములు నాయుడు
నటీనటులు: యన్.టి.రామారావు , సావిత్రి 
నిర్మాత, దర్శకత్వం: యస్.ఎం.శ్రీరాములు నాయుడు
విడుదల తేది: 11.08.1960



Songs List:



కన్నుల బెలుకే పాట సాహిత్యం

 
చిత్రం: విమల (1960)
సంగీతం: యస్.ఎం.సుబ్బయ్య నాయుడు
సాహిత్యం: ముద్దు కృష్ణ 
గానం: ఘంటసాల, రాధా జయలక్ష్మి

కన్నుల బెలుకే



మేలి వెన్నెల పాట సాహిత్యం

 
చిత్రం: విమల (1960)
సంగీతం: యస్.ఎం.సుబ్బయ్య నాయుడు
సాహిత్యం: ముద్దు కృష్ణ 
గానం: రాధా జయలక్ష్మి

పల్లవి:
మేలి వెన్నెల కాయసాగే.. చల్లగాలి తగిలి తీగలూగే
మేలి వెన్నెల కాయసాగే.. చల్లగాలి తగిలి తీగలూగే 

నాలో కలలు చెలరేగే నను గనవిదేరా.. ప్రేమ .. మీరా
నాలో కలలు చెలరేగే నను గనవిదేరా.. ప్రేమ .. మీరా 


చరణం: 1
గుండె దడ దడలు మీరి... నినే నిండు మనసు నను కోరి
గుండె దడ దడలు మీరి...  నినే నిండు మనసు నను కోరి

కన్నుతళుకులకు నన్నే మరిచినాను  కదరా.. మది .. చెదరా
కన్నుతళుకులకు నన్నే మరిచినాను  కదరా.. మది .. చెదరా 

మేలి వెన్నెల కాయసాగే.. చల్లగాలి తగిలి తీగలూగే 

చరణం: 2 
చక్కదనము సొమ్ము నేనే.. నీకే చిక్కి సమస్తమీనాడే
చక్కదనము సొమ్ము నేనే.. నీకే చిక్కి సమస్తమీనాడే 

ఒక్క పలుకుతోనే.. చిక్కు తీరునురా
ఒక్క పలుకుతోనే చిక్కుతీరగ...నా దిక్కే  చూడవేరా ..
ఒక్క పలుకుతోనే చిక్కుతీరగ.. నా దిక్కే  చూడవేరా ..


చరణం: 3 
మనసు మనసు పెనవేసి.. మన మమతలొకటిగను  చేసి
మనసు మనసు పెనవేసి.. మన మమతలొకటిగను  చేసి 

కలలు కనిన మన వలపు ఫలములను కనరా .. సుఖమగురా
కలలు కనిన మన వలపు ఫలములను కనరా .. సుఖమగురా

మేలి వెన్నెల కాయసాగే.. చల్లగాలి తగిలి తీగలూగే 
నాలో కలలు చెలరేగే నను గనవిదేరా.. ప్రేమ .. మీరా




కన్నుల్లో నీ బొమ్మ చూడు పాట సాహిత్యం

 
చిత్రం: విమల (1960)
సంగీతం: యస్.ఎం.సుబ్బయ్య నాయుడు
సాహిత్యం: ముద్దు కృష్ణ 
గానం: ఘంటసాల, రాధా జయలక్ష్మి

పల్లవి:
కన్నుల్లో నీ బొమ్మ చూడు...
నా కన్నుల్లో నీ బొమ్మ చూడు .. అది కమ్మని పాటలు పాడు
నా కన్నుల్లో నీ బొమ్మ చూడు .. అది కమ్మని పాటలు పాడు
కన్నుల్లో నీ బొమ్మ చూడు 

చరణం: 1
పున్నమ వెన్నెల వన్నెలలో....ఓ...ఓ.. ఆ...ఆ
పున్నమ వెన్నెల వన్నెలలో... కన్నుల కట్టిన రూపముతో
నీవే మనసున తోచగా .. ఆ...ఆ
నీవే మనసున తోచగా .. నను నేనే మరిచిపోదురా

కన్నుల్లో నీ బొమ్మ చూడు .. అది కమ్మని పాటలు పాడు
కన్నుల్లో నీ బొమ్మ చూడు.... 

చరణం: 2
కోయిల పాటల తీరులతో .. ఓ...ఓ
కోయిల పాటల తీరులతో ..  సరిపోయిన రాగాలల్లుదమా
సరిపోయిన రాగాలల్లుదమా
నచ్చిన పూవు గద నేను...
నచ్చిన పూవు గద నేను... కోరి వచ్చిన తుమ్మెద నీవేరా

కన్నుల్లో నీ బొమ్మ చూడు....
నా కన్నుల్లో నీ బొమ్మ చూడు

చరణం: 3 
రాగమాలికల వీణ నీవే.... ఏ..ఏ...ఏ..
రాగమాలికల వీణ నీవే... అనురాగములేలే జాణ నేనే
అనురాగములేలే జాణ నేనే
నీవే వలపుల జాబిలిరా... ఆ...ఆ..ఆ
నీవే వలపుల జాబిలిరా... మరి నేనే కులుకుల వెన్నెలరా

కన్నుల్లో నీ బొమ్మ చూడు..
నా కన్నుల్లో నీ బొమ్మ చూడు... అది కమ్మని పాటలు పాడు
కన్నుల్లో నీ బొమ్మ చూడు..
నా కన్నుల్లో నీ బొమ్మ చూడు




చిన్ని లతవోలే పాట సాహిత్యం

 
చిత్రం: విమల (1960)
సంగీతం: యస్.ఎం.సుబ్బయ్య నాయుడు
సాహిత్యం: ముద్దు కృష్ణ 
గానం: జమునారాణి , ఏ. పి. కోమల 

చిన్ని లతవోలే 



ఎర్రా ఎర్రాని దాన పాట సాహిత్యం

 
చిత్రం: విమల (1960)
సంగీతం: యస్.ఎం.సుబ్బయ్య నాయుడు
సాహిత్యం: ముద్దు కృష్ణ 
గానం: మాధవపెద్ది సత్యం  , ఏ. పి. కోమల 

ఎర్రా ఎర్రాని దాన 



కావవే అమ్మా పాట సాహిత్యం

 
చిత్రం: విమల (1960)
సంగీతం: యస్.ఎం.సుబ్బయ్య నాయుడు
సాహిత్యం: ముద్దు కృష్ణ 
గానం: రాధా జయలక్ష్మి

కావవే అమ్మా 




టక్కరి దాన పాట సాహిత్యం

 
చిత్రం: విమల (1960)
సంగీతం: యస్.ఎం.సుబ్బయ్య నాయుడు
సాహిత్యం: ముద్దు కృష్ణ 
గానం: పిఠాపురం నాగేశ్వరరావు , జనునా రాణి 

టక్కరి దాన 


No comments

Most Recent

Default