Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Chinnari Devatha (1987)




చిత్రం: చిన్నారి దేవత (1987)
సంగీతం: కె. చక్రవర్తి 
సాహిత్యం: వేటూరి (All)
గానం: యస్.పి.బాలు, జేసుదాస్, పి.సుశీల, యస్.జానకి, యు.వి.లలితా సాగరి 
నటీనటులు: అర్జున్ సార్జా, రజిని, సీత, శరత్ బాబు, రాజ్యలక్ష్మి,  బేబీ షాలిని 
మాటలు: సత్యానంద్ 
దర్శకత్వం: రాజా నాయుడు 
నిర్మాతలు: యం. శరవణన్, యం. బాలసుబ్రమణియన్ 
విడుదల తేది: 19.03.1987



Songs List:



మా ఇంటి పేరే అనురాగం (Sad Version) పాట సాహిత్యం

 
చిత్రం: చిన్నారి దేవత (1987)
సంగీతం: కె. చక్రవర్తి 
సాహిత్యం: వేటూరి
గానం: యు.వి. లలితాసాగరి 

పల్లవి:
మా ఇంటి పేరే అనురాగం 
మా సొంత ఊరే మమకారం 
అరారు కాలాలు చైత్రాలుగా 
పూయించే... పులకించే...
మా ప్రేమ బృందావనం

మా ఇంటి పేరే అనురాగం 
మా సొంత ఊరే మమకారం

చరణం: 1
నిదరోయి మా అమ్మా వినిపించదా
నీలాలై పొంగేటి నాగే కన్నా
నీవు మటాడవు నన్ను ముద్దాడవు
ఏమి నేరాలు చేశానమ్మా
ఉన్న నాన్నైన కనిపించక
లేని నీవైన కరునించక
ఎన్నాళ్ళు... కన్నీళ్లు...
ఇంకా నేనేమి కావాలమ్మా

మా ఇంటి పేరే అనురాగం 
మా సొంత ఊరే మమకారం

చరణం: 2
దీపంలా ఉన్నాను సుడిగాలిలో
పూవల్లే రాలేను వడగాలిలో
నువ్వు వస్తావని ముద్దులిస్తావని
వేచి ఉన్నాను నీకోసము
నేర్చుకున్నాను నీ పాటని
నేను పాడేది నీ పల్లవి
విన్నావా... వస్తావా...
పాడుతున్నాను కడసారిగా 

మా ఇంటి పేరే అనురాగం 
మా సొంత ఊరే మమకారం
అరారు కాలాలు చైత్రాలుగా 
పూయించే... పులకించే...
మా ప్రేమ బృందావనం




కడప కాంబోజివా కర్నూలు కామక్షివా పాట సాహిత్యం

 
చిత్రం: చిన్నారి దేవత (1987)
సంగీతం: కె. చక్రవర్తి 
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి. బాలు, పి.సుశీల & కోరస్ 

కడప కాంబోజివా కర్నూలు కామక్షివా



కాచుకో చలి బాధ పాట సాహిత్యం

 
చిత్రం: చిన్నారి దేవత (1987)
సంగీతం: కె. చక్రవర్తి 
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి. బాలు, యస్. జానకి

కాచుకో చలి బాధ 



మేలుకొన్న దేవుడంట పాట సాహిత్యం

 
చిత్రం: చిన్నారి దేవత (1987)
సంగీతం: కె. చక్రవర్తి 
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి. బాలు, యు.వి. లలితాసాగరి  & కోరస్ 

మేలుకొన్న దేవుడంట ఎవరికోసం ఆగడంట
తేలు కుట్టిన దొంగలంతా గల్లంతు
దొడ్డిదారి గడ్డిమేతే మీవంతు 



నెమ్మది నెమ్మదిగా పాట సాహిత్యం

 
చిత్రం: చిన్నారి దేవత (1987)
సంగీతం: కె. చక్రవర్తి 
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి. బాలు, పి. సుశీల

నెమ్మది నెమ్మదిగా పుట్టింది నా తొలి కోరిక



మా ఇంటి పేరే అనురాగం (Happy Version) పాట సాహిత్యం

 
చిత్రం: చిన్నారి దేవత (1987)
సంగీతం: కె. చక్రవర్తి 
సాహిత్యం: వేటూరి
గానం: జేసుదాస్, యు.వి.లలితాసాగరి 

పల్లవి:
మా ఇంటి పేరే అనురాగం 
మా సొంత ఊరే మమకారం 
అరారు కాలాలు చైత్రాలుగా 
పూయించే... పులకించే...
మా ప్రేమ బృందావనం

మా ఇంటి పేరే అనురాగం 
మా సొంత ఊరే మమకారం

చరణం: 1
అల్లారు ముద్దుల్లో ఒక పొద్దున
మా ఇంట వెలసింది చిరుదేవత
తాను నా జ్యోతిగా నేను పూజారిగా
కంటిపాపల్లే కాపాడనా 
చిట్టి చిన్నారి మా దేవతా
కోటి దీపాల వెలుగవ్వదా 
దీవించి... ప్రేమించే...
మా ఇళ్లు దేవాలయం

మా ఇంటి పేరే అనురాగం 
మా సొంత ఊరే మమకారం

చరణం: 2
చిలకమ్మే అడిగింది మా పాపనీ
తెలుగింటి పాటైనా నేర్పాలని
మనసు మందారము మాట మకరందము
ఆమె చిన్నారి మా ప్రాణము
పాప నవ్వాలి ఈ జన్మకీ
పూవులివ్వాలి ప్రతి కొమ్మకీ
నవ్వుల్లో... పువ్వుల్లో...
సాగాలి మా జీవితం హా 

మా ఇంటి పేరే అనురాగం 
మా సొంత ఊరే మమకారం

No comments

Most Recent

Default