Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Khaidi Kalidasu (1977)




చిత్రం: ఖైదీ కాళిదాసు (1977) 
సంగీతం: కె. చక్రవర్తి 
సాహిత్యం: మైలవరపు గోపి
గానం: యస్.పి. బాలు, పి. సుశీల, యస్.జానకి, మాధవపెద్ది సత్యం
నటీనటులు: శోభన్ బాబు, మోహన్ బాబు, చంద్రమోహన్, ఉన్ని మేరీ, దీప, రోజారమని, బేబి రోహిణీ, మాధవి 
మాటలు: గొల్లపూడి
దర్శకత్వం: వి.సుబ్రమణ్యం
నిర్మాత: వి.ఎస్.నరసింహా రెడ్డి
విడుదల తేది: 01.01.1977



Songs List:



ఎవరీ చక్కనివాడు పాట సాహిత్యం

 
చిత్రం: ఖైదీ కాళిదాసు (1977) 
సంగీతం: కె. చక్రవర్తి 
సాహిత్యం: మైలవరపు గోపి 
గానం: యస్.పి.బాలు, పి.సుశీల

పల్లవి: 
ఓ.. హొ.. ఓఓఓ.. హొ.. ఓఓ.. హొ.. హా 
ఎవరీ చక్కనివాడు ఎంతకూ చిక్కనివాడు.. ఎప్పటికి దారికొస్తాడో
ఎవరీ చక్కని చుక్క సోకు దీని కాలికి మొక్క
కాదన్నా వెంట పడుతోందీ.. హా...
కాదన్నా వెంటపడుతోందీ 

ఆఆ.. ఆ..ఆ 
ఎవరీ చక్కనివాడు ఎంతకూ చిక్కనివాడు ఎప్పటికి దారికొస్తాడో
ఎవరీ చక్కని చుక్క సోకు దీని కాలికి మొక్క
కాదన్నా వెంట పడుతోందీ.. హా... 
కాదన్నా వెంటపడుతోందీ 

చరణం: 1
కదలిక వుందీ మబ్బులో కదలిక వుందీ.. 
నీటికీ వేగం వుందీ గాలికీ చలనం వుందీ.. 
వీడిలోనే ఉలుకూ పలుకూ లేకుందీ

కదలిక వుందీ మబ్బులో కదలిక వుందీ 
నీటికీ వేగం వుందీ గాలికీ చలనం వుందీ 
వీడిలోనే ఉలుకూ పలుకూ లేకుందీ

వయసొచ్చిందీ దానితో వలపొచ్చిందీ హా...
వయసొచ్చిందీ దానితో వలపొచ్చిందీ 
అందుకే చిన్నది తొందర పడుతోందీ
అందుకే చిన్నది తొందర పడుతోందీ

ఆఆ..ఆఆ.. అ 
ఎవరీ చక్కనివాడు ఎంతకూ చిక్కనివాడు ఎప్పటికి దారికొస్తాడో
ఎవరీ చక్కని చుక్క సోకు దీని కాలికి మొక్క
కాదన్నా వెంట పడుతోందీ.. హా... 
కాదన్నా వెంటపడుతోందీ 

చరణం: 2
కన్నేసిందీ కళ్ళతో కట్టేసిందీ
చూపుతో చంపేస్తుందీ నవ్వుతో బ్రతికిస్తుందీ 
అమ్మమ్మో కుర్రది చాలా టక్కరిది 

కన్నేసిందీ కళ్ళతో కట్టేసిందీ 
చూపుతో చంపేస్తుందీ నవ్వుతో బ్రతికిస్తుందీ 
అమ్మమ్మో కుర్రది చాలా టక్కరిది

వీడితో ఔననిపించి కొంగుముడి వెయ్యకపోతే 
వీడితో ఔననిపించి కొంగుముడి వెయ్యకపోతే 
ఎందుకీ ఆడజన్మ వోయమ్మా ఎందుకీ ఆడజన్మ వోయమ్మా

ఎవరీ చక్కనివాడు ఎంతకూ చిక్కనివాడు ఎప్పటికి దారికొస్తాడో
ఎవరీ చక్కని చుక్క సోకు దీని కాలికి మొక్క
కాదన్నా వెంట పడుతోందీ
.కాదన్నా వెంటపడుతోందీ



వద్దురా చెప్పకుంటే సిగ్గురా పాట సాహిత్యం

 
చిత్రం: ఖైదీ కాళిదాసు (1977) 
సంగీతం: కె. చక్రవర్తి 
సాహిత్యం: మైలవరపు గోపి 
గానం: యస్. జానకి 

పల్లవి:  
వద్దురా చెప్పకుంటే సిగ్గురా
గుట్టుగా దాచుకుంటే ముప్పురా
వద్దురా చెప్పకుంటే సిగ్గురా
గుట్టుగా దాచుకుంటే ముప్పురా
పేరైనా చెప్పలేదు సచ్చినోడు
సంతలోని ఆణ్ణి  చూసి నా తెలివి సంతకెళ్లే

వద్దురా చెప్పకుంటే సిగ్గురా
అబ్బా... గుట్టుగా దాచుకుంటే ముప్పురా


చరణం: 1
సరసకు వచ్చాడు హా...చనువుగ నవ్వాడు
మాటల గారడితో నను మాయ చేశాడు
సరసకు వచ్చాడు హా...చనువుగ నవ్వాడు
మాటల గారడితో నను మాయ చేశాడు

తప్పిపోతావన్నాడు జట్టుకట్టకున్నాడు
జారిపోతాదన్నాడు కొంగుపట్టుకున్నాడు
చుక్కలెన్నో చూపాలంటూ కళ్ళుమూయమన్నాడు
చుక్కలెన్నో చూపాలంటూ కళ్ళుమూయమన్నాడు
ఒళ్ళు తెలిసే లోపుగానే ఒళ్ళు నాకే ఆరిపోయే

వద్దురా చెప్పకుంటే సిగ్గురా 
అబ్బా...గుట్టుగా దాచుకుంటే ముప్పురా 


చరణం: 2
అడుగులు పడవాయే హా నడుములు బరువాయే.. హా
నాకు నా ఒళ్లే మాటవినదాయే
అడుగులు పడవాయే హా నడుములు బరువాయే.. హా
నాకు నా ఒళ్లే మాటవినదాయే

పదారేళ్లు నా పరువం పొట్టనెట్టుకున్నాడు
పదారేళ్లు నా పరువం పొట్టనెట్టుకున్నాడు
ఎందుకో వాడంటే కోపమే రాకుంది
ఎందుకో వాడంటే కోపమే రాకుంది
తప్పు చేసిన పోకిరీనే తండ్రిగా చేయాలనుంది

వద్దురా చెప్పకుంటే సిగ్గురా
గుట్టుగా దాచుకుంటే ముప్పురా
పేరైనా చెప్పలేదు సచ్చినోడు
సంతలోని ఆణ్ణి చూసి నా తెలివి సంతకెళ్లే
వద్దురా చెప్పకుంటే సిగ్గురా
అబ్బా...గుట్టుగా దాచుకుంటే ముప్పురా




సై పోటీకొస్తే ఆటపాట పాట సాహిత్యం

 
చిత్రం: ఖైదీ కాళిదాసు (1977) 
సంగీతం: కె. చక్రవర్తి 
సాహిత్యం: మైలవరపు గోపి 
గానం: యస్. జానకి

సై పోటీకొస్తే ఆటపాట కుస్తీ దోస్తీ ఏదైనా సైరా 
వెయ్ పందెం వేస్తే ఇల్లు, ఒళ్లు, సీసా పైసా ఏదైనా వెయ్
నా జేబులో సుఖమున్నిది నీ జేబులో ఎమున్నది.
నువ్వో . నేనో తేల్చుకుందామా ?
ఎందిరినో ఓడించిన దాన్ని .... ఓటమే తెలియనిదాన్నీ
వయసుకి నే చిన్నదాన్ని కన్ను కన్నుకీ నచ్చినదాన్ని
చేతికి చిక్కనిజాన్ని - సీమకి నే దొరసాన్ని
తొలి పందెమే నుపు గెల్చుకో - ఈ రాతిరే కసితీర్చుకో
నువ్వో నేనో తేల్చుకుందామా
సై పోటీకొస్తే.... ఆట పాట - కుస్తీ నాదోస్తీ వెంకమ్మా రావే
పందెం వేస్తే .... ఇల్లు, ఒళ్ళు సీసా పై పుల్లమ్మ వెయ్యవే

నా జేబులో నిప్పున్నదీ - నీ గుండెలో ఎమున్నదీ
నువ్వో - నేనో తేల్చుకుందామా ?
మాటలతోనే కోటలు కట్టే
మగతనమున్నది నీలో పన ఏడున్నది నీలో
చెప్పింది చేసే మగవాణ్ణి నేనే
అలుసు చెయ్యొద్దే పిల్లా - అనుభవిస్తావే పిల్లా
చూశానులే మహ చేశావులే
యిపుడేముంది ? యిక ముందే వుంది
మన సంగతి ఆహ తెలిసొస్తుంది
నువ్వో - నేనో తేల్చుకుందామా ? సై సై సై పై




హల్లో హల్లో ఓ తాతయ్య (సంతోషం) పాట సాహిత్యం

 
చిత్రం: ఖైదీ కాళిదాసు (1977) 
సంగీతం: కె. చక్రవర్తి 
సాహిత్యం: మైలవరపు గోపి 
గానం: పి. సుశీల, మాధవపెద్ది సత్యం, యస్.పి.బాలు

హలోహలో .... ఓ తాతయ్యా.... ఓ తాతయ్యా, రావయ్యా
నిన్నే పిలిచేది.... పిలుపుకు బదులేది
తాతా.... ఓ .... తాతా
హలో....హలో .... ఓ నాన్నారూ... ఓ నాన్నారూ రావాలీ
నిన్నే పిలిచేది.... పిలుపుకు బదిలేది... నాన్నా, ఓ నాన్నా
అమ్మలాగే తాత ఒడిలో చోటిస్తాడు
ఏడ్చినపుడు కథలు చెప్పి జో కొడతాడు
అమ్మలాగే తాత ఒడిలో చోటిసాడు
ఏడ్చినపుడు కధలు చెప్పి జో కొడతాడు
జో.... జో... జో... జో.... జో జో.... జో
మరుజన్మలో మీ కడుపునే పుడతాన టాడు
ఆ ఆశతోనే యిప్పుడింతగా చేరదీస్తాడు.... బాబూ
లలాల్ల లా
పాపా
హలో ....హలో
బాబూ
అలాఅలా
పాపా
హలో ....హలో
మాకు వెలుగై నాన్న ఎపుడూ తోడుంటాడు
ఏది తప్పో ఏది ఒప్పో చెబుతుంటాడు
మాకు వెలుగై నాన్న ఎపుడూ తోడుంటాడు
ఏది తప్పో, ఏది ఒప్పో చెబుతూంటాడు

ఆఁ..‌.
కళ్లుమూసిన కన్నతల్లి కలలే పండాలి
ఆఁ..‌.ఆఁ..‌.
కళ్లమూసిన కన్నతల్లి కలలే పండాలి
మీ నడత చూసి లోకమంతా నాన్నను పొగడాలి..బాబూ
లలాల్లలా
పాపా
హలో....హలో
బాబూ....
లలాల్లలా
పాపా
హలో ....హలో
హలో .... హలో .... ఓ తాతయ్యా
ఓ నాన్నారు
రావాలీ.... నిన్నే పిలిచేది.... పిలుపుకు బదు లేది?
నిన్నే పిలిచేది.... పిలుపుకు బదులేది?



హల్లో హల్లో ఓ తాతయ్య ( విషాదం) పాట సాహిత్యం

 
చిత్రం: ఖైదీ కాళిదాసు (1977) 
సంగీతం: కె. చక్రవర్తి 
సాహిత్యం: మైలవరపు గోపి 
గానం: యస్.పి.బాలు, పి. సుశీల, యస్. జానకి

హల్లో హల్లో ఓ తాతయ్య రావయ్యా నిన్నే ( విషాదం)


No comments

Most Recent

Default