చిత్రం : సీతా రామం (2022) సంగీతం: విశాల్ చందసేఖర్ నటినటులు:దుల్కర్ సాల్మన్, రష్మిక మందన్న, మృణాల్ ఠాకూర్ దర్శకత్వం: హను రాఘవపూడి నిర్మాత: అశ్వని దత్ విడుదల తేది: 05.08.2022
Songs List:
ఓ సీతా వదలనిక పాట సాహిత్యం
చిత్రం : సీతా రామం (2022) సంగీతం: విశాల్ చందసేఖర్ సాహిత్యం: అనంత శ్రీరాం గానం: యస్.పి.బి.చరణ్ , రమ్యా బెహ్రా ఓ సీతా వదలనిక తోడౌతా రోజంతా వెలుగులిడు నీడౌతా దారై నడిపే చేతి గీత చేయి విడువక సాగుతా తీరం తెలిపెనే నుదుటి రాత నుదుట తిలకమై వాలుతా కనులలో మెరుపులా తారాడే కలని నేనౌతా హే రామా ఒకరికొకరౌతామా కాలంతో కలిసి అడుగేస్తామా రేపేం జరుగునో రాయగలమా రాసే కలములా మారుమా జంట జన్మనే గీయగలమా గీసే కుంచెనే చూపుమా మెరుపులో ఉరుములో దాగుంది నిజము చూడమ్మా ఓ సీతా వదలనిక తోడౌతా హే రామా ఒకరికొకరౌతామా నేరుగా పైకి తెలుపని పలుకులన్నీ నీ చూపులే నేలపై వాలుతున్నవి అడుగు అడుగున పువ్వులై ఓ వైపేమో ఓపలేని మైకం లాగుతోంది మరోవైపు లోకం ఏమి తోచని సమయంలో ఏది తేల్చని హృదయమో ఏమో బిడియమో నియమమో నన్నాపే గొలుసు పేరేమో నిదుర లేపడుగు ఒక్క నీ పేరే కలవరిస్తానులే నిండు నూరేళ్ల కొలువనే తెలిసి జాగు చేస్తావులే ఎపుడు లేదే ఏదో వింత బాధే వంత పాడే క్షణం ఎదురాయే కలిసొస్తావా ఓ కాలమా కలలు కునుకులా కలుపుమా కొలిచే మనిషితో కొలువు ఉండేలా నీ మాయ చూపమ్మా హాయ్ రామా రామా ఒకరికొకరౌతామా కాలంతో కలిసి అడుగేస్తామా దారై నడిపే చేతి గీత చేయి విడువక సాగుతా తీరం తెలిపెనే నుదుటి రాత నుదుట తిలకమై వాలుతా కనులలో మెరుపులా తారాడే కలని నేనౌతా
ఇంతందం దారి మల్లిందా పాట సాహిత్యం
చిత్రం : సీతా రామం (2022) సంగీతం: విశాల్ చందసేఖర్ సాహిత్యం: కృష్ణ కాంత్ గానం: యస్.పి.బి.చరణ్ ఇంతందం దారి మల్లిందా భూమిపైకే చేరుకున్నదా లేకుంటే చెక్కి ఉంటారా అచ్చు నీలా శిల్ప సంపదా జగత్తు చూడనీ మహత్తు నీదేలే నీ నవ్వు తాకి తరించె తపస్సీలా నిశీదులన్నీ తలొంచే తుషారాణివా విసుక్కునె వెళ్ళాడు చందమామయే నువ్వుంటే నా పనేంటనే ఈ నేలకే దిగేను కోటి తారలే నీకంత వెన్నెలేంటనే నీదే వేలు తాకి నేలే ఇంచు పైకి తేలే వింత వైఖరీ వీడే వీలు లేని ఏదో మాయలోకి లాగే పిల్ల తెంపరీ నదిలా దూకేటి నీ పైట సహజగుణం పులిలా దాగుంది వేటాడే పడుచుతనం దాసోహమంది నా ప్రపంచమే అదంత నీ దయే విసుక్కునె వెళ్ళాడు చందమామయే నువ్వుంటే నా పనేంటనే ఈ నేలకే దిగేను కోటి తారలే నీకంత వెన్నెలేంటనే చిలకే కోక కట్టి నిన్నే చుట్టుముట్టి సీతాకోకలాయేనా..! విల్లే ఎక్కుపెట్టి మెల్లో తాళి కట్టి మరలా రాముడవ్వనా అందం నీ ఇంట చేస్తోందా ఊడిగమే యుద్ధం చాటింది నీపైన ఈ జగమే దాసోహమంది నా ప్రపంచమే అదంత నీ దయే విసుక్కునె వెళ్ళాడు చందమామయే నువ్వుంటే నా పనేంటనే ఈ నేలకే దిగేను కోటి తారలే నీకంత వెన్నెలేంటనే
కానున్న కళ్యాణం ఏమన్నది పాట సాహిత్యం
చిత్రం : సీతా రామం (2022) సంగీతం: విశాల్ చందసేఖర్ సాహిత్యం: సిరివెన్నెల గానం: అనురాగ్ కులకర్ణి, సింధూరి. S ఆఆ ఆఆఆ ఆఆ ఆ ఆ ఆఆ కానున్న కళ్యాణం ఏమన్నది స్వయంవరం మనోహరం రానున్న వైభోగం ఎటువంటిది ప్రతి క్షణం మరో వరం విడువని ముడి ఇది కదా ముగింపులేని గాధగా తరముల పాటుగా... తరగని పాటగా ప్రతి జత సాక్షిగా... ప్రణయమునేలగా సదా కన్నుల్లోని కలలు అన్ని కరిగిపోని కలలుగా... కళ్ళముందు పారాడగా... (2) చుట్టు ఎవరూ ఉండరుగా కిట్టని చూపులుగా చుట్టాలంటూ కొందరుండాలిగా దిక్కులు ఉన్నవిగా గట్టిమేలమంటూ ఉండగా గుండెలోని సందడి చాలదా పెళ్లి పెద్దలెవరు మనకి మనసులే కదా అవా..! సరే..!! కన్నుల్లోని కలలు అన్ని కరిగిపోని కలలుగా... కళ్ళముందు పారాడగా.... (2) తగు తరుణం ఇది కదా మదికి తెలుసుగా తదుపరి మరి ఏమిటటా తమరి చొరవట..! బిడియమిదేంటి కొత్తగా తరుణికి తెగువ తగదుగా పలకని పెదవి వెనక పిలువు పోల్చుకో సరే మరి.! కన్నుల్లోని కలలు అన్ని కరిగిపోని కలలుగా... కళ్ళముందు పారాడగా... (2)
ఓ ప్రేమా పాట సాహిత్యం
చిత్రం : సీతా రామం (2022) సంగీతం: విశాల్ చందసేఖర్ సాహిత్యం: కృష్ణకాంత్ గానం: కపిల్ కపిలన్, చిన్మయి శ్రీపాద వస్తా… నే వెంటనే ఉంటా… నీ వెంటనే ముద్దంటిన చెంపపై తడి ఆరనే లేదులే మాటొకటి చెప్పెంతలో పయనాలు మొదలాయెనే ఓ ప్రేమా.. - ఓ ప్రేమా అవసరమా... - అవసరమా మాయే నీ...- మాయే నీ చిరునామా... - చిరునామా మనసంతా నీవే ప్రియా విరహాన్ని చంపేదెలా అంతరిక్షం అంచుదాక ప్రేమ తాకిందిగా నీతో ఙ్ఞాపకాలే ఈ మంచుల అవి కరగవే ఈ నీ పరిమళాలే గుండెలో నిండెలే ఓ ప్రేమా.. - ఓ ప్రేమా అవసరమా... - అవసరమా మాయే నీ...- మాయే నీ చిరునామా... - చిరునామా ఇటు చూడవా ప్రియతమా ఎడబాటు అనుకోకుమా కాలికిందే చిక్కుకుందీ చూడు నా ప్రాణమే దూరం ఆవిరాయే నీ వెచ్చనీ నిశ్వాసలో నిదురే చెదిరేలోపే తిరిగిరా స్వప్నమా ఓ ప్రేమా.. - ఓ ప్రేమా అవసరమా... - అవసరమా మాయే నీ...- మాయే నీ చిరునామా... - చిరునామా
No comments
Post a Comment