చిత్రం: అంతా మనమంచికే (1972) సంగీతం: భానుమతి రామకృష్ణ, చెళ్ళపిళ్ళ సత్యం సాహిత్యం: దేవులపల్లి కృష్ణశాస్త్రి, దాశరథి, ఆరుద్ర గానం: భానుమతి రామకృష్ణ, పి.సుశీల, యస్.పి.బాలు, వసంత నటీనటులు: భానుమతి రామకృష్ణ, కృష్ణ, కృష్ణంరాజు, టి.పద్మిని (నూతన నటి) మాటలు: భానుమతి రామకృష్ణ, డి.వి.నరసరాజు కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: భానుమతి రామకృష్ణ నిర్మాణ సంస్థ: భరణీ పిక్చర్స్ విడుదల తేది: 19.04.1972
Songs List:
నీవేరా నా మదిలో పాట సాహిత్యం
చిత్రం: అంతా మనమంచికే (1972) సంగీతం: భానుమతి రామకృష్ణ , చెళ్ళపిళ్ళ సత్యం సాహిత్యం: దాశరథి గానం: భానుమతి రామకృష్ణ నీవేరా నా మదిలో - దేవా తిరుమలవాసా : ఓ శ్రీనివాసా నీ పదదాసిని నేనేరా .... యెంతో మధురం నీ శుభనామం జగతికి దీపం నీ దివ్య రూపం ఆశలపూలే - దోసిట నింపే వేచే భాగ్యము - నాదేరా.... నీ మెడలోన కాంతులు చిందే కాంచన హారము కాలేను నేను నీ పదములపై వాలిన సుమమె నిలిచే భాగ్యము నాదేరా.... నా జీవితమే హారతి చేసి నీ గుడి వాకిట నిలిచేను స్వామీ నీ సన్నిథియే నా పెన్నిధిగా మురిసే భాగ్యము నాదేరా....
మానస సంచరరే... పాట సాహిత్యం
చిత్రం: అంతా మనమంచికే (1972) సంగీతం: భానుమతి రామకృష్ణ , చెళ్ళపిళ్ళ సత్యం సాహిత్యం: వీర బ్రహ్మేంద్ర స్వామి గానం: భానుమతి రామకృష్ణ మానస సంచరరే... బ్రహ్మణి మానస సంచర రే... మదశిఖి పింఛా అలంకృత చికురే మహానీయ కపోల విజిత ముఖు రే... శ్రీ రమణీ కుచ దుర్గవిహారే సేవక జన మందిర మందారే పరమహంస ముఖ చంద్రచకోరే పరిపూరిత మురళీరవ కారే
స రి గ మ ప పాట పాడాలి పాట సాహిత్యం
చిత్రం: అంతా మనమంచికే (1972) సంగీతం: భానుమతి రామకృష్ణ , చెళ్ళపిళ్ళ సత్యం సాహిత్యం: ఆరుద్ర గానం: భానుమతి రామకృష్ణ & బృందం స రి గ మ ప పాట పాడాలి పాటలోనే పాఠాలన్నీ నేర్చుకోవాలి. పాటలె పూవుల బాట వెయ్యాలి ఆ బాటలో సూటిగా సాగిపోవాలి శ్రుతిలో కలవాలి -జతగా మెలగాలి అంతా ఒకటై సంతోషంగా ఆడుకోవాలి... ఆనందం మధురానందం అనుభవ సారమె సంగీతం పశువులనైనా-శిశువులనైనా పాములనైనా జో కొట్టేది చల్లని గీతం. సనిదపమగరిస.... సాధనతో మంచి సాధనతో సఫలము కావలె జీవితము జీవితమంతా జిలిబిలి ఆట ఒప్పులకుప్పా - ఒయ్యారి భామా చక్కనిచుక్కా, సనిదపమగరిస
పరాన్ముఖ మేలనమ్మా పాట సాహిత్యం
చిత్రం: అంతా మనమంచికే (1972) సంగీతం: భానుమతి రామకృష్ణ , చెళ్ళపిళ్ళ సత్యం సాహిత్యం: జి.ఎన్.బాలసుబ్రహ్మణ్యం గానం: భానుమతి రామకృష్ణ పరాన్ముఖ మేలనమ్మా పరాధీన పతిత నాపై నిరాదరము నీవే జేసితే నే సహింస తరమా తల్లీ... మరాళాజిక మందగమనీ .... మహాదేవి మదిరంజిత వదనీ నిరామయే... నీరదశ్యామలే నిత్యకల్యాణ గుణాలయే ...
మాటచాలదా, మనసుచాలదా పాట సాహిత్యం
చిత్రం: అంతా మనమంచికే (1972) సంగీతం: భానుమతి రామకృష్ణ , చెళ్ళపిళ్ళ సత్యం సాహిత్యం: దేవులపల్లి కృష్ణశాస్త్రి గానం: పి. సుశీల, యస్.పి. బాలు మాటచాలదా, మనసుచాలదా మాటలోని మనసులోని మమత తెలియదా ? దిక్కులు వినగా చుక్కలు కనగా నీ పక్కనె పలికే మక్కువ ఒలికే తోటలో పూవు చెవిలో తుమ్మెద ఊదేది గూటిలో ప్రియునితో గోరింక అనేది కన్నులలోన, నవ్వులలోనా ఒదిగే దాగే మధుర రహస్యం ఒకరికి నా గుండెలో ఎప్పుడూ వసతి ఒక్కరేనా ప్రేమకు ఏనాటికి అతిధి పదిలముగా నా హృదయములోనా ఒదిగే దాగే మధుర రహస్యం ....
చల్లగా హాయిగా పాట సాహిత్యం
చిత్రం: అంతా మనమంచికే (1972) సంగీతం: భానుమతి రామకృష్ణ , చెళ్ళపిళ్ళ సత్యం సాహిత్యం: ఆరుద్ర గానం: భానుమతి రామకృష్ణ చల్లగా హాయిగా లాలించు లాలి నేనేరా మెల్లగా తీయగా నవ్వించు నవ్వు నీవేరా ముందుగా రాగల శుభకాలము నీదే నీదే కొందరే సుఖపడే యీ లోకము మారెనోయి అందరూ ఒకటిగా జీవించు యుగము రావాలి ॥చల్లగా॥ ఎవరికీ తెలియని ఏ కొమ్మనుండి పూచావో ఎవ్వరూ లేరని ఎలుగెత్తి ఎంత ఏడ్చావో ఏడ్చితే ఏ కనుల నీలాలు ఎవరు తుడిచారో ఆడుతూ పాడుతూ నీ జీవనౌక సాగాలి ॥చల్లగా॥
నేనె రాధనోయీ పాట సాహిత్యం
చిత్రం: అంతా మనమంచికే (1972) సంగీతం: భానుమతి రామకృష్ణ , చెళ్ళపిళ్ళ సత్యం సాహిత్యం: దాశరధి గానం: భానుమతి రామకృష్ణ నేనె రాధనోయీ గోపాలా ... అందమైన యీ బృందావనిలో విరిసిన వున్నమి వెన్నెలలో చలని యమునా తీరములో నీ పెదవుల పై వేణుగానమై పొంగి పోదురా నేనీ వేళా..... ఆదే పొన్నల నీడలలో నీ మృదు పదముల జాడలలో నేనే నీవె నీవే నేనై అనుసరింతురా నేనీ వేళా ....
నవ్వవే... నా చెలీ... పాట సాహిత్యం
చిత్రం: అంతా మనమంచికే (1972) సంగీతం: భానుమతి రామకృష్ణ , చెళ్ళపిళ్ళ సత్యం సాహిత్యం: దాశరధి గానం: యస్.పి.బాలు, వసంత నవ్వవే... నా చెలీ...చల్లగాలి పిలిచేను మల్లెపూలు నవ్వేను...వలపులు పొంగేవేళలో నవ్వవే .... నా చెలీ... నవ్వనా, నా ప్రియా.... మూడుముళు పడగానే తోడు నీవు కాగానే - మమతలు పండేవేళలో .... నవ్వనా, నా ప్రియా.... మనసులు యేనాడో కలిశాయిలే మనువులు యేనాడో కుదిరాయిలే నీవు నాదానవే నీవు నా వాడ వే .... నేను నీ వాడనే నేను నీ దాననే ఇక ననుజేరి మురిపింప బెదురేలనే.... ॥నవ్వవే ॥ జగమేమి తలిచేనో ? మన కెందుకు ? జనమేమి పలికేనో ? మనకేమిటి.... నీవు నా దానవే నీవు నా వాడివే నేను నీ వాడినే నేను నీ దాననే నిజమైన ప్రేమ గెలిచేనులే...... ||నవ్వవే॥
No comments
Post a Comment