చిత్రం: భలే మోసగాడు (1972) సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం సాహిత్యం: శ్రీ శ్రీ, దాశరథి, కొసరాజు గానం: పి. సుశీల, ఎల్.ఆర్.ఈశ్వరి, యస్.పి. బాలు నటీనటులు: కృష్ణ, విజయ నిర్మల, కృష్ణం రాజు (సహాయ నటుడు) దర్శకత్వం: పి. సాంబశివరావు నిర్మాతలు: పి. వి. కె దుర్గాప్రసాద్ రావు, గబ్బిట వెంకటరావు విడుదల తేది: 12.07.1972
Songs List:
అందాలన్నీ చూపాలంటే... పాట సాహిత్యం
చిత్రం: భలే మోసగాడు (1972) సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం సాహిత్యం: దాశరథి గానం: ఎల్.ఆర్.ఈశ్వరి అందాలన్నీ చూపాలంటే... లా... లా అడిగినవన్నీ ఇవ్వాలంటే ... లా ... లా అందరిలోన తొందరపడితే అడొస్తుంది ... లా పెదవులు తహతహ పడుతున్నై బుగ్గలు తళతళ మంటున్నై సొంపులు సవాలంటై వొంపులు తయారం అందరిలోన తొందరపడితే అడొస్తుంది ... లా ... వయసులు మిసమిస మంటున్నై మనసులు గుసగుస పెడుతున్నై వలపులు రెడీ అంతై తలవులు స్టడీ అంతై అందరిలోన తొందరపడితే అడొస్తుంది ... లా ...
యేమయ్యో యెఱ్ఱటి కుఱోడా పాట సాహిత్యం
చిత్రం: భలే మోసగాడు (1972) సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం సాహిత్యం: దాశరథి గానం: పి.సుశీల & పార్టీ యేమయ్యో యెఱ్ఱటి కుఱోడా !! చాలులే అల్లరి బులోడా ! ఆడది అబలనుకున్నావా ! అదేమీ సాగదు పోవయ్యా | తెలుసుకో ! తెలుసుకో ! తెలుసుకో ! కన్నెపిల్లలో సోయగం సన్నజాజితో సమానం పెచ్చుమీరిన పరిహాసం విచ్చుక త్తితో చెలగాటం మగువ తెగువనే చూపిందా మీ మగాళ్ళపని ఇక గోవిందా ! తెలుసుకో తెలుసుకో ... తెలుసుకో !... వయసుపిల్ల లో లేనిదీ వసుధలోన యేమున్నది ! మెచ్చి మనసునే ఇచ్చిందా వచ్చి స్వర్గమే వాలదా ! వాడిచూపులే చూసిందా ! మగధీరులందరు గోవిందా ! తెలుసుకో ... తెలుసుకో ... తెలుసుకో ..... తెలుసుకో...
ఈ హుషారులో పాట సాహిత్యం
చిత్రం: భలే మోసగాడు (1972) సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం సాహిత్యం: శ్రీ శ్రీ గానం: యస్.పి.బాలు ఈ హుషారులో ఈ నిషాలలో ఇలా ఇలా మునిగిపోవనీ కలలో అలనై తేలనీ ఈ హుషారులో ఈ షికారులో ఇలా ఇలా కరిగిపోవసీ యెదలో నిజమే తేలనీ నీ కన్నులలో ఏదో వింత మైకమూ ఆ మైకంలో దాగే వలపు లోకము నిజమని నమ్మవా కథయను కొందునా కథలు కాదు కలలుకాదు నీవు నేను వేరుకాదు విరితేవె ధారజాలువారు మాటలు ఆ మాటలలో విరిసే వలవు తోటలు అవి మన సొంతము పద విహరింతము తమాషాలు చాలు చాలు భలే మోసగాడివే ఈ హుషారులో
నీ పైన చిన్నోడా పాట సాహిత్యం
చిత్రం: భలే మోసగాడు (1972) సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం సాహిత్యం: కొసరాజు గానం: ఎల్.ఆర్.ఈశ్వరి నీటైనా చిన్నోడా మాటుంది రారా అందాల వయ్యారి సై అంది లేరా ఔనంటావా ? కాదంటావా ? ఈ ముదుల గుమ్మని వద్దంటావా అందాల వయ్యారి సై అందిలేరా రాజనిమ్మనపండా రావయ్య బంగరుకొండా నువ్వులేక నిదుర రాదురా ఓరయ్యా నిన్ని డిసి నిలువలేనురా మరుమల్లె తోటుంది తోటలోన కోటుంది మనకోసం వేచుందీ మనసైతే రమ్మంది రారా డింగరి మామా నిన్నొదలదుర ఈ భామా అద్దాల మేడుందిరా మనకూ అందులోన వీడుంది రా ఘాపెన మందుంది మందులో మత్తుంది మత్తులోన ముంచేస్తా చిత్తు చిత్తు చేసేస్తా
No comments
Post a Comment