Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Manchi Vallaki Manchivadu (1973)




చిత్రం: మంచి వాళ్ళకు మంచివాడు (1973)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం 
సాహిత్యం: శ్రీ శ్రీ, దాశరథి, డా॥ సి. నారాయణరెడ్డి, ఆరుద్ర 
గానం: యస్.పి. బాలు, యస్. జానకి , ఎల్.ఆర్.ఈశ్వరి 
నటీనటులు: కృష్ణ , విజయ నిర్మల 
దర్శకత్వం: కె.యస్.ఆర్. దాస్ 
నిర్మాత: యస్.భావనారాయణ 
విడుదల తేది: 13.01.1973



Songs List:



పిల్లా షోకిల్లా పాట సాహిత్యం

 
చిత్రం: మంచి వాళ్ళకు మంచివాడు (1973)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం 
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి
గానం: యస్.పి. బాలు, యస్. జానకి

పిల్లా షోకిల్లా పిలిచే సందె వేళా
ఏయ్ పిల్లో లో లో నా కాలులో లో లో
నీ ఒడిలో లో లో – నేనే వున్నానే
పిల్లా షోకిల్లా - ఏయ్ పిలిచే సందెవేళ

కలలో కన్నెపిల్లను కన్నుగీటావా
అద్దంలో జాంపళ్లు అందుకున్నావా
అద్దంలో కాదులే, నిద్దర్లో కాదులే
అద్దాల మేడలో యిద్దరం
ఒక్కటై నిద్దుర చేశామే
పిల్లా షోకిల్లా - పిలిచే సందెవేళ

బుగ్గమీద గులాబీల ముగ్గులేశావే
మొగ్గలాంటి నా వయసు పువ్వుగ చేశావే
అమ్మమ్మో ఆ మజా కావాలా మేరిజా
ఎప్పుడు ఎక్కడ
యిప్పుడే యిక్కడే
మక్కువ తీర్చానే
పిల్లా షోకిల్లా పిలిచే సందెవేళ
అందుకో... రారా
అనుకో... రారా
అల్లుకో... రారా
అల్లరి పిల్లోడా
పిల్లా షోకిల్లా పిలిచే సందెవేళ



ఏ ఊరోయ్ మొనగాడా పాట సాహిత్యం

 
చిత్రం: మంచి వాళ్ళకు మంచివాడు (1973)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం 
సాహిత్యం: దాశరథి
గానం: ఎల్.ఆర్.ఈశ్వరి 

సాకీ:
ఏ ఊరోయ్ మొనగాడా
ఏ ఊరోయ్ సోగాడా
పాట వింటావా
ఆట చూసావా
ఆడిస్తారా, కవ్విస్తారా, ఓడిస్తా రా

ఆడదాన్ని చూపేనే అలుసా మీకు
అది పగబట్టిన కోడెత్రాచు తెలుసా మీకు
గజ్జ గల్లంటే - ఒళ్లు ఝల్లంటే
తాడు పెళ్లంటే - వీపు ఛెళ్లంటే
వున్న పొగరంత దిగిపోవాలోయ్

కన్నెపిల్ల కన్నుల్లో మెరుపులున్నవి
పడుచుపిల్ల అడుగుల్లో పిడుగులున్నవి
మెరుపు మెరిపి సే చూపు చెదరాలి
పిడుగు జడిపిసే గుండెలదరాలి
ఆడదంటే మజాకాదోయీ -




వెండిమబ్బు విడిచిందీ పాట సాహిత్యం

 
చిత్రం: మంచి వాళ్ళకు మంచివాడు (1973)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం 
సాహిత్యం: ఆరుద్ర 
గానం: యస్.పి. బాలు 

వెండిమబ్బు విడిచిందీ
వింత దాహం వేసిందీ
గిన్నెనిండ మధువు, కన్నెపిల్ల నింపాలి
రావే రామచిలక తేవే ఘాటుచుక్కా
ఏసుకో నిషా - చేసుకో మజా

విచ్చల విడిగా - నచ్చిన జతగా
తాగాలి, ఊగాలి - తై తెక్క లాడాలి
తలదాకా కై పెక్కెరా - తలకిందులవ్వాలిరా
కుతితీర కులకాలిరా - కై పెక్కి పండాలిరా
పిల్లగాలీ గుసగుసలు - పిల్లదానీ మిసమిసలూ
వన్నెకాడు నవ్వాడు చిన్నదేమో పొంగింది
భళిరా భళి, కుషిరా కుషి
నీటైన పిల్ల వాటేసుకుంటే 
నిలువెల్ల పొంగాలి, పులకించి పోవాలి
బుల్లెమ్మ వాలిందిరా
ఏయ్ బుగ్గలు నిమరాలిరా
సిగ్గుల్లు దోచాలిరా
సిందేసి చెప్పాలిరా 





లేనే లేదా అంతం పాట సాహిత్యం

 
చిత్రం: మంచి వాళ్ళకు మంచివాడు (1973)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం 
సాహిత్యం: శ్రీ శ్రీ
గానం: యస్.పి. బాలు 

లేనేలేదా అంతం లేనేలేదా
రానేరాదా విము కి రానేరాదా
బలవంతులకు నరహంతకులకు
బలికావాలా మానవత 

తల్లి ఎదుటనే బిడ్డను నరికి
ర ఎదుటనే భార్యను చెరచి
పుస్తెలు తెంచి ఆస్తులు దోచే
అమానుషాలకు అంతంలేదా ॥ లేనేలేదా॥

కడుపులు కాలిన కన్న తల్లులకు దారేది
ఉన్న ఊరినే వదిలిన వారికి ఊరేది
తల్లిని తండ్రిని కోలుపోయిన ఈ పిల్లల దిక్కేదీ
కళ్లు పోయినా కాళ్లు విరిగినా వికలాంగులకు బ్రతుకేదీ
లేనేలేదా
కమ్మిన చీకటి పారద్రోలగా కాంతి కిరణమే రాదా
సమ్మెట గుమ్మెట సంధించే ఒక సాహస వీరుడు రాడా

అభాగ్య జీవుల ఆక్రందనలు
అనాధ జనుల అశ్రుధారలు
కడలి తరగలై పిడుగుల ఝడు లై
ఒకే శ క్తిగా ఒకే వ్యక్తిగా
రుద్రమూర్తియై రూపొందాలీ 
క్షుద్రశక్తులను హతమార్చాలీ
హతమార్చాలీ - పరిమార్చాలీ

No comments

Most Recent

Default