చిత్రం: నిండు కుటుంబం (1973) సంగీతం: సాలూరి రాజేశ్వరరావు నటీనటులు: జగ్గయ్య, కృష్ణ , జమున, విజయ లలిత, అంజలీ దేవి దర్శకత్వం: పి. సాంబశివ రావు నిర్మాత: అమరారామ సుబ్బారావు విడుదల తేది: 22.06.1973
Songs List:
పిల్లా పాపల చల్లని గూడు పాట సాహిత్యం
చిత్రం: నిండు కుటుంబం (1973) సంగీతం: సాలూరి రాజేశ్వరరావు సాహిత్యం: దాశరధి గానం: ఘంటసాల పిల్లా పాపల చల్లనిగూడు చెల్లా చెదురై పోయెను నేడు ఒకరిది నేరం - ఒకరికిభారం జీవిత నావకు లేదా తీరం ఏమైపోవునొ ఈ సంసారం చరణం: 1 మంచిని మెచ్చే మనిషే లేడు మచ్చను చూపును ప్రతివాడు ఇన్ని తరాల యింటి గౌరవం ఒక్క నిందతో మంటగలిసెరా చరణం: 2 కన్నీళ్ళైనా కషాలెనా అన్నిభరించే అమ్మవు నీవు పిల్లలకోసం జీవించాలి నిండుకుటుంబం నిలపాలి చరణం: 3 పసిహృదయానికి తగిలెను గాయం యెవ్వరులేరు నీకుసహాయం వయసుకుమించిన పంతంతో పయనించే ఓ పసివాడా విజయం నీదే నీదేరా !
నవ నవ లాడే నవతరం పాట సాహిత్యం
చిత్రం: నిండు కుటుంబం (1973) సంగీతం: సాలూరి రాజేశ్వరరావు సాహిత్యం: దాశరధి గానం: పి. సుశీల, రమోల, వి.రామకృష్ణ యువతరం నవతరం నవనవలా దే - నవతరం ఉరకలువేసే - యువతరం మనలా అవడం - యెవరితరం యువతరం నవతరం చరణం: 1 ముందు ముందుకు సాగిపోయే యువకులం మేము స్వేచ్ఛకోసం పోరుసలిపే యువతులం మేము యెవ రేమం టె నేమి - యేపేరు పెడితేనేమి మనమూ మనమూ యేకమైతే మార్పుసాధిస్తాం చరణం: 2 ఆటలందూ దోరవయసు తొంగిచూడాలి పాటలందూ కొంటె మనసు పొంగిపోవాలి చేయీ చేయీ కలిపి సరదాల తేలి తేలి పాతకాలం రోతలన్నీ - మరిపించెయ్యాలి చరణం: 3 యవ్వనమే అందరికీ వఠములాంటిది నవ్వులతో గడపడమే మనకు మంచిది వడివడిగా నీటిలోనే బోటు షికారు లోతు లోతు కెళుతుంటే భలే హుషారు ఛల్ ఛల్ ఛల్ ఛల్ బోటు షికారు జిల్ జిల్ జిల్ జిల్ భలే హుషారు జంటలుగా వలపుమజా రుచిచూడాలి
తళతళ తళతళ మెరుపే మెరిసింది పాట సాహిత్యం
చిత్రం: నిండు కుటుంబం (1973) సంగీతం: సాలూరి రాజేశ్వరరావు సాహిత్యం: ఆత్రేయ గానం: పి. సుశీల, యస్.పి.బాలు తళ తళ తళ తళ మెరుపే మెరిసిందీ జల జల జల జల జ లేకురిసింది ఏంచేయాలీ - అబ్బా! ఏంచేయాలీ మిల మిల మిల కళే మెరిసినవీ గుబ గుబ గుబ గుబ గుబులేరేగినది ఏంచేయాలి - అబ్బా ! ఏంచేయాలి చరణం: 1 ఏదో చెయ్మని వయసంటే ఏల తొందరని మనసంటుంది మనసుకు వయసుకు మధ్యనచిక్కి సొగసే ఉసూరు మంటుంది చరణం: 2 వెచ్చని జతగా నువ్వున్నావని చలి నన్నెంతో మెలివేస్తుంది దుడుకుగ దూకే తోడున్నావని వలపే వరదై వంచేస్తుంది చరణం: 3 ఎత్తూ పల్లా లేకంచేసే చీకటి ఎంతో బాగుంటుంది చేయీ చేయిగ యిద్దరముంటే చీకిటి వెచ్చని వెలుగౌతుంది
అవలీలగా శ్రీరాముడు శివధనువును (పద్యం) పాట సాహిత్యం
చిత్రం: నిండు కుటుంబం (1973) సంగీతం: సాలూరి రాజేశ్వరరావు సాహిత్యం: దాశరధి గానం: పి. సుశీల అవలీలగ శ్రీరాముడు శివధనువును విరిచినంత చిత్తము పొంగన్ నవ సుమ మాలను చేకొని అవనీ సుత వచ్చి నిలిచె అతని ఎదుటన్ అందమునకె అందమైన సీతమ్మను ప్రేమమీద చూచె రామమూర్తి వీరవరుల కెల్ల వీరుడా రాముని సంతసమున కాంచే జనక జాత కొంత పులకరింత కొంత చక్కలిగింత అతని చూచినంత అదొక వింత పూలమాలతోడ - బాలనిండు మనమ్ము స్వామి కంఠసీమ వ్రాలిపోయె
ఎవరు కారణము పాట సాహిత్యం
చిత్రం: నిండు కుటుంబం (1973) సంగీతం: సాలూరి రాజేశ్వరరావు సాహిత్యం: ఆత్రేయ గానం: పి. సుశీల, కె.హరిరావు ఎవరు కారణము ఈ లోకమిలా - అల్లకల్లోల మగుటకు ఎవరు కారణము ప్రతి మనిషీ బాధలు పడుతున్నాడు ప్రతి దానికి దేవుని తిడుతున్నాడు దేవుడు పాపం అలోచించాడు మనిషికి పాఠం నేర్పాలనుకున్నాడు సృష్టించాడొక స్త్రీ మూ ర్తిని చేశాడు రెండుగా దానిని తెల్లనిదే మంచిన్నాడు- నల్లనిదే చెడుగన్నాడు అల్లదిగో మానవలోకం-అక్కడికే పొమ్మన్నాడు మంచిని నేను మీ మంచికోరి వచ్చాను...మంచిని నేను మీ హృదయాల్లో చోటిస్తే వుంటాను ఉండి-మిమ్మల్ని మనుషులుగా చేస్తాను రావమ్మా | రావమ్మా ! మా మంచి ఏమి తెచ్చావు మాకు దీనినించి చీకటి పోగొడతాను మీలో చీలికలన్నీ మాన్పుతాను అందరి నొకటిగ చేస్తాను. ఆనందం-అందం-అందిస్తాను సమతా-మమతా పండిస్తాను శాంతి- సౌఖ్యం-పంచేస్తాను ఆకలి శోకం లేనిరాజ్యం రామరాజ్యం మీలోకంలో స్థాపిస్తాను. నేను నేనే నేను నేననే అహం నేనే నాది నాదనే స్వార్ధం నేనే బలే బలే నువ్వేకావాలి పక్కవాడిని తొ క్కెయ్యాలి గొంతు పిసికి పారెయ్యాలి! గొయ్యి తవ్వి పూడ్చెయ్యాలి! అన్నీ చేసాను-మీ ఆశలు తీరుస్తాను ధర్మాన్ని ఉరి కెక్కిసాను అధర్మాని కే పట్టం కడతాను రాజకీయ రాక్షసి నా రూపం రాపిడి దోపిడి నా రాజ్యం ఫిరంగి నాకు మృదంగము ప్రేతభూమి నా నాట్యరంగము మీరే, మీరే | ఎవరికివారే కారణము ఈ మంచి వున్నది మీలో నే ఈ చెడ వున్నదీ మీలోనే మంచిని మీలో పెంచుకోవాలి చెడునుదాంతో గెలుచుకోవాలి ఈ జగతి స్వర్గం చేసుకోవాలి
ఈవేళ పాడేటి పాట సాహిత్యం
చిత్రం: నిండు కుటుంబం (1973) సంగీతం: సాలూరి రాజేశ్వరరావు సాహిత్యం: గోపి గానం: పి.సుశీల ఈవేళ పాడేటి పాటా నేడూ రేపూ వినిపించు నీ వున్నచోటా ఏ నాటికీ ముమ్మూలకీ చరణం: 1 మనసుంది. మన లేవు నీవూ తనువుంది కనరాను నేనూ చిరుగాలి నేనూ- తెరచాప నీవూ యేనాడు చేరేము రేవూ చరణం: 2 మన కేసిపోయేను హృదయం చేజారిపోనీకు సమయం మనవింత స్నేహం వెలిగించుదీపం తొలగించు నీపైన శాపం
No comments
Post a Comment