సాంగ్: సొమ్మసిల్లిపోతున్నవే ఓ సిన్నా రాములమ్మ! (2022) సంగీతం: కళ్యాణ్ కీస్ రచన: రాము రాథోడ్ సింగర్: రాము రాథోడ్ ప్రొడక్షన్: MS అడ్డా
సొమ్మసిల్లిపోతున్నవే ఓ సిన్నా రాములమ్మ! పాట సాహిత్యం
సాంగ్: సొమ్మసిల్లిపోతున్నవే ఓ సిన్నా రాములమ్మ! (2022) సంగీతం: కళ్యాణ్ కీస్ రచన: రాము రాథోడ్ సింగర్: రాము రాథోడ్ ప్రొడక్షన్: MS అడ్డా కంటికి కునుకే కరువాయినే! గుండెల బరువే మొదలయినే! సొమ్మసిల్లిపోతున్నవే ఓ సిన్నా రాములమ్మ! చెమ్మగిల్లి ముద్దివ్వవే చూపించవే నాపై ప్రేమ! నల్ల నల్లాని కళ్లతో నాజూకు నడుముతో! నన్నాగం జేసితివే! గుండెలో గాలిలో తేలుతు ఆరాటాలాడుతూ..నీ ఒళ్లో నీవాలినే! సుట్టు దిప్పూకున్నావే! ఓ చిన్నా రాములమ్మ! చెమటచుక్కొలే తీసెయ్యకే నీ చీర కొంగుకే ముడివెయ్యవే! సాయం కాలం వేళ సందె పొద్దులాగ చెంతలోనే ఉండవే! చీకటేల మెరిసే సుక్కలాగ గుండెలోన దాగవే! నీటిలోన నీడ చూస్తుంటే ఈ వేళ నీబొమ్మలావున్నదే! నీ చేతినడ్డేసి కలలన్నీ చెరిపేసి కాలాన్ని మార్చకే ఎక్కడున్నా ఎదురయ్యే నీ సన్నజాజి నవ్వులే! సక్కనైనా సొగసులే నాకిచ్చి స్వర్గంలో బంధించవే! ఏటి గట్టి మీద ఎదురు చూపుల్లోన కళ్ళల్లో నిండినవే! గాలి వానల్లోన గొడుగల్లే రమ్మనవే వెచ్చగ కౌగిలికే! నీ ఊహలే కన్న నీ ధ్యాసలో ఉన్న నా దరికి రమ్మంటినే! నిను వెతికే దారుల్లో అడ్డంకులెన్నునా..నా అడుగు నీ జాడకే! ముద్దుగున్నా నా చెలివే! ఓ చిన్నా రాములమ్మా! సుక్క చేరే రోజెన్నడే ప్రాణం అల్లాడే నీ కోసమే! పారేటి సెలయేరు పలకరించకున్న పర్వాలేదనుకుంటినే! ప్రాణం కన్న నీవు ఎక్కువ అంటున్న పట్టించుకోవెందుకే! పువ్వుల్లో దాగున్న పరిమళాలన్ని నీ చెంత చేరిస్తినే! పంచబూతలన్ని సాక్షులుగ చేసి మనువాడు కుంటాలే! జన్మజన్మాల బంధానివే! ఓ సిన్నా రావులమ్మా! నా చీకటి బ్రతుకులో వెలుగివ్వవే! నా ఇంటి దీపాన్ని వెలుగించవే!
No comments
Post a Comment