Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Balagam (2023)




చిత్రం: బలగం (2023)
సంగీతం: భీమ్స్ సిసిరోలియో
నటీనటులు: ప్రియదర్శి, కావ్య కళ్యాణ్ రామ్
దర్శకత్వం: వేణు యల్దండి ( టిల్లు)
ప్రొడక్షన్ హౌస్: దిల్ రాజు ప్రొడక్షన్స్
నిర్మాతలు: హర్షిత్ రెడ్డి, హన్షిత రెడ్డి
విడుదల తేది: 03.03.2023



Songs List:



బలరామ నరసయ్యో పాట సాహిత్యం

 
చిత్రం: బలగం (2023)
సంగీతం: భీమ్స్ సిసిరోలియో
సాహిత్యం: కాసర్ల శ్యామ్
గానం: భీమ్స్ సిసిరోలియో, వేణు యొల్దండి

శ్రీహరి రాఘవులే ఏ ఏ ఏయ్
అయ్యో బాలి బాలి బాలి
అయ్యో బాలి బాలి బాలి

ఏ దిక్కు పోతున్నవే బాలి
నువ్వున్న ఇల్లు ఇడిసి బాలి
నువ్వున్న జాగ ఇడిసి బాలి
నువ్వుతిన్న కంచం ఇడిసి బాలి
నువ్ పన్న మంచం ఇడిసి బాలి
ఆటేటు పోతున్నవే బాలి
గోవిందా గోవిందా

బలరామ నరసయ్యో బలరామ నరసయ్యో
బంగారి తోవబట్టి బయలెల్లుతుంటివో
బలరామ నరసయ్యో
బలరామ నరసయ్యో బలరామ నరసయ్యో
బంగారి తోవబట్టి బయలెల్లుతుంటివో
బలరామ నరసయ్యో

బలరామ నరసయ్యో బలరామ నరసయ్యో
బాధంటు లేని సోటు ఎతుక్కుంట పోతివో
బలరామ నరసయ్యో
బలరామ నరసయ్యో బలరామ నరసయ్యో
బాధంటు లేని సోటు ఎతుక్కుంట పోతివో
బలరామ నరసయ్యో

తీరు తీరు యేషాలేసి ఎంత అలసి పోయినవో
తోడురాని మంది కోసం తిప్పలెన్ని మోసినవో
కట్లు తెంచుకోని నేడు కైలాసం పోతున్నవో

బలరామ నరసయ్యో బలరామ నరసయ్యో
బంగారి సావునీది బయలుదేరి పోవయ్యో
బలరామ నరసయ్యో
బలరామ నరసయ్యో బలరామ నరసయ్యో
భూమ్మీద లేని హాయి సచ్చి అనుభవించయ్యో
బలరామ నరసయ్యో

బాల మల్లేశా బైలు మల్లేశా
బాల మల్లేశా బైలు మల్లేశా
రాంగ రాంగ ఏమి తేమురో కొడుకా
పొంగ ఏమి కట్క పోమురో కొడుకా

బాల మల్లేశా బైలు మల్లేశా
బాల మల్లేశా బైలు మల్లేశా
తొమ్మిది తొర్రలురో కొడుకా
ఒళ్లు ఉత్త తోలు తిత్తిరో కొడుకా

బాల మల్లేశా బైలు మల్లేశా
కూడగట్టుకొనె బలుగము కొడుక
ఒంటి పిట్ట లెక్క పోతము కొడుకా
నాలుగొద్దులీడ ఉంటము కొడుకా
పైన ఉంది నీది దేశము కొడుకా
బాల మల్లేశా బైలు మల్లేశా
బాల మల్లేశా బైలు మల్లేశా

సుక్కల్లాంటి సుక్కల్లో
ఏగు సుక్క నువ్వయ్యి
మా కండ్ల ముందే ఉంటావు
మా బాపు కొమురయ్య
మము కండ్లారా చూస్తుంటావు
మా బాపు కొమురయ్య

ముద్దుగ ముస్తాబైనవు
సావుతో జంట కూడినవు
ఈ పండుగ పెద్దగ జేస్తామే
మా బాపు కొమురయ్య
నిను సంబురంగ సాగ దోలుతమే
మా బాపు కొమురయ్య

బలరామ నరసయ్యో బలరామ నరసయ్యో
అంతలోనే అందరాని దూరమెల్లి పోతివో
బలరామ నరసయ్యో
బలరామ నరసయ్యో బలరామ నరసయ్యో
మా పిలుపు ఇనబడితే ఎనకకొచ్చి పోవయ్యో
బలరామ నరసయ్యో

అమ్మఒళ్ళో పండుకున్నట్టు
సింత లేని నిదురబోతివి
అగ్గి లోన తానం జేసి
బుగ్గిలాగ మారిపోతివి

బలరామ నరసయ్యో బలరామ నరసయ్యో
పచ్చనైన గూడు ఇడిసి పచ్చివయ్యి పోతివో
బలరామ నరసయ్యో
బలరామ నరసయ్యో బలరామ నరసయ్యో
పంచ భూతాల కొరకు ప్రేమ కొంచబోతీవో
బలరామ నరసయ్యో




పొట్టి పిల్ల పాట సాహిత్యం

 
చిత్రం: బలగం (2023)
సంగీతం: భీమ్స్ సిసిరోలియో
సాహిత్యం: కాసర్ల శ్యామ్
గానం:  రామ్ మిరియాల

పొట్టి పిల్ల 



ఊరూ పల్లెటూరు పాట సాహిత్యం

 
చిత్రం: బలగం (2023)
సంగీతం: భీమ్స్ సెసిరోలె
సాహిత్యం: కాసర్ల శ్యామ్
గానం: మంగ్లీ, రామ్ మిరియాల, భీమ్స్ సెసిరోలె

ఓరి వారి.. ఇంక పిండుతున్నావురా పాలు
ఇంకెప్పుడు పోతావురా ఊర్లోకి నీయక్క
ఇగ పొద్దు పొద్దునే మొదలెట్టినావోయి  నీ పాసుగాల

కోలో నా పల్లే కోడి కూతల్లే
ఒల్లిరుసుకుందే కోడె లాగల్లే
యాప పుల్లల.. చేదు నమిలిందే
రామ రామ రామ రామా
తలకు పోసుకుందే నా నేల తల్లే
అలికి పూసుకుందే ముగ్గు సుక్కల్లే
సద్ది మూటల్లే సగ బెట్టుకుందే
బాయి గిరక నా పల్లే

హేయ్.. తెల్లా తెల్లాని పాల దారలల్ల పల్లె తెల్లారుతుంటదిరా
గుళ్ళోని గంటలు కాడెడ్ల మెడలోన జంటగ మోగుత ఉంటాయిరా
నాగలి భుజాన పెట్టుకుంటే దోస్తులు చెయ్యేసినట్టేరా
గొడ్డు గోధా పక్కన ఉంటే కొండంత బలగం ఉన్నట్టురా
సల్లగాలి మోసుకొచ్చెరా సేను సెలకల ముచ్చట్లు
దారి పొడుగు సెట్ల కొమ్మలా రాలుతున్న పూల సప్పట్లు
గడ్డి మోపులు కాల్వ గట్టులు సెమట సుక్కల్లొ తడిసిన.. ఈ మట్టి గంధాలు

ఊరూ పల్లెటూరు దీని తీరే అమ్మ తీరు
కొంగులోనా దాసిపెట్టీ కొడుకు కిచ్చే ప్రేమ వేరు
ఊరూ పల్లెటూరు దీని తీరే కన్న కూతురు
కండ్ల ముందే యెదుగుతున్నా సంబరాల పంట పైరు

వంద గడపలా మందనా పల్లే
గోడ కట్టని గూడు నా పల్లే
సెరువుల్ల తుల్లేటి జెల్లషాపోలే
రామ రామ రామ రామా
మావ అత్త బావ బాపు వరసల్లే
ఊరంత సుట్టాల ముల్లె నా పల్లె
దారంలొ ఒదిగిన పూల దండల్లే రంగుల సింగిడి పల్లే

ఆలు మొగలు ఆడే ఆటలూ అత్త కోడండ్ల కొట్లాటలూ
సదిరి చెప్పలేని మొగని తిప్పలే తిప్పలూ
రచ్చ బండ మీద ఆటలూ ఛాయబండి కాడ మాటలూ
వొచ్చి పోయెటోల్ల మందలించుకొనే సంగతే గమ్మత్తి
తట్టబుట్టలల్ల కూరతొక్కులూ సుట్ట బట్టలల్ల బీడి కట్టలు
చేతనైన సాయం జేసే మనుషులు
మావి పూత కాసినట్టే మనుసులు
ఊరంటే రోజు ఉగాదే సచ్చేదాక ఉంటంది యాది

ఊరూ పల్లెటూరు దీని తీరే అమ్మ తీరు
కొంగులోనా దాసిపెట్టీ కొడుకు కిచ్చే ప్రేమ వేరు
ఊరూ పల్లెటూరు దీని తీరే కన్న కూతురు
కండ్ల ముందే యెదుగుతున్నా సంబరాల పంట పైరు

వంద గడపలా మంద నా పల్లే
గోడ కట్టని గూడు నా పల్లే
సెరువుల్ల తుల్లేటి జెల్లషాపోలే
రామ రామ రామ రామా
మావ అత్త బావ బాపు వరసల్లే
ఊరంత సుట్టాల ముల్లె నా పల్లె
దారంలొ ఒదిగిన పూల దండల్లే రంగుల సింగిడి పల్లే




తోడుగా మా తోడుండి పాట సాహిత్యం

 

చిత్రం: బలగం (2023)
సంగీతం: భీమ్స్ సిసిరోలియో
సాహిత్యం: కాసర్ల శ్యామ్
గానం: మొగిలి, కొమరమ్మ 

కరునించవే శారదాంభ
నీకు శరణు జేసెద పారతాంబా 
కరునించవే శారదాంభ
కొన్ని జన్మకు పాప ఖర్మలు ఎన్నున్న 
కరునించవే శారదాంభ

కొమరయ్య రాండుపొంగా  మందలిచ్చే వాడు 
ఐదో పదో ఇచ్చి అరుచు కొనే వాడు 
ఈ యాల మనమధ్య లేకపోయే
ఎంత మంచి మనసుండె 

తోడుగా మా తోడుండి
నీడగా మాతో నడిచి
తోడుగా మా తోడుండి
నీడగా మాతో నడిచి

నువ్వెట్టా వెళ్ళినావు కొమురయ్యా
నీ జ్ఞాపకాలు మరువమయ్యో కొమురయ్యా
కొడుకునెట్లా మర్సినావే కొమురయ్యా
నీ బిడ్డనెట్టా మర్సినావే కొమురయ్య

బలగాన్ని మర్సినావా
బాంధవుల మర్సినావా
బలగాన్ని మర్సినావా
బాంధవుల మర్సినావా 

నువ్వెక్కడెల్లినావు కొమురయ్యా
నీ జ్ఞాపకాలు మరవలేము కొమురయ్యా 
ఇయ్యాల కొమురయ్య మా అందు గలిగి
మాతో ఈ పదాలు పలికిస్తున్నాడో ఏమో

ఎల్లిపోతున్న నా కొడుకా
నా కొడుకా ఐలయ్య కైలయ్య
అయ్యయ్యో నా కొడుకా ఐలన్న
ఎల్లిపోతున్న నా కొడుకా
సినకొడకా మొయిలన్న మొయిలన్న
సినకొడకా మొయిలన్న బైలన్న

దయగల్ల లచ్చవ్వ లచ్చవ్వ
నేనెళ్ళిపోతున్న నా బిడ్డా
నేనెళ్ళిపోతున్న లచ్చవ్వ
బిడ్డా లచ్చవ్వ

నన్నిచ్చిన దేవుడేమో
నా కాకు జింపినాడు
నా ఆట ముగిసిందని
నన్ను పైకి బిలిసినాడు

నువ్వు కాశీకి బోయినగాని నా కొడుకా
కన్నతండ్రి గానరాడు నా కొడుకా
ఏ తీర్థము తిరిగినగాని నా బిడ్డ
ఈ కన్నతండ్రి తిరిగిరాడు నా బిడ్డ

పెద్ద కొడుకా ఐలయ్య నా తొలిసూరు కొడుకువు
ప్రేమగల్ల పెద్ద కొడకా ఐలన్న
నిన్ను పావురంగా సాదుకున్న ఐలన్న
పావురంగా సాదుకున్న ఐలన్న
గున్న గున్న తిరుగుతుంటే గుండెల్లో వెట్టుకున్న
నా గుణమే వచ్చిందని ఊరంతా జెప్పుకున్న
ఊరంతా జెప్పుకున్న
సత్తెనైనా సారుపాని ఐలన్న
నీకు దండసేసి మురిసినాను ఐలన్న
నేనెంతో సంబరబడ్డ ఐలన్న

చిన్న కొడుకా మొయిలన్న
గావురాల కొడుకువి నువ్వు మొయిలన్న
నా ముద్దుల కొడుకువు నువ్వు మొయిలన్న
సిలకోలే సాదుకున్న మొలకోలే బేర్చుకున్న
భుజాల గూర్చోబెట్టి బువ్వదిన బెట్టుకున్న 
బువ్వదిన బెట్టుకున్న
సుక్కలాంటి సుజాతని మొయిలన్న
నీ పక్కనుంచి సంబరపడ్డ మొయిలన్న

బిడ్డ లచ్చవ్వ నా బంగారు తల్లి
ఎక్కాని కొండ లేదే లచ్చవ్వ నీకై
మొక్కాని బండ లేదు లచ్చవ్వ
దిష్టి చుక్క బెట్టుకొని లచ్చిమోలే దిద్దుకుంటి
అమ్మవిడిచి పోయిందాని
కంటికి రెప్పవోలె కాపాడుకుంటి బిడ్డ
కాసుకుంటి గాదే బిడ్డ
కాసుకుంటి గాదే బిడ్డ

అల్లుడా నారాయణ
నా ఇంటి లచ్చిమిని అల్లుడా
నీ చేతుల వెట్టినాను అల్లుడా
నీ చేతుల వెట్టినాను నా అల్లుడా

ఐలయ్య ఇంటికి పెద్దోడంటే నా కొడకా
పెద్దమనసుండాలె నా కొడకా
పంచుకున్న రక్తము నా కొడకా
పైలంగా దాయాలే నా కొడకా

కన్నబిడ్డలోలే నువ్వు ఐలయ్య
తోడబుట్టినవాళ్ళని జూడు నా కొడుకా
పిల్లల కోడి తీరు నా కొడుకా
నీ రెక్కల్ల దాచుకోరా నా కొడుకా
నీ రెక్కలల్ల దాసుకోరా నా కొడుకా

చిన్నకొడుకా మొయిలన్న
అన్నంటే తండ్రెనక తండ్రి కొడుకా
అన్ననొక్క మాటంటే నన్నన్నట్టే
మర్చిపోకు బిడ్డ అవ్ బిడ్డ

ఒక్క తల్లి పిల్లలు నా కొడుకా
కూడిమాడుండాలే నా కొడుకా
కూడిమాడుండాలే నా కొడుకా
కలిసిమెలిసుండాలె మొయిలన్న

అన్నాకు బాధలొత్తే తమ్ముడు సూడావాలె
తమ్ముడికి బాధలొత్తే అన్నైనా సూడావాలె
నీకొప్పజెప్పుతున్న ఐలయ్యా
తమ్మున్ని పైలంగా జూడు ఐలయ్యా
తమ్మున్ని పైలంగా జూడరా నా కొడుకా

బిడ్డా మీ ఇద్దరి పొత్తుల 
ఒక్క చెల్లి ఉన్నదని
మర్చి పోకుండి కొడుకా
ఆడబిడ్డ ఆశపడ్తది కొడుకా
ఎండి బంగారం ఎంతున్నాగాని
పుట్టినింటి ఎల్లిపాయే కారం మెతుకులే గొప్పై బిడ్డ

నా ఇంటి దీపమేరా లచ్చవ్వా
దాని కంటే నీరు రావద్దు నా కొడుకా
నీ చెల్లె ఏడ్తావుంటే నా కొడుకా
నా జీవి సరిగబట్టదు నా కొడుకా
పచ్ఛాని సంసారమురా నా కొడుకా
మీరు ఇచ్చుకపోవద్దురా నా కొడుకా
మీరు ఇచ్చుకపోవద్దురా నా కొడుకా

No comments

Most Recent

Default