Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Vinaro Bhagyamu Vishnu Katha (2023)




చిత్రం: వినరో భాగ్యము విష్ణుకథ (2023)
సంగీతం: చైతన్ భరద్వాజ్
నటీనటులు: కిరణ్ అబ్బవరం , కాశ్మీర
దర్శకత్వం: మురళి కిషోర్ అబ్బూరు 
నిర్మాత: బన్నీ వాస్
విడుదల తేది: 17.02.2023



Songs List:



వాసవ సుహాస గమన సుధా పాట సాహిత్యం

 
చిత్రం: వినరో భాగ్యము విష్ణుకథ (2023)
సంగీతం: చైతన్ భరద్వాజ్
సాహిత్యం: కళ్యాణ చక్రవర్తి త్రిపురనేని 
గానం: కారుణ్య 

వాసవ సుహాస గమన సుధా
ద్వారవతీ కిరనార్బటీ వసుధా
అశోక విహితాం క్రుపానాన్రుతాం కోమలామ్
మనోజ్ఞితం మమేకవాకం

మయూఖ యుగళ మధుసూదన మదనా
మహిమగిరి వాహఘనా నాం
రాగ రధసారధి హే రమణా
శుభచలన సం ప్రోక్షణా
యోగ నిగమ నిగమార్చన వశనా
అభయప్రద రూపగుణ నాం
లక్ష్య విధి విధాన హే సదనా
నిఖిల జన సా లోచన

యుగ యుగాలుగా ప్రభోధమై
పది విధాలుగా పదే పదే
పలికేటి సాయమీమన్న
జాడలే కదా నువ్వెదికినదేదైనా

చిరుమోవికి జరిగిన చిరునవ్వుల ప్రాసన
చిగురేయక ఆగునా… నువ్వెళ్ళే దారిన
నిను నిన్నుగా మార్చిన… నీ నిన్నటి అంచున
ఓ కమ్మటి పాఠమే… ఎటు చూసినా

మయూఖ యుగళ మధుసూదన మదనా
మహిమగిరి వాహఘనా నాం
రాగ రధసారధి హే రమణా
శుభచలన సం ప్రోక్షణా
యోగ నిగమ నిగమార్చన వశనా
అభయప్రద రూపగుణ నాం
లక్ష్య విధి విధాన హే సదనా
నిఖిల జన సా లోచన



ఓ బంగారం పాట సాహిత్యం

 
చిత్రం: వినరో భాగ్యము విష్ణుకథ (2023)
సంగీతం: చైతన్ భరద్వాజ్
సాహిత్యం: భాస్కరభట్ల
గానం: కపిల్ కపిలన్ 

ఓ బంగారం... నీ చెయ్యి తాకగానే ఉప్పొంగి పోయిందే నా ప్రాణం
నా బంగారం... కన్నెత్తి చూడగానే నిద్దర్లె మానేచి జాగారం
నా చిట్టి చిట్టి గుండే నీ లోనే కొట్టుకుందే 
బుర్రంతా  పిచ్చెక్కిందే నా బంగారు తల్లి 
ఏ మొట్ట మొదటిసారి  మరిచానే  ఇంటి దారి 
ఆ సొట్ట బుగ్గతోటే నువ్వు నవ్వబట్టే
అద్తోదం ఇంత యుద్ధం చేయలేదే 
నీకోసం మారిపోవడం నమ్మే లేదే
 పుట్టాక ఇంత ఆనందం చూడలేదే 
నీ పేరే చెప్పుకుంటా ఈ పుణ్యం నీదే

నువ్వు పక్కనుంటే చాల్లే మత్తుఎక్కి తూలె మాయదారి మనసే 
మరి నిన్ను తాకే గాలే నన్ను తాకుతుంటే ఆదమరుపు ఇప్పుడే ఎగసే 
 నీ చూపు వలకే చాపలా దొరికే నా ఊపిరే తొలిగా అల్లాడే 
ఈ ప్రేమ వలలో ఏదో ఏదో జరిగే నడిచి నడిచి ఆగి ఆగేలా..  

నా చిట్టి చిట్టి గుండె నీలోనే కొట్టుకుందే బుర్రంతా పిచ్చెక్కిందే నా బంగారు తల్లి
ఏ మొట్టమొదటిసారి మరిచానే ఇంటి దారి ఆ సొట్ట బుగ్గ తోటే నువ్వు నవ్వబట్టే

 కాటుక కనులే పుట్టిస్తుంటే  కలలే వదిలేదెట్టాగే ఓ మైనా
నీ వల్లే మొదలై తిక్క తిక్క పనులే దిల్ రూబా  మోగిందే నాలోనా
 నీ పేరు పిలిచే ఆస్తమాను తలిచే నా సంగతే మరిచా అదేంటో
ఈ ప్రేమ కథలో చాలా చాలా తెలిసే ఒకటో రెండో ఎన్నో  ఎన్నెన్నో

 చిట్టి చిట్టి గుండె నీలోనే కొట్టుకుందే బుర్రంతా పిచ్చెక్కింది నా బంగారు తల్లి
 ఏ మొట్టమొదటిసారి మరిచానే ఇంటి దారి ఆ సోట్ట బుగ్గ తోటే నువ్వు నవ్వబట్టే




దర్శన పాట సాహిత్యం

 
చిత్రం: వినరో భాగ్యము విష్ణుకథ (2023)
సంగీతం: చైతన్ భరద్వాజ్
సాహిత్యం: భాస్కరభట్ల
గానం: అనురాగ్ కులకర్ణి

మనసే మనసే తననే కలిసే
అపుడే అపుడే తొలిప్రేమలోన పడిపోయా కదా
తనతో నడిచే అడుగే మురిసే
తనకా విషయం చెప్పలేక ఆగిపోయా కదా

ఎన్నో ఊసులు ఉన్నాయిలే
గుండే లోతుల్లో
అన్ని పంచేసుకుందామంటే
కళ్ళముందు లేదాయే దర్శన
దర్శన తన దర్శనానికింకా
ఎన్నాళ్ళు కన్నీళ్లతో ఉండాలిలా

తట్టుకోడం కాదే నావల్ల వయ్యారి పిల్ల
గుక్కపట్టి ఏడుస్తుందే ప్రాణం నీవల్లా
తట్టుకోడం కాదే నావల్ల వయ్యారి పిల్ల
గుక్కపట్టి ఏడుస్తుందే ప్రాణం నీవల్లా

ఇష్టమైంది లాగేసుకుంటే చంటిపిల్లాడల్లాడినట్టే
దిక్కు తోచకుందే నాకు నువ్వే లేకుంటే
నువ్వుగాని నాతో ఉంటే నవ్వులేరుకుంటానంతే
నీ జతలో క్షణాలకే దొరికెను పరిమళమే

చక్కగా చెట్టాపట్టా తిరిగాం అట్టా ఇట్టా
అరె లెక్కపెట్టుకుంటే
బోలెడు ఉన్నాయిలే చెప్పాలంటే

తట్టుకోడం కాదే నావల్ల వయ్యారి పిల్ల
గుక్కపట్టి ఏడుస్తుందే ప్రాణం నీవల్లా
తట్టుకోడం కాదే నావల్ల వయ్యారి పిల్ల
గుక్కపట్టి ఏడుస్తుందే ప్రాణం నీవల్లా

దారులన్ని మూసేసినట్టే
చీకటేసి కప్పేసినట్టే
నువ్వు లేకపోతే
నేను ఉన్నా లేనట్టే
చందమామ రావే రావే
జాబిలమ్మ రావే రావే
కమ్ముకున్న ఈ మేఘాలలో
వెలుతురు కనబడదే

బెంగతో ఇల్లా ఇల్లా
పోయేలా ఉన్నానే పిల్ల
నువ్వొచ్చేదాకా పచ్చి గంగైనా
ముట్టనులే నీమీదొట్టే

తట్టుకోడం కాదే నావల్ల వయ్యారి పిల్ల
గుక్కపట్టి ఏడుస్తుందే ప్రాణం నీవల్లా
తట్టుకోడం కాదే నావల్ల వయ్యారి పిల్ల
గుక్కపట్టి ఏడుస్తుందే ప్రాణం నీవల్లా




చుక్కలెత్తు కొండలే పాట సాహిత్యం

 
చిత్రం: వినరో భాగ్యము విష్ణుకథ (2023)
సంగీతం: చైతన్ భరద్వాజ్
సాహిత్యం: కళ్యాణ చక్రవర్తి త్రిపురనేని 
గానం: అనురాగ్ కులకర్ణి

చుక్కలెత్తు కొండలే నిండినా శ్రీపురం
నెత్తికొప్పు దేవుడీ కాపురం
మట్టితల్లి బొట్టులా ఎప్పుడూ సంబరం
ఎంకన్న సామికున్న ఎండి దోరం

ఊరులెన్ని చూసుకో వారికో వీరికో
పేరు పెట్టుకోవడం ఖచ్చితం
ఎల్లలన్ని ఏకమై చేసినా సంతకం
వేవేల మైళ్ళకైనా కాదు దూరం

పేదరాసి పెద్ద ముత్తైదువురా
సాధువురా ఈ ఊరే
చేసుకున్న పూర్వపుణ్యముంటేనే
పుడతారే మా ఊరే

దేశం మొత్తం పరపతిరా
తిరుపతి పేరంటే మోతరా
సామికైనా ధీమాలాగా నిలబడతారే
ఇట్టాంటి ఊరు చూడరే

చుక్కలెత్తు కొండలే నిండినా శ్రీపురం
నెత్తికొప్పు దేవుడీ కాపురం
మట్టితల్లి బొట్టులా ఎప్పుడూ సంబరం
ఎంకన్న సామికున్న ఎండి దోరం

సరదా సంద్రంలా ఉంటారే
సర్దుకు పోతారే
సమయాసమయాలే లేకుండా
సాయం చేసే కుదురే

దిగులే దాటుకొని
స్థిరంగా నిలబడిపోతారే
కల్లాకపటాన్నే ఖండించి
నవ్వుతు గెలువగ పొగరే

ఈ యాసలో ఉందో కదరే
అరె వినరో భాగ్యంబిదికదరే
మీసాల సామి ఉన్న ఊరే
రోషాలకేమో మాది పెద్ద పేరే

ఊరు చూస్తే కొత్తకొత్తగుంటుందీ
ప్రతిసారి కంగారే
వింద వింద గోవిందా అనుకుంటూ
కష్టాలే దాటేరే

దేశం మొత్తం పరపతిరా
తిరుపతి పేరంటే మోతరా
సామికైనా ధీమాలాగా నిలబడతారే
ఇట్టాంటి ఊరు చూడరే (2)

చుక్కలెత్తు కొండలే నిండినా శ్రీపురం
నెత్తికొప్పు దేవుడీ కాపురం
మట్టితల్లి బొట్టులా ఎప్పుడూ సంబరం
ఎంకన్న సామికున్న ఎండి దోరం



ప్రవాసాన్ని పాట సాహిత్యం

 
చిత్రం: వినరో భాగ్యము విష్ణుకథ (2023)
సంగీతం: చైతన్ భరద్వాజ్
సాహిత్యం: కళ్యాణ చక్రవర్తి త్రిపురనేని 
గానం: హైమత్ మహమ్మద్ 

ప్రవాసాన్ని 

No comments

Most Recent

Default