చిత్రం: Baby (2023) సంగీతం: విజయ్ బుల్గానిన్ నటీనటులు: ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ దర్శకత్వం: సాయి రాజేష్ నిర్మాత: SKN విడుదల తేది: 2023
Songs List:
ఓ రెండు ప్రేమ మేఘాలిలా పాట సాహిత్యం
చిత్రం: Baby (2023) సంగీతం: విజయ్ బుల్గానిన్ సాహిత్యం: అనంత శ్రీరామ్ గానం: శ్రీరామ్ చంద్ర ఏం మాయే ఇది ప్రాయమా అరె ఈ లోకమే మాయమా వేరే ఏ ధ్యాస లేదే ఆ గుండెల్లో వేరయ్యే ఊసే రాదే తుళ్ళే ఆశల్లో ఇద్దరిదీ ఒకే ప్రయాణంగా ఇద్దరిదీ ఒకే ప్రపంచంగా ఆ ఇద్దరి ఊపిరి ఒకటైందే మెల్లగా మెల్లగా ఓ రెండు ప్రేమ మేఘాలిలా దూకాయి వానలాగా ఆ వాన వాలు ఏ వైపుకో తేల్చేది కాలమేగా ఓ రెండు ప్రేమ మేఘాలిలా దూకాయి వానలాగా ఆ వాన వాలు ఏ వైపుకో తేల్చేది కాలమేగా తోచిందే ఈ జంట కలలకే ఏ ఏ ఏ నిజములా ఆ ఆ సాగిందే దారంతా చెలిమికే ఏ ఏ ఏ రుజువులా ఆ ఆ కంటీ రెప్ప కనుపాపలాగ ఉంటారేమో కడదాక సందామామ సిరివెన్నెల లాగ వందేళ్లైనా విడిపోక ఓ రెండు ప్రేమ మేఘాలిలా దూకాయి వానలాగా ఆ వాన వాలు ఏ వైపుకో తేల్చేది కాలమేగా ఓ రెండు ప్రేమ మేఘాలిలా దూకాయి వానలాగా ఆ వాన వాలు ఏ వైపుకో తేల్చేది కాలమేగా ఏం మాయే ఇది ప్రాయమా అరె ఈ లోకమే మాయమా వేరే ఏ ధ్యాస లేదే ఆ గుండెల్లో వేరయ్యే ఊసే రాదే తుళ్ళే ఆశల్లో ఇద్దరిదీ ఒకే ప్రయాణంగా ఇద్దరిదీ ఒకే ప్రపంచంగా ఆ ఇద్దరి ఊపిరి ఒకటైందే మెల్లగా మెల్లగా
దేవరాజ పాట సాహిత్యం
చిత్రం: Baby (2023) సంగీతం: విజయ్ బుల్గానిన్ సాహిత్యం: కళ్యాణ్ చక్రవర్తి గానం: ఆర్య దయాల్ తదుమ్ తనిక తకుమ్ తనీయ తకదును తదుమ్ తనిక తదుమ్ తనిక తా తదుమ్ తనక తధిమ్ తనక తకధిను తదుమ్ తనిక తదుమ్ తనక తా దేవ రాజ సేవ్య మూర్ధనే కీర్ణలోచనే, ఆ ఆ భావ బీజ గణ్య వాహిని నిత్య నూతనే, ఆ ఆ మలయజ హాస హాస్య వినిమయముగ లలిత సాధ్వితే సరసిజ వీక్ష నాక్ష విరచిత కావ్య కధన నాయికే ప్రభవ ప్రభకలిత విభవ శుభ జలిత విభుధ సంస్తుత్య భూమికా మలుపు కనపడని మునుపు ఎదురవని జగతి చేరింది తెలియక ఆ ఆ ఆఆ ఆఆ ఆఆ ఆ ఆ ఆఆ ఆఆ ఆఆ నిజమనుకోనే క్రీనీడలే అడుగడుగున ఉంటాయని తెలుపదు కదా ఓ పాఠమై, చదువే నిలకడ అనే ఆ మాటకే నిలబడమనే అర్ధం అని అతి సులువుగ అనిపించదే బ్రతుకే భ్రమలమైకాన భ్రమణమే చేసి భ్రమరమౌతుంది కాలమే అడుగు తడబడగ నేర్చుకొను నడక దాటుకొస్తుంది కాలమే వెలుగు జిలుగుల్లో వెలిగి పోలేక వెలిగి వస్తుంది చీకటే కలుసుకున్నంత కలిసిపోకంటూ మనకు చూపేను బాసటే జారే జారే నెర్రలపై ప్రయాణమే ఈ జీవితం పరాకనే తెర దాటితే జయం సదా (సదా) ఆఆ ఆఆ ఆ ఆఆ ఆఆ ఆఆ ఆ ఆఆ దేవ రాజ సెవ్య మూర్ధనే కీర్ణలోచనే ఏ ఏ ఏ ఏ
ప్రేమిస్తున్నా పాట సాహిత్యం
చిత్రం: Baby (2023) సంగీతం: విజయ్ బుల్గానిన్ సాహిత్యం: సురేష్ బనిశెట్టి గానం: PVNS రోహిత్ ప్రేమిస్తున్నా, ఆ ఆ ఆ ఆ ప్రేమిస్తున్నా ఆ ఆ ఆ నీ ప్రేమలో, ఓ ఓ ఓ ఓ జీవిస్తున్నా, ఆ ఆ ఆ ఆశకి ఇవ్వాలే… ఆయువు పోశావే కొత్తగ నా బ్రతుకే తీపిని చేశావే ఈ ముద్దు మన ప్రేమ గురుతుగా మనసున దాచుకుంటనే మన కథలాంటి మరో కథా చరితలో ఉండదంటనే ఓ ఓ ఓ ఆ ఆ ఆ ఆ ఆ ప్రేమిస్తున్నా, ఆ ఆ ఆ ఆ ప్రేమిస్తున్నా ఆ ఆ ఆ నీ ప్రేమలో, ఓ ఓ ఓ ఓ జీవిస్తున్నా, ఆ ఆ ఆ నువ్వు ఎదురే నిలబడితే వెలిగెనులే నా కంటి పాపలు ఒక నిమిషం వదిలెలితే కురిసేనులే కన్నీటి ధారలు అపుడెపుడో అల్లుకున్న బంధమిది చెదరదుగా చెరగదుగా మురిపెముగా పెంచుకున్న ప్రేమ నీది కరగదుగా తరగదుగా మరణము లేనిదొక్కటే అది మన ప్రేమ పుట్టుకే ప్రేమిస్తున్నా, ఆ ఆ ఆ ఆ ప్రేమిస్తున్నా ఆ ఆ ఆ నీ ప్రేమలో, ఓ ఓ ఓ ఓ జీవిస్తున్నా, ఆ ఆ ఆ నను ఎపుడూ మరువనని పరిచావులే చేతుల్లో చేతిని నను వదిలి బ్రతకవనీ తెలిసిందిలే నీ శ్వాస నేనని నువ్వు తరచూ నా ఊహల్లో ఉండిపోడం మనసుకదే వరము కదా అణువణువు నీలో నన్నే నింపుకోడం పగటికలే అనవు కదా మలినము లేని ప్రేమకి నువ్వు ఒక సాక్ష్యమౌ చెలి ప్రేమిస్తున్నా, ఆ ఆ ఆ ఆ ప్రేమిస్తున్నా ఆ ఆ ఆ నీ ప్రేమలో, ఓ ఓ ఓ ఓ జీవిస్తున్నా, ఆ ఆ ఆ ఆశకి ఇవ్వాలే… ఆయువు పోశావే కొత్తగ నా బ్రతుకే తీపిని చేశావే ఈ ముద్దు మన ప్రేమ గురుతుగా మనసున దాచుకుంటనే మన కథలాంటి మరో కథా చరితలో ఉండదంటనే ఓ ఓ ఓ ఆ ఆ ఆ ఆ ఆ
రిబపప్ప రిబసప్ప పా పాట సాహిత్యం
చిత్రం: Baby (2023) సంగీతం: విజయ్ బుల్గానిన్ సాహిత్యం: సురేష్ బనిశెట్టి గానం: శ్రీకృష్ణ ఎదురుగా ఇంతందంగా కనిపిస్తుంటే నీ చిరునవ్వు ఎదసడే హద్దులు దాటే చూడూ చూడూ చూడూ కుదురుగా ఉందామన్న ఉంచట్లేదే నన్నే నువ్వు నిదరకే నిప్పెడతావే రోజూ రోజూ రోజూ నీ చూపుల్లోన బాణం అందంగా తీసే ప్రాణం నీ మౌనంలోన గానం ప్రాణాలు పోసే వైనం అందుకే ఇంతలా పిచ్చిగా ప్రేమిస్తున్నా రిబపప్ప రిబసప్ప పా మనస్సంతా సమర్పించుకో రిబపప్ప రిబసప్ప పా వరం ఇచ్చుకో రిబపప్ప రిబపప్ప పా ప్రశాంతాన్ని ప్రసాదించుకో రిబపప్ప రిబసప్ప పా ఆలకించుకో ఓ ఓ హో నాకైనా ఇవ్వొద్దు నన్నెప్పుడూ నీలోనే దాచేసుకో ఎప్పుడూ ఆ మాట నువ్విస్తే నాకిప్పుడూ ఇంకేది అడగన్లే నిన్నెప్పుడూ నా చేతి రేఖల్లో నీ రూపురేఖల్ని ముద్రించుకున్నాను చిలకా నా నుదుటి రాతల్లో నీ ప్రేమలేఖల్ని చదివేసుకున్నాను తెలుసా చెలియ నాపై కొంచం మనసుపెట్టూ నీ ప్రేమంతా నాకే పంచిపెట్టూ నా ఊపిరికి నువ్వే ఆయువుపట్టూ నీతో ఉండే భాగ్యం రాసిపెట్టూ కుదరదనకు వలపు వెన్నెలా రిబపప్ప రిబసప్ప పా మనస్సంతా సమర్పించుకో రిబపప్ప రిబసప్ప పా వరం ఇచ్చుకో రిబపప్ప రిబపప్ప పా ప్రశాంతాన్ని ప్రసాదించుకో రిబసప్ప రిబసప్ప పా ఆలకించుకో ఓ ఓ నువుతప్ప నాకేమి కనిపించదు నువుతప్ప చెవికేది వినిపించదు నువులేని ఏ హాయి మొదలవ్వదు నువురాని నా జన్మ పూర్తవ్వదు నీ కలలతో కనులు ఎరుపెక్కి పోతున్నా చూస్తూనే ఉంటాను తెలుసా నీ ఊహతో మనసు బరువెక్కి పోతున్నా మోస్తూనే ఉంటాను మనసా నిన్నే ఆలోచిస్తూ మురిసిపోతా మురిసీ మురిసీ రోజు అలసిపోతా అలిసీ అలిసీ ఇట్టే వెలిసీపోతా వెలిసీ వెలిసీ నీలో కలిసిపోతా తెలుసుకోవె కలల దేవతా రిబపప్ప రిబసప్ప పా మనస్సంతా సమర్పించుకో రిబపప్ప రిబసప్ప పా వరం ఇచ్చుకో రిబపప్ప రిబసప్ప పా ప్రశాంతాన్ని ప్రసాదించుకో రిబసప్ప రిబపప్ప పా ఆలకించుకో ఓ ఓహో
చంటిపిల్లలా పాట సాహిత్యం
చిత్రం: Baby (2023) సంగీతం: విజయ్ బుల్గానిన్ సాహిత్యం: సురేష్ బనిశెట్టి గానం: అనుదీప్ దేవ్ చంటిపిల్లలా ఊగే ఈ మనసు తప్పు ఒప్పుకి తేడా ఏం తెలుసు చంటిపిల్లలా ఊగే ఈ మనసు తప్పు ఒప్పుకి తేడా ఏం తెలుసు తనమాటే వినలేని వెర్రిది మనమాటేం వినిపించుకుంటది అటుఇటుగా పరుగుల్ని తీస్తది చోద్యం చూడ్డం మినహా హా ఇవ్వలేం కదా ఏం సలహా చంటిపిల్లలా ఊగే ఈ మనసు తప్పు ఒప్పుకి తేడా ఏం తెలుసు ఈ నిమిషం ఇది చెయ్యాలంటూ ఈ నిమిషం ఇది చెయ్యొద్దంటూ ఆలోచించే తెలివే, అరెరే ఉంటే దాన్నెవరైనా మనసే అంటే వింతే రంగు రంగు తారలు రేపుతుంటే ఆశలు చూసుకోదు చిక్కులు చాపుతుంది రెక్కలు చంటిపిల్లలా ఊగే ఈ మనసు తప్పు ఒప్పుకి తేడా ఏం తెలుసు ఆనందంలో ముంచేస్తుందో ఆవేదనలో ఉంచేస్తుందో ప్రశ్నేదైనా గానీ..! బదులే రాదే తీరం ఎక్కడ ఉందో దారే లేదే ఈ మనస్సు గారడీ అంతుపట్టలేనిది పక్కవాడి వేదనే దానికర్ధమవ్వదే ఓ, చంటిపిల్లలా ఊగే ఈ మనసు తప్పు ఒప్పుకి తేడా ఏం తెలుసు చంటిపిల్లలా ఊగే ఈ మనసు తప్పు ఒప్పుకి తేడా ఏం తెలుసు తనమాటే వినలేని వెర్రిది మనమాటేం వినిపించుకుంటది అటుఇటుగా పరుగుల్ని తీస్తది చోద్యం చూడ్డం మినహా హా ఇవ్వలేం కదా ఏం సలహా
కలకలమే రేగిందీ కథలో పాట సాహిత్యం
చిత్రం: Baby (2023) సంగీతం: విజయ్ బుల్గానిన్ సాహిత్యం: సురేష్ బనిశెట్టి గానం: సాహితి చాగంటి కలకలమే రేగిందీ కథలో కలవరమే కమ్మిందీ మదిలో కలకలమే రేగిందీ కధలో కలవరమే కమ్మిందీ మదిలో ఏ లేత హృదయాల మధ్యన అనుకోని ఒకలాంటి ఉప్పెన ఆగేనా ఎవరెంత ఏడ్చినా ప్రేమ ప్రేమా ప్రేమా ప్రళయమె నీ చిరునామా..? కలకలమే రేగిందీ కధలో కలవరమే కమ్మిందీ మదిలో కన్నీరంతా కడలై పొంగి కల్లోలంలా మార్చేసింది సుడిగుండంలో పడవై బ్రతుకే మారే బయటే పడదామన్నా, లేదే దారి కన్నీరంతా కడలై పొంగి కల్లోలంలా మార్చేసింది సుడిగుండంలో పడవై, బ్రతుకే మారే బయటే పడదామన్నా, లేదే దారీ పోరుగాలి తీరుగా జీవితాలు మారగా దేవుడైన జాలిగా దారి చూపలేదుగా కధ ఒకటే రాసిందీ కాలం ఆ కధలో ఊహించని గాయం కధ ఒకటే రాసిందీ కాలం ఆ కధలో ఊహించని గాయం విధి ఆడే వింత ఆటలో ఎదచాటు ఎన్నెన్ని కుదుపులో ఎడబాటే ప్రతిమలుపు మలుపులో కలతే నిండిన కనులు కనలేమింకేం కలలు
No comments
Post a Comment