చిత్రం: ఖుషి (2023) సంగీతం: హేషం అబ్దుల్ వాహెబ్ నటీనటులు: విజయడేవర కొండ , సమంతా రుతుప్రభు దర్శకత్వం: శివ నిర్వాణ నిర్మాతలు: మైత్రీ మూవీ మేకర్స్ విడుదల తేది: 01.09.2023
Songs List:
నా రోజా నువ్వే పాట సాహిత్యం
చిత్రం: ఖుషి (2023) సంగీతం: హేషం అబ్దుల్ వాహెబ్ సాహిత్యం: శివ నిర్వాణ గానం: హేషం అబ్దుల్ వాహెబ్ ఆరా ఆరా ఆరా తననానా తననానా తననానా ఆరా సే ప్యారు అందం తన ఊరు సారె హుషారు బేగం బెజారు ఆరా సే ప్యారు అందం తన ఊరు దిల్ మాంగే మొరు ఈ ప్రేమే వేరు నా రోజా నువ్వే నా దిల్ సే నువ్వే నా అంజలి నువ్వే గీతాంజలి నువ్వే నా రోజా నువ్వే నా దిల్ సే నువ్వే నా అంజలి నువ్వే గీతాంజలి నువ్వే నా కడలి కెరటంలో ఓ మౌన రాగం నువ్వేలే నీ అమృతపు జడీలో ఓ ఘర్షణే మొదలయ్యిందే నా సఖివి నువ్వేలే నీ దళపతిని నేనేలే నా చెలియా నువ్వేలే నీ నాయకుడు నేనే నువ్వు ఎస్ అంటే ఎస్ అంటా నో అంటే నో అంటా ఓకే బంగారం నా రోజా నువ్వే నా దిల్ సే నువ్వే నా అంజలి నువ్వే గీతాంజలి నువ్వే నా రోజా నువ్వే నా దిల్ సే నువ్వే నా అంజలి నువ్వే గీతాంజలి నువ్వే నా ప్రేమ పల్లవిలో నువ్వు చేరావే అనుపల్లవిగా నీ గుండె సడి లయలో నే మారన నీ ప్రతిధ్వనిలా నీ కనుల కలయికలో కన్నాను ఎన్నో కలలెన్నో నీ అడుగులకు అడుగై ఉంటాను నీ నీడై నువ్వు ఊ అంటే నేనుంటా కడదాకా తోడుంటా ఓకే నా బేగం ఆరా సే ప్యారు అందం తన ఊరు సారె హుషారు బేగం బెజారు
ఆరాధ్యా పాట సాహిత్యం
చిత్రం: ఖుషి (2023) సంగీతం: హేషం అబ్దుల్ వాహెబ్ సాహిత్యం: శివ నిర్వాణ గానం: సిద్ శ్రీరాం , చిన్మయి శ్రీపాద యు ఆర్ మై సన్ షైన్ యు ఆర్ మై మూన్ లైట్ యు ఆర్ స్టార్ ఇన్ ది స్కై కం విత్ మీ నౌ, యు హావ్ మై డిసైర్ నాతో రా… నీలా రా ఆరాధ్యా పదము నీవైపిలా పరుగు నీదే కదా తనువు తెర మీదుగా చేరుకో త్వరగా మనసారా చెలి తార నా గుండెని మొత్తం తవ్వి తవ్వి చందనమంతా చల్లగ దోచావే, ఏ ఏ వందల కొద్ది పండగలున్న వెన్నెల మొత్తం నిండుగ ఉన్న ఆరాధ్య నా ఆరాధ్య నువ్వే లేనిదేది వద్దు ఆరాధ్యా ఆరాధ్య నా ఆరాధ్య నువ్వే లేనిదేది వద్దు ఆరాధ్యా ఈ పూట నా పాట చేరాలి నీ దాకా నీ చిన్ని మెడ వంపులో సాగాలి ఈ ఆట తేడాలు తేలాకా గెలిచేది ఎవరేమిటో ఇలాగే, ఏ ఏ… ఉంటాలే, ఏ ఏ నీతోనే, ఏ ఏ దూరాలు తీరాలు లేవే ఆరాధ్య నా ఆరాధ్య నువ్వే లేనిదేది వద్దు ఆరాధ్యా ఆరాధ్య నా ఆరాధ్య నువ్వే లేనిదేది వద్దు ఆరాధ్యా ఏదో అనాలంది, ఇంకా వినాలంది నీ ఊహ మళ్లింపులో నాదాకా చేరింది నాక్కూడ బాగుంది నీ ప్రేమ కవ్వింపులో నీలానే, ఏ ఏ ఏ మారానే, ఏ ఏ ఏ అంటానే… ఏ ఏ ఏ నువ్వంటు నేనంటూ లేనే మనసారా చెలి తార నా గుండెని మొత్తం తవ్వి తవ్వి చందనమంతా చల్లగ దోచావే ఏ వందల కొద్ది పండగలున్న వెన్నెల మొత్తం నిండుగ ఉన్న ఆరాధ్య నా ఆరాధ్య నువ్వే లేనిదేది వద్దు ఆరాధ్యా ఆరాధ్య నా ఆరాధ్య నువ్వే లేనిదేది వద్దు ఆరాధ్యా పదము నీవైపిలా పరుగు నీదే కదా తనువు తెర మీదుగా చేరుకో త్వరగా
మనసా..! పాట సాహిత్యం
చిత్రం: ఖుషి (2023) సంగీతం: హేషం అబ్దుల్ వాహెబ్ సాహిత్యం: శివ నిర్వాణ గానం: హేషం అబ్దుల్ వాహెబ్ , దివ్య యస్.మీనన్ మనసా..! మనకూ సెలవే సెలవు ముసిరే ఊసులు కనవా..? ఎదకి ఒక గాయం వదలమంది ప్రాణం చెలిమి విడి బంధం ఎవరు ఇక సొంతం కలత పడి హృదయం కరగనంది మౌనం గతము విడి పాశం ఏది ఇక బంధం హే, ఇన్నాళ్లు నన్ను వెన్నంటి ఉన్న నీడ నీవుగా కొన్నాళ్ళే అంటూ కోరింది నన్నే వీడమందిగా నిను తలచే ప్రతి తలపే ప్రణయాన శోధనా నను మరిచే మరుక్షణమే విరహాల వేధనా ఎదకి ఒక గాయం వదలమంది ప్రాణం చెలిమి విడి బంధం ఎవరు ఇక సొంతం హే, మందార పూలే మంటల్లే మారే… మౌన వేళలో నిండారా నాతో ఉంటావులే నా కంట నీరులో ఇది శరమో, కలవరమో ఎనలేని శూన్యమో చెలి వరమో, తుది క్షణమో ఎడబాటు సoద్రమో మనసా..!! మనకూ సెలవే సెలవు ముసిరే ఊసులు కనవా..?
ఓసి పెళ్ళమా..!పాట సాహిత్యం
చిత్రం: ఖుషి (2023) సంగీతం: హేషం అబ్దుల్ వాహెబ్ సాహిత్యం: శివ నిర్వాణ గానం: రాహుల్ సిప్లిగంజ్ , సాకేత్ కొమందూరి హేయ్, హ్హ హ్హ హా కాశ్మీరులో ఫస్ట్ టైం తనని చూసినా, హే ముందెనక చూడకుండా మనసిచ్చినా, హే బాబు మాట పక్కనెట్టి బైటికొచ్చినా, హే లగ్గమెట్టి కాపురాన్ని స్టార్ట్ చేసినా ఓ హో… స్ట్రగుల్ స్టార్టాయెనే ఓ హో… పాప చేంజయ్యనే ఓసి పెళ్ళమా..! నన్ను మిర్చిలాగ నంజుకుంటవే వద్దు ఆపమ్మా..! నేను కోడిలాగ గింజుకుంటనే ఉన్న మాట సెప్పుతాను ఇనుకోండ్రి పెళ్లి ఊసు పాడుగాను మానుకోండ్రి గన్ను కంటే పవరుఫుల్లు ఆలండీ దూల తీర్చేస్తదండీ ఉన్న మాట సెప్పుతాను ఇనుకోండ్రి పెళ్లి ఊసు పాడుగాను మానుకోండ్రి గన్ను కంటే పవరుఫుల్లు ఆలండీ దూల తీర్చేస్తదండీ లేట్ నైట్ ఇంటికొస్తే తలుపు తియ్యరు ఫ్రెండ్ తోన మందు కొడితే తాట తీస్తరు పాత గర్ల్ ఫ్రెండ్ మీద నిఘా ఏస్తరు గ్లోబులోన ఎక్కడున్న ట్రాక్ చేస్తరు బుజ్జికన్న అంటు నిన్ను ముద్దు సేస్తరు, హే కన్నవాళ్ళ కంటే నువ్వు ఎక్కువంటరు, హే చిన్న మాట అన్న కూడా బుస కొడతారు, హే కన్నీళ్లతో నిన్ను కాటేస్తారు ఓ హో… వైఫ్ నైఫాయనే ఓ హో… మైండు బ్లాకాయనే ఓ హో… లైఫ్ చేంజాయనే ఓ హో… కర్మ కాలిపోయెనే పెళ్లాలే గయ్యాలా, గయ్యాలే పెళ్ళాలా పెళ్ళాలు పెళ్ళాలు… పెళ్ళాలు కాదే దయ్యాలు దయ్యాలు… దయ్యాలు మీరే ఓసి పెళ్ళమా..! నన్ను మిర్చిలాగ నంజుకుంటవే వద్దు ఆపమ్మా..! నేను కోడిలాగ గింజుకుంటనే ఉన్న మాట సెప్పుతాను ఇనుకోండ్రి పెళ్లి ఊసు పాడుగాను మానుకోండ్రి గన్ను కంటే పవరుఫుల్లు ఆలండీ దూల తీర్చేస్తదండీ ఉన్న మాట సెప్పుతాను ఇనుకోండ్రి పెళ్లి ఊసు పాడుగాను మానుకోండ్రి గన్ను కంటే పవరుఫుల్లు ఆలండీ దూల తీర్చేస్తదండీ
No comments
Post a Comment