చిత్రం: PS -II (2023) సంగీతం: ఎ.ఆర్.రెహమాన్ నటీనటులు: విక్రమ, ఐశ్వర్యా రాయ్, జయం రవి, కార్తీ, ఐశ్వర్యా లక్ష్మి , శోభిత ధూళిపాల దర్శకత్వం: మణిరత్నం నిర్మాతలు: మణిరత్నం, సుభాస్కరన్ విడుదల తేది: 28.04.2023
Songs List:
ఆగనందే పాట సాహిత్యం
చిత్రం: PS -II (2023) సంగీతం: ఎ.ఆర్.రెహమాన్ సాహిత్యం: అనంత శ్రీరామ్ గానం: శక్తిశ్రీ గోపాలన్ ఆగనందే ఆగనందే మోవి నవ్వుతుందే మోవి నవ్వే… మోవి నవ్వే మోము నవ్వుతుందే మోము నవ్వే… మోము నవ్వే మాను నవ్వుతుందే మాను నవ్వి మాను నవ్వి మొగ్గలయిందే ఎవ్వరో ఎవ్వరో ప్రాణమే మీటెనే ఏలకో ఏలకో ఈ ముడే వేసెనే నది నడకలే పదగతి సరిచేసే గిరి పెదవులు పెదవుల తడి పీల్చే గొడుగులవలె తరువులు నిలిచే కుసుమపు కొన చినుకులు విడిచే నను కని పెంచే సొగసుల తలమా నను నడిపించే అంతఃపురమా కొలనుల నగవే పలుకనుకొనుమా నవనవలాడే నువు నా గరిమా నిను తలవగనే ఎద ఎగిరినదే నిను తడమగనే మది మురిసినదే నిన్నానుకునే పవలించెదనే మైమరచెదనే ఆగనందే ఆగనందే మోవి నవ్వుతుందే మోవి నవ్వే… మోవి నవ్వే మోము నవ్వుతుందే మోము నవ్వే… మోము నవ్వే మాను నవ్వుతుందే మాను నవ్వి మాను నవ్వి మొగ్గలయిందే ఎవ్వరో ఎవ్వరో ప్రాణమే మీటెనే ఏలకో ఏలకో ఈ ముడే వేసెనే ఎవ్వరో ఎవ్వరో ప్రాణమే మీటెనే ఏలకో ఏలకో ఈ ముడే వేసెనే
వీరా రాజా వీర పాట సాహిత్యం
చిత్రం: PS -II (2023) సంగీతం: ఎ.ఆర్.రెహమాన్ సాహిత్యం: చంద్రబోస్ గానం: హరిహరన్, బెన్నీ దయాల్, నబీలమాన్ కళ్ళార చూద్దాం చోళ ఖడ్గ సంచారం సంహారం ఓ సొగసరి పూవా పూమాలే శుభమని వేయవే వీరా రాజా వీర శూర ధీర శూర నువ్వే శుభ్రతారా నీలో శౌర్య ధార ఏరై పొంగిపారా సమరం శ్రుతించైరా శిఖరం స్పృశించైర మార రాకుమారా చోరా చిత్త చోర రా రా ఏలుకోర కరవాల మీవేళ కనులెర్రజెయ్యంగ భుజబలము ఈవేళ భూతలము మోయంగ ధైర్యము మోహరింప రాజ్యము విస్తరింప రాజా శ్రేష్ట రాజ… తేజ సూర్య తేజ వీర రాజా వీర శూర ధీర శూరా పడతులు పాట పాడా ముదితలు నాట్యమాడ తేరులు స్వాగతించ భేరులు ప్రతిధ్వనించ సంధ్రాల సుడిలోన బడబాణలములాగ భుగ భుగ కదిలినావ ధగ ధగ ఎదిగినావ కలనే గెలిచినావ, నిజమై నిలిచినావ విక్రమ వజ్రనావ నావికుడైన వీర వీరా రాజా వీర శూర ధీర శూర పడతులు పాట పాడా ముదితలు నాట్యమాడ తేరులు స్వాగతించ భేరులు ప్రతిధ్వనించ సంధ్రాల సుడిలోన బడబాణలములాగ భుగ భుగ కదిలినావ ధగ ధగ ఎదిగినావ కలనే గెలిచినావ, నిజమై నిలిచినావ విక్రమ వజ్రనావ నావికుడైన వీర వీరా రాజా వీర శూర ధీర శూర సుడిగాడ్పులా అడుగేయరా సర సర సర సర శరమే తనువే తాకగా చర చర చర చర చెలరేగాలి వేగంగా మగసిరి కండచూసి కడలికి చెమట పోయు పదునగు కత్తి చూసి నింగికి నిదుర రాదు రగతము పొంగి పారీ నదులకు రంగు మారు తెగిపడు తలలు అన్ని అలలకు అన్నమౌను పులివలె దూకుతుంటే జగములు జింకలౌను నిన్నిక పొగడమంటే భాషకు స్వాస ఆగు విధిగా తెగించైర విధినే వదించైర విలయం దరించైర విజయం వరించైర వీరా రాజా వీర శూర ధీర శూర నువ్వే శుభ్రతారా నీలో శౌర్య ధార… ఏరై పొంగిపారా సమరం శ్రుతించైరా… శిఖరం స్పృశించైర మార రాకుమారా… చోరా చిత్త చోర ధైర్యము మోహరింప రాజ్యము విస్తరింప రాజా శ్రేష్ట రాజ… తేజ సూర్య తేజ వీర రాజా వీర వీర రాజా వీర శూర ధీర శూరా వీరా
శివోహం పాట సాహిత్యం
చిత్రం: PS -II (2023) సంగీతం: ఎ.ఆర్.రెహమాన్ సాహిత్యం: ఆది శంకర గానం: సత్య ప్రకాష్, Dr.నారాయణన్, శ్రీకాంత్ హరిహరన్, నివాస్, అరవింద్ శ్రీనివాస్, శన్బాగరాజ్, TS అయ్యప్పన్ శివోహం
మిన్నంచుల వెన్నెల పాట సాహిత్యం
చిత్రం: PS -II (2023) సంగీతం: ఎ.ఆర్.రెహమాన్ సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి గానం: హరిచరణ్ మిన్నంచుల వెన్నెల కన్నంచుల జల్లుగ జారితివే ఎద కోసే ప్రళయవిలాపమిదే ఊపిరినాపినదే స్వప్నం చెరిగినదే రక్తము సత్తువ చెదిరినదే ఒక రాజ్యము కూలినదే యుద్ధమే చేయక ఒరిగానే ఏ దరి వెతికెదనే నెచ్చెలీ నిన్నెట కాంచెదనే నిత్య నిశీధి ఇది చీకటి సూన్యమే మిగిలినదే చిత్ర నయనమది చక్కని చక్కెర పలుకులేవీ సుందరహాసమేది కావేరి నురగల పరుగులేవీ మంచుమబ్బులవలే ప్రేమగా తడిమిన చేతులెవీ గోరు వెచ్చ కాంతుల వేకువై వెలిగిన చూపులేవీ మిన్నంచుల వెన్నెల కన్నంచుల జల్లుగ జారితివే ఎద కోసే ప్రళయవిలాపమిదే ఊపిరినాపినదే ఆరని జ్వలనమయే హృదయం తీరని నరకమయే ప్రాణం శిధిలమయే సమయం చలనము లేనిదయే నిప్పుల ఉప్పెనలో నన్నిలా ముంచితివెందులకే నేరము చెయ్యక ఏ శిక్షలో వగచితి నీ కొరకే మిన్నంచుల వెన్నెల కన్నంచుల జల్లుగ జారితివే ఎద కోసే ప్రళయవిలాపమిదే ఊపిరినాపినదే స్వప్నం చెరిగినదే రక్తము సత్తువ చెదిరినదే ఒక రాజ్యము కూలినదే యుద్ధమే చేయక ఒరిగానే
ప్రార్థనలు వినుమా పాట సాహిత్యం
చిత్రం: PS -II (2023) సంగీతం: ఎ.ఆర్.రెహమాన్ సాహిత్యం: చంద్రబోస్ గానం: శిరీష భాగవతుల ప్రార్థనలు వినుమా మా ఊపిరి వేణువు గీతికలో మనోరథాన్ని కనుమా నీలిమేఘం నీ దేహం అయితే మెరుపుల జ్యోతులు మనసు ముంగిళ్లలో ప్రసిరించాలి ప్రసిరించాలి నీ కరుణే అనవరతం మధురామృత దారై మాపై కురవాలి పాడు తలపులు తలపడు క్షణమున పిడుగులా రావాలి కడతేర్చి పోవాలి
అలుపే లేదే పాట సాహిత్యం
చిత్రం: PS -II (2023) సంగీతం: ఎ.ఆర్.రెహమాన్ సాహిత్యం: చంద్రబోస్ గానం: శిరీష భాగవాతుల, హరిప్రియ, దీప్తి, సురేష్ అలుపే లేదే
No comments
Post a Comment