చిత్రం: అభిమనవతి (1975) సంగీతం: కె.చక్రవర్తి సాహిత్యం: డా॥ సి.నారాయణరెడ్డి, దాశరథి, ఆరుద్ర గానం: యస్.పి.బాలు, పి.సుశీల నటీనటులు: కృష్ణ, వాణిశ్రీ దర్శకత్వం: డూండీ నిర్మాత: జి.సాంబశివరావు, పి.బాబ్జి విడుదల తేది: 28.02.1975
Songs List:
నీపై న నాకెంతో పాట సాహిత్యం
చిత్రం: అభిమనవతి (1975) సంగీతం: కె. చక్రవర్తి సాహిత్యం: దాశరథి గానం: యస్.పి.బాలు నీపై న నాకెంతో అనురాగముందని నిను వీడి క్షణమైన నేనుండలేనని ఎలా ఎలా నీకెలా తెలిపేది నీలి నింగిలో కోటితారలు మాలల్లి తేనా అందమైన ఆ చందమామ నీ కుదుమ తురుమవలేనా అణువణువున నీవే వ్యాపించినావనీ ఎలా ఎలా నీకెలా తెలిపేది వలపు తెలియని మనసులోనికి ఎందుకోసమని వచ్చావూ మనసు దోచుకొని మమత పంచుకొని మరలి వెళ్ళిపోతున్నావు నిన్నే హృదయాన నిలిపాను నేననీ ఎలా ఎలా నీకెలా తెలిపేది
ఏనాడూ లేని ఆనందం పాట సాహిత్యం
చిత్రం: అభిమనవతి (1975) సంగీతం: కె.చక్రవర్తి సాహిత్యం: ఆరుద్ర గానం: పి.సుశీల ఏనాడూ లేని ఆనందం ఈనాడు వేచె మా కోసం సరాగమే తుషారమై పదే పదే మురిపించి నను మురిపించి మైమరపించె లలల లలలా.... వీచెను శీతల పవనాలు పూచెను, విలాస కుసుమాలు వలపులు వేయి గులాబిలై వెదజల్లెను కోటి ఘుమఘుమలు ఘుమఘుమలు ఘుమఘుమలు గలగల పారే సెలయేరు ఈరోజే కలకల నవ్వింది లోకంనాకై చిగురించి నా లోపల వీణలు మీటింది మీటింది మీటింది
ఎట్టా పోనిత్తురా పాట సాహిత్యం
చిత్రం: అభిమనవతి (1975) సంగీతం: కె.చక్రవర్తి సాహిత్యం: డా॥ సి.నారాయణరెడ్డి గానం: పి.సుశీల, యస్.పి.బాలు ఎట్టా పోనిత్తురా చేతికి చిక్కినోణ్ణి నా సామిరంగ చిననాటి చెలికాణ్ణి ఎట్టా పోనివ్వవే గుట్టుగ ఉన్నవాణ్ణి ఓ యమ్మతల్లి చెట్టంత చినవాణ్ణి ఉదయానికి మరో పేరేమిటి ఆఁ ! పొద్దు కాదనటానికి మరో పేరేమిటి హుఁ వద్దు.... ఇద్దరి నడుమ ఇపుడున్న దేమిటి హ .... హ .... హ .... హ .... హద్దు .... రెండు మేనులూ కలుసుకున్నపుడూ రెండు పెదవులూ హత్తుకున్నపుడూ ఏమిటి ఏమిటి ఏమిటి ఏమిటి.... ముము... ము ము ... ముద్దు ఆ ముద్దే ఎంతో ముద్దూ బాబోయ్ వద్దూ ఓయమ్మో పోనిద్దూ పోనిద్దు పోనిద్దు పోనిద్దు పోనిద్దు ఒక చేయి భుజంమీద వెయ్యి హుఁ !... వేశా .... ఇంకొకచేత నడుం పైనవెయ్యి అబ్బబ్బ వేశా ఇపుడు నీ గుండె ఏమంటున్నది దడ దడ దడ .... వయసు జల్లులా ముసురుతున్నపుడూ వలపు వెలువలా పొంగుతున్నపుడూ ఏమిటి ఏమిటి కలిగేదేమిటి.... హ....హ....హ...హ.... మోజు .... ఆ మోజే ఎంతో ముద్దు బాబోయ్ వద్దూ ఓయమ్మో పోనిద్దూ పోనిద్దు పోనిద్దు పోనిద్దు పోనిద్దు ॥ ఎట్టా పోనిత్తురా॥
మామిడి తోటలో పాట సాహిత్యం
చిత్రం: అభిమనవతి (1975) సంగీతం: కె.చక్రవర్తి సాహిత్యం: డా॥ సి.నారాయణరెడ్డి గానం: యస్.పి.బాలు మామిడి తోటలో మల్లెల వేళలో తుంటరి గాలిలో ఆహ, ఒహొ, హుహు ఎహే .... ఒంటిగ నువ్వుంటే సింగార మెగబోసె బంగారు బొమ్మా హఁ .... చేరవచ్చి మనసు చేతికిచ్చి ఏమండీ మన పెళ్ళెప్పుడంటే ఏమంటావు అప్పుడేమంటావు బాబు నమస్కారం. మామిడి తోటలో మల్లెల వేళలో తుంటరి గాలిలో లలా-ఓహో- హెహే.... వంటిగ నేనుంటే సింగార మెగబోసె బంగారు బొమ్మా...హ చేరవచ్చి మనసు చేతికిచ్చి ఏమండీ మన పెళ్ళెప్పుడంటే ఆగమంటాను డాడీ నడగమంటాను ఏడిశాపు ఎవడ్రా వీడు ప్రేమించు కోవడం సరద కాని పెళ్ళాడలంటేనె బెడద పెద్దల అనుమతి కావాలీ కాదా చీ హద్దులు దాటితే ఏం మర్యాద ఒరే సన్నాసీ ప్రేమే ఒక దెవం పెళ్ళే ఒక యాగం అందుకు అనుమతు లెందుకు హద్దులు పద్దులు ఎందుకు నిన్నే నమ్ముకున్న ఆ ముద్దు గుమ్మా.... హ... చేరవచ్చి మనసు చేతికిచ్చి ఏమండీ మన పెళ్ళెప్పుడంటే ఆగమంటావా డాడీనడగమంటావా ఈడియట్ పోరా పోరా పోరా ఛీ పోరా.... రుక్మిణిని శ్రీకృష్ణుడు ఎత్తుకుపోలేదా లైలాకోసం మజ్ను అరచి చావలేదా ఆ ఆహా .... ఉన్నారు మగధీరులు అన్ని యుగాలలో చచ్చైనా నడవరా వారి అడుగు జాడలో ధన్యోస్మీ ధన్యోస్మీ సోదరా నీ హితబోధ నా బ్రతుకుకే భగవద్గీత ఇక ఆగమన్న ఆగను అడుగువేసి తీయను నన్నే నమ్ముకున్న నా ముద్దు గుమ్మా... హా... చేరవచ్చి తాళి చేతికిచ్చి ఏమండీ మన పెళ్ళెప్పుడంటే కాదంటానా తాళి కట్టేస్తాను ఎవరే మన్నా అంతు తేల్చేస్తాను హాహా డాడీ .... డాడీ .. డాడీ .... డాడీ.
No comments
Post a Comment