చిత్రం: రుద్రుడు (2023) సంగీతం: జి.వి.ప్రకాష్ కుమార్ నటీనటులు: రాఘవ లారెన్స్, ప్రియా భవాని శంకర్ దర్శకత్వం: కతిరేషణ్ నిర్మాత: కతిరేషణ్ విడుదల తేది: 14.04.2023
Songs List:
ప్రాణాన పాటలే పాడుతుంది పాట సాహిత్యం
చిత్రం: రుద్రుడు (2023) సంగీతం: జి.వి.ప్రకాష్ కుమార్ సాహిత్యం: రాకేందు మౌళి గానం: సత్య ప్రకాష్, నిత్యశ్రీ వెంకటరమణన్, Emcee D ప్రాణాన పాటలే పాడుతుంది
భగ భగ భగ రగలరా పాట సాహిత్యం
చిత్రం: రుద్రుడు (2023) సంగీతం: జి.వి.ప్రకాష్ కుమార్ సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి గానం: ప్రుద్వి చంద్ర దుష్ట దమన ధీర దుర్మ దా పహారా దుష్ట దమన ధీర దుర్మ దా పహారా ఎరుపు కన్ను మెరుపు తీసి ఆయుధముగ పదును చేసి వెయ్యి జనుల పిరికి తలలు తలొకవైపు ఎగరవేయరా కోరస్: రుద్ర రుద్ర భగ భగ భగ రగలరా పర శివుడై వెలగరా తెగ తెగబడి చెలగరా పెనురణములు గెలవరా (2) సలసల రుధిరమే ఆవిరెగిసెనే కొర కొర క్రోధమే నిప్పు కురిసెనే పట పటా నర నరం పట్టు బిగిసెనే అసురుల ఉసురుపై ఉచ్చు విసిరెనే భజే ప్రమద నాదం… భజే ప్రనవ నాదం ఆవాహయామి దేవం… అధరం దండనార్ధం భజే నీలకంఠం.. భజే శూలపాణి ఆవాహయామి దేవం… ఆర్థ రక్షనార్థం భగ భగ భగ రగలరా పరశివుడై వెలగరా తెగ తెగబడి చెలగరా పెనురణములు గెలవరా (2) రారా రారా రారా రారా రారా రా రా రారా రారా రారా రారా రారా రా రా రుద్ర గతం దెబ్బ తగిలి… గాయమైంది కాలము పగను తీర్చమంది… పరమ శివుని శూలము గొంతు దిగని నలుపై… మండుతోంది గరళము నిప్పు కన్ను తెరిచి… దహించు పాప శకలము అండపిండమంతా అదిరిపడే తీరుగా ఉగ్రతాండవంగా రుద్ర చెలరేగరా సదా శక్తి కిరణం… సదా ముక్తి కరుణం ఆవాహయామి దేవం… కాల కాల శరణం మహాపాప తరనం… మహాదోశ హననం ఆవాహయామి దేవం… శివా శంభు శరణం శివాయ శివాయ శివాయ నమః శివాయ శివాయ శివాయ నమః శివాయ శివాయ శివాయ నమః శివాయ శివాయ శివాయ
నువ్వుంటే చాలు పాట సాహిత్యం
చిత్రం: రుద్రుడు (2023) సంగీతం: జి.వి.ప్రకాష్ కుమార్ సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి గానం: అనురాగ్ కులకర్ణి నువ్వుంటే చాలు నువ్వు తోడై ఉంటే చాలు ప్రేమోత్సవాలు బతుకంతా సంతోషాలు నా పెదాల ఆమని నీ పేరుగ విరబూయనీ ప్రేయసీ..! నా ప్రపంచం నీవే నా ప్రభాతం నీవే, నీవేలే ప్రేయసీ నా ప్రయాణం నీవే నాలో ప్రాణం నీవే, నీవేలే నా దేహమే నీ కోవెల నీ సవ్వడే నా లోపల కాలలతో పని లేదుగా ఒక పుట్టుక సరిపోదుగా నా తల్లి మమకారాన్ని మరల నేను నీలో చూసానే కలలా ఉంది ఈ నిజమే ఈ జన్మలో మరుజన్మంల నీ ఒడిలో నే ఉయ్యాలలూగాలే చెలియ నువ్వు నా వరమే ప్రేయసీ నా ప్రపంచం నీవే నా ప్రభాతం నీవే నీవేలే ఏకాంతమే లేదు ఇక నీ వెన్నెలే నా వేడుక చలి గుండెపై నీరెండగా కురిసావుగా మెరిసావుగా నీ చెరగు అంచుల్లోనా కొలువుందంట నే కోరే స్వర్గం నిను నే వదిలిపోనే నీ బరువు బాధ్యతలోనే కదలాలంటా నే వెళ్ళే మార్గం అడుగు వెలుగు నేనే ప్రేయసీ..! నా ప్రపంచం నీవే నా ప్రభాతం నీవే, నీవేలే ప్రేయసీ నా ప్రయాణం నీవే నాలో ప్రాణం నీవే, నీవేలే
No comments
Post a Comment