చిత్రం: స్కంద (2023) సంగీతం: యస్.తమన్ నటీనటులు: రామ్ పోతినేని, శ్రీలీల దర్శకత్వం: బోయపాటి శ్రీను నిర్మాత: శ్రీనివాస చిట్టూరి విడుదల తేది: 15.09.2023
Songs List:
నీ చుట్టూ చుట్టూ పాట సాహిత్యం
చిత్రం: స్కంద (2023) సంగీతం: యస్.తమన్ సాహిత్యం: రఘురాం గానం: సిద్ శ్రీరాం, సంజనా కల్మాన్జి నీ చుట్టూ చుట్టూ చుట్టూ చుట్టూ చుట్టూ తిరిగిన నా చిట్టి చిట్టి చిట్టి చిట్టి గుండెనడిగినా నా దిమ్మ తిరిగే బొమ్మ ఎవరిదంటే నిన్ను చూపుతోందిగా ఓహ్ దమ్ము లాగి గుమ్మతో రిదమ్ము కలిపి ఆడమందిగా ప్రాణమే పతంగి లాగ ఎగురుతోందిగా ఇంతలో తతంగామంత మారుతోందిగా క్షణాలలో ఇదేమిటో గల్లంతు చేసే ముంత కల్లు లాంటి కళ్ళలోన తెల్లగా మరింత ప్రేమ పుట్టుకొచ్చి మత్తులోకి దించుతోందిగా నీ చుట్టూ చుట్టూ చుట్టూ చుట్టూ చుట్టూ తిరిగిన నా చిట్టి చిట్టి చిట్టి చిట్టి గుండెనడిగినా నా దిమ్మ తిరిగే బొమ్మ ఎవరిదంటే నిన్ను చూపుతోందిగా మీసాలనే తిప్పమాకు బాబో వేషాలతో కొట్టమాకు డాబు నువ్వెంత పొగుడుతూనే నేను పాడనే పడనుగా చటుకునొచ్చే ప్రేమ నమ్మలేను సడెనుగా కంగారుగా కలాగేనయ్యో కైపు నేనస్సలు కాదు నీ టైపు ఇలాంటివెన్ని చూడలేదు కాళ్ళ ముందర నువ్వెంత గింజుకున్నా నన్ను గుంజలేవురా ఏమిటో అయోమయంగా ఉంది నా గతి ముంచినా భలేగా ఉంది ఈ పరిస్థితి ఇదో రకం అరాచకం కరెంటు షాక్ లాంటి వైబ్ నీది అంటే డౌట్ లేదు గా ఖల్లాస్ చేసి పోయినావు ఒరా చూపు గుచ్చి నేరుగా నీ చుట్టూ చుట్టూ చుట్టూ తిరిగిన నా చిట్టి చిట్టి గుండెనడిగినా నా దిమ్మ తిరిగే బొమ్మ ఎవరిదంటే నిన్ను చూపుతోందిగా ఓహ్ దమ్ము లాగి గుమ్మతో రిదమ్ము కలిపి ఆడమందిగా
కల్ట్ మామ పాట సాహిత్యం
చిత్రం: స్కంద (2023) సంగీతం: యస్.తమన్ సాహిత్యం: అనంత శ్రీరాం గానం: హేమచంద్ర, రమ్యా బెహరా, మహా బిట్టు బిట్టు బాడీ మొత్తం రెడ్డు చిల్లీ సాల్టు ఏయ్, చుట్టు చుట్టూ కమ్మేసుంది పొగరే డిఫాల్టు ఏయ్, పెట్టుకుంటే ఓడిపోద్ది ప్రతి నట్టు బోల్టు ఏయ్, కొట్టి సూడు ఎట్టుంటాదో కండల్లో రివోల్టు ఓయ్ లాక్కొడితే లాక్కొడితే లైఫులకే జోల్టు హే, వేటపులి దూకుతంటే ఊపిరికే హాల్టు హే, ఉక్కునరం ఉగ్గడితే కిక్కు ట్రిపుల్ మాల్టు అరె ఎయ్ దరువెయ్ ఎయ్ దరువెయ్ స్టెప్పులిక ఫుల్టూ ఎయ్ మామ ఎయ్ మామ ఎయ్ మామ ఎయ్ మామ ఎయ్ మామమామమామమామ మామ మామ మామ మామ ఏయ్ కల్టు కల్టు కల్టు కల్టు ఎయ్ కల్ట్ మామ కల్ట్ మామ కల్ట్ మామ కల్టే నువ్ కన్ను కొడితే అంతే మామ కన్నెల గుండెలు మెల్టే ఎయ్ కల్ట్ మామ కల్ట్ మామ కల్ట్ మామ కల్టే నువ్ కాలు దువ్వితే అంతే మామ కత్తులకైనా గిల్టే ఎయ్ కల్ట్ మామ కల్ట్ మామ కల్ట్ మామ కల్టే నీకెదురుపడితే వణికిపోద్ది నడుముకున్న బెల్టే ఎయ్ కల్ట్ మామ కల్ట్ మామ కల్ట్ మామ కల్టే నీ కడుపు కోస్తే బయటపడే కంటెంటే డైటే ఓయ్ మీసమిలా మీసమిలా మెలిపెడితే కల్టు నీ కాలరిలా కాలరిలా ఎగరేస్తే కల్టు అరె బాడీలిలా బాడీలిలా తిరగేస్తే కల్టు ఏయ్, వీధుల్లో వెంటపడి ఇరగేస్తే కల్టు మెడకి కర్చిఫ్, తలకి రిబ్బను కట్టేసి నించున్న కటౌట్ కల్టు సైలెన్సరు పీకేసి ఆక్సిలేటర్ని రయ్యంటు తిప్పేసి కట్టింగ్ కల్టు దందా కోసం పెట్టే సిట్టింగు కల్టు వంద మందితోనే బెట్టింగు కల్టు మిడ్ నైట్ మోగించే డీజే బీట్ కల్టు ఫ్లడ్ లైట్ వెలుతుర్లో పట్టే కుస్తీ కల్టు స్కెచ్చు గీస్తే కల్టు రచ్చ చేస్తే కల్టు ఇస్మైల్ కల్టు, ఇస్మైల్ కల్టు ఇస్టయిల్ కల్టు, ఇస్కూలు కల్టు కల్టు కల్టు కల్టు కల్టు కల్టు ఏయ్ కల్టు కల్టు కల్టు కల్టు ఎయ్ కల్ట్ మామ కల్ట్ మామ కల్ట్ మామ కల్టే నువ్ కన్ను కొడితే అంతే మామ కన్నెల గుండెలు మెల్టే ఎయ్ కల్ట్ మామ కల్ట్ మామ కల్ట్ మామ కల్టే నువ్ కాలు దువ్వితే అంతే మామ కత్తులకైనా గిల్టే ఎయ్ కల్ట్ మామ కల్ట్ మామ కల్ట్ మామ కల్టే నీకెదురుపడితే వణికిపోద్ది నడుముకున్న బెల్టే ఎయ్ కల్ట్ మామ కల్ట్ మామ కల్ట్ మామ కల్టే నీ కడుపు కోస్తే బయటపడే కంటెంటే డైటే
డుమ్మారే డుమ్మా పాట సాహిత్యం
చిత్రం: స్కంద (2023) సంగీతం: యస్.తమన్ సాహిత్యం: కళ్యాణ్ చక్రవర్తి గానం: అర్మాన్ మాలిక్, అయ్యన్ ప్రణతి తెల్లగా తెల్లవారిందే హే సరాసరా వెచ్చగా వేకువ వచ్చిందే హే సురాసురా కోలమ్మ కోలో కొమ్మ గుమ్మల్లో గువ్వా గువ్వా కొండ కోనమ్మ జళ్ళో వాగమ్మ పాటే మువ్వా మువ్వా ఏలమ్మ ఏలో ఏరమ్మ ఒళ్ళో గవ్వా గవ్వా ఆహ ఏ రంగు లేని సారంగమంటే నువ్వా నువ్వా ఇంత అందం చందం గంధంలాగ గంతే వేసే పల్లెటూరు సాటేది రాదే మచ్చుకైనా మచ్చేది లేదే కొత్త పాత అంటు తేడా లేనే లేదు ప్రేమ ప్రతిక్షణం రారా అని పోదామని కలగలిపే పిలుపు ఇది డుమ్మారే డుమ్మా డుమ్మారే సూటిగా ఉంటది మా తీరే మట్టితల్లి బొట్టుగ మారే పచ్చదనాలే పల్లెటూరులే డుమ్మారే డుమ్మా డుమ్మారే సూటిగా ఉంటది మా తీరే మట్టితల్లి బొట్టుగ మారే పచ్చదనాలే పల్లెటూరులే తల్లిసాటి చుట్టాలే లేవే తల్లివేరు అంటే ఊరెలే పట్టుకున్న కొమ్మను కాచే అమ్మలు అంటే పల్లెటూరులే తల్లిసాటి చుట్టాలే లేవే తల్లివేరు అంటే ఊరెలే పట్టుకున్న కొమ్మను కాచే అమ్మలు అంటే పల్లెటూరులే తెల్లగా తెల్లవారిందే హే సరాసరా వెచ్చగా వేకువ వచ్చిందే హే సురాసురా చెక్కర లేని పాలల్లో చెక్కిన మీగడ తీపల్లే కారంగా ఉన్న ఊరించే ఆవకాయల్లే హే, చుక్కలు లేని గీతల్లో చక్కగ గీసిన ముగ్గల్లే కోరంగి దాటె కోనసీమ నావల నీడల్లే తన ఒళ్ళే తుళ్ళి మళ్ళీ మళ్ళీ జల్లే చల్లే మేఘంలాగ కోనంగి కళ్ళే పంపెనే చూపుల కౌగిళ్లే అవి ఎల్లకిల్లా అల్లీ గిల్లి అల్లో మల్లో ఆకాశంలో అల్లాడెనే తెల్లారులు కలవరపడి కల వదిలే డుమ్మారే డుమ్మా డుమ్మారే సూటిగా ఉంటది మా తీరే మట్టితల్లి బొట్టుగ మారే పచ్చదనాలే పల్లెటూరులే తల్లిసాటి చుట్టాలే లేవే తల్లివేరు అంటే ఊరెలే పట్టుకున్న కొమ్మను కాచే అమ్మలు అంటే పల్లెటూరులే
గండర బాయ్ పాట సాహిత్యం
చిత్రం: స్కంద (2023) సంగీతం: యస్.తమన్ సాహిత్యం: అనంత శ్రీరాం గానం: హర్ష. డి హేయ్, గండర గండర హేయ్, గండరబాయ్ ఓసి వంపుల కుప్పల వయ్యారి సిగ్గుల మొగ్గల సింగారి టక్కుల టిక్కుల టెక్కలి టిక్కుల బంగారి ఓసి మెత్తని సొత్తుల మందారి మత్తుల విత్తులు చల్లాలి పిల్లాడి గుండెలు పిల్లి మొగ్గలెయ్యాలే గంట కొట్టి సెప్పుకో గంట కొట్టి సెప్పుకో గంటలోనే వస్తనే గండర గండర బాయ్ గజ్జె కట్టి సెప్పుకో గాజులెట్టి సెప్పుకో గాలివాన తెస్తనే గండర గండరబాయ్ ఏయ్, విన్నారోయ్ విన్నారోయ్ తయ్యారయ్యే ఉన్నారోయ్ విస్తారే విస్తారే విందే వడ్డించేస్తారో ఇష్టంగా ఇస్తానోయ్ నువ్వే నువ్వే విస్తారోయ్ నా గల్లా పెట్టె గళ్ళుమంటున్నాదిరోయ్ గండర బాయ్ గండర బాయ్ గందరగోళంలో పెట్టకమ్మాయ్ గండర బాయ్ గండర బాయ్ గత్తర కౌగిట్లో సుట్టకమ్మాయ్ గండరబాయ్ గండరబాయ్ గందరగోళంలో పెట్టకమ్మాయ్ గండర బాయ్ గండర బాయ్ గత్తర కౌగిట్లో సుట్టకమ్మాయ్ ఓసి వంపుల కుప్పల వయ్యారి సిగ్గుల మొగ్గల సింగారి టక్కుల టిక్కుల టెక్కలి టిక్కుల బంగారి ఓసి మెత్తని సొత్తుల మందారి మత్తుల విత్తులు చల్లాలి పిల్లాడి గుండెలు పిల్లి మొగ్గలెయ్యాలే గంట కొట్టి సెప్పుకో గంట కొట్టి సెప్పుకో గంటలోనే వస్తనే గండర గండర బాయ్ గజ్జె కట్టి సెప్పుకో గాజులెట్టి సెప్పుకో గాలివాన తెస్తనే గండర గండర బాయ్ గల్లా లుంగి ఏసుకో, గడ్డివాము సూసుకో గట్టిగానే ఉంటాదోయ్ సయ్యాటియ్యాల గడ్డపార తీసుకో, గట్టునింక తవ్వుకో సిగ్గునంత లోతుగా పాతి పెట్టలా నీ తట్ట బుట్ట సర్దేసుకో సోదాపి నా చెట్టాపట్టా పట్టేసుకో సోల్లాపి ఆ ముద్దుల్తోనే చల్లేస్తావే కళ్ళాపి ఓ ముగ్గులెడుతూ కూకుంటే నీకెట్టా పనౌద్దీ హే, వత్తాసే వత్తాసే నువ్వేమన్నా వత్తాసే నీ కట్టా మిట్టా పట్టే పట్టెయ్యాలిరోయ్ గండర బాయ్ గండర బాయ్ గందరగోళంలో పెట్టకమ్మాయ్ గండర బాయ్ గండర బాయ్ గత్తర కౌగిట్లో సుట్టకమ్మాయ్ గండర బాయ్ గండర బాయ్ గందరగోళంలో పెట్టకమ్మాయ్ గండర బాయ్ గండర బాయ్ గత్తర కౌగిట్లో సుట్టకమ్మాయ్ ఓసి వంపుల కుప్పల వయ్యారి సిగ్గుల మొగ్గల సింగారి టక్కుల టిక్కుల టెక్కలి టిక్కుల బంగారి ఓసి మెత్తని సొత్తుల మందారి మత్తుల విత్తులు చల్లాలి పిల్లాడి గుండెలు పిల్లి మొగ్గలెయ్యాలే
No comments
Post a Comment