చిత్రం: అండమాన్ అమ్మాయి (1979) సంగీతం: కె.వి.మహదేవన్ సాహిత్యం: ఆచార్య ఆత్రేయ (All) గానం: యస్.పి.బాలు, పి.సుశీల నటీనటులు: అక్కినేని నాగేశ్వరరావు, వాణిశ్రీ, చంద్రమోహన్, బేబీ వరలక్ష్మి దర్శకత్వం: వి.మధుసూదనరావు నిర్మాతలు: టి.గోవింద రాజన్, టి.యం.కిట్టు విడుదల తేది: 15.06.1979
Songs List:
హేయ్ లల్లీ పప్పీ పాట సాహిత్యం
చిత్రం: అండమాన్ అమ్మాయి (1979) సంగీతం: కె. వి. మహదేవన్ సాహిత్యం: ఆచార్య ఆత్రేయ గానం: యస్.పి.బాలు హేయ్ లల్లీ పప్పీ లల్లీ మళ్లీ రారండీ పువ్వులు ఉన్నవి పూజకు కావు - లవ్వూ గివ్వూ అనకండీ తేనె తేనెకూ తేడా ఏమిటో - తేనెటీగకు తెలుసు - ఈ తేనెటీగకు తెలుసు తేటికి వుంది వయసూ తేనెకు వుంది సొగసూ తెరవకండి మనసూ .... మనసు గినసు అంటే నాకు అసలే అలుసు రోజు రోజుకో రోజా పువ్వుతో - మోజు తీర్చుకోవాలి నీ మోజు తీరిపోవాలి నిన్న అనుభవం నిన్నే రేపటి సంగతి రేపే మరచిపొండి నేడే - రేపటికంఠా మీరూ నేనూ వేరే వేరే ॥హేయ్॥ అందమన్నది బంధంకారాదు అనుబంధం కారాదు అది ఎవ్వరి సొంతం కాదు కొత్తదన్నది నేడే — పాతై పోతే రోతే ఎందుకింక సొంతం – రోజూమారే దేవునిసృష్టే నాకూ యిష్టం ॥హేయ్॥
చిత్రా చిత్రాల బొమ్మా పాట సాహిత్యం
చిత్రం: అండమాన్ అమ్మాయి (1979) సంగీతం: కె. వి. మహదేవన్ సాహిత్యం: ఆచార్య ఆత్రేయ గానం: యస్.పి.బాలు, పి.సుశీల చిత్రా చిత్రాల బొమ్మా - పుత్తడీ పోతబొమ్మా మొత్తా మొత్తంగ వచ్చి_చిత్తాన్నే దోచెనమ్మా పైలా పచ్చీసు బొమ్మా - పరదేశీ ఆటబొమ్మా ముచ్చల్లే వచ్చి వచ్చి - మచ్చేదో చల్లెనమ్మా ॥చిత్రా॥ టేకు మానల్లే చక్కంగా వుంటాడు ఆకు తేలల్లె చల్లంగా వస్తాడు సోకంతా సూపుల్లో సూపుతాడు. ఆ సూపులతో ఒళ్ళంతా పాకుతాడు పువ్వు తీగల్లే నాజూగా వుంటుంది బొండు మల్లల్లె నిండుగా నవ్వుతుంది నవ్వుల్లో చాణాలు రువ్వుకుంది అబ్బ రువ్వుతూ ప్రాణాలు తోడుతుంది వాడిబాకల్లే గుచ్చుతుంది గుండెలో లేడి పిలలై గెంతుతుంది ఇంతలో.... దీపమల్లె వెలుగుతుంది దీవిలో తెర చాపలాగ ఎగురుతుంది నావలో అలలు అలలుగా వూగుతాడు మనసులో కలలు కలలుగా వస్తాడు కళ్ళలో కడలిలా వుంటాడు లోతులో చలమలాగ వూరుతాడు చెలిమిలో
వేస్తాను పొడుపు కధ పాట సాహిత్యం
చిత్రం: అండమాన్ అమ్మాయి (1979) సంగీతం: కె. వి. మహదేవన్ సాహిత్యం: ఆచార్య ఆత్రేయ గానం: యస్.పి.బాలు, పి.సుశీల వేస్తాను పొడుపు కధ వేస్తాను చూస్తాను విప్పుకో చూస్తాను. మనం వేసుకున్న పొడుపు కథ ఈ రాత్రి అది విప్పుకొని తప్పుకొంటే శివరాత్రి వచ్చాక వచ్చారు. వచ్చి వెళ్ళిపోయారు. వెళ్ళి మల్లి వచ్చారు. మళ్ళీ వెళ్తే వస్తారా....? ఎవరు వారు...? ఎవరు వారు. తెలియలా .... ? ఊహుఁ.... పళ్ళు పగడాల చక్రాలపచ్చనీ తేరునెక్కి సూర్యుడంటి వీరుడొస్తే దారంతా నెత్తురంట. ఏమిటంట....? ఏమిటబ్బా.... తెలీలా....? తెలియలా....? ఆకు వక్క సున్నం పుట్టినిల్లు మెట్టినిల్లు ఒక్కటైనది పుట్టిన ప్రతి జీవికి తప్పకున్నది కాయైనా పండై నా తీయనై నది గాయమైనా మందైనా తానై నది ఏమిటది...? తెలీలా...? తెలీలా .... ప్రేమ.... నేలమీద నిలిచేవి రెండుకాళ్ళు నింగిలోన నిలిచేవి రెండు కాళ్లు మధ్యలో నడిచేవి ఎన్నోకాళ్లు ఏమిటది ....? ఏంటది....? ఇది తెలీలా ... తెలీలా.... నాకు తెలియదు.
ఎందుదాగినావురా పాట సాహిత్యం
చిత్రం: అండమాన్ అమ్మాయి (1979) సంగీతం: కె. వి. మహదేవన్ సాహిత్యం: ఆచార్య ఆత్రేయ గానం: పి.సుశీల ఎందుదాగినావురా నందకిశోరా నవనీతచోరా ఎందెందు వెదుకుదురా ఎటులా కనుగొందురా మన్ను తినాబోయావో పొన్న చెట్టు నెక్కావో వెన్న దొంగిలించి ఏ వెలది యింట పొంచావో ఆ రాధ నిన్ను ఎక్కడ దాచిందో పెట్టెలో పెట్టిందో బుట్టలో దాచిందో పైటకొంగులో నిన్ను ముడివేసుకున్నదో ఎక్కడని వెతికేది ఇక్కడ — అక్కడ ఎక్కడ — మరెక్కడ .... భామా, సత్యభామా చెప్పమ్మా నేను రుక్మిణిని కాను రాధను కాను గోపికను కాను నీ భర్త నెత్తుకుపోను నీడగా దొరికినా — లీలగా మెరిసినా కనబడితే చాలు నాకు కనక వర్షాలు ఎక్కడని వెతికేది ఇక్కడ — అక్కడ ఎక్కడ - మరెక్కడ
ఈ కోవెల నీకై వెలిసిందీ పాట సాహిత్యం
చిత్రం: అండమాన్ అమ్మాయి (1979) సంగీతం: కె. వి. మహదేవన్ సాహిత్యం: ఆచార్య ఆత్రేయ గానం: పి.సుశీల, యస్.పి.బాలు ఈ కోవెల నీకై వెలిసిందీ - ఈ వాకిలి నీకై తెరిచుందీ రా దేవి తరలిరా - నా దేవి తరలిరా .... ఈ కోవెల నీకై వెలిసిందీ ఈ వాకిలి నీకై తెరిచుందీ రా స్వామి తరలిరా - నా స్వామీ తరలిరా దేవతల గుడిలో లేకున్నా - దీపం పెడుతూ వున్నాను తిరునాళ్ళెపుడో రాక తప్పదని - తేరును సిద్ధం చేశాను దేవుడు వస్తాడని రోజూ—పువ్వులు ఏరితెస్తున్నాను రేపటికోసం చీకటి మూసిన తూరుపులాగా వున్నాను ॥ఈ కోవెల॥ మాసినవెచ్చని కన్నీరు - వేసెను చెంపల ముగ్గులను మాయని తీయని మక్కువల చూసెను ఎనిమిది దిక్కులను దిక్కులన్నీ ఏకమై నా కొక్కదిక్కై నిలిచినవి మక్కువలన్నీ ముడుపులు కట్టి మొక్కులుగానే మిగిలినవి ॥ఈ కోవెల ॥ నీరువచ్చె - ఏరువచ్చె ఎరుదాటి ఓడవచ్చె ఓడ నడిపే తోడు దొరికె వడ్డుచేరే రోజువచ్చె ఓడచేరే రేవు వచ్చె... నీడచూపే దేవుడొచ్చె రేవులోకి చేరేలోగా_దేవుడే అడ్డువేసే....
No comments
Post a Comment