చిత్రం: బంగారు పంజరం (1969) సంగీతం: ఎస్. రాజేశ్వరరావు సాహిత్యం: దేవులపల్లి గానం: యస్.జానకి, ఘంటసాల, యస్.పి.బాలు, ఏ.పి.కోమలి, సరోజినీ, శూలమంగళం రజ్యలక్ష్మి, సుమిత్ర, వసంత, రమణ, బసవేస్వర్, స్వర్ణలత నటీనటులు: శోభన్ బాబు, శ్రీరంజని, వాణిశ్రీ దర్శకత్వం: బి.యన్ రెడ్డి నిర్మాత: బి. యన్ రెడ్డి విడుదల తేది: 19.03.1969
Songs List:
శ్రీ శైల భవనా ! పాట సాహిత్యం
చిత్రం: బంగారు పంజరం (1969) సంగీతం: ఎస్. రాజేశ్వరరావు సాహిత్యం: దేవులపల్లి కృష్ణశాస్త్రి గానం: ఘంటసాల, యస్.జానకి & బృందం శ్రీ శైల భవనా ! భ్రమరాంబా రమణా! మల్లికార్జునా ! బాలేందు కోటీరా ! శ్రిత మందార! ఫణిహారా ! సురాసురార్చిత చరణా ! మల్లికార్జునా ! హరా! అఖిల భువనేశ్వరా ! అంధతిమిర భాస్కరా ! శంకర ! హరా ! అఖిల భువనేశ్వరా ! నటేశ్వరా ! జటలోని మినువాకతో, పయి నటియించు నెలరేకతో, తనకెన లేనిదీ – మన యెదలోనిదీ ఘనలావణ్య రూపమ్ముతో, ఉమా హృదయ మందిరా ! సుందరా ! హరా! అఖిల భువనేశ్వరా ! అంధ తిమిర భాస్కరా శంకరా! హరా ! ॥ శ్రీశైలం ॥
కొండల కోనల సూరీడు పాట సాహిత్యం
చిత్రం: బంగారు పంజరం (1969) సంగీతం: ఎస్. రాజేశ్వరరావు సాహిత్యం: దేవులపల్లి గానం: యస్.జానకి & బృందం కోరస్: కొండల కోనల సూరీడు కురిసె బంగారు నీరు! పిలిసె వురకేసే యేరు! ఆ మావి గుబురు, హెయ్ హెయ్ ఆ సింత సిగురు, హెయ్ హెయ్ ఆ యెనక పిలిసేటి యేరూ - పదవే - పదవే పిలిసే పచ్చన్నీ బీడు, కదలే గొర్రెల బారు ॥ కొండల॥ హెయ్! జోడెడ్ల యీ బండీ-జోడు చెక్రాల బండీ గాజుల గలగల యింటే కదలనంటదీ బండి ! అందెల సందడి వుంటే ఆగి వింటది! కోరస్: ఎండల్లొ వానల్లో చీకట్లొ యెన్నెల్లో, మా వెంట వుండి, - మాకు కాపుండి, కరుణించీ మమ్మేలగా, తల్లీ, గిరినుంచి దిగివస్తివా? కొమ్మల రెమ్మల కదిలేను నెమ్మదిగా పిల్లగాలీ, నల్ల మలల పిల్లగాలి! కోతకు సింతల సిగురుంది! పూతకు మామిడి పువ్వుంది ! లేత సింత సిగురల్లె కోత కొచ్చిన వయసు ! పూత మావి పూవల్లె పూత కొచ్చిన పడుసు! ఊగేది సెంగావి సెంగు! దాన్ని లాగేవు కొంటే కోణంగు ! మత్తెక్కి సూసేవు నువ్వు, నిన్ను మక్కలిరగ దన్నేరు సూడు
గట్టుకాడ ఎవరో సెట్టునీడ ఎవరో పాట సాహిత్యం
చిత్రం: బంగారు పంజరం (1969) సంగీతం: ఎస్. రాజేశ్వరరావు సాహిత్యం: దేవులపల్లి గానం: యస్.జానకి పల్లవి: గట్టుకాడ ఎవరో సెట్టునీడ ఎవరో నల్లకనుల నాగసొరము వూదేరు ఎవరో గట్టుకాడ ఎవరో చెట్టునీడ ఎవరో నల్లకనుల నాగసొరము ఊదేరు ఎవరో చరణం: 1 ఓ...ఓ... పోటుపాటు సూసుకొని ఏరు దాటి రావాలా ముళ్ళు రాళ్ళు ఏరుకోని మందతోవ నడవాలా ఆగలేక రాచకొడక సైగ చేసెవెందుకో సైగెందుకూ ఏటిగట్టుకాడ మావిచెట్టునీడ ఎవరో ఎవరో నల్లకనుల నాగసొరము ఊదేరు ఎవరో చరణం: 2 ఓ...ఓ.. పైరుగాలి పడుచుపైటా పడగలేసి ఆడేను గుండె పైనీ గుళ్ళ పేరు ఉండలేక ఊగేను తోపు ఎనక రాచకొడక తొంగి చూసేవెందుకో నీవెందుకూ సైగెందుకూ ఏటిగట్టుకాడ మావిచెట్టునీడ ఎవరో ఎవరో నల్లకనుల నాగసొరము ఊదేరు ఎవరో
పదములె చాలు-రామా ! పాట సాహిత్యం
చిత్రం: బంగారు పంజరం (1969) సంగీతం: ఎస్. రాజేశ్వరరావు సాహిత్యం: దేవులపల్లి గానం: ఏ.పి.కోమలి పదములె చాలు-రామా ! నీ పద ధూళులె పదివేలు! నీ పదములె చాలు, రామా! నీ పద మంటిన పాదుకలు ముమ్మాదుకొని ఈ జగమేలు! నీ పదములె చాలు రామా నీ దయ గౌతమి గంగ-రామయ ! నీ దాసులు మునుగంగా !.... రామా.... నా బ్రతుకొక నావ దానిని నడపే తండ్రివి నీవా ! నీ పదములె చాలు రామా.... ....
చుక్క మెరిసెను - మొక్క పెరిగెను ు పాట సాహిత్యం
చిత్రం: బంగారు పంజరం (1969) సంగీతం: ఎస్. రాజేశ్వరరావు సాహిత్యం: దేవులపల్లి గానం: బసవేస్వర్, స్వర్ణలత చుక్క మెరిసెను - మొక్క పెరిగెను కుక్క మొరిగెను బౌబౌబౌ గౌన్సు విడువుము నౌ నౌ నౌ జీన్సు తొడుగుము నౌ నౌ నౌ గౌన్సు విడువుము జీన్సు తొడుగుము డాన్సు సలుపుము నౌ నౌ నౌ
పైరుగాలీ పడుసు పైట పాట సాహిత్యం
చిత్రం: బంగారు పంజరం (1969) సంగీతం: ఎస్. రాజేశ్వరరావు సాహిత్యం: దేవులపల్లి గానం: యస్.పి.బాలు పైరుగాలీ పడుసు పైట పడగలేసి ఆడేను! గుండెపైని గుళ్ల పేరు వుండలేక వూగేను- ఆగలేక, రాస కొడకా - సైగ చేసేవెందుకు ? సెగెందుకు ? గట్టుకాడ ఎవరో ! - సెట్టునీడ ఎవరో ! నల్ల కనుల నాగస్వరము ఊదేరు ఎవరో....
శ్రీ గిరి శిఖర విమాన విహారీ పాట సాహిత్యం
చిత్రం: బంగారు పంజరం (1969) సంగీతం: ఎస్. రాజేశ్వరరావు సాహిత్యం: దేవులపల్లి గానం: యస్.జానకి, యస్.పి.బాలు శ్రీ గిరి శిఖర విమాన విహారీ శ్రీ శివ మూర్తి దేవేరీ ఔనని సెలవిమ్మా తల్లీ -అవునని సెలవిమ్మా
ఒక నాటిదా పాట సాహిత్యం
చిత్రం: బంగారు పంజరం (1969) సంగీతం: ఎస్. రాజేశ్వరరావు సాహిత్యం: దేవులపల్లి గానం: కోమలి & బృందం ఒక నాటిదా, ఒక చోటిదా, కడచిన ఎన్నో జన్మల దారుల నడచి వచ్చినది మీ జంట! రాగల ఎన్నో జన్మల దాకా సాగును పున్నెపు పంట! మీ అనురాగపు పంట!
పగలైతే దొరవేరా పాట సాహిత్యం
చిత్రం: బంగారు పంజరం (1969) సంగీతం: ఎస్. రాజేశ్వరరావు సాహిత్యం: దేవులపల్లి గానం: యస్.జానకి పగలైతే దొరవేరా - రాతిరి నా రాజువురా! పక్కనా నువ్వుంటే - ప్రతి రాత్రీ పున్నమిరా! ॥ పగలై తే ॥ పగలైతే నాలో నీ సొగసంతా దాగేరా ! రేయైతే వెన్నెలగ బయలంత నిండేరా ! రాతిరి నా రాజువురా ! నే కొలిచే దొరవై నా-నను వలచే నా రాజువే ! కలకాల మీలాగె నిలిచే నీ దాననే ! పక్కనా నువ్వుంటే - ప్రతి రాత్రి పున్నమిరా ॥ పగలైతే ॥
మనిషే మారేరా, రాజా పాట సాహిత్యం
చిత్రం: బంగారు పంజరం (1969) సంగీతం: ఎస్. రాజేశ్వరరావు సాహిత్యం: దేవులపల్లి గానం: యస్.జానకి, యస్.పి.బాలు మనిషే మారేరా, రాజా, మనసే మారేరా ! మనసులో - నా మనసులో, సరి కొత మమత లూరేరా! ॥ మనిషే || ఏచోట దాగేనో ఇన్నాళ్ళూ ఈ సొగసు ఆ తోట పువులేనా - అలనాటి లతలేనా ॥ మనిషే ॥ ప్రతి పొదలో ప్రతి లతలో పచ్చనాకులు గూడేరా ! గూట గూట దాగుండి కొత్త గువ్వపాడేరా ॥మనిషే ॥ అడుగడుగున జగమంతా అనురాగపు కనులకు కులుకుతూ కొత్త పెళ్ళి కూతురిలా తోచెనే ! ఆనాటివె పువులై నా - అలనాటివె లతలైనా ! మనసే మారేనే - రాణీ - మనసే మారేనే
చల్లరమ్మా, తల్లులూ పాట సాహిత్యం
చిత్రం: బంగారు పంజరం (1969) సంగీతం: ఎస్. రాజేశ్వరరావు సాహిత్యం: దేవులపల్లి గానం: శూలమంగళం రాజ్యలక్ష్మి & బృందం చల్లరమ్మా, తల్లులూ, మీ చల్లనీ దీవనలవాన! చల్లగా నూరేళ్లుగా వర్ధిల్లగా మా పాపపైన ! దేవదేవుడె వచ్చి పాపకు దీవనలు దయచేయును పూవులన్నా పాపలన్నా దేవదేవుని పిల్లలే ! కోరస్: చల్లరమ్మా తల్లులూ మీ చల్లని దీవనల వాన! చల్లగా నూరేళ్లుగా వర్ధిల్లగా మా పాపపైన
జో కొడుతూ కథ చెబితే పాట సాహిత్యం
చిత్రం: బంగారు పంజరం (1969) సంగీతం: ఎస్. రాజేశ్వరరావు సాహిత్యం: దేవులపల్లి గానం: యస్.జానకి జో కొడుతూ కథ చెబితే ఊ కొడుతూ వింటావా ! నా కన్న పాపా-నే కన్న పాపా .... జో .... జో .... ఒక కొండ - ఒక కనుమ - ఆ రెంటికి నడుమ - అనగనగా ఒక తోట, పచ్చన్నీ తోట! ఆకాశమంతేసి గూడుండే చోట, ఆ తోట ఒక చిలుక -ఆడేది పాడేది అది రామ చిలుక - జో-జో-జో ఒకనాడు వచ్చాడు ఒయ్యారి దొరకొడుకు ఆ తోట కడకు ! వలచింది రాచిలుక, ఆ రాజు కొడుకు! వాలింది వగకాని వలకేలి పైని ! బంగారు పంజరపు బ్రతుకై పోయింది ॥ జో-జో ॥ కోనైతే పిలిచేనూ - కొండా పిలిచేనూ ఆకాశమంతేసి ఆ గూడు పిలిచేనూ ఎగరని రెక్కలతో -పగిలిన గుండెలతో పంజరపు బ్రతుకాయె ఓ రామచిలుకా ! బంగారు పంజరపు బ్రతుకాయె ఓ రామచిలుకా!
ఎల్లవేళ నిజం చెప్పరా పాట సాహిత్యం
చిత్రం: బంగారు పంజరం (1969) సంగీతం: ఎస్. రాజేశ్వరరావు సాహిత్యం: శ్రీ శ్రీ గానం: బసవేస్వర్, స్వర్ణలత ముని : ఎల్లవేళ నిజం చెప్పరా పద్మ : దూ-దూ-దూ ముని : తల్లి తండ్రి మాట వినరా పద్మ : దూ-దూ-దూ - ముని : ఎదుటి వారి మేలు కోరరా పద్మ : దూ-దూ-దూ - ముని : అబ్బబ్బ పద్మ : నిజం చెప్పరా ముని: అన్నన్నా పద్మ : బలాదూరుగా ముని : అమ్మమ్మ పద్మ : మేలు కోరరా యిద్దరు : అయ్యయ్యొ-మరీ హోరుగా
తుమ్మెదా - తుమ్మెదా పాట సాహిత్యం
చిత్రం: బంగారు పంజరం (1969) సంగీతం: ఎస్. రాజేశ్వరరావు సాహిత్యం: దేవులపల్లి గానం: సరోజినీ బిచ్చక త్తె: తుమ్మెదా - తుమ్మెదా పాలరాతి మేడ తుమ్మెదా! బందిఖానా అయింద తుమ్మెదా ! పూలరేకుల వీడు తుమ్మెదా.... నేల రాలిపోకుంటాద తుమ్మెదా, వన్నెలా బొమ్మను తుమ్మెదా నువ్ వదలేసి వెడతావ తుమ్మెదా ! వలచేటి రాజును తుమ్మెదా - నువ్వు వదిలేసి వెడతావ తుమ్మెదా ! || తుమ్మెదా ॥
శ్రీగిరి శిఖర విమాన విహారీ -II పాట సాహిత్యం
చిత్రం: బంగారు పంజరం (1969) సంగీతం: ఎస్. రాజేశ్వరరావు సాహిత్యం: దేవులపల్లి గానం: యస్.జానకి శ్రీగిరి శిఖర విమాన విహారీ శ్రీ శివ మూర్తి దేవేరీ నీ వరమిది కాదా - తల్లీ నీ దయ యిక లేదా తల్లీ! శరణము మరిలేదా !
నీ వెరిగిన కథ చెబుతా పాట సాహిత్యం
చిత్రం: బంగారు పంజరం (1969) సంగీతం: ఎస్. రాజేశ్వరరావు సాహిత్యం: దేవులపల్లి గానం: జానకి నీ వెరిగిన కథ చెబుతా నిదరోతూ వినవా ? నా కంటి వెలుగా- నా గూటి పులుగా కథ వింటే కలలెన్నో కదలాడునేమో ఆ కథలో వ్యధలెన్నో మెదలాడునేమో ! జో-జో ఒక కొండ - ఒక కనుమ ఆ రెంటికి నడుమ ఉండే దొక తోట ఆ తోట ఆడేది పాడేదొక పిల - ఒక పేదపిల ఆ తోట అందాల దొరనే చూసింది చూసి చూసీ మనసిచ్చి వేసింది ఆ పేదపిల్ల !
గట్టు కాడ ఎవరో చెట్టు నీడ ఎవరో -II పాట సాహిత్యం
చిత్రం: బంగారు పంజరం (1969) సంగీతం: ఎస్. రాజేశ్వరరావు సాహిత్యం: దేవులపల్లి గానం: యస్.జానకి గట్టు కాడ ఎవరో చెట్టు నీడ ఎవరో నల్ల కనుల నాగస్వరమూ వూదేరు ఎవరో ! అయ్యకు బువ్వ పెట్టాలా ! పెయ్యకు మువ్వ కట్టాలా ఒక్కటొక్కటే కొండ పైకి, సుక్కదీపం రాకమును పే రాక మును పే ఏటి గట్టుకాడ మావి సెట్టునీడ – ఎవరో కళ్ళనిండ నీళ్ళు నింపి సూసేరు ఎవరో ! కళ్ళు విప్పి రాచ కొడకా నా కోసం చూడవా మన పాప కోసం చూడవా! || గట్టు కాడ ||
No comments
Post a Comment