చిత్రం: బొమ్మాబొరుసే జీవితం (1979) సంగీతం: జే. వి. రాఘవులు సాహిత్యం: వేటూరి , వీటూరి గానం: యస్.పి.బాలు, పి.సుశీల నటీనటులు: చంద్రమోహన్, మాధవి, జయమాలిని మాటలు: జంధ్యాల దర్శకత్వం: కొమ్మినేని శేషగిరిరావు సహాయ దర్శకుడు: వంశీ నిర్మాత: USR మోహనరావు విడుదల తేది: 21.06.1979 (గమనిక: వేటూరి సుందరరామ మూర్తి, వీటూరి వెంకట సత్య సూర్యనారాయణమూర్తి ఇద్దరు వేరు వేరు, కానీ వీరిద్దరు పాటలు రచయితలు. వీరిద్దరూ కలిసి ఒకే సినిమాలో పాటలు రాసిన సినిమాలు: 1.యమగోల (1977) 2. మల్లెపువ్వు (1978) 3. విజయ (1979) 4. బొమ్మాబొరుసే జీవితం (1979) 5. చెయ్యెత్తి జై కొట్టు (1979) 6. జూదగాడు (1979) 7. మామా అల్లుళ్ళ సవాల్ (1980) 8. మంగళ గౌరి (1980) ఈ ఎనిమిది సినిమాలలో వీరిద్దరి పేర్లు కనిపిస్తాయి )
Songs List:
అందాల సృష్టికి మూలం పాట సాహిత్యం
చిత్రం: బొమ్మాబొరుసే జీవితం (1979) సంగీతం: జే. వి. రాఘవులు సాహిత్యం: వీటూరి గానం: పి.సుశీల అందాల సృష్టికి మూలం ఆనాటి ఏడమ్ ఆనందం సృష్టిస్తోంది - ఈనాడీ మేడమ్ గరీబుకైనా బికారికైనా | అవసరమొకటి నిషాగా ఖుషీగా సుఖాల చరించడం పక్కింటి రాముడుకోసం - పంకజాక్షి విరహం ఎదురింటి రాజాపైనా అబుల్లా మొహం ఎల్లమ్మ తోటలోనా - ఎంకినాయుళ్ళు సరసం : శాంతమ్మ సంతకెళ్ళినా గోవిందు గోడ దూకినా ఎందుకోసం ? పొందుకోసం ? జగమంతా ప్రేమ విలాసం కన్నెపిల్ల కనిపించిందా కన్ను గీటే కాలేజీ బాయ్ హయ్ .... హయ్ చిన్నపిల్ల బుగ్గ నిమిరీ ఇకిలించే తాతాయీ కొంగుచూసి రంగైపోయే దొంగచూపు పూజారీ పార్కుల్లో ఊసులాటలూ తిరునాళ్ళ తిప్పలాటలూ ఏమిగోలా ప్రేమగోలా ? జగమంతా ॥అందాలా॥
వింటే భారతం వినాలీ పాట సాహిత్యం
చిత్రం: బొమ్మాబొరుసే జీవితం (1979) సంగీతం: జే. వి. రాఘవులు సాహిత్యం: వీటూరి గానం: యస్.పి.బాలు, పి.సుశీల హిహిహిహి .... మన్మధలీలా వింటే భారతం వినాలీ తింటే గారెలే తినాలీ పడితే గొప్పోణీ పట్టాలి కొడితే జాక్ పాట్ కొట్టాలీ మీరంతా ఈలలు వెయ్యాలీ మా జేబులు బాగా నిండాలి భారతానికి మూలకారణం ద్రౌపది వస్త్రాపహరణం ప్రజలకు నచ్చే సన్ని వేశమూ పసందైన శృంగార దృశ్యమూ నేనే కురునాదూడా - నాదూడా అపక్ర విక్రమ పరాక్రముండ సుయోధనా సార్వబౌముండ - ఘనుండ నే కురు నాయకుండ హల్లో బ్రదర్ దుశ్శాసనా రేపింగ్ కళా ప్రవీణా ఎక్కడ ఆ FIVE STARS పతివ్రతా గుమ్మడి పండులాంటి ఉమ్మపతి - ద్రౌపతీ పాలమీగడలాంటి వయ్యారీ చెఱుకు గడలావున్న చిన్నారీ పొడుముకాయలాంటి నడుమూపీ జడవూపీ తొడపైన కూర్చోవే ఒకసారి నా తొడపైన కూర్చోవే ఒకసారి ఏయ్ ... ఎవరనుకున్నావూ ఏమనుకున్నావూ అయిదుగురు భర్తలకు నే సింగిల్ భార్యనూ అఫ్కోర్స్ దమర్మము లేరుగని కోర్టుల కెక్కని ఘనుడు ధర్మరాజూ గదతో రొమ్ముల దుమ్మును దులిపే బలుడు భీమరాజూ షూటింగ్లో ఫైటింగ్ హీరో అర్జునుడూ హర్స్ రేసులో అగ్రగణ్యుడు నకిలీలేని నకులుడూ పేరు పొందిన పశువుల డాక్టరు తిరుగులేని సహదేవుడూ ఎవరనుకున్నావూ ఏమనుకున్నావూ అయిదుగురు భర్తలకు నే సింగిల్ భార్యను ఏయ్ --- చాలించవే నీ గొప్పలు ఇక చూసుకోవే నీ తిప్పలు నిన్ను నాకు నాజూదంలో ఓడినారె నీ భర్తలు Don't you know it ? Is it ? తన్నోడి నన్నోడినా నారాజు నన్నోడి తన్నోడెనా తనుముందు ఓడితే నన్నోడ హక్కేది ఈ జూదమాడగా లైసెన్సు నీకేది పాయింటు పట్టిందిరో - లా పాయింటు పట్టిందిరో - హైకోర్టు కెళ్ళినా అప్పీలు లేదురా పాయింటు పట్టిందిరో - లా పాయింటు పట్టిందిరో ఏయ్ -- విప్పరా తప్పురా.. విప్పరా తప్పురా..... కృష్ణా..... కృష్ణా - కృష్ణా కృష్ణా కృష్ణా పోలీస్ పోలీస్ పోలీస్
లుక్ చుక్ లుక్ పాట సాహిత్యం
చిత్రం: బొమ్మాబొరుసే జీవితం (1979) సంగీతం: జే. వి. రాఘవులు సాహిత్యం: వేటూరి గానం: యస్.పి.బాలు, సాయిబాబా లుక్ చుక్ లుక్ చుక్ వ్యాపారం గప్ చిప్ గప్ చిప్ మనబేరం బొమ్మా బొరసే జీవితం - ఆడే బొమ్మల నాటకం బొమ్మలు: Twinkle Twinkle Little Master How We wonder you are here ! మనిషి చేసిన బొమ్మలు మీరు మనసే ఉండడూ వయసే పండదూ దేవుడు చేసిన బొమ్మలు మేము - బుద్దులు మారే మనుషులమూ పొదువాలితే పోతాము - గుడిలో బొమ్మను అర్చిస్తాం అంగడిలో బొమ్మను అమ్మేస్తాం బొమ్మలు: బొమ్మల పాలిట బ్రహ్మలు మీరట పేరు గొప్పట ఊరు దిబ్బట - అయ్యోపాపం : అయ్యోపాపం..కీలుబొమ్మలు ఆ బ్రహ్మదేవుడే కీలుబొమ్మ శ్రీ విష్ణువు చేతులలో ఆ వైష్ణవ మాయలలో… ఈ తోలు బొమ్మలూ కీలుబొమ్మలే ఈకలికాలంలో ఆకలికాలంలో - ధనమదాంధులు జరాసంధులు ఆడే చదరంగంలో పేదజీవులం మేముపావులం కసాయి సాలకు పోతున్నా గరికెలు మేసే గోవులం ఇది గండు పిల్లల చెలగాటంలో నిండు బ్రతుకుల ప్రాణ సంకటం
అమ్మ అనేదీ అచ్చ తెలుగుమాటరా పాట సాహిత్యం
చిత్రం: బొమ్మాబొరుసే జీవితం (1979) సంగీతం: జే. వి. రాఘవులు సాహిత్యం: వేటూరి గానం: యస్.పి.బాలు, పి.సుశీల అమ్మ అనేదీ అచ్చ తెలుగుమాటరా జన్మ జన్మ కదే నిత్యవెలుగు బాటరా ప్రేమకు పెట్టనికోట మమతల మల్లెలతోట తనపిల్లల క్షేమమే పల్లపైన పాట మధుర మధుర మధురమైన మాటరా : అమ్మా కాలు మోపితే అమ్మ అవతరించె కాశీ తానమాడితే అమ్మ తరించింది గంగ మెరిసె లక్ష్మణరేఖ నడిచే భగవద్గీత తొలి పలుకులు దిద్దుకుంది తెలుగుపాప ఆమ్మతో తొలివెలుగులు దిద్దుకుంది తూర్పు అమ్మ చూపుతో దేవుడైన చెప్పలేడు ఆ దేవత ఎంత గొప్పదో అమ్మా - ॥అమ్మ॥ అనగనగా ఓ రాజకుమారి వన్నెచిన్నెల వయ్యారి - నాట్యంలో మయూరి యెందరెందరో రాకుమారులు, ప్రేమ బిక్షకై అర్ధించారు నిరాశ చెందారు డైలాగ్: ఇలా వుండగా ఓనాడు - పెన్నిధి తనతల్లి అయిన పేదయువకుడొకడు ఆ రంభలాంటి చిన్న చూచాడు అందానికి కన్ను చెదిరి ఆ క్షణాన వళ్ళు మరిచి ప్రేమ పిచ్చిలో పడ్డాడు పెళ్ళిచేసుకో మన్నాడు! డైలాగ్ : అప్పుడా సుందరి ఏమడిగిందో తెలుసా ? కానుకగా కన్నతల్లి గుండె కోరెనా చిన్నది తేలికగా తెస్తా లెమ్మన్నాడు - ప్రేమ ఎంతగుడ్డిది ఆ కామమెంత చెడ్డది కన్నుల కడవెలుగు దాచి కన్న కడుపునే తలచి తలవాకిట నిలచినదా తల్లి కన్నతల్లి వచ్చిన బిడ్డనుచూచి వెచ్చని మమతలుపోసి వండిన అన్నము పెట్టెను - నిండుగుండెతో ఆ తల్లి బిడ్డకడుపు నిండుగా మళ్ళీ మళ్ళీ ఇటు కన్నతల్లి మమకారము అటు కన్నెపిల్ల శృంగారమూ ఇటు తల్లిగుండె గుడిగంటలూ అటు కన్నె కంటి చలిమంటలూ ఇటు నెత్తురు - అటు అత్తరు ఇటు త్యాగము - అటు భోగము ఉన్మత్తుడై, చలచిత్తుడై, కామాంధుడై, పాపాత్ముడై పుత్రరూపమున శత్రువై, మాతృ హత్యనే చేశాడు జన్మనిచ్చిన తల్లినే చంపుకున్నాడు కన్నుమిన్ను కానక, కన్నతల్లి గుండె కానుక కన్నెపిల్ల కే ఇవ్వగా ! కన్నుకానక పరుగులెత్తగా - కాలుజారి పడిపోయాడూ చావు దెబ్బతిని అమ్మా అమ్మా అమ్మా అంటూ గావు బొబ్బలే పెట్టాడు డైలాగ్ : అప్పుడు ఆ తల్లి గుండె యెమన్నదో తెలుసా? నాయనా దెబ్బతగిలిందా ? జాగ్రత్త నాయనా నా ఆయుష్షు పోసుకొని నూరేళ్ళు చల్లగా వర్ధిల్లు నాయనా - అమ్మ కోరేదీ ఒకే ఒక్క మాటరా అయిదూ ప్రాణాలుపోసి నవమాసాలు మోసిన తనకు అప్పు పడ్డందుకు తలకు కొరివి పెట్టమనీ తన ఋణమును తీర్చమనీ ఎన్ని జన్మలెత్తినా తనబిడ్డయి పుట్టమనీ అమ్మా అని పిలవమనీ - మాతృదేవోభవా ! మాతృదేవోభవా ! మాతృదేవోభవా |
No comments
Post a Comment