చిత్రం: చెయ్యెత్తి జై కొట్టు (1979) సంగీతం: జే.వి.రాఘవులు సాహిత్యం: వేటూరి, వీటూరి, జాలాది గానం: పి.సుశీల, యస్.పి.బాలు, యస్. జానకి నటీనటులు: కృష్ణం రాజు, గీత, పల్లవి, జయమాలిని, జ్యోతిలక్ష్మి దర్శకత్వం: కొమ్మినేని శేషగిరిరావు నిర్మాత: కె. రామచంద్ర రావు విడుదల తేది: 10.08.1979 (గమనిక: వేటూరి సుందరరామ మూర్తి, వీటూరి వెంకట సత్య సూర్యనారాయణమూర్తి ఇద్దరు వేరు వేరు, కానీ వీరిద్దరు పాటలు రచయితలు. వీరిద్దరూ కలిసి ఒకే సినిమాలో పాటలు రాసిన సినిమాలు: 1.యమగోల (1977) 2. మల్లెపువ్వు (1978) 3. విజయ (1979) 4. బొమ్మాబొరుసే జీవితం (1979) 5. చెయ్యెత్తి జై కొట్టు (1979) 6. జూదగాడు (1979) 7. మామా అల్లుళ్ళ సవాల్ (1980) 8. మంగళ గౌరి (1980) ఈ ఎనిమిది సినిమాలలో వీరిద్దరి పేర్లు కనిపిస్తాయి )
Songs List:
యాలో యాలా ఉయ్యాలా పాట సాహిత్యం
చిత్రం: చెయ్యెత్తి జై కొట్టు (1979) సంగీతం: జే. వి. రాఘవులు సాహిత్యం: వేటూరి గానం: పి.సుశీల యాలో యాలా ఉయ్యాలా గున్నమావిలో కన్నెకోయిలా కూసిందియ్యాలా ఎండకన్నులా పండువెన్నెలా కాసిందియ్యాలా ఈ పులకరింతలే పూలు పుయ్యాలా ఆ పలకరింతకే పైట జారాల .... వున్న ఈడులేని తోడు - ఈసులాడుకున్న ఈ వేళ మల్లెపువ్వు పిల్ల నవ్వు - మాటలాడుకున్న ఈ వేళ ఏ ఈడులో ఆ వేడుక జరగాలనే చలికోరిక కంటిపాపనే చందమామ వాటేసిందియ్యాలా కొంగుచాటున కొండగాలి కాటేసిందియ్యాల ఈ కలవరింతలే కలిసిరావాల ఆ కోగిలింతలో కలిసిపోవాల.... వానపువ్వు తేనెటీగ - ముద్దులిచ్చి పుచ్చుకున్న వేళ కన్నెసోకు కన్నుసోకి మొగ్గలిచ్చుకున్న ఈ వేళ ఈ గుండెలో గూడున్నది - ఏ గువ్వకో చోటున్నది కొత్తబరుపు నాకోకబిగువు కాజేసిందియ్యాలా పైటదరువు నా పరువుతీసి ఆరేసిందియ్యాలా ఈ జలదరింత నేనేడ దాయాలా ఈ తొలకరింత నేనెవరికియ్యాలా ....
కోడెవయసూ కుమ్మేస్తుంటే పాట సాహిత్యం
చిత్రం: చెయ్యెత్తి జై కొట్టు (1979) సంగీతం: జే. వి. రాఘవులు సాహిత్యం: వీటూరి గానం: పి.సుశీల , యస్.పి.బాలు కోడెవయసూ కుమ్మేస్తుంటే - కొంటె మనసూ దొలిచేస్తుంటే తిమ్మిరెక్కి నాఒళ్లు తుళ్లి తుళ్లి పడుతుంటే...ఏం చెయ్యాలి...అమ్మో ఎటు పోవాలి? ఆరు బైట జారు పైట రెపరెపమంటే నా గుండెలోన రేగింది సన్నని చలిమంట నీ చూపు నా వైపు ఎగాదిగా చూస్తే నా వెన్నులాగ సాగింది వెచ్చని పులకింత పట్ట బోతే పావురాయి - కొట్ట బోతే కొక్కిరాయి అందకుంటే సూదంటురాయి అందకుంటే ఆకురాయి కలిసివుంటె హాయి - కలపవేమె చేయి - ఒ రాలుగాయి గడుగ్గాయి అమ్మాయి ఏం చెయ్యాలి - ఎటుపోవాలి జత కలపాలి - కధ నడపాలి ॥కోడెవయసూ॥ బుగ్గమీద ముగ్గులేసి అలా అలా రాస్తే సింగారం చిలికింది సిగ్గుల సిరిమొగ్గ కూత కూసి లేతనడుము అటూయిటూ వూగితె వలపు వయసు గోదారికి వచ్చింది వరద ముట్టుకుంటే మునగకొమ్మ - పట్టుకుంటే వదలడమ్మ మచ్చికైతే పూలరెమ్మ - నచ్చకుంటే మంచుబొమ్మ పెళ్లయితే కీలుబొమ్మ - అందాక ముళ్ళకొమ్మ ఆ పైనే నీముచ్చుట తీరేనమ్మా ఏంచెయ్యాలి ఎటుపోవాలి - జతకలవాలి కధనడపాలి
మాఘమాసం మాపటేల పాట సాహిత్యం
చిత్రం: చెయ్యెత్తి జై కొట్టు (1979) సంగీతం: జే. వి. రాఘవులు సాహిత్యం: వేటూరి గానం: పి.సుశీల మాఘమాసం మాపటేల - మనక ఎన్నెట్లో గోరింట పొదరింట కోరిన కౌగిట్లో ఎన్ని ముద్దుముచ్చట్లో - ఎన్నో వున్నై గుప్పెట్లో ఎట్టా సెప్పను యిప్పట్లో - సెబుతా పెళ్ళిపందిట్లో ॥మాఘమాసం|| పులకింతలే బుసకొట్టగా - గిలిగింతలే నసపెట్టగా ఆ కళ్ళే గిల్లి గిల్లీ - నా ఒళ్ళే తుళ్ళి మళ్ళి నాగమల్లి తోటకాడ చంద్రవంక వాగులోన నిండా మునగకుండానే నీల్లాడబోకుంటే చలి చలి చలి అన్నానే, చెలి చెలి చెలి అన్నాడే ఆడేమన్నాడో నేనేం యిన్నానో ఎట్టా సెప్పను యిప్పట్లో సెబుతా పెళ్ళిపందిట్లో ॥మాఘమాసం॥ పడుచందమే కడవెత్తగా - తడికొంగులే పడగెత్తగా నీళ్ళే తొణికి తొణికి - నా ఒళ్ళే ఒణికి ఒణికి నీలికొండ చాటుచూసి నీటిఎండ కాపుకాసి ఆరీ ఆరకుండానే చీర కట్టుకొస్తుంటే చుర చుర చుర చూశాడే - విర విర విర లాడానే కంటే చూశాడో - కాటే వేశాడో. ఎట్టా సెప్పను యిప్పట్లో సెబుతా పెళ్ళిపందిట్లో.... ॥మాఘమాసం॥
చీరులోయ్ చీరులు పాట సాహిత్యం
చిత్రం: చెయ్యెత్తి జై కొట్టు (1979) సంగీతం: జే. వి. రాఘవులు సాహిత్యం: వేటూరి, వీటూరి, జాలాది గానం: పి.సుశీల , యస్.పి.బాలు, యస్. జానకి చీరులోయ్ చీరులు - చీరులోయ్ చీరులు చుక్కచుక్క జారుల్లో - నిషా హుషారుల్లో ఆనంద నిలయం - అందాల వలయం ఈ చుక్క సరసం - అందుకుంటె సార్గం.....॥చీరులోయ్ || పాలకుండ ఎన్నెలంటరో ఎన్నెట్లో నీలికొండ జారుబండరో బండమీద కొక్కిరాయిరో - నన్ను నిక్కినిక్కి చూస్తుందిరో అయితే యిదే మన తక్షణ కర్తవ్యం నీటూ గోటూ దుశ్శశనా సరసకురారా సుయోధనా దానంచేసే ఓ కర్ణా - పాచికలాడే ఓ శకునీ బొమ్మలాట నువ్వు ఆడకురా .. దుమ్ము దులపరా దొరమావా మరి పొజిసన్ మార్చహే మార్చుకున్నా చల్లార్చుకున్నా - దీపాలయాల కాదురో చీకట్లో చిందువేయరో అయితే ఒత్తినొక్కి దీపమార్పెయ్.... భారతకథలో రారాజైనా భామకు లోబడిపోలేదా మందు పొందూ మరిగినవాడే - ఇంద్రుడిగా నిలబడలేదా నేలకు నాలుగు దిశలంటా ఈ మనిషికి నాలుగు దశలంటా దశలూ దిశలూ మారితే ఈ చతుష్టయం గతి ఏమంటా రంభా ఊర్వశి నేను మీ రంగులు తేల్చేస్తాను కామిని యామిని నేను మీ కధలే మార్చుతాను
No comments
Post a Comment