Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Doralu Dongalu (1976)




చిత్రం: దొరలు దొంగలు (1976)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం: మల్లెమాల యూనిట్
నటీనటులు: జి. రామకృష్ణ, రంగనాథ్, శ్రీధర్, చంద్రమోహన్, వాణిశ్రీ
దర్శకత్వం: కె.ఎస్.ఆర్. దాస్
నిర్మాణ సంస్థ: సుందరం మూవీస్ 
విడుదల తేది: 06.05.1976



Songs List:



పండు వెన్నెల తెల్లవార్లు పాట సాహిత్యం

 
చిత్రం: దొరలు దొంగలు (1976)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం: మల్లెమాల యూనిట్
గానం: యస్.పి.బాలు, పి.సుశీల 

పండు  వెన్నెల తెల్లవార్లు కురిసి వెలిసింది 
పైట సర్దుకు  పల్లెటూరు నిదుర లేచింది
పొంచి కూర్చొని వున్న సూర్యుడు పైకి లేచాడు 
ముగ్గులా ముంగిళ్ళు చూసి మురిసిపోయాడు 
మురిసిపోయాడు

అందాల చందాల చందమామా 
మా ఇంట వెలిశావా చందమామా 
ముప్పేట గొలుసురో చందమామా.....
ఇది మూడు తరాలుండాలి చందమామా 
చందమామా.... చందమామా....



మందార మకరందమూ పాట సాహిత్యం

 
చిత్రం: దొరలు దొంగలు (1976)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం: మల్లెమాల యూనిట్
గానం: యస్. జానకి 

మందార మకరందము 
యెల తేటికే సొంతము 
పగడాల నా అధరము... పస గల 
ప్రతివాడికి సొంతము  ॥ మందార॥
 
ముసిరిన విరహం తొలగాలంటే 
ముచ్చట నాతో నెరపండి 
ముదిమికి పరువం రావాలంటే 
ముద్దులు నావే కొసరండి 
చెలిమి కోరితిని చెంత చేరితిని 
చలమి కేల రవితేజా....  ॥ మందార॥

ముసి ముసి నగవులు విసిరానంటే 
మునులే ముందుకు ఉరకాలి 
కసిగొని ఒక చూపు చూశానంటే 
ఘనులే దాసులు కావాలి.... 
మధన సముడవని హృదయ మొసగితిని 
వదల నింక నిను రాజా.... ॥ మందార ॥

వదలనురా... అదునిదిరా... 
అదునిదిరా... వదలనురా 
వదలనురా...
వదలనురా... నిను... వదలనురా...




పెళ్లంటే మాటలు కాదోయ్ పాట సాహిత్యం

 
చిత్రం: దొరలు దొంగలు (1976)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం: మల్లెమాల యూనిట్
గానం: పి.సుశీల 

అహా పెళ్ళి… ఓహో పెళ్ళి 
నీకూ పెళ్ళి… నాకూ పెళ్ళి...
బళ్ళో పెళ్ళి... గుళ్ళో పెళ్ళి 
పెళ్ళి... పెళ్ళి..... 
గల్ మోహనరంగా 
పెళ్ళంటె మాటలు కాదోయి - శ్రీరంగశాయి 
పెళ్ళీ పెళ్ళని గంతులెయ్ కోయి 

పిచ్చి కుదరనిదే.... పెళ్ళి జరగదు 
పెళ్ళి జరిగనిదే.. పిచ్చి కుదరదు 
పిచ్చికి పెళ్ళికి పొత్తు కలవదు 
కలవకపోతే పెళ్ళే జరగదు..... ॥పెళ్ళంటె॥ 

ఎండా వానకు పెళ్ళంటా 
కొండ కిందనే విడిదంటా 
కోతుల్లారా వస్తారా 
కొబ్బరికాయలు తెస్తారా 
తెచ్చేదాకా వుంటాను 
తెస్తే మాత్రం తంతాను   ॥పెళ్ళంటె॥ 

తలుపు తట్టుతావా మురహరి  తాళికట్టుతావా
తాళి తగలగానే పిల్లలు పుడితే  జోలి పట్టుతావా 
ఉ ళు ళు ళు జోల పాడుతావా 
జో అచ్యుతానంద జో జో ముకుందా 
లాలీ పరమానంద రామ గోవిందా 
రామ గోవిందా  నీవు గోవిందా
నీవు గోవిందా నేను గోవిందా 
నీవూ నేనూ  గోవిందా  గోవిందా...




చెప్పలనుకున్నాను పాట సాహిత్యం

 
చిత్రం: దొరలు దొంగలు (1976)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం: మల్లెమాల యూనిట్
గానం: యస్.పి.బాలు, పి.సుశీల 

చెప్పాలనుకున్నాను 
చెప్పలేక పోతున్నాను 
కల్లాకపటం తెలియని నన్ను 
కన్నులతో కవ్వించవద్దని  ॥చెప్పా॥ 

చెప్పకుండ నా మదిలో దూరి 
చిందర వందర చెయ్యొద్దని 
రెండివ్వాలనుకున్నాను 
ఇవ్వలేక పోతున్నాను 

ఆడుకొనే లతల నడుమ 
పాడుకొనే పూవులమై 
పరిసరాల నన్నిటిని 
పరిమళింప చేద్దామని 

మేలి మునుగలోని లజ్జ 
మెట్లు దిగీ వచ్చిందిని 
తెలిసికూడ తెలియనట్టె 
ఒదిగుండె ఒళ్ళుమండి
రెండివ్వాలనుకున్నాను 
ఇవ్వలేక పోతున్నాను

అడగకుండ అందించే 
ఆలింగన మధురము 
వద్దంటూ అందుకొనే 
వలపు మరీ మధురము 

అని చెప్పాలనుకున్నాను 
అన్నీ చెప్పేశాను 
ఇవ్వాలనుకున్నాను 
అన్నీ ఇచ్చేశాను




ఏనాడు అనుకోనిదీ పాట సాహిత్యం

 
చిత్రం: దొరలు దొంగలు (1976)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం: మల్లెమాల యూనిట్ 
గానం: యస్.పి.బాలు, పి.సుశీల

పల్లవి:
ఏనాడు అనుకోనిదీ ఈనాడు నాదైనదీ
ఏనాడు అనుకోనిదీ ఈనాడు నాదైనదీ

వెల లేనిది కల కానిది ఇలలోన సరి రానిదీ
ఏనాడు అనుకోనిదీ ఈనాడు నాదైనదీ

చరణం: 1 
వెన్నెల పొదిగిన దొన్నెలు కన్నులు
పెదవుల కందించనా పరవశ మొ౦దించనా

అందం విరిసిన ఆమని వేళా
విందులు కొదవుండునా వింతలు లేకుండునా
వేడుక వాడుక కాకుండనా

ఏనాడు అనుకోనిదీ ఈనాడు నాదైనదీ

చరణం: 2 
కౌగిట అదిమి హృదయం చిదిమి
మధువులు కురిపించనా
మదనుని మురిపించనా   

అందని స్వర్గం ముందు నిలిచితే
ఎందుకు పోమ్మ౦దునా
ఇది వేళ కాదందునా
తీరిక కోరిక లేదందునా

ఏనాడు అనుకోనిదీ ఈనాడు నాదైనదీ
వెల లేనిది.. కల కానిది ఇలలోన సరి రానిదీ
ఏనాడు అనుకోనిదీ  ఈనాడు నాదైనదీ



వయ్యారాల బంగారు బొమ్మకు పాట సాహిత్యం

 
చిత్రం: దొరలు దొంగలు (1976)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం: మల్లెమాల యూనిట్
గానం: యస్.జానకి, మాధవపెద్ది రమేష్ 

ఒయ్యారాల బంగరు బొమ్మకు 
వన్నెలు పదహారు 
నేటికి వయసూ పదహారు 
ఎందున్నారో ఏమంటారో 
వచ్చే దొరగారు 
కాబోయే శ్రీవారు 

పుట్టే వున్నాము 
శపదం పట్టే వున్నాము.... 
మొగ్గలు తొడిగిన సిగ్గలు మేమై 
దగ్గర లోనే వున్నాము -  ॥ ఒయ్యారాల॥

కోరిక పిలిచింది.... తెలియక 
కోమలి పలికింది 
అంతటితోనే ఆగకపోతే 
అసలుకే మోసం వస్తుంది.... ॥ ఒయ్యారాల॥

ఊహలు పూశాయి..... మమ్ము 
ఉక్కిరి చేశాయి.... 
అక్కడె వాటిని అణచకపోతే 
బిక్కిరి కూడా చేస్తాయి




ఓలమ్మో ఓరయ్యో పాట సాహిత్యం

 
చిత్రం: దొరలు దొంగలు (1976)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం: మల్లెమాల యూనిట్
గానం: పి.సుశీల 

ఓలయ్యొ ఓలమ్మొ... 
ఇయ్యాల మనకంతా పండగా  
ఏటికి నీరొచ్చింది దండిగా

ఓలయ్యొ ఓలమ్మొ...  ఓలయ్యొ ఓలమ్మొ ! 
ఈయాల మనకంత పండగ 
ఏటికి నీరొచ్చింది దండిగ....  ॥ ఓలయ్యొ॥

రేవులోనీ అడుసంతా
రూపుమాసి పోయింది.... 
రేయేంది.... పగలేంది 
ఉతకండి జోరుగా.... ॥ఓలయ్యొ॥ 

పట్టు పంచ పంచాంగం పాపయ్యది .... ఈ 
గళ్ళ కోక పూటకూళ్ళ గౌరమ్మది 
ఈ రెంటికి లంకెరా పిచ్చి సన్యాసి 
బాదరా జతజేసి బండ కేసి.... ॥ఓలయ్యొ॥ 

ఎల్లాయి కుండపైన ఎన్ని రంగులు 
ఏందట్టా సూస్తావు యెర్రి గంగులు 
ఏ గాలికెగిరింది పైట సెంగు
బైట పడి కూకుంది వయసు పొంగు.... ॥ఓలయ్యొ॥ 




తన్ను తన్ను పాట సాహిత్యం

 
చిత్రం: దొరలు దొంగలు (1976)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం: మల్లెమాల యూనిట్
గానం: యస్.పి.బాలు, పి.సుశీల 

తన్ను - తన్ను.... తన్ను.... తన్ను....! 
మళ్ళీ.... మళ్ళీ.... తన్ను.... ! 
ఆడదాని తన్నుల్లోనే 
ఆనందం వున్నదంట....  ॥ తన్ను॥

వద్దు - వద్దు. వద్దు వద్దు.... ! 
మళ్ళీ.....మళ్ళీ....వద్దు....! 
ఒక్కసారే కొన్నిటి ముద్దు 
అంతకు మించి వద్దే వద్దు....  ॥ వద్దు॥

ఊరూ పేరూ లేని కృష్ణుడు 
యుగపురుషుడు ఐనాడంటే 
సత్యభామ తన్నులుగాక 
వేరే కారణ మేముంది - అందుకే  ॥ తన్ను॥

కోకారైకా లేని గోపికలు 
ఏటికి అందం తెచ్చారంటే...
అది కృష్ణుని చలవే అయినా 
ఆ పని మళ్ళీ చేశాడా.... అందుకే.. ॥ వద్దు॥






దొరలెవరో దొంగలేవరో తేల్చికుంటాను పాట సాహిత్యం

 
చిత్రం: దొరలు దొంగలు (1976)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం: మల్లెమాల యూనిట్
గానం: యస్.పి.బాలు 

దొరలెవరో దొంగ లెవరో 
తెలుసుకుంటాను 
తెలియకపోతే 
ప్రాణాలొడ్డి తేల్చుకుంటాను  ॥ దొర॥

మనిషి పులిని చంపాడంటే 
శౌర్యమంటారు.... 
పులి మనిషిని చంపిందంటే 
క్రౌర్యమంటారు.... 
ఏమి ధర్మమిది....? ఏమి న్యాయమిది....? 
ఎక్కడిదీ సిద్ధాంతం....?    ॥ దొర॥

నిప్పు లేనిదే పొగ రాజదు 
ఇది తిరుగులేని నిజము 
ఎప్పటికై నా నిజం దాగదిది 
మరువరాని నిజము........ 
ఉప్పు మెక్కితే దాహం తధ్యం 
తప్పు చేసితే దండన తధ్యం.... ॥ దొర॥




వెడలె ఉత్తరకుమరి సభకు పాట సాహిత్యం

 
చిత్రం: దొరలు దొంగలు (1976)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం: మల్లెమాల యూనిట్
గానం: యస్.పి.బాలు, పి.సుశీల 

వెడలె ఉత్త  రాకుమారి సభకు 
రాయంటి నడకల....   ॥వెడలె॥
వందిమాగదులు చిందులు దొక్కగ 
కుందరదన కనువిందు సేయుచు ॥వెడలె॥

ఇలా ఉత్తరాకుమారి నిద్రనుండి లేచి 
కళ్ళు తెరిచి, ఒళ్ళు విరిచి 
బృహన్నల కడ నేర్చిన నాట్యవిధానం బెట్టిదనినా.... 
ఎట్టిదనినా.... 
శభాష్....! 
తకిటా... తకతకిట ధిమిత తక తకిటా ! 
ధిమి తకిట తకిట తోం తకిటా .... ! 

ఉప్పు కప్పురం ఒకటిగ వున్నా 
రుచుల జాడ వేరన్నా..... ఇది 
వేదవాక్కు రోరన్నా....  ॥తకిటా॥

కన్నూ ముక్కూ ఒకటిగ వున్నా 
కాళ్ళ తీరు వేరన్నా...ఈ కాళ్ళ తీరు వేరన్నా ! 
ఆ.... కాళ్ళు మాకు తెలుసన్నా....!....  ॥తకిటా॥

చేతులా ఇవి.... ఆ.... చేతులా ఇవి 
చేతులా ఇవి భూతలమ్మున 
ఖ్యాతి గాంచిన రాతి రేకులు 
చూడవే...ఓ ముద్దుగుమ్మా....! చూడవే.... 
చూసితీ.... నీకంటే ముందే చూసితీ 
చూసి చేసేదేమి లేదని 
చూసి చూడని దాననైతిని.... ॥తకిటా॥ 

No comments

Most Recent

Default