చిత్రం: డాక్టర్ ఆనంద్ (1966) సంగీతం: కె.వి. మహదేవన్ సాహిత్యం: ఆత్రేయ, దేవులపల్లి కృష్ణ శాస్త్రి, కొసరాజు, డా॥ సి. నారాయణరెడ్డి గానం: ఘంటసాల, పి.సుశీల, బి. వసంత, పి.బి.శ్రీనివాస్, పిఠాపురం నాగేశ్వరరావు నటీనటులు: రామారావు, అంజలీ దేవి, కాంచన దర్శకత్వం: వి. మధుసూదనరావు నిర్మాత: డి.వెంకటపతిరెడ్డి విడుదల తేది: 14.10.1966
Songs List:
చక్కని చల్లని యిల్లు పాట సాహిత్యం
చిత్రం: డాక్టర్ ఆనంద్ (1966) సంగీతం: కె.వి. మహదేవన్ సాహిత్యం: ఆచార్య ఆత్రేయ గానం: ఘంటసాల, పి. సుశీల చక్కని చల్లని యిల్లు చక్కెర బొమ్మలు పాపలు మల్లెల మనసులు విరజల్లు మమతల కలలకు పందిళ్ళు చక్కని చల్లని యిల్లు, చక్కెర బొమ్మలు పాపలు మల్లెల మనసులు విరజల్లు మమతల కలలకు పందిళ్ళు చక్కని చల్లని యిల్లు చక్కెర బొమ్మలు పాపలు చరణం:1 అమ్మా, నాన్నా కట్టినవి అమ్మా, నాన్నా కట్టినవి అల్లరి పిల్లలు పుట్టినవీ.. అహహహ అల్లరి పిల్లలు పుట్టినవి ముద్దుల ముద్దలు పెట్టినవి ముల్లోకాలకు స్వర్గమిదీ..ఈ.. అహహహా.. అహహహా...అహహహా చక్కని చల్లని యిల్లు చక్కెర బొమ్మలు పాపలు చరణం: 2 మనసు పెరిగితే ఒకటౌతాము వయసు పెరిగితే వేరౌతాము మనసు పెరిగితే ఒకటౌతాము వయసు పెరిగితే వేరౌతాము పెరిగే మీరు తరిగే మేము ప్రేమనిక్కడే చవి చూద్దాము అహహహా.. అహహహా...అహహహా చక్కని చల్లని యిల్లు చక్కెర బొమ్మలు పాపలు మల్లెల మనసులు విరజల్లు మమతల కలలకు పందిళ్ళు చక్కని చల్లని యిల్లు చక్కెర బొమ్మలు పాపలు అహహహా.. అహహహా...అహహహా
నీలమోహనా.. రారా పాట సాహిత్యం
చిత్రం: డాక్టర్ ఆనంద్ (1966) సంగీతం: కె.వి. మహదేవన్ సాహిత్యం: దేవులపల్లి గానం: పి. సుశీల పల్లవి: నీలమోహనా.. రారా నిన్ను పిలిచె నెమలి నెరజాణ నీలమోహనా.. రారా నిన్ను పిలిచె నెమలి నెరజాణ నీలమోహనా.. రారా జారువలపు జడివాన కురిసెరా.. జాజిలత మేను తడిసెరా జారువలపు జడివాన కురిసెరా.. జాజిలత మేను తడిసెరా లతలాగే నా మనసు తడిసెరా.. నీలమోహనా.. రారా రారా..రారా.. చరణం: 1 ఏలాగె మతిమాలి? ఏడే నీ వనమాలి? ఏలాగె మతిమాలి? ఏడే నీ వనమాలి? అతడేనేమో అనుకున్నానే.. అంత దవుల శ్రావణ మేఘములగనీ అతడేనేమో అనుకున్నానే.. అంత దవుల శ్రావణ మేఘములగనీ ప్రతిమబ్బు ప్రభువైతే... ప్రతికొమ్మ మురళైతే ఏలాగె ఆ... ఏలాగె మతిమాలి.... ఏడే నీ వనమాలి? హ హా హా.. హా హా.. నీలమోహనా.. రారా.. నిన్ను పిలిచె నెమలి నెరజాణ నీలమోహనా.. రారా.. రా రా రా... చరణం: 2 ఆ... సారెకు దాగెదవేమి? నీ రూపము దాచి దాచి ఊరించుటకా స్వామీ? సారెకు దాగెదవేమి..? నీ కన్నుల తోడు నీ కలికి నవ్వుల తోడు నీకోసం ఎంత వేగిపోయానో కృష్ణా కృషా కృష్ణా కృష్ణా... సారెకు దాగెదవేమి..? చరణం: 3 అటు... అటు... ఇటు... ఇటు... ఆ పొగడకొమ్మవైపు ఈ మొగలి గుబురువైపు కార్తీక రాతిరిలో కఱి మబ్బుంటుందా... నీలిమేఘమాకాశము విడిచి... నేల నడుస్తుందా ? కార్తీక రాతిరిలో కఱి మబ్బుంటుందా... నీలిమేఘమాకాశము విడిచి... నేల నడుస్తుందా ? నడిచే మబ్బులకు నవ్వే పెదవుందా? నవ్వే పెదవులకూ మువ్వల మురళుందా? పెదవి నందితే పేద వెదుళ్ళు కదిలి పాడుతాయా? నడిచే మబ్బులకు నవ్వే పెదవులు నవ్వే పెదవులకు మువ్వల వేణువులు మువ్వల వేణువులు... మువ్వల వేణువులు
పెరుగుతుంది హృదయం పాట సాహిత్యం
చిత్రం: డాక్టర్ ఆనంద్ (1966) సంగీతం: కె.వి.మహదేవన్ సాహిత్యం: ఆచార్య ఆత్రేయ గానం: పి.సుశీల పెరుగుతుంది హృదయం
మదిలోని నా స్వామి పాట సాహిత్యం
చిత్రం: డాక్టర్ ఆనంద్ (1966) సంగీతం: కె.వి. మహదేవన్ సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి గానం: పి. సుశీల మదిలోని నా స్వామి ఎదురాయె నేడు శిలయైన నా మేను పలికించినాడు మదిలోని నా స్వామి ఎదురాయె నేడు శిలయైన నా మేను పలికించినాడు అతనిని కనినంత అందెలు పలికే అతనిని కనినంత అందెలు పలికే అందెలు రవళించ డెందము పలికే నాలో శతకోటి భావాలు పలికే మదిలోని నా స్వామి ఎదురాయె నేడు శిలయైన నా మేను పలికించినాడు మనసెరిగిన వాడు మమతల నెలరేడు వలపుల దీపాలని నిలిపిన చెలికాడు మనసెరిగిన వాడు మమతల నెలరేడు వలపుల దీపాలు నిలిపిన చెలికాడు ఇన్నాళ్లకు తానే నన్నేలినాడు మదిలోని నా స్వామి ఎదురాయె నేడు శిలయైన నా మేను పలికించినాడు అతడే నాపాలి అభినవ వనమాలి ఆతని నయనాలు అందిన నయనాలు అతడే నాపాలి అభినవ వనమాలి ఆతని నయనాలు అందిన గగనాలు ఆతని పాదాలు నా పారిజాతాలు మదిలోని నా స్వామి ఎదురాయె నేడు శిలయైన నా మేను పలికించినాడు.
నీలాల కన్నులతో పాట సాహిత్యం
చిత్రం: డాక్టర్ ఆనంద్ (1966) సంగీతం: కె.వి. మహదేవన్ సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి గానం: ఘంటసాల, పి. సుశీల నీలాల కన్నులతో ఏలాగో చూసేవు ఎందుకని చూసేవెందుకని
ముసుగు తీయవోయి పాట సాహిత్యం
చిత్రం: డాక్టర్ ఆనంద్ (1966) సంగీతం: కె.వి.మహదేవన్ సాహిత్యం: ఆచార్య ఆత్రేయ గానం: పి.బి.శ్రీనివాస్ ముసుగు తీయవోయి
తళుకు బెళుకు చీరదాన పాట సాహిత్యం
చిత్రం: డాక్టర్ ఆనంద్ (1966) సంగీతం: కె.వి.మహదేవన్ సాహిత్యం: కొసరాజు గానం: పిఠాపురం, స్వర్ణలత తళుకు బెళుకు చీరదాన
చక్కని చల్లని యిల్లు (Female Version) పాట సాహిత్యం
చిత్రం: డాక్టర్ ఆనంద్ (1966) సంగీతం: కె.వి. మహదేవన్ సాహిత్యం: ఆచార్య ఆత్రేయ గానం: పి. సుశీల చక్కని చల్లని యిల్లు చక్కెర బొమ్మలు పాపలు
No comments
Post a Comment