చిత్రం: జవాన్ (2023) సంగీతం: అనిరుద్ రవిచందర్ నటీనటులు: శారుఖాన్, నయనతార, దీపికా పదుకొనే దర్శకత్వం: అట్లీ నిర్మాత: గౌరీఖాన్ విడుదల తేది: 07.09.2023
Songs List:
దుమ్మే దులిపేలా పాట సాహిత్యం
చిత్రం: జవాన్ (2023) సంగీతం: అనిరుద్ రవిచందర్ సాహిత్యం: చంద్రబోస్ గానం: అనిరుద్ రవిచందర్, మంగ్లీ సిన్ని గుండె నేడే ఆడమన్నదే అయినా బిడియమేదో ఆపే… (రెడీ) దుమ్మే దులిపేలా ఎగిరి ఎగిరి దూకెయ్ ధూలే రేగేలా ఎగిరి దుముకురా భూమే బెనికేలా అదర అదరగొట్టెయ్ నింగే వణికేలా ఎగిరి దుముకురా ఉడుకు దుడుకు ఉండాలోయ్ ఉరుకు పరుగు ఉండాలోయ్ చురుకు చమకు ఉండాలోయ్ ఉంటేనే మనిషండోయ్ చిలిపితనము ఉండాలోయ్ చెలిమి గుణము ఉండాలోయ్ కరుణ తపన ఉండాలోయ్ ఉంటేనే మనిషండోయ్ ఊపిరి వెచ్ఛంగా, ఊహలు పచ్చంగా హృదయము స్వచ్చంగా ఉంటే మనిషండోయ్ హేయ్, హృదయము స్వచ్చంగా ఉంటే మనిషండోయ్ ధక్ ధక్ ధడకు ధడకు దరువు రాగానే మగాళ్ళిలా చలించనే ఆడే వాడే అందరివాడు అందరి కోసం ఆడాలే ధక్ ధక్ ధడకు ధడకు దరువు రాగానే లోకంలో నువ్వే లేవంటాను నీలోనే లోకం ఉందంటాను ప్రేమించే తత్వం చాలంటాను వేరే వేదాంతం వద్దంటాను ఎగుడు దిగుడు కలపాలోయ్ అడుగు నీడ కలవాలోయ్ కలుపుగోలుగుండాలోయ్ ఉంటేనే మనిషండోయ్ ఉడుకు దుడుకు ఉండాలోయ్ ఉరుకు పరుగు ఉండాలోయ్ చురుకు చెమకు ఉండాలోయ్ ఉంటేనే మనిషండోయ్ కొంచెం సరదాగా, కొంచెం మర్యాద అంతా మనసారా ఉంటె మనిషండోయ్ అరె, అంతా మనసారా ఉంటె మనిషండోయ్ ధక్ ధక్ ధడకు ధడకు దరువు రాగానే మగాళ్ళిలా చలించనే ఆడే వాడే అందరివాడు అందరి కోసం ఆడాలే ధక్ ధక్ ధడకు ధడకు దరువు రాగానే
ఛలోన పాట సాహిత్యం
చిత్రం: జవాన్ (2023) సంగీతం: అనిరుద్ రవిచందర్ సాహిత్యం: చంద్రబోస్ గానం: ఆదిత్య RK, ప్రియా మాలి ప్రేమలో హాయి ఉందో ప్రేమలో బాధ ఉందో ఓ నిజంగా ఏది ఉన్నా నువ్వే నా ప్రేమ అన్నావో ఓ ఓ ప్రేమను ఆపే అడ్డు లేదట, గుట్టు లేదట చుట్టూపక్క చూడబోదట ఓ ఓ ఓ ఓ ప్రేమను కొలిచే పరికరాలని సాధనాలని ఇంకెవరు కనిపెట్టలేదటా ఓఓ ఓ ఓ ఓ చల్ చల్ ఛలోన ఆ ఊపులోనే ఛలోన ఆ వైపుగానే ఛలోనా ఆపినా ప్రవాహాల పరుగాగునా ఛలోన ఆ ఊపులోనే ఛలోన ఆ వైపుగానే ఛలోనా ఆపినా ప్రవాహాల పరుగాగునా ఈ ప్రేమే ధ్యేయమై వెయ్యేళ్ళ ఆయువై ప్రాణాల వాయువై వెళ్ళాలి వేగమై, వేగమై ఈ ప్రేమే ధ్యేయమై, ధ్యేయమై వెయ్యేళ్ళ ఆయువై, ఆయువై ప్రాణాల వాయువై, వాయువై వెళ్ళాలి వేగమై, వేగమై, హా ప్రేమలో హాయి ఉందో ప్రేమలో బాధ ఉందో ఓ ఓ నిజంగా ఏది ఉన్నా నువ్వే నా ప్రేమ అన్నావో ఓ ఓ ప్రేమను మించే పదము లేదట పదవి లేదట, మందీమార్బలమేమి లేదట, ఓఓ ఓఓ ప్రేమను ఆపే శక్తి లేదట, యుక్తి లేదట మొదలే కానీ పూర్తి కాదట, ఓఓ హో ఓ ఓ చల్ చల్ ఛలోన ఆ ఊపులోనే ఛలోన ఆ వైపుగానే ఛలోనా ఆపినా ప్రవాహాల పరుగాగునా ఛలోన ఆ ఊపులోనే ఛలోన ఆ వైపుగానే ఛలోనా ఆపినా ప్రవాహాల పరుగాగునా నువ్వంటే పరిమళాలు చిందే కవితల పుస్తకానివంటా నీలో మాటమాటాకింకా ఒక్కో ముద్దు ఇచ్చుకుంటా నువ్వంటే పరిమళాలు చిందే కవితల పుస్తకానివంటా నీలో మాటమాటాకింకా ఒక్కో ముద్దు ఇచ్చుకుంటా ఈ ప్రేమే ధ్యేయమై (ప్రేమలో హాయి) వెయ్యేళ్ళ ఆయువై (ప్రేమలో హాయి) ప్రాణాల వాయువై వెళ్ళాలి వేగమై, వేగమై, హా
రామయ్య హే వస్తావయ్యా పాట సాహిత్యం
చిత్రం: జవాన్ (2023) సంగీతం: అనిరుద్ రవిచందర్ సాహిత్యం: చంద్రబోస్ గానం: అనిరుద్ రవిచందర్ , శ్రీరామచంద్ర, రక్షిత సురేష్ రామయ్య హే వస్తావయ్యా అయ్యా హో రామయ్య హే వస్తావయ్యా హో రామయ్య హే వస్తావయ్యా అయ్యా హో రామయ్య హే వస్తావయ్యా హో డాన్స్ విత్ మీ నౌ, ఐ కెన్ బ్రేక్ అవే సిగ్గు ఎగ్గు వదిలేసి, షేక్ అవే షేకవే హద్దు మనకు లేదంటా, ఆన్ ద వే అంతులేని సంతోషం, టేక్ అవే టేక్ అవే వర్క్ లోడు పక్కనెట్టు ఇప్పుడే స్పార్కు నీది బయటపెట్టు ఇక్కడే ఇక్కడే డిస్కో డాన్స్ ఫోజులన్నీ దండగే దేసి డాన్స్ చేసి చూడు పండగే పండగే అప్పుడేమో చయ్యా చయ్యారే ఇప్పుడేమో తతా తయ్యా రామయ్య వస్తావయ్యా రామయ్య వస్తావయ్యా రామయ్య హే వస్తావయ్యా అయ్యా హో రామయ్య హే వస్తావయ్యా హో రామయ్య హే వస్తావయ్యా అయ్యా హో రామయ్య హే వస్తావయ్యా హో రామయ్య వస్తావయ్యా రామయ్య వస్తావయ్యా (టియెనెస్ మి కొడాసోన్) రామయ్య వస్తావయ్యా రామయ్య వస్తావయ్యా (టియెనెస్ మి కొడాసోన్) దడ దడ ఊగిపోని ఫ్లో–రే ఫ్లోరే ధగధగ రేగిపోని ఫైర్ ఫైరే వీడు కానీ వాడు గానీ ఇమ్మెట్యూర్ అనుకొని రెచ్చిపోదాం ఇంకా మోరే స్విచ్చే నొక్కేస్తే చందమామే ఆగిపోతాడులే నైటు నైటంతా చిందులోనే తేలిపోవాలిలే అప్పుడేమో చయ్యా చయ్యారే ఇప్పుడేమో తతా తయ్యా రామయ్య వస్తావయ్యా రామయ్య వస్తావయ్యా రామయ్య హే వస్తావయ్యా అయ్యా హో రామయ్య హే వస్తావయ్యా హో రామయ్య హే వస్తావయ్యా అయ్యా హో రామయ్య హే వస్తావయ్యా హో రామయ్య వస్తావయ్యా రామయ్య వస్తావయ్యా (టియెనెస్ మి కొడాసోన్) రామయ్య వస్తావయ్యా రామయ్య వస్తావయ్యా (టియెనెస్ మి కొడాసోన్)
నల్లాని చీకటిలో పాట సాహిత్యం
చిత్రం: జవాన్ (2023) సంగీతం: అనిరుద్ రవిచందర్ సాహిత్యం: చంద్రబోస్ గానం: దీప్తి సురేష్ ఖైదులో కన్ను తెరిచే కృష్ణుడు నువ్వేరా లోకమే నీ కొరకే ఎదురు చూసేరా ఖైదులో కన్ను తెరిచే కృష్ణుడు నువ్వేరా లోకమే నీ కొరకే ఎదురు చూసేరా నల్లాని చీకటిలో నిదురించే రేపటి పువ్వా, హో ఓ ఓ నల్లాని చీకటిలో నిదురించే రేపటి పువ్వా లాలి లాలి జో జో తెల్లారే వేకువగా విహరించే రెక్కవి నువ్వా లాలి లాలి జో జో బాణమల్లే నువ్వే వెళ్ళాలిరా విల్లులాగ నేనుంటా బంధీఖానాలో బంధం నువ్వా బ్రతికేందుకర్ధం నువ్వా సంకెళ్ళలోని సంతోషం నువ్వా బంధీఖానాలో బంధం నువ్వా బ్రతికేందుకర్ధం నువ్వా సంకెళ్ళలోని సంతోషం నువ్వా, ఓ ఓ ఓ నల్లాని చీకటిలో నిదురించే రేపటి పువ్వా లాలి లాలి జో జో ఖైదులో కన్ను తెరిచే కృష్ణుడు నువ్వేరా లోకమే నీ కొరకే ఎదురు చూసేరా ఆకసం ఆపిందంటే హో ఓ ఓ, ఆకసం ఆపిందంటే ఓ ఓ మెరుపై చీల్చాలిరా ఆ, పర్వతం అడ్డు ఉంటే పిడుగై దూకిపోరా నువ్వు నా ఆశాజ్యోతి అందరికీ కాంతి ధైర్యం అంటే నా పేరే అంటా త్యాగం నీ పేరంటా చనుబాలు చెప్పే పాఠం ఏదంటా లాలి లాలి జో, లాలి లాలి జో జో జో లాలి జో జో జో జో లాలి, లాలి లాలి జో ఓ ఓ నల్లాని చీకటిలో నిదురించే రేపటి పువ్వా లాలి లాలి జో జో ఖైదులో కన్ను తెరిచే కృష్ణుడు నువ్వేరా లోకమే నీ కొరకే ఎదురు చూసేరా
Jawan Title Track పాట సాహిత్యం
చిత్రం: జవాన్ (2023) సంగీతం: అనిరుద్ రవిచందర్ సాహిత్యం: రాజా కుమారి గానం: అనిరుద్ రవిచందర్ , రాజా కుమారి Jawan Title Track
నాతో నువ్వుంటే గలాట పాట సాహిత్యం
చిత్రం: జవాన్ (2023) సంగీతం: అనిరుద్ రవిచందర్ సాహిత్యం: చంద్రబోస్ గానం: నకాష్ అజీజ్, జోనిత గాంధీ, అవిరు నాతో నువ్వుంటే గలాట గొడవే ప్రతి పూట ప్రేమే పుడుతుంటే గలాట తగువే ప్రతి చోట హే గొడవే కాదా షాదీ కి మూలం పడదామా సరిగా ఓ ఓ తగువే చేర్చును తియ్యని తీరం వెళదామా త్వరగా ఇలాగ నాతో నువ్వుంటే గలాట గొడవే ప్రతి పూట ప్రేమే పుడుతుంటే గలాటా తగువే ప్రతి చోటా Advertisement నువ్వు తెలుగు హంసవే తెలుపలేవి హింసవే చిలిపి చంద్ర జ్వాలవే కలికి సూర్య ఛాయవే దివ్యమైన మహిమలున్న ప్రేమ దేవ ధూతవే సోయగాల సైన్యమున్న ప్రేమ యుక్త భూమివే తెగువ తెగువ చూపినావే మగువ జాతి రత్నమా బిగువు బిగువు చూపమాకే అగని తగున రూపమా Advertisement వదిలి వదిలి వెళ్ళమాకే కదిలి నన్ను చేరువ ఎదురు నుదురు ఉండిపోవే నిధుల నిజస్వరూపమా రాణి నేను, నువ్వే నా రాజా జోడి ఎపుడు తాజా తాజా కుస్తి అయిన కౌగిళ్లే అయినా వస్తుందంట ఎంతో మజా Advertisement చిన్న చిన్న తప్పులు హద్దు మీరి నడకలు అందగత్తె ముందర సహజమే కదా ముద్దు ముద్దు శిక్షలు మధురమైన బాధలు పొందుతుంటే అదే సౌఖ్యం కాదా నాతో నువ్వుంటే గలాట గొడవే ప్రతి పూట ప్రేమే పుడుతుంటే గలాట తగువే ప్రతి చోట హే గొడవే కాదా షాదీ కి మూలం పడదామా సరిగా ఓ ఓ తగువే చేర్చును తియ్యని తీరం వెళదామా త్వరగా ఇలాగ గలాట… భలేగా గలాట… ఇలాగా
No comments
Post a Comment