చిత్రం: కమలమ్మ కమతం (1979) సంగీతం: టి.చలపతి రావు సాహిత్యం: వేటూరి కొసరాజు, జాలాది గానం: యస్.పి.బాలు, పి.సుశీల, జానకి, విజయలక్ష్మి శర్మ నటీనటులు: కృష్ణం రాజు, జయంతి, పల్లవి, విజయ లలిత, రామకృష్ణ దర్శకత్వం: ప్రత్యగాత్మ నిర్మాత: ఏ.వి.సుబ్బారావు విడుదల తేది: 01.03.1979
Songs List:
ఏమౌతుంది ఇప్పుడేమౌతుంది పాట సాహిత్యం
చిత్రం: కమలమ్మ కమతం (1979) సంగీతం: టి.చలపతి రావు సాహిత్యం: వేటూరి గానం: యస్.పి.బాలు, పి.సుశీల ఏమౌతుంది.... యిప్పు డేమౌతుంది ఇటా ఇట్టిట్టా యిది ఎందాకా పోతుంది అహ .... నాకు తెలీక అడుగుతాను పిల్లగాడి రిమరిమలు పులిహోర ఘమఘమలు.... పిల్లగాడి .... పిల్లదాని చెక్కిళ్ళు నా చెక్కర పొంగళ్ళూ.... పిల్లదాని.... ఆకేసి వడ్డిస్తా అవుపోసన పడతావా.... ఆ కేసి.... అవుపోసన ఆనక చూద్దాం ఆరగింపు మొదలెడతా ఆరగింపు మొదలెడతా.... అవుపోసన.... గోవిందా గోవిందా ఏందయ్యా ఆచార్లూ ఏం జరిగింది అబ్బా చెయ్యి కడిగేశాడండీ ఎట్టా యిప్పుడేమౌతుందయ్య రావే అరకు రాణీ నీకు చేస్తానే వలపు బోణీ రారా నా రాజ నిమ్మలపండు నిన్ను రమ్మంది నా తల్లో మల్లెచెండు రారా .... పట్టా రాసిస్తావా కమలమ్మా నీ కమతం పట్టా... అడగాలా రామయ్య నువ్వు అడగాలా నన్ను అడగాలా యీ కొండ్రంతా నీ సొంతం ఈ కొండ్రంతా నీకే సొంతం పోయిందయ్యో పోయింది ఏంటా గోల కమ్మలమ్మా పోయింది కమతమూ పోయిందీ అహ యిప్పుడే మౌతుంది మేడెత్తు ఎదిగావు కోడెగాడా నీకే ఓటిచ్చుకుంటాను అందగాడా వయ్యారి కమలమ్మా వలపుల్లో గెలిపిస్తే నిన్నేలు కుంటానే కుతితీరా ఎన్నికలలో ఎందరెన్ని కలలోకన్నా ఎన్నికలలో : ఏనాటికీ నువ్వే ప్రెసిడెంటువి నా ప్రెసిడెంటువి.
అత్తకూతురా చిట్టి మరదలా పాట సాహిత్యం
చిత్రం: కమలమ్మ కమతం (1979) సంగీతం: టి.చలపతి రావు సాహిత్యం: జాలాది గానం: యస్.పి.బాలు, పి.సుశీల హోయ్ హోయ్-హోయ్. అత్తకూతురా చిట్టిమరదలా కొత్త చీరలో నిన్ను చూస్తుంటే ఏదో అవుతాదే యెర్రెత్తి పోతాదే ఏదో అవుతాదే యెర్రెత్తి పోతాదే హోయ్ మేనత్త కొడకా మీసాల బావా కోడె గిత్తలా కుమ్ముకొస్తుంటే గుబులెత్తి పోతాదే గుండెగిరి పడతాదే గుబులెత్తి పోతాదే గుండెగిరి పడతాదే నీ చిలిపి కౌగిళ్ళే నా చలువ పందిళ్లు నీ గుండె లోగిళ్ళే నా నూరేళ్ళ సిరులూ నా వయసులోని బిగువు నీ అడుగులోని బరువు చూసి చూసి కళ్ళు రెండు సోలి పోతున్నాయ్ కళ్ళంటే కళ్ళా అవికలువ పువ్వుల్లా - కళ్ళంటే..... వొళ్ళంటే వొళ్ళా అది దొంతు మల్లెల్లా హాయ్.... హాయ్ - హాయ్ ఆ నడక చూస్తుంటే - నీ నడుము వూగుతుంటే ఆ నడక .... తిమ్మిరి తిమ్మిరి జింగిరి బింగిరి అవుతోందే పిల్లా హేయ్ అత్తకూతురా ! కల్ల బొల్లి మాటలంటే కప్పచేత కరిపిస్తా అయ్య బాబోయ్ అల్లరి చేశావంటే పుట్టి నింటికె ఎల్లిపోతా ఎల్లిపో కల్లబొల్లి మాటలంటే కప్పచేత కరిపిస్తా అల్లరి చేశావంటే పుట్టినింటికె ఎల్లిపోతా తాళికట్టి నెత్తిమీద తలంబ్రాలు పోస్తా తాళికట్టి.... పల్లకీలో నీ పక్కన వూరేగుతు వస్తా తిక్క రేగిందంటే ఏంటా పోర్సు బుగమేట్లో దూకేస్తా నిన్ను దాటి యేరుదాటి దాటి దాటి ఏం చేస్తావ్ నీకు సవితిని తెచ్చేస్తా ఎట్టా - ఎట్టా నిన్ను దాటి యేరు దాటి నీకు సవితిని తెచ్చేస్తా నిన్ను దాటి.... నీకు సవితిని తెచ్చేస్తా నీకు సవితిని తెచ్చేస్తా
ఇంటి ముందు ఈత చెట్టు పాట సాహిత్యం
చిత్రం: కమలమ్మ కమతం (1979) సంగీతం: టి.చలపతి రావు సాహిత్యం: కొసరాజు గానం: విజయలక్ష్మి శర్మ , యస్.పి.బాలు ఇంటి ముందూ యీత సెట్టూ ఇంటి ఎనకా తాడి సెట్టూ ఇంటిముందూ .... యీత పెట్టూ యిల్లు కాదూ తాడి సెటూ తల్లి కాదూ తగులు కోనోడే మొగుడౌతాడా ఆచారీ — ఓ ఆచారీ ముద్దుల ఆచారీ - గుళ్ళో పూజారీ అట్టాగా అట్టయితే యిదికూడా ఇనుమరి ఆ....వూరి ముందర వుల్లితోట వూరిబైట మల్లితోట వుల్లి తల్లి అవుతుందా మల్లె మందు కొస్తుందా.... మూడు ముళ్ళస్తేనే మొగుడౌతాడా! చుక్కా ... చుక్కా .... చుక్కా చల్లని గంధపు చెక్కా....ముద్దుల ముద్దుల చుక్కా .... చుక్కా .... చుక్కా తీయని కొబ్బరిముక్కాముక్కముక్కముక్క హద్దు యిడిసిన ఆడదానికి పద్దులు రాసి పెట్టడానికి .... హద్దు మొగుడో మొద్దులో ఎవడో ఒకడుండాలి. నాలాంటి వాడెవడో అండగా నిలవాలి అయితే ఒక పని చేత్తా ఏంటీ పగటిపూట నా పక్కన బజారెంట వస్తావా ఆచారీ కొంపలంటుకు పోతాయమ్మో -- ఆచారీ పూజారీ వూరి ముందర వుల్లితోట వూరి... ఉల్లి తల్లి అవుతుందా మల్లె మందుకొస్తుందా మూడు ముళ్ళేస్తేనే మొగుడౌతాడా.. చుక్కా - చుక్కా- చుక్కా చల్లని గంధపు చెక్కా ముద్దుల ముద్దుల చుక్కా తీయని కొబ్బరి ముక్కా సల్ల సల్లగా పక్కన చేరి సరిగమలే - వాయించుకుంటే అయ్యబాబోయ్ సల్ల సల్లగా పక్కన చేరి, సరిగమలే - వాయించుతుంటే పరువు మర్యాదా పందిరెక్కి కూచుందా నడి బజారులో మాత్రం నామోషీ వచ్చిందా అమ్మమ్మమ్మమ్మో తప్పు అంత మాటనకే చుక్కా-చుక్కా-చుక్కా చల్లని గంధపు చెక్కా ముద్దుల ముద్దల అబ్బ చుక్క తీయని కొబ్బరి ముక్కా - - ఇంటిముందు ఇంటి ముందూ యీత సెట్టూ ఇంటి వెనకా- తాడి సెట్టూ ఈత సెట్లూ ఇల్లుకాదూ తాడి సెట్టూ తల్లి కాదూ తగులు కొన్నోడే మొగుడౌతాడా ఆచారీ - ఓ ఆచారీ ముద్దుల ఆచారీ - - గుళ్ళో పూజారీ -- ఊరు పేరూ ఉన్నవాణ్ణి ప్రెసిడెంటుకి కుడిభుజాన్ని హోయ్ : ఊరూ పేరూ.... కొండమీద కోతినైనా తెప్పించే గొప్పోణ్ణి గుడిలో దేముడికే నామం పెట్టేవోణ్ణి... కొండమీద ఆ యింకా చెప్పనా మన గొప్ప.... పేరు గొప్ప ఊరు దిబ్బ ఆపవయ్య సొంతడబ్బా - ఆశారీ... ఓ ఆశారీ .... ముద్దుల ఆచారీ .... ఆశారీ.... ఆశారీ - పూజారీ యింటి ముందూ ఈత సెట్టూ యింటి వెనకా తాడి సెటూ ఈత సెట్టూ ఇల్లు కాదూ తాడి సెట్టూ తల్లికాదు తగులుకున్నోడే మొగుడౌతాడా ఆచారీ ఓ ఆచారీ ముద్దుల ఆచారీ....గుళ్ళో పూజారీ
నిమ్మ చెట్టుకు నిచ్చెనేసి పాట సాహిత్యం
చిత్రం: కమలమ్మ కమతం (1979) సంగీతం: టి.చలపతి రావు సాహిత్యం: కొసరాజు గానం: యస్.జానకి నిమ్మచెట్టుకు నిచ్చేనేసి నిమ్మపళ్ళు కొయ్యబోతే నిమ్మముళ్లు రోమ్మునాటెనురా. హాయ్ హాయ్ హాయ్ హాయ్ నిమ్మముళ్ళు రొమ్ము నాటెనురా ఓ రందగాడా సన్న రైక సగం చిరెగెనురా రెకెందుకు చిరిగిందని కొప్పెందుకు చెదిరిందని రై కెందుకూ........ అత్తముందూ అంద రడిగితే ఆ - అడిగితే ఏమైందట ఆ - చెప్పడాని కేముందిరా ఆ - చెప్పడానికేముందిరా ఓరందగాడా - సిగ్గు ముంచుకొస్తుందిరోయ్.. నిమ్మచెట్టుకు.. చెలమయ్యా చేనుకాడ నిన్ను తలచుకుంటూ కూచునుండే చెలమయ్యా చేను .... ఈల వేసి.... నన్ను పిలిచి చెంగుపట్టి లాగావనీ వూరు నోరు.... వూరు నోరూ చేసుకొందిరా వూరు నోరు చేసుకొందిరా ఓ రందగాడా తూరుపార పట్టిందిరా హాయ్ .... హాయ్..... నిమ్మచెట్టుకు... మావ కొడకా వస్తావని మంచమేసి కాసుకుంటే మావకొడకా.... ఇంటిపక్క ఎంకటేసు చెమ్మ చెక్కలాడి ఆడి ఆడి ఆడి అబ్బా ఎవరితోటి చెప్పుకుందురా ఎవరితోటి ఓ రండగాడ యీది పాలు చేశావురో నిమ్మచెట్టుకు
తొలిసారి మొగ్గేసింది పాట సాహిత్యం
చిత్రం: కమలమ్మ కమతం (1979) సంగీతం: టి.చలపతి రావు సాహిత్యం: వేటూరి గానం: పి.సుశీల, యస్.పి.బాలు తొలిసారి మొగేసింది సిగ్గూ -పాడుసిగ్గు తొలిసారి.. ఆ సిగ్గే మొగై పిండై కాయై సండై అమ్మో కోకకొత్త బరువేసింది రైక కాస్త బిగు వేసింది కోకకొత్త .... ఆ సూపే సిటుకూ సిటుకూ గుండెలో దరువేసింది నాకు సిగ్గేసింది.... తొలిసారి మొగ్గేసింది ....... కొత్తగా చూసిందేముంది సరికొత్తగా చూడని దేముంది కొత్తగా చూపూ చూపూ కలిసింది. అది చుట్టరికం — కలిపేసింది. చూపూ చూపూ.... నీ చూపుల రాపిడిలో సిగ్గుకే సిగ్గేసింది.. సిగ్గే మొగ్గేసింది..... తొలిసారి మొగ్గేసింది సిగ్గుః పాడు సిగ్గుః .... దాచినా దోచని దేముంది నువ్వు దోచితే దొరకని దేముంది, దాచినా గువ్వకు గువ్వే దొరికింది తన గుండె గూడుగా మలచింది తొలిరాతిరి తెలారగానే నెలవంక కనిపించింది. నెల యింక తప్పిస్తుంది.. తొలిసారి మొగ్గేసింది ఎనక జన్మ ఒక పులకింత అది తలుచుకుంటే గిలి ఒళ్ళంత.... ఎనక జన్మ.... ముందు జన్మ తెలియని వింత అది వుందో లేదో తేలన చింత ముందుజన్మ.... ఈ జన్మల వూసులు వింటే ఎందుకో నవొచ్చింది తొలిసారి మొగ్గేసింది సిగ్గూ.... పాడు సిగూ....
No comments
Post a Comment