Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Kolleti Kapuram (1976)




చిత్రం: కొల్లేటి కాపురం (1976)
సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు 
సాహిత్యం: శ్రీ శ్రీ, ఆరుద్ర, సుగంబాబు, రాజా శివానంద్ 
గానం: పి.సుశీల, యస్.జానకి, సి.విజయలక్ష్మి, యస్.పి.బాలు, గోపాలం, అనుపమవిల్సన్, పూర్ణచంద్రరావు, ఎస్.కె.రవి
నటీనటులు: కృష్ణ, ప్రభ 
మాటలు: రాజా శివానంద్ 
దర్శకత్వం: కె. బి.తిలక్ 
నిర్మాతలు: గుమ్మడి శ్రీమన్నారాయణ, కొల్లిపర కృష్ణారావు 
విడుదల తేది: 15.09.1976



Songs List:



అంబా పరాకు దేవీ వరాకు పాట సాహిత్యం

 
చిత్రం: కొల్లేటి కాపురం (1976)
సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు 
సాహిత్యం:  శ్రీ శ్రీ
గానం: యస్.పి.బాలు

అంబా పరాకు దేవీ వరాకు
కొల్లేటి మా పెద్దింటమ్మా పరాకు 

వలచి వచ్చిన వేల్పు ముమ్మొన 
వాలు దాల్పున రాణివై తివి 

కొలుచు వారల కరుణ నేలగ
వెలసి మా జలదుర్గ వైతివి 

అంబా పరాకు దేవీ పరాకు
కొల్లేటి మా పెద్దింటమ్మా పరాకు



ఇదేనండి ఇదేనండి పాట సాహిత్యం

 
చిత్రం: కొల్లేటి కాపురం (1976)
సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు 
సాహిత్యం:  శ్రీ శ్రీ
గానం: యస్.జానకి, గోపాలం

ఇదేనండి ఇదేనండి భాగ్యనగరం 
ముప్పేటల తెలుగువారి ముఖ్య పట్టణం 
అలనాడు పాలించెను కులీ కుతుబ్ షా 
భాగమతి అతని యొక్క ముద్దుల దేవి 
ప్రేయసికై కట్టినాడు పెద్ద ఊరు 
ఆ ఊరే ఈనాడు హైదరాబాదు 

సరసులు, చతురులు, సాహసవంతులు 
చదువులలో పదవులలో పారంగతులు 
ఎందరో మహనీయులున్న సుందరనగరం 
భరతమాత జడలోని పసిడి నాగరం



ఎల్లారే నల్లామాను పాట సాహిత్యం

 
చిత్రం: కొల్లేటి కాపురం (1976)
సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు 
సాహిత్యం:  ఆరుద్ర
గానం: పి.సుశీల, యస్.పి.బాలు, అనుపమవిల్సన్

హైలేసా హైలేసా హైలేసా
హైలేసా హైలేసా హైలేసా
హైలేసా హైలేసా హైలేసా
ఎల్లారే నల్లామాను ---- హైలేసా బైలేసా
అంతరాల పడవమీద - హెలేసా బైలేసా 
అందిపువ్వులు కొయ్యాబోతే 
కొమ్మావంగి కొప్పూనిండే

ఎల్లారే చల్లాగాలి – హైలేసా . బైలేసా
పడుచూ చిలకలు పడవయెక్కె - హైలేసా బైలేసా

ఆ గడుసూ తలపులు గంతులువేసె
చల్లాగాలి అల్లరిచేసె
కోడె వయసు ఐసో డై సో 
ఆడపిల్ల లు - సేసో సేసో
కోడె వయసు - ఐసో బె సో 
ఆడపిల్లలు - సేసో సేసో 
జట్టూకట్టి - బ్యూటీ బ్యూటీ 
జాతర కెళితే - నాటీ హాటీ
కొంటెవాడు వెంటాపడెను
కొక్కిరాయి వెక్కిరించె
కుఱ్ఱడేమొ కన్నెఱజేస్తే
వెట్టివాడు తుర్

కోరచూపు - హైలేసా 
ఆ - కోపగించె - బైలేసా 
ఆయ్ - కోరచూపు - హైలేసా 
కోపగించె - బై లేసా
ఆ - ఓరా చూపు - హైలేసా 
ఓయనిపించే - బై లేసా
ఆ కన్ను కోపం, ఈ కన్ను తాపం 
ఏం చెయ్యాలో తోచదు పాప
దోరవయసు తొందరచేస్తే
ఉక్కిరి బిక్కిరి చక్కిలి గింత

చక్కని చుక్క - బ్యూటీ బ్యూటీ
ఫక్కున నవ్వె - నాటీ హాటీ
చక్కని చుక్క - బ్యూటీ బ్యూటీ 
ఫక్కున నవ్వే - నాటీ హాటీ
చక్కని చుక్క - బ్యూటీ బ్యూటీ 
ఫక్కున నవ్వె - నాటీ హాటీ
అది చూసి హీరో – ఐసో బైసో
జోరంత తగె - సేసో సేసో

మంచి తెలియక మాట్లాడుతుంది 
మాట కలిపితే కాట్లాడుతుంది
మాటచాటున మమత ఉందని
మనసు కలిపితే మచ్చికౌతుంది




నాచు కప్పియు రమ్యమే పాట సాహిత్యం

 
చిత్రం: కొల్లేటి కాపురం (1976)
సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు 
సాహిత్యం:  శ్రీ శ్రీ
గానం: పూర్ణచంద్రరావు

నాచు కప్పియు రమ్యమే నళిన సుమము 
కప్పు కల్గియు నొప్పారు కలువరేడు
తరుణి జిగి మించె వల్కల ధారణమున 
పొలతి మిన్నల కెవిగావు భూషణములు 
పొలతి మిన్నల కెవిగావు భూషణములు




ఇద్దరమే - మనమిద్దరమే పాట సాహిత్యం

 
చిత్రం: కొల్లేటి కాపురం (1976)
సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు 
సాహిత్యం:  శ్రీ శ్రీ
గానం: యస్.పి.బాలు

ఇద్దరమే - మనమిద్దరమే, ఇద్దరమే 
కోలేటి కొలనులో - కులికేటి అలలమై 
వలపించే భావాల - వెలలేని కలలమై

తొలిసంజ వెలుగులో - కలువ పూబాటలా 
తొలిసంజ వెలుగులో - కలువ పూటలా 
వికసించే ఎదలతో విడిపోని జంటగా
విడిపోని జంటగా

గరిమాగు పొదలలో పరువంపు దోనెలో
గరిమాగు పొదలలో పరుపంపు దోనెలో
కువ కువల పిలుపులో పులకించే పాటగా

సరితోడు నీడగా పలికింది చేతగా
సరితోడు నీడగా పలికింది చేతగా
పదిమంది కోసమే బతకాలి నీతిగా
బ్రతకాలి నీతిగా....




చీలిపోయెను మనసులూ పాట సాహిత్యం

 
చిత్రం: కొల్లేటి కాపురం (1976)
సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు 
సాహిత్యం:  శ్రీ శ్రీ
గానం: పూర్ణచంద్రరావు

చీలిపోయెను మనసులూ
చెదరిపోయేను మమతలూ
ఎడ పెడ దారుల పయనంలో
ఇరువురి గమ్యం ఒకటే అయినా 
మరల కలయిక ఏనాడో ....




తప్పు తప్పు తప్పు పాట సాహిత్యం

 
చిత్రం: కొల్లేటి కాపురం (1976)
సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు 
సాహిత్యం:  శ్రీ శ్రీ
గానం: యస్.జానకి, ఎస్.కె.రవి

తప్పు తప్పు తప్పు
అదిగో అదే తప్పు
అలా చూడడం తప్పు - ఇలా చేయడం తప్పు 
తప్పనుకుంటే అంతా తప్పే.
లలల. లలల....

ఆడదాన్ని ఆస్తి లాగ వాడడమే తప్పు 
ఎదిరించినదాన్ని రచ్చ కీడ్చడమే ఒప్పు 
కప్పవలసిన చీర విప్పడమే తప్పు 
కప్పవలసిన చీర విప్పడమే తప్పు 
తప్పును ఒప్పుగా చూపే వాళ్ళకే మెప్పు 
అదే మా గొప్ప
యా .... యా
నాచో నాచో గోరీ మేరి ప్యారీ
నాచో నాచో గోరీ మేరి ప్యారీ 
ఈయ్య....
తెలిసి తెలివి కానిపనులు చేసేవారంతా
తెలివిగ దైవం చాటున దాగడమే వింత

మనలోనే ఎందరో తెగబడి చేసే తప్పు 
మనలోనే ఎందరో తెగబడి చేసే తప్పు 
సమాజానికే తీరని అప్పు
తప్పుమీద తిరుగుబాటు చేయడమే ఒప్పు
యా .... చూ ....
ఈయ్య....





సత్యమే నిత్యమూ సిద్ధన్నా పాట సాహిత్యం

 
చిత్రం: కొల్లేటి కాపురం (1976)
సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు 
సాహిత్యం:  శ్రీ శ్రీ
గానం: ఎస్.కె.రవి

సత్యమే నిత్యమూ సిద్ధన్నా 
సర్వమూ తెలిసేను సిద్దన్నా 
మంచి మర్మములేవొ సిద్దన్నా 
తెలియజెప్పర నీవు సిద్ధన్నా 
పొంచి దాగితె నిన్ను సిద్దన్నా 
ఎంచి దొంగంటారు సిద్దన్నా 
పడగెత్తి సర్పాలు సిద్దన్నా 
పడగొట్టనున్నాయి సిద్ధన్నా 
బుట్టలో పెట్టాలి. సిద్ధన్నా 
పట్టి బుట్టలో పెట్టాలి సిద్దన్నా
చెప్పలేడూ మాట సిద్దన్నా 
చేసి చూపేవాడు సిద్దన్నా 
మనసు కలిగుంటాడు సిద్దన్నా 
మిత్రుడే వీడెపుడు సిద్దన్నా 
తిన్ననీ వారేదో సిద్దన్నా 
చెన్నడే చూపాడు సిద్దన్నా
నీ చెన్నడే చూపాడు సిద్దన్నా 
మంచివారికి మంచి సిద్దన్నా 
తోడు నీడాతుండి సిద్దన్నా 
మంచిగా నను నమ్ము సిగన్నా




ఆరిజెల్లా - బేరిమోత పాట సాహిత్యం

 
చిత్రం: కొల్లేటి కాపురం (1976)
సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు 
సాహిత్యం:  ఆరుద్ర
గానం: యస్.జానకి

ఆరిజెల్లా - బేరిమోత
ఆరిజెల్లా - బేరిమోత
నత్తగుల్లా - నాచుపీత
లల్లలాలాలాలలల్లలా
లల్లలాలా లాలలల్లలా

సూడబోతె మట్టగిడస - పట్టబోతే బొమ్మిడాయి
పట్కొ....పట్కొ.... పట్కొ.... ఆ పట్కొ.... ఆ పట్కొ
ఆ పట్కొ.... పట్కొ.... పట్కొ... పల్కొ.... పట్కొ.... 
మన కొల్లేటి లంకల్లో జాబు
గుడ్డికొంగ లెన్నో ఉన్నాయి బాబు
దిక్కులేని సేపల్ని కొక్కిరాయి మింగబోతె
ఎండ్రకాయ ఒకటి వచ్చి ఏకంగా గొంతుపట్టె
సిన్న సిన్న పురుగుల్ని మెలిమెల్లిగా తింటు 
సిన్న పేప బతుకుతాడి బాబూ 
దాన్ని పెద్దసేప మింగుతాది బాబూ  ॥మన కొల్లేటి॥

ఆ పెద్దసేప నోటికేమొ - సిన్నపురుగు నెఱసూపి 
గడుసోడు గాలమేసి ఒడుపుగాను పడతాడు - 
లేనోళ్ళ ఉసురుగొడితే బాబూ
అయ్యొలోకాలె చల్లంతు బాబూ
లల్లలాలాలాలలల్లలా
లల్లలాలా లాలలల్లలా

మోసగాళ్ళ బతుకుమీన బుడమేరు పొంగకుంటె 
మచ్చావతారు డొచ్చి, మంచిబుద్ధి సెప్తాడు





ఎవ్వారే .... యవ్వా... పాట సాహిత్యం

 
చిత్రం: కొల్లేటి కాపురం (1976)
సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు 
సాహిత్యం:  రాజా శివానంద్ 
గానం: సి.విజయలక్ష్మి, ఎస్.కె.రవి, అండ్ పార్టీ 

ఎవ్వారే .... యవ్వా...
ఎవ్వారే యవ్వా - ఇనుకోవే గువ్వా 
నేల దున్నే యేల నెలవంక పొడిచింది 
అహ – జనక రాజింటిలో సీతమ్మ వెలిసింది 
శివుని విల్లూ విరిసి సీతమ్మనే పట్టె
పట్టమూ గట్టంగ పట్టు పట్టి కైక 
నార బట్టల తోడ నట్టడవి కంపె 
వనములో సీకమ్మ పంటరిగనుండ
పది తలల రేడు పరమనీచుడు వాడు 
బిచ్చమంటూ వచ్చి బింకమూ సూపి 
లంకకే చేర్చెను, అకళంక సీతను





ఏలేమాలి - ఏలేమాలి పాట సాహిత్యం

 
చిత్రం: కొల్లేటి కాపురం (1976)
సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు 
సాహిత్యం: సుగం బాబు
గానం: యస్.పి.బాలు, అనుపమవిల్సన్, సి.విజయలక్ష్మి, ఎస్.కె.రవి, అండ్ పార్టీ 

ఓ.... ఓ.....
ఏలేమాలి - ఏలేమాలి
ఏటీమీనా - ఓరూగాలి
ఎటీవారా - ఏపా సెట్టూ

ఎక్కీసూ త్తే - ఎఱ్ఱాకోట
తిప్పండి ఒడిశేలా – కొట్టండి ఉసిగా

పట్టండి కొడవళ్ళూ - ఎత్తండి కసిగా 
సర్రూన కొడవళ్ళు - పరవళ్ళు తొక్కాల 
సర్రూన కొడవళ్ళు - పరవళ్ళు తొక్కాల 
సెయ్యిదాటకుండ - పంట పోగెయ్యాల 
తుంచి పారెయ్యాల - చీడపట్టిన ఆకు
చీడపట్టిన ఆకు 
కొట్టిపారెయ్యాల - చేనుమింగే కంచె
చేనుమింగే కంచె
తూటు కాడల్లాగ డొంక తిరుగుడు పెట్టు
దొంగనాయాళ్ళనీ.... తుంగలో తొక్కాల 
దొంగనాయాళ్ళనీ - తుంగల్లో తొక్కాల 
నాచు పీచుల్లాంటి - నాలిముచ్చుల్ని 
నా లిముచ్చుల్ని 
మాటు గర్లుగట్టి - మావుల్లో బట్టాల మావుల్లో బట్టాల
నెప్పి తెలవా కుండ - నెత్తురేపీల్చేటి 
నల్ల జలగల బట్టి నిప్పుల్లో ఎయ్యాలా
పంటలే కాజేసి పరిగలే మనకిచ్చి
కొవ్వెక్కి కులికేటి ... పందికొక్కుల బట్టి 
బంతినా కటేసి ఒలియె ఒలియో
బంతినా కచేసి ఒలియె ఒలియో అని
నూర్పిళ్ళు సాగించి తూర్పార బట్టాల
ఏలేమాలీ ఓరూగాలీ
ఏలేమాలీ ఓరూగాలీ

No comments

Most Recent

Default