చిత్రం: కోరికలే గుర్రాలైతే (1979) సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం సాహిత్యం: ఆత్రేయ, డా॥ సి. నారాయణరెడ్డి, కొసరాజు, దాసం గోపాలకృష్ణ గానం: పి.సుశీల, యస్.పి.బాలు, యస్.జానకి, వసంత నటీనటులు: మురళీమోహన్, చంద్రమోహన్, మోహన్ బాబు, కాంతారావు, ప్రభ, జయలక్ష్మి, రమాప్రభ దర్శకత్వం: దాసరి నారాయణరావు నిర్మాత: జి. జగదీష్ చంద్ర ప్రసాద్ విడుదల తేది: 12.01.1979
Songs List:
కోరికలే గుర్రాలైతే (Female Version) పాట సాహిత్యం
చిత్రం: కోరికలే గుర్రాలైతే (1979) సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం సాహిత్యం: ఆత్రేయ గానం: పి.సుశీల కోరికలే గుర్రాలయితే ఊహలకే రెక్కలు వస్తే అదుపేలేని మనసునకు - అందని స్వర్గం ఏముంది తన యింట సిరితోట పూచేనని - తనదారి విరిబాట అయ్యేనని దినదినము తియ్యన్ని పాటేనని - తాగన్న కలలన్ని పండేనని సరదాలన్నీ చని చూడాలని సంబర పడుతుంది. సంపదలన్నీ తనకే గలవని పండుగ చేస్తుంది. జాబిల్లి తనకున్న విడిదిల్లని వెన్నెల్లు పన్నీటి జలకాలని హరివిల్లు రతనాల జడబిళ్ళని తారకలు మెడలోని హారాలని ఆకాశాన్ని దాటేయాలని నిచ్చెన వేస్తుంది ఈ లోకాలన్ని గెలిచేయాలని ముచ్చటపడుతుంది
రే రే రేక్కాయలో పాట సాహిత్యం
చిత్రం: కోరికలే గుర్రాలైతే (1979) సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం సాహిత్యం: దాసం గోపాలకృష్ణ గానం: యస్.జానకి రే రే రేక్కాయలో - ఆ రే రే రేక్కాయలో సందకాడ సిన్నోడు సందుకాశాడే సంతసేసి వస్తావుంటే సరసమాడాడే బటానీల కోకమీద సిన్న సిటిక వేశాడే సింతపువ్వ రైకమీద సెయ్యేశాడే. తల్లోకి మల్లెపూల దండంపాడే మెళ్ళోకి సెంద్రహారం గొలుసంపాడే పట్టెమంచం పై కెమొ పరుపంపాడే గదిలోకి అగరొత్తుల కట్టంపాడే వంటకెమొ సన్నబియ్యం సంచులంపాడే కూరకేమొ కొర్రమీను సేపలంపాడే మంగళగిరి తిరణాళ్ళకి నన్ను తీసికెళ్ళాడే రంగులరాట్నం ఎక్కించి రంగు సేశాడే
మనసే మన ఆకాశం పాట సాహిత్యం
చిత్రం: కోరికలే గుర్రాలైతే (1979) సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి గానం: పి.సుశీల, యస్.పి.బాలు మనసే మన ఆకాశం - మనమే రవి చంద్రులం ఇటు రేయి అటు పగలు - ఒకటై వెలిగే ప్రేమికులం చందమామ నువ్వంట - వెన్నెల్లే నువ్వంట సూరేడి వెచ్చనీ నీరెండె నువ్వంట నీ మాట అనుకుంటె మాటలే రావంట మాటల కందని మనిషివి నువ్వంట మనుషుల కందని మమతే నువ్వంట నీకు నీ వారుంటె నా కోసం నువ్వంట ఏ ఏటి ఒడునా ఇల్లేల మనకంట ఈ ఒంటివానికి నీ జంట ఇల్లంట ఆ యింట గోరంత దీపమై నేనుంట గోరంత దీపానికి ఇల్లంత వెలుగంట కొండంత దేవుడికి కోవేలే నేనంట
సలామలేకుం రాణి పాట సాహిత్యం
చిత్రం: కోరికలే గుర్రాలైతే (1979) సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి గానం: పి.సుశీల, యస్.పి.బాలు సలాం లేకుం రాణి | నీ గులాము నౌతాను ముత్యాల పల్లకిలోన నిను మోసు కెళుతాను సలాం లేకుం రాజా ! నీ గులాము నౌతానునువు మోసుకెళితే నిన్నే : ఎగ రేసు కెళుతాను ! మరుమల్లె లెందుకులే - నీ చిరునవ్వులే వుంటే కరిమబ్బు లెందుకులే - నీ కురుల నీడలే వుంటె నీ - జడలోన ఒదిగున్న విరజాజిని ఓ - జవరాలా నీ ప్రేమ పూజారిని బృందావనినే వలవుల ముంగిట నాటాలనీ స్వర్గ సుఖాలన్ని ప్రియుని సందిట చూడాలని నా కనులార కలగంటి ఇన్నాళ్ళుగా ఆవి కనుగొంటి ఈనాడు నీ తోడుగా
ఏమి వేషం ఏమి రూపం పాట సాహిత్యం
చిత్రం: కోరికలే గుర్రాలైతే (1979) సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం సాహిత్యం: కొసరాజు గానం: యస్.పి.బాలు, వసంత ఏమి వేషం - ఏమి రూపం ఆహా కథానాయకీ సావిత్రీ ఐ లవ్వూ ! నచ్చినానా - మెచ్చినావా ఓహో ఆశదీర్చలేవా ధర్మరాజా ! ఐ లవ్వూ నిన్నటి నాటుపిల్ల యీ-నాడు బలే రసగుల్లా ఒక్క ఛాన్సు యిచ్చిచూడూ దులిపేస్తా నీతోడూ సరి సరి - నాకు తెలుసు నీలో వున్న సరుకు యిక - పెరుగులే మార్కెట్టు సావిత్రీ ఐ లవ్యూ ఒకసారి పై కిదెస్తే జన్మంతా రుణపడి వుంటా రేయి పగలు కృషి చేస్తా ఒకదారి నీకు చూపిస్తా చూడు చూడు కోతి మూకల్ని నవ్వు తుండే ఆ వెధవల్ని ఏవరెటు చస్తే మనకేమీ లవ్యూ - సావిత్రి ఒహో
కోరికలే గుర్రాలైతే (Male Version) పాట సాహిత్యం
చిత్రం: కోరికలే గుర్రాలైతే (1979) సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం సాహిత్యం: ఆత్రేయ గానం: యస్.పి.బాలు కోరికలే గుర్రాలయితే ఊహలకే రెక్కలు వస్తే మనిషికి మతిపోతుంది బ్రతుకే శృతి తప్పుతుంది నేలవిడిచి సాము చేస్తే మూతిపళ్ళు రాలుతాయి కళ్ళు నెత్తి కొచ్చాయంటే కాళ్ళు కొట్టు కుంటాయి గాలి కోటలు కట్టాపు అవి కూలి తలపై పడ్డాయి చివరి మెట్టు పైకెక్కావు చచ్చినట్టు దిగమన్నాయి పులినిచూచి నక్కలాగ వేసుకొంటివి వాతలు రాజు నెప్పుడోచూసి మొగుడికి పెట్టినావు వంకలు అప్పు చేసిన పప్పుకూడు అరగదమ్మా వంటికి జుట్టు కొద్ది పెట్టిన కొప్పె అందం ఆడదానికి
No comments
Post a Comment