చిత్రం: లక్ష్మణ రేఖ (1975) సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం నటీనటులు: చంద్రమోహన్, మురళీమోహన్, జయసుధ దర్శకత్వం: ఎన్.గోపాల కృష్ణ నిర్మాతలు: పి.యం.షణ్ముగం, ఏ.వి.కృష్ణారావు విడుదల తేది: 12.09.1975 (జయసుధ గారికి హీరోయిన్ గా ఇది మొదటి తెలుగు సినిమా)
Songs List:
ఒకమాట ఒ కేమాట పాట సాహిత్యం
చిత్రం: లక్ష్మణ రేఖ (1975) సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి గానం: పి. సుశీల, యస్.పి. బాలు పల్లవి: ఒకమాట ఒ కేమాట వలచే రెండు హృదయాలు ఒదిగే తీయని కౌగిలిలో ఒకటై ఉన్నచోట చరణం: 1 ప్రతి నిమిషం జతగా నే ఉండాలనీ బ్రతుకంతా మధురిమలే నిండాలనీ చిలిపిగ వీచే చిరుగాలి నా చెవిలో అన్న వేళ చరణం: 2 అరవిరిచే తొలివయసే నీ దేనని అది చిలికే అనుభవమే నాదేనని కలువల రేకుల తలదన్నే నీ కనులే అన్న వేళ చరణం: 3 ఊహలలో ఊపిరిలో ఉన్నావని నా వలపూ నావరమూ నీవేననీ లా పైన బాస చేసి నా మనసే అన్న వేళ
నాడు లక్ష్మణ రేఖ పాట సాహిత్యం
చిత్రం: లక్ష్మణ రేఖ (1975) సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం సాహిత్యం: సముద్రాల గానం: యస్.జానకి నాడు లక్ష్మణ రేఖ దాటిన ఫలితమే నేడు నేనూ అను భవించే నరకమూ కన్న తండ్రిని కాదనీ నే కదలివచ్చిన ఫలమిది కన్ను కానక వలచినందుకు తగిన శిక్షే నాకిదీ ఎండమావిని ఏరని భ్రవియింది ముందుకుసాగితే ఏటికీ ఎదురీదితే నాలాంటి కన్నెలకీగతే
నీదాననురా నీ నీడనురా! పాట సాహిత్యం
చిత్రం: లక్ష్మణ రేఖ (1975) సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం సాహిత్యం: కొసరాజు గానం: యస్.జానకి సాకి: నీపైన నా కెంతొ మనసుందిరా! నీవు రాకున్న నేను ఏమౌదునోరా పల్లవి: నీదాననురా నీ నీడనురా ! నారాజా నీవెకావాలిరా ! అనుపల్లవి: నీకోసం వేచి ఉన్నారా ! ఏమైనా నిన్ను వదలనురా ! చరణం: 1 విరిసినపుడే కన్నెగులాబి? వేడిలోనే తీపి జిలేబీ వాసన చూడాలిరా రుచిని చూడాలికా మనను నీకుంటే మగసిరేవుంటే మరులు తీరేనురా ! చరణం: 2 కన్నులు కలిపే చిన్నదివుంటే ఎందుకురా "షరాబు” విరహము రేపే వెచ్చని వెన్నెల కురిసెనురా దొరబాబు ఇంకజాగేల లేచిరా వేల ఈ రేయి నీ చేనురా
నీ సంగతి నాకు తెలుసు పాట సాహిత్యం
చిత్రం: లక్ష్మణ రేఖ (1975) సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం సాహిత్యం: ఆరుద్ర గానం: యస్.పి.బాలు, యస్.జానకి నీ సంగతి నాకు తెలుసు నీకివ్వనురా నా మనసు ఒద్దంటున్నా ముద్దిమ్మంటే నీకూ నాకూ తిరకాసు ఊపేసే అందాలు చూపించితే ఎటువంటి మొనగాడు బలాదూరురా మిసమిసలాడేటి గుసగుసలా డేటి సొగసులు నా వేనురా వన్నెలు చూశావు కన్నె వేశావు కానీ రానురా నీలోన సరదాలు పొంగుకున్నవి నా లేత పరువాలు లొంగనన్నవి మగసిరి బడాయి గడసరిలడాయి నువ్వో రంగేళివా మస్కా కొట్టకు చిట్కా లేయొద్దు నేనూ కిల్లాడిరా
అందరిరాతలు రాసేది ఆ దేవుడు పాట సాహిత్యం
చిత్రం: లక్ష్మణ రేఖ (1975) సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం సాహిత్యం: ఆచార్య ఆత్రేయ గానం: పి.సుశీల అందరిరాతలు రాసేది ఆ దేవుడు ఆడదానిరాత రాసేది మగవాడు పువ్వల్లే పుట్టాను నవ్వుతు పెరిగాను తేటివచ్చింది పాట పాడింది తేనియ తాగింది తెల్లవారింది అప్పుడు తెలిసింది ఏమని .? నేకొల బోయాశని తావెళ్ళి పోయిందని అందరి రాతలు రాసేది ఆ దేవుడు ఆడదాని రాత రాసేది మగవాడు పువ్వులున్నవి కొల్లబోవుటకా తేటికి రెక్కలున్నది ఎగిరి వెళ్ళుటకా కన్నులున్నవి కన్నీటికా కట్టిన తాళివున్నది ఎగతాళికా రసికులు వస్తారు ధనికులు వస్తారు రాత్రి మసకలో సొగసును కొంటారు పగలు కాగానే మనసును చూసారు అప్పుడంటారు.... ఏమని ... ? మనసుంటె మా కొద్ద ని అది మగవాళ్ళ సరిహద్దని
No comments
Post a Comment