చిత్రం: లక్ష్మీ పూజ (1979) సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి, వీటూరి గానం: యస్.పి.బాలు, పి.సుశీల, యస్.జానకి, బి.వసంత, బెంగుళూర్ లత నటీనటులు: నరసింహరాజు, త్యాగరాజు, చంద్రకళ, జయమాలిని, బేబీ రోహిణి, బేబీ తులసి దర్శకత్వం: కొమ్మినేని శేషగిరిరావు నిర్మాత: పింజల ఆనందరావు విడుదల తేది: 16.11.1979
Songs List:
శ్రీ లక్ష్మి జయ లక్ష్మి పాట సాహిత్యం
శ్రీలక్ష్మీ జయలక్ష్మీ సిరులను కురిపించే శ్రీలక్ష్మీ కరుణించ రావే మహాలక్ష్మీ, మము - కరుణించ రావే మహాలక్ష్మీ పాలకడలిలో ప్రభవించినావు - మురిపాల మాధవుని వరియించినావు శ్రీపతి హృదయాన కొలువైతివమ్మా నాపతి పాదాల నను నిలుపవమ్మా | అన్ని జగాలకు మూలము నీవే ఆదిలక్ష్మివమ్మా పాడిపంటలను ప్రసాదించు నవధాన్యలక్ష్మివమ్మా ! భీరులనైనా వీరులచేసే ధైర్యలక్ష్మివమ్మా ! జగతికి జయమును కలిగించే గజలక్ష్మివి నీవమ్మా ! వంశము నిలిపే పాపలనిడు సంతానలక్ష్మివమ్మా | కార్యములన్నీ సఫలముచేసే విజయలక్ష్మివమ్మా ! జనులకు విద్యాబుద్ధులు నేర్పే విద్యాలక్ష్మివి నీవమ్మా | సర్వసౌభాగ్య సంపదలిచ్చే భాగ్యలక్ష్మివి నీవమ్మా ।
నాధమయమే జగము పాట సాహిత్యం
చిత్రం: లక్ష్మీ పూజ (1979) సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం సాహిత్యం: వీటూరి గానం: పి.సుశీల నాదమయమె జగము - అనురాగమయమె వయ్యారి హృదయము మధువులు పొంగే మరుమల్లె పువ్వే - తుమ్మెదనే కోరదా ఆ ఆ పరుగులు తీసే పరువాలవాగు సాగరునే చేరదా నీ గమకాల ఊయెలలూగి తెలుపలేని నిలుపరాని విరహమె - పడగవిప్పి బుసలుకొట్టి ఆడవా సరసాలు పలికే సన్నాయి నేనై పెదవులు చుంబించనా ఆ ఆ నీ రాగములో స్వరమును నేనై మోహము పలికించనా నీ నాదానికి ఊపిరి నేనై వలపులోన విరులవాన కురియగ హొయలు కులికి లయలు పలికి పాడనా? స: నీపై కలిగెను లాలస రి: దిగివచ్చితి నిను కోరి గ: నీ రాగాలాపన వినగా మ: మది దోచెనురా స్వరమధురిమా ప: పరువాలు పులకరింప ద: దరిచేరి ఏలరాదా నీ: నీ మగసిరిగని, నాసరి దొరవని - తమి దీర్చెదవని పిలిచితినీ సా: సారస సుమశర - కేశీసంగమ మదసామజస-మమధుహాసా
రాజా నీదనారా వాడివాడి పరుగుది పాట సాహిత్యం
చిత్రం: లక్ష్మీ పూజ (1979) సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి గానం: బి.వసంత రాజా నీదానరా - వడివడి పరుగిడి నాఒడి చేరరా కనులందు నీరూపే తొణికింది రారా ప్రతి మువ్వ నీపేరే పలికిందిలేరా ఈ మదనదాహం నీ పొందుకోసం మనసుతెలిసి మరులుకురిసి పోరా కలలోన నినుచూసి పులకించినాను గంధర్వలోకాలు దిగివచ్చినాను ఏకాంత వేళ ఎదలోన జోల కళలుచిలికి రుచులు తెలిపి పోరా రాజా
నిన్నే రమ్మంటిని పాట సాహిత్యం
చిత్రం: లక్ష్మీ పూజ (1979) సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి గానం: పి.సుశీల నిన్నే రమ్మంటిని లేలే లెమ్మంటిని నువ్వేదిమ్మన్నా నేనేమన్నా లేదంటినా నీ కౌగిలిలో పడివుండాలన్నా కాదంటినా చినదాని ఒళ్ళు విరజాజి విల్లు - చేపట్టి చూడరా మరుడైన యక్ష వరుడైన నిన్ను మతిపోయి చూడగా నా చురచురలాడే పరువం నా చురచురలాడే పరువం నీసొమ్మంటిని తొలిచూపులోనె మనసైన నిన్నె - వలచింది నాగినీ పగలైన రేయి సెగలైన నిన్నె తలచే వియోగినీ నా కువకువలాడే అందం..నా కువకువలాడేఅందం ఏలుకొమ్మంటినీ
మురిపాలే చూపి మొహాలే రేపి పాట సాహిత్యం
చిత్రం: లక్ష్మీ పూజ (1979) సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం సాహిత్యం: వీటూరి గానం: పి.సుశీల, బెంగుళూర్ లత ఎ హేయ్.............. మురిపాలే చూపి - మోహాలే రేపి ముదులో ముంచి ముంచి - మోజు పెంచరా డుర్రుచ్చి డుర్రుచ్చి డీడీకి నువ్వొచ్చి మనసిచ్చి ననుగిచ్చి నాకచ్చితీర్చాలిరా రా రా రా | పాలు కొనండి - నా పాట వినండీ మీ పాపలకీ పాలిచ్చీ మురిపాలే తీర్చుకొండి రండీ కొనరండీ - రండీ కొనరండీ గోమాతా మాలక్ష్మీ కురిపించిన పాలూ తనివితీరు ఒకసారి తాగితేనే చాలు నే పాలనమ్ముతున్నది మా నాన్నకోసమే ఒక మంచిపనికి చేయండి మీ సహాయమే నా తనుపూ సరసాల కామధేనువు నా వలపూ నా బులుపూ ఏల తీర్చవూ పెదవుల్లో అమృతమే నిండివున్నది నా కౌగిలిలో స్వర్గమే కాచుకున్నది డుర్రుచ్చి డుర్రుచ్చి డీడీకి నువ్వొచ్చి మనసిచ్చి ననుగిచ్చి నాకచ్చి తీర్చాలిరా
నిరతము అమ్మా (పద్యం) పాట సాహిత్యం
చిత్రం: లక్ష్మీ పూజ (1979) సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం సాహిత్యం: వీటూరి గానం: బి.వసంత నిరతము "అమ్మ" నీ చరణనీరజముల్ నెరనమ్మెనేని ఈ ధరణిని మేముచేసిన వ్రతమ్ములు పూజలు సత్యమేని సత్ సరణిని పంచభూతములు సవ్యముగా చరియించునేని నీ శరణముకోరి వేడితిని సత్వరమీ అనలమ్ము నార్పి నీ కరుణ జూపి దీనులను కావవె ఓ మహంక్ష్మి దేవతా। - ఓ మహలక్ష్మి దేవతా | జలధరా జలధరా జలజలా సాగిరా ! ఉరుముతో అందాలు మెరుపుతో పూజల్లు కురియగా కమలాలు విరియగా - దిగిరా దిగి వానదేవా . దేవా రావా దేవా రావా - దేవా రావా
నీవే నాలో పొంగే పాట సాహిత్యం
చిత్రం: లక్ష్మీ పూజ (1979) సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి గానం: యస్.పి.బాలు, బి.వసంత నీవే నాలో పొంగే తరంగానివి నీవేలే నన్నేలే వసంతానివి చల్లని వలపుల మల్లెలలో అల్లరి తలపుల జల్లులలో తొలకరి సొగసుల తోటలలో తుంటరి తుమ్మెద పాటలలో తాకింది కోడెగాలి, తనువెల్ల రాసకేళి ఆది నీ మహిమేనా। అభినవ వనమాలీ నవ్వుల మంత్రం వేసే। నామది వేణువుచేసే కళలేవో పలికించే సరాగానివి ఊగింది లేత నడుము కాదంటె తీగ నడుగు వేసెను ఆదినాలో వెన్నెల పిడుగు మల్లి యలా సను మలచీ - తేనియలన్నీ దోచీ మరులేవేవో కవ్వించే భ్రమరానివి
అమ్మా శ్రీ లక్ష్మీ దయలేదా పాట సాహిత్యం
చిత్రం: లక్ష్మీ పూజ (1979) సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి గానం: యస్.జానకి అమ్మా శ్రీలక్ష్మీ దయలేదా। నా - ఆర్తిని వినవేమి మరియాదా ॥ అమ్మా॥ పద్మపీఠిపై కొలుపున్నావా - పతియెదపై నే పవళించేవా రూపు తరిగిన ప్రతి ఒకవైపు - చూపు తొలగిన సుతు డొకవైపు పడమట సూర్యుడు వాలిన నిమిషం నిలువదు తల్లీ నా మాంగల్యం ॥ అమ్మా॥ సేవించెదనన్న చేతులులేవే - వినుతించెదనన్న వేనోళ్ళు లేవే పది దినములు నీ వ్రత మొనరించగ - పతితపావనీ సమయంలేదే ఈ తొలి కుసుమం వందనం - ఈ మలి కుసుమం కీర్తనం ఇది ధూపం - ఇది దీపం - ఇది పాద్యం - నైవేద్యం ఈ ప్రతి కుసుమం ఆత్మ నివేదనం ఉండి ఉండి ఈ రాతి గుడిని నీ గుండె బండయైతే నీ బంగరు చెవులను నా ఆర్తధ్వని గింగురు మనకుంటే అలవైకుంఠ పురాధి వరుడు నీ ఆత్మవిభుడు లేదా కైలాసాచల లీలా తాండవ కరుడు హరుడు లేడా చతుర్దశ భువన చయ వినిర్మాణ చణుడు అజుడు లేదా త్రిసంధ్యలే లేవా। చతుర్వేదములు లేవా పంచభూతములు లేవా। సప్తమరత్తులు లేవా అష్టదిక్పతులు లేరా। ఏకాదశరుద్రులు లేరా లేరా | లేరా | నా ఆక్రందన వినలేరా ! దైవశక్తి కరువైతే - నా తాళి నేలపాలైతే పాతివ్రత్య మహాగ్ని జ్వాలా పటలిలోన ఒక చిటికిలోన భస్మమైపోనా। నీ భస్మమైపోనా! అమ్మా! శ్రీ లక్ష్మీ దయామయీ | నా ఆర్తిని నిన్నావా మాంపాహి। మాంపాహి
No comments
Post a Comment