Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

MAD (2023)




చిత్రం: MAD (2023)
సంగీతం: భీమ్స్ సిసిరోలియో
నటీనటులు: యన్.నితిన్, యస్. శోబన్ , రామ్ నితిన్, శ్రీ గౌరి ప్రియ, అనంతిక
దర్శకత్వం: కళ్యాణ్ శంకర్
నిర్మాత: హారిక సూర్యదేవర, సాయి సౌజన్య 
విడుదల తేది: 2023



Songs List:



Proud'se Single పాట సాహిత్యం

 
చిత్రం: MAD (2023)
సంగీతం: భీమ్స్ సిసిరోలియో
సాహిత్యం: రఘురాం
గానం: భీమ్స్ సిసిరోలియో, నకాష్ అజీజ్

Proud'se Single




నువ్వు నవ్వుకుంటూ పాట సాహిత్యం

 
చిత్రం: MAD (2023)
సంగీతం: భీమ్స్ సిసిరోలియో
సాహిత్యం: భాస్కర భట్ల
గానం: కపిల్ కపిలన్ 

నువ్వు నవ్వుకుంటూ వెళ్లిపోమాకే
నా గుండెనేమో గిల్లి పోమాకే

చిన్ని చిన్ని కళ్ళే అందం
ముద్దు ముద్దు మాటలు అందం
బుజ్జి బుజ్జి బుగ్గల మెరుపే
ఎంతో అందమే

ముక్కు మీద కోపం అందం
మూతి ముడుచుకుంటే అందం
ఝంకాలలా ఊగుతు ఉంటే
ఇంకా అందమే

నీ పిచ్చి పట్టిందిలే
అది నీవైపే నెట్టిందిలే
ఏమైన బాగుందిలే
నువ్వు ఒప్పుకుంటే
జరుపుకుంట జాతరలే

నువ్వు నవ్వుకుంటూ వెళ్ళిపోమాకే
నా గుండెనేమో గిల్లి పోమాకే
నువ్వు తప్పుకుంటు వెళ్ళిపోమాకే
పిల్లా నిన్ను హత్తుకుంటు ఉండి పోతానే

ఈ తిరిగే తిరుగుడు
గుడి చుట్టు తిరిగితే
దిగి వచ్చి దేవతే
వరమిస్తా నంటదే

నువ్వు కొంచెం కరిగితే
ప్రపంచం మునగదే
ఈ పంతం వదిలితే
యుగాంతం రాదులే ఏ ఏ ఏ

నువ్వు నవ్వుకుంటూ వెళ్ళిపోమాకే
నా గుండెనేమో గిల్లి పోమాకే
నువ్వు తిప్పుకుంటు వెళ్ళిపోమాకే
పిల్లా నేను తిట్టుకుంటు ఉండి పోలేనే

అవునంటే అవునను
కాదంటే కాదను
నడి మధ్య ఊగితే
నేనెట్టా సావను

నీలాగే అందరు
విసిగిస్తే అమ్మడు
మగవాడెవ్వడు ప్రేమంటే
నమ్మడూ ఊ ఊ ఊ

నువ్వు నవ్వుకుంటు వెళ్ళిపోమాకే
అయ్ అయ్ అయ్ అయ్
నా గుండెనేమో గిల్లి పోమాకే
చూసి చూడనట్టు వెళ్ళిపోమాకే
పిల్లా కొంచం కసురుకుంటు ఉండి పోరాదే



మళ్ళి మళ్ళీ రానిరోజు పాట సాహిత్యం

 
చిత్రం: MAD (2023)
సంగీతం: భీమ్స్ సిసిరోలియో
సాహిత్యం: భోలే షావలి
గానం: సాయి చరన్ భాస్కురుని

మళ్ళి మళ్ళీ రానిరోజు




కళ్ళజోడు కాలేజీ పాప పాట సాహిత్యం

 
చిత్రం: MAD (2023)
సంగీతం: భీమ్స్ సిసిరోలియో
సాహిత్యం: కాసర్ల శ్యామ్
గానం: భీమ్స్ సిసిరోలియో, వర్మ, కీర్తన శర్మ

హే, కళ్ళజోడు కాలేజీ పాప జూడు
ఎల్లారెడ్డిగూడ కాడ ఆపి జూడు
ఎర్రరోజా పువ్వు సేతికిచ్చి జూడు
అందరిముందు ఐ లవ్ యూ సెప్పిజూడు

అరె పడితే లైన్లో పడతది
లేకపోతే తిడతది
పోతే ఇజ్జత్ పోతది
అదిబోతే ఇంకోటొస్తది

హే నల్లకండ్ల అద్దాలు తొడిగిన పోరి
అరె పడితే లైన్లో పడతది
లేకపోతే తిడతది
పోతే ఇజ్జత్ పోతది
అదిబోతే ఇంకోటొస్తది

హీరో హోండా బండి మీద పోరడు జూడు
కూలింగ్ గ్లాసు పెట్టి కట్టింగ్ ఇస్తడాడు
షారుక్ ఖాన్ లెక్క ప్రపోజ్ చేస్తడాడు
రిప్లై కోసం చెప్పులరగ తిరుగుతాడు

అరె ఓకే అని అంటిమా, ఓయో కు రమ్మంటడు
ఒక్కసారి పడితిమా లెక్కనన్నజేయడు
(ఓకే అని అంటిమా ఓయో కు రమ్మంటడు
ఒక్కసారి పడితిమా లెక్కనన్నజేయడు)

అరెరెరే పడేదాకా పరేశాను జేస్తడు వాడు
ఓకే అని అంటిమా ఓయో కు రమ్మంటడు
ఒక్కసారి పడితిమా లెక్కనన్నజేయడు

హే గోకేటోడ్ని మీరు గోకనిస్తుంటారు
పిచ్చిగ మీ యెనకబడితే ఫోజిస్తారు
స్టేటసులో సింగల్ అని పెట్టేస్తారు
లవ్వరు ఉన్నదాని ఫ్రెండును ట్రై చేస్తారు

నడిసినన్ని రోజులు నడిపిస్తనే ఉంటరు
అవ్వ అయ్యను జూపి వేరే పెళ్లి జేసుకుంటరు
నడిచినన్ని రోజులు నడిపిస్తనే ఉంటరు
అవ్వ అయ్యను జూపి వేరే పెళ్లి జేసుకుంటరు

ఆ, ఎడ్డీ పొరల్ల చేసి ఆడిపిస్తరు
నడిసినన్ని రోజులు నడిపిస్తనే ఉంటరు
కెరియర్లంటు జెప్పి వేరే పెళ్లి జేసుకుంటరు
నడిసినన్ని రోజులు నడిపిస్తనే ఉంటరు
కెరియర్లంటు జెప్పి వేరే పెళ్లి జేసుకుంటరు

No comments

Most Recent

Default