Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Mudda Mandaram (1981)




చిత్రం: ముద్దమందారం (1981)
సంగీతం: రమేష్ నాయుడు
నటీనటులు: ప్రదీప్ కొండేపర్తి, పూర్ణిమ 
దర్శకత్వం: జంధ్యాల 
నిర్మాతలు: రంజిత్, ప్రశాంత్ 
విడుదల తేది: 11.09.1981



Songs List:



ముద్ద మందారం పాట సాహిత్యం

 
చిత్రం: ముద్దమందారం (1981)
సంగీతం: రమేష్ నాయుడు
సాహిత్యం: వేటూరి సుందరరామమూర్తి
గానం: యస్.పి.బాలు 

పల్లవి:
మందారం ముద్ద మందారం 
మందారం ముద్ద మందారం 
ముద్దుకే ముద్దొచ్చే మువ్వకే నవ్వొచ్చే

ముద్దుకే ముద్దొచ్చే మందారం
మువ్వల్లే నవ్వింది సింగారం
ముద్దమందారం ముగ్థ శృంగారం
ముద్దమందారం ముగ్థ శృంగారం

ముద్దుకే ముద్దొచ్చే మందారం
మువ్వల్లే నవ్వింది సింగారం
ముద్దమందారం ముగ్థ శృంగారం

చరణం: 1 
అడుగులా అష్టపదులా నడకలా జీవనదులా
అడుగులా అష్టపదులా నడకలా జీవనదులా

పరువాల పరవళ్లు పరికిణీ కుచ్చిళ్లూ
విరి వాలుజడ కుచ్చుల సందళ్లు

కన్నెపిల్లా కాదు కలల కాణాచి
కలువ కన్నులా కలల దోబూచి

ముద్దుకే ముద్దొచ్చే మందారం
మువ్వల్లే నవ్వింది సింగారం
ముద్దమందారం ముగ్థ శృంగారం

చరణం: 2 
పలుకులా రా చిలకలా అలకలా ప్రేమ మొలకలా
పలుకులా రా చిలకలా అలకలా ప్రేమ మొలకలా

మలి సంధ్య వెలుగుల్లో నారింజ రంగుల్లో
కురిసేటి పగడాల వడగళ్లు

మల్లెపువ్వా కాదు మరుల మారాణి
బంతిపువ్వా పసుపు తాను పారాణి

ముద్దుకే ముద్దొచ్చే మందారం
మువ్వల్లే నవ్వింది సింగారం
ముద్దమందారం ముగ్థ శృంగారం
ముద్దమందారం ముగ్థ శృంగారం

ముద్దుకే ముద్దొచ్చే మందారం
మువ్వల్లే నవ్వింది సింగారం
ముద్దమందారం ముగ్థ శృంగారం
ముద్దమందారం ముగ్థ శృంగారం



జొన్నచేలోన జున్ను పాట సాహిత్యం

 
చిత్రం: ముద్దమందారం (1981)
సంగీతం: రమేష్ నాయుడు
సాహిత్యం: వేటూరి సుందరరామమూర్తి
గానం: యస్.పి.బాలు, యస్.జానకి 

జొన్నచేలోన జున్ను



నీలాలు కారేనా పాట సాహిత్యం

 
చిత్రం: ముద్దమందారం (1981)
సంగీతం: రమేష్ నాయుడు
సాహిత్యం: వేటూరి సుందరరామమూర్తి
గానం: యస్.పి.బాలు, యస్.జానకి 

నీలాలు కారేనా కాలాలు మారేనా
నీ జాలి నే పంచుకోనా 
నీ లాలి నే పాడలేనా
జాజి పూసే వేళ జాబిల్లి వేళ
పూల డోల నేను కానా

నీలాలు కారేనా కాలాలు మారేనా
నీ జాలి నే పంచుకోనా 
నీ లాలి నే పాడలేనా
జాజి పూసే వేళ జాబిల్లి వేళ
పూల డోల నేను కానా

సూరీడు నెలరేడు 
సిరిగల దొరలే కారు లే
పూరి గుడిసెల్లో పేద మనసుల్లో 
వెలిగేటి దీపాలులే
ఆ నింగి ఈ నేల కొనగల సిరులే లేవులే
కలిమి లేముల్లొ కరిగే ప్రేమల్లొ 
నిరుపేద లోగిళ్ళులే

నీలాలు కారేనా కాలాలు మారేనా
నీ జాలి నే పంచుకోనా 
నీ లాలి నే పాడలేనా
జాజి పూసే వేళ జాబిల్లి వేళ
పూల డోల నేను కానా

ఈ గాలిలో తేలి వెతలను మరిచే వేళలో
కలికి వెన్నెల్లు కలల కన్నుల్లో 
కలతారి పోవాలి లే
ఆ తారలే తేరి తళ తళ మెరిసే రేయిలో
ఒడిలో నువ్వుంటె ఒదిగీ పోతుంటె 
కడతేరి పోవాలిలే..

నీలాలు కారేనా కాలాలు మారేనా
నీ జాలి నే పంచుకోనా 
నీ లాలి నే పాడలేనా
జాజి పూసే వేళ జాబిల్లి వేళ
పూల డోల నేను కానా

నీలాలు కారేనా కాలాలు మారేనా
నీ జాలి నే పంచుకోనా 
నీ లాలి నే పాడలేనా
జాజి పూసే వేళ జాబిల్లి వేళ
పూల డోల నేను కానా





జో లాలీ జో లాలీ పాట సాహిత్యం

 
చిత్రం: ముద్దమందారం (1981)
సంగీతం: రమేష్ నాయుడు
సాహిత్యం: వేటూరి సుందరరామమూర్తి
గానం: యస్.పి.బాలు

పల్లవి: 
జో... లాలి.. ఓ లాలి...
నాయనా  ఒకటాయె రెండాయె ఉయ్యాల
రెండు మూడు మాసాలాయె ఉయ్యాల
జో... లాలి.. ఓ లాలి...
నాయనా  మూడో మాసములోన ఉయ్యాల
ముడికట్ట్లు బిగువాయె ఉయ్యాల 

చరణం: 1 
జో... లాలి.. ఓ లాలి...
నాయనా  మూడాయె నాలుగాయె ఉయ్యాల
నాలుగు అయిదు మాసములాయె ఉయ్యాల
జో... లాలి.. ఓ లాలి...
నాయనా  అయిదాయె ఆరాయె ఉయ్యాల
ఆరు ఏడు మాసాములాయె ఉయ్యాల
జో... లాలి.. ఓ లాలి...
ఏడో మాసములోన ఉయ్యాల
నాయనా  వేగుళ్ళు బయలెళ్ళె ఉయ్యాల 

చరణం: 2 
జో... లాలి.. ఓ లాలి...
నాయనా  ఏడాయె ఎనిమిదాయె ఉయ్యాల
ఎనిమిది తొమ్మిది మాసములాయె ఉయ్యాల
జో... లాలి.. ఓ లాలి...
నాయనా  తొమ్మిది మాసములోన ఉయ్యాల
నాయనా  శ్రీకృష్ణ జన్మమురా ఉయ్యాల
నాయనా  శ్రీకృష్ణ జన్మమురా ఉయ్యాల



నా షోలాపూర్ చెప్పులు పాట సాహిత్యం

 
చిత్రం: ముద్దమందారం (1981)
సంగీతం: రమేష్ నాయుడు
సాహిత్యం: బాబన్, సుబ్బారావు 
గానం: జిత్మోహన్ మిత్ర

పల్లవి: 
షోలాపూర్... చెప్పులు పోయాయి
అహ... హ.. హ...

నా షోలాపూర్ చెప్పులు పెళ్ళిలో పోయాయి
అవి కొత్తవి మెత్తవి కాలికి హత్తుకుపోయేవి

నా షోలాపూర్ చెప్పులు పెళ్ళిలో పోయాయి
అవి కొత్తవి మెత్తవి కాలికి హత్తుకుపోయేవి

నా షోలాపూర్ చెప్పులు పెళ్ళిలో పోయాయి 

చరణం: 1 
అరే రమణమూర్తి పెళ్ళి ఇది రాదు మళ్ళి మళ్ళి
నవ్వాలి తుళ్ళి తుళ్ళి అని పాడెను మళ్ళి మళ్ళి
అరే రమణమూర్తి పెళ్ళి ఇది రాదు మళ్ళి మళ్ళి
నవ్వాలి తుళ్ళి తుళ్ళి అని పాడెను మళ్ళి మళ్ళి

ఆ సందట్లో కన్నేసి కనిపెట్టి కాజేసాడెవడో

నా షోలాపూర్ చెప్పులు పెళ్ళిలో పోయాయి
అవి కొత్తవి మెత్తవి కాలికి హత్తుకుపోయేవి
నా షోలా షోలా షోలా షోలాపూర్ చెప్పులు పెళ్ళిలో పోయాయి 

చరణం: 2 
ఇది షోలాపూర్ లెదరు అండ్ లైట్ ఏర్ ఫెదరు
యూజ్ యట్ ఎనీ వెదర్ దీన్ని తొడిగి చూడు బ్రదరు

ఇది షోలాపూర్ లెదరు అండ్ లైట్ ఏర్ ఫెదరు
యూజ్ యట్ ఎనీ వెదర్ దీన్ని తొడిగి చూడు బ్రదరు
అని మురిపించి మరిపించి కొనిపించాడు ఆ పొట్టోడు

షోలాపూర్ చెప్పులు పెళ్ళిలో పోయాయి
అవి కొత్తవి మెత్తవి కాలికి హత్తుకుపోయేవి
నా షోలాపూర్ చెప్పులు పెళ్ళిలో పోయాయి

చరణం: 3 
జత నెంబరేమో ఆరు వెల చూస్తే ఇరవైఆరు
తొడిగేను ఒక్కమారు వెళ్ళాను పాత ఊరు

జత నెంబరేమో ఆరు వెల చూస్తే ఇరవైఆరు
తొడిగేను ఒక్కమారు వెళ్ళాను పాత ఊరు
ఒకసారైన పాలిష్ కొట్టనిది కొట్టేసాడెవడో

నా షోలాపూర్ చెప్పులు పెళ్ళిలో పోయాయి
అవి కొత్తవి మెత్తవి కాలికి హత్తుకుపోయేవి

నా షోలాపూర్ చెప్పులు పెళ్ళిలో పోయాయి
నా షోలాపూర్ చెప్పులు పెళ్ళిలో పోయాయి
నా షోలాపూర్ చెప్పులు పెళ్ళిలో పోయాయి
దొరికితే ఎవరైనా ఇవ్వండి

అహహహా..




అలివేణి ఆణిముత్యమ పాట సాహిత్యం

 
చిత్రం: ముద్దమందారం (1981)
సంగీతం: రమేష్ నాయుడు
సాహిత్యం: వేటూరి సుందరరామమూర్తి
గానం: యస్.పి.బాలు, యస్.జానకి 

పల్లవి:
అలివేణీ ఆణిముత్యమా
నీ కంట నీటి ముత్యమా
ఆవిరి చిగురో ఇది ఊపిరి కబురో
స్వాతివాన లేత ఎండలో
జాలినవ్వు జాజి దండలో..

అలివేణీ ఆణిముత్యమా
నా పరువాల ప్రాణ ముత్యమా
జాబిలి చలువో ఇది వెన్నెల కొలువో
స్వాతివాన లేత ఎండలో
జాజిమల్లీ పూలగుండెలో
అలివేణీ ఆణిముత్యమా...

చరణం: 1
కుదురైన బొమ్మకి కులుకుమల్లె రెమ్మకి
కుదురైన బొమ్మకి కులుకుమల్లె రెమ్మకి
నుదుట ముద్దు పెట్టనా బొట్టుగా
వద్దంటే ఒట్టుగా...
అందాల అమ్మకి కుందనాల కొమ్మకి
అందాల అమ్మకి కుందనాల కొమ్మకి
అడుగు మడుగులొత్తనా మెత్తగా...
ఔనంటే తప్పుగా...

అలివేణీ ఆణిముత్యమా
నా పరువాల ప్రాణ ముత్యమా

చరణం: 2
పొగడలేని ప్రేమకి పొన్నచెట్టు నీడకి
పొగడలేని ప్రేమకి పొన్నచెట్టు నీడకి
పొగడదండలల్లుకోనా పూజగా...
పులకింతల పూజగా...

తొలిజన్మల నోముకి దొర నవ్వుల సామికి
తొలిజన్మల నోముకి దొర నవ్వుల సామికి
చెలిమై నేనుండిపోనా చల్లగా
మరుమల్లెలు చల్లగా...

అలివేణీ ఆణిముత్యమా
నీ కంట నీటి ముత్యమా
జాబిలి చలువో ఇది వెన్నెల కొలువో
స్వాతివాన లేత ఎండలో
జాజిమల్లీ పూలగుండెలో
అలివేణీ ఆణిముత్యమా
అలివేణీ... ఆణిముత్యమా...





శ్రీరస్తు శుభమస్తు (కడగంటి కొలకుల్లో) పాట సాహిత్యం

 
చిత్రం: ముద్దమందారం (1981)
సంగీతం: రమేష్ నాయుడు
సాహిత్యం: వేటూరి సుందరరామమూర్తి
గానం: యస్.పి.బాలు, యస్.జానకి 

శ్రీరస్తూ... శుభమస్తూ... కళ్యాణమస్తూ...
జీవేమ శరదాం శతం భవామ శరదాం శతం
నందామ శరదాం శతం చిరంజీవా సుఖీభవా
శతాయుష్మాన్ భవ శతాయుష్మాన్ భవ

కడగంటి కొలకుల్లో తెలుగింటి వెలుగుల్లు
తెర తీసిన తేనెదీపం తేనె కన్న తీపి రూపం
తేనె కన్న తీపి రూపం
నీ నిండు హృదయాన ఒదిగేటి సమయాన
ప్రణయాల ఓంకార నాదం వినిపించె కళ్యాణ గీతం
వినిపించె కళ్యాణ గీతం

హరిత వర్ణ చైత్ర పత్ర గీతికలా
గ్రీష్మ తప్త ఉదయ రాగ కుంకుమలా
గగన నీల శ్రవణ మేఘ మాలికలా
శరత్కాల సితానంద చంద్రికలా కదలిరా

కప్పుర తీవల వీణలు వెన్నెల పుప్పొడి వానలు
అందాలభరిణ అనురాగకిరణ 
అందాలభరిణ అనురాగకిరణ
కనుపాపలే మూగజాణలు

ఈ చంచల నాయన బృగంచల రేఖా
చందన శీతల శీకరములు వశీకరములు
నీ మేఘసందేశమే నీ మోహనావేశమే
నీ దాహ సంకీర్తనే నీ దాహ సంకేతమే

కడగంటి కొలకుల్లో తెలుగింటి వెలుగుల్లు
తెర తీసిన తేనెదీపం తేనె కన్న తీపి రూపం
తేనె కన్న తీపి రూపం

హిమస్నపిత హేమ పుష్పలా వికలా
శిశిర శీర్ణ జీర్ణ పత్ర భూమికలా
సాంఝ రాగ పశ్చిమాంతరంగిణిలా
సప్త వర్ణ స్వరస స్వర్ణ సుందరిలా
ఇంద్ర ధనుస్సుందరిలా తరలిరా

నాపాలి వేదాద్రి శిఖరం నా ఇల్లు నీదివ్య చరణం
చుంబించు అధరం సుధ కన్న మధురం 
చుంబించు అధరం సుధ కన్న మధురం
నీ మాట మంత్రాక్షరం

తమాల పల్లవ జాల మాలికా
వికసిత విభాత భాస్వంతము నాస్వాంతము,
నీ స్నేహ సంగీతమే నీ స్నిగ్ధ సౌందర్యమే
నీ సాంఝ సంసారమే నీ సాంఝ సంసారమే


కడగంటి కొలకుల్లో తెలుగింటి వెలుగుల్లు
తెర తీసిన తేనెదీపం తేనె కన్న తీపి రూపం
తేనె కన్న తీపి రూపం
నీ నిండు హృదయాన ఒదిగేటి సమయాన
ప్రణయాల ఓంకార నాదం వినిపించె కళ్యాణ గీతం
వినిపించె కళ్యాణ గీతం




ఆ రెండు దొండపండు పెదవుల్లో పాట సాహిత్యం

 
చిత్రం: ముద్దమందారం (1981)
సంగీతం: రమేష్ నాయుడు
సాహిత్యం: వేటూరి సుందరరామమూర్తి
గానం: యస్.పి.బాలు, యస్.జానకి 

ఆ రెండు దొండపండు పెదవుల్లో

No comments

Most Recent

Default