చిత్రం: ఒక చల్లని రాత్రి (1979) సంగీతం: కె.వి.మహదేవన్ సాహిత్యం: ఆచార్య ఆత్రేయ గానం: యస్.పి.బాలు, పి.సుశీల, ఎల్.ఆర్.ఈశ్వరి నటీనటులు: చంద్రమోహన్, మాధవి, రామకృష్ణ , హలం దర్శకత్వం: పి.వాసు నిర్మాత: పి.రామమోహనరావు విడుదల తేది: 18.05.1979
Songs List:
ఈ రాతిరిలో నీ జాతకమే పాట సాహిత్యం
చిత్రం: ఒక చల్లని రాత్రి (1979) సంగీతం: కె.వి.మహదేవన్ సాహిత్యం: ఆచార్య ఆత్రేయ గానం: ఎల్.ఆర్.ఈశ్వరి పల్లవి: ఈ రాతిరితో నీ జాతకమే మార్చేస్తాను నా పాత కథే కొత్తగా నీచేతే రాయిస్తాను చరణం: 1 నువ్వే హీరో నా కథలో కానీ జీరో నాజతలో ఒకటి పక్కన వుంటేనే సున్న పది అవుతుంది. నా పక్కన వుంటేనే నీకొక కథవుంటుంది చరణం: 2 నువ్వూ నేను ఒక్కటైతే నేనే చివరకు వుండేది ఒకటి ఒకటి గుణిస్తే అది ఒకటవుతుంది ఆ ఒకటి కాస్త తీసేస్తే సున్న మిగులుతుంది
అమ్మమ్మ ఈనాడు శనివారం పాట సాహిత్యం
చిత్రం: ఒక చల్లని రాత్రి (1979) సంగీతం: కె.వి.మహదేవన్ సాహిత్యం: ఆచార్య ఆత్రేయ గానం: యస్.పి.బాలు, పి.సుశీల అమ్మమ్మా ఈనాడు శనివారం ఆ ఏడుకొండల స్వామివారం ఉండాలి ఉపవాసం లేకుంటే అపచారం యాయ్యా యాయ్యా యాయ్యా అమ్మమ్మా ఈనాడు శనివారం అర్ధరాత్రి దాటితే ఆదివారం ఆపైన ఉపవాసం అన్యాయం అన్యాయం యాయ్యా యాయ్యా యాయ్యా చరణం: 1 శనివారమైనా చేస్తారు ఫలహారం అది ఆచారం కాదపచారం అసలును మించిన వడ్డీవ్యాపారం నీ ఫలహారం వ్యవహారం ఎందుకు ఇంకా గందర గోళం తిప్పేద్దాము గడియారం చరణం: 2 బెలూన్ బెలూన్ ఇది ప్రేమ బెలూన్ కమాన్ కమాన్ చేరుదాం చందమామను చంద్రుడిలో ఏముంది కొండలు బండలు మరెందుకు పోల్చుతావు నా మోమును తప్పు తప్పు ఇంకెప్పుడు అనను ఒప్పుకుంటే చాలదు దింపుకో నన్ను
అధి ఒక చల్లని రాత్రి పాట సాహిత్యం
చిత్రం: ఒక చల్లని రాత్రి (1979) సంగీతం: కె.వి.మహదేవన్ సాహిత్యం: ఆచార్య ఆత్రేయ గానం: యస్.పి.బాలు, పి.సుశీల పల్లవి: అది ఒక చల్లని రాత్రి మరుమల్లెలు చల్లిన రాత్రి ఇక ప్రతి రాత్రి అదేరాత్రి వలపుల జల్లుల రాత్రి చరణం: 1 మనసుకు మనసు మంగళసూత్రం కట్టిన శుభరాత్రి సొగసును వయసు బిగికౌగిలిలో పొదిగిన తొలిరాత్రి శివుడు పార్వతికి తనసగమిచ్చిన పవిత్ర శివరాత్రి యువతీ యువకులు నవశిల్పాలై కొలువగు నవరాత్రి చరణం: 2 పూర్వజన్మల పుణ్యం ఏదో పండినదా రాత్రి ముందు జన్మల అనుబంధం ముడివేసినదీ రాత్రి పరువం ప్రణయం పరవశించి మైమరచినదా రాత్రి ముద్దూ ముచ్చట మూటలు విప్పి మురిసేదీ రాత్రి చరణం: 3 అంతులేని ఆనందం చిగురించినదా రాత్రి అనురాగాళా తీగలల్లీ పెనవేసినదీ రాత్రి చిన్ననాటి నేస్తం మొగ్గలు తొడిగినదా రాత్రి జీవితానికి పువ్వుల బాటను పరిచినదీ రాత్రి.
దుక్ఖమంటే యేమిటని పాట సాహిత్యం
చిత్రం: ఒక చల్లని రాత్రి (1979) సంగీతం: కె.వి.మహదేవన్ సాహిత్యం: ఆచార్య ఆత్రేయ గానం: యస్.పి.బాలు పల్లవి: దుఃఖమంటే ఏమిటని దేవుడ్ని అడిగాను ఒకసారి ప్రేమించి చూడరా అన్నాడు ఆమాట నమ్మాను ప్రేమించినాను దుఃఖమే నేనుగా మారాను నేడు చరణం: 1 ప్రేమే బొమ్మయితే దుఃఖమే బొరుసు ఈ చేదు నిజము ఎందరికి తెలుసు తెలియక మునుపాబొమ్మను వలచాను తెలిసిన పిదపే చేదును మింగాను చరణం: 2 దుఃఖమే నేటిది సుఖమేమొ నిన్నది ఈ రెండూ కానిది నే వెతుకుతున్నది కన్నీటి ఏటిని దాటాలి దానికి ఎన్నాళ్ళకో చేరేది ఆ చోటికి
నువ్వెవరో నాకు తెలుసును పాట సాహిత్యం
చిత్రం: ఒక చల్లని రాత్రి (1979) సంగీతం: కె.వి.మహదేవన్ సాహిత్యం: ఆచార్య ఆత్రేయ గానం: పి.సుశీల, మోహన్ నువ్వెవరో నాకు తెలుసును క్యా.... క్యా.... హా..... హా.... నేనెవరో నీకు తెలుసును తెలిసినట్టు నీకు నాకు తెలియక పోవచ్చును ఏకై సా హోతా హోతా హోతా ఏ అనుబంధమో తెచ్చింది నిన్ను ఏ అనురాగమో కలిపింది నన్ను అచ్చా అచ్చా ఈ రుణం నేటితో తీరదులే నా గుణం యిప్పుడే తెలియదులే ఠీక్ హై... ఠీక్ హై.... వేషమేదై తేనేం భాష రాకుంటేనేం లోపలున్నదేదో తెలుసుకుంటే చాలును వేషం నిముషంలో మార్చుతాను భాషంతా కళ్ళతోటి నేర్పుతాను నీ రసికతకు దాసిని నేను నా సొగసులకు బానిస నీవు ఆప్ కి కసమ్ నేను నీ వశం అనుమానం యింకా నీ కెందుకు పెన వేసి రారా నా ముందుకు ॥నువ్వెవరో ॥
అధి ఒక చల్లని రాత్రి (విచారం) పాట సాహిత్యం
చిత్రం: ఒక చల్లని రాత్రి (1979) సంగీతం: కె.వి.మహదేవన్ సాహిత్యం: ఆచార్య ఆత్రేయ గానం: యస్.పి.బాలు, పి.సుశీల అది ఒక చల్లని రాత్రి విషబీజం చల్లిన రాత్రి యిక ప్రతి రాత్రి నల్లని రాత్రి కన్నీటి జల్లుల రాత్రి చరణం: 1 మనసే సాక్ష్యం నిలిచిన రాత్రి మమత లగ్నమై కలిపిన రాత్రి తనువును పూజాపుష్పం చేసిన రాత్రి నా తలరాతే మార్చిన రాత్రి చరణం: 2 ఆవేశం పెనవేసిన రాత్రి ఆనందం చవిచూసిన రాత్రి వయసు మత్తులో హద్దులు మరచిన రాత్రి వెన్నెల చాటున చీకటి పెరిగిన రాత్రి చరణం: 3 అన్నెం పున్నెం ఎరుగనిదా రాత్రి అంతా చేదై చెదిరినదీ రాత్రి కన్నుల నిండా నువ్వున్నది ఆరాత్రి కన్నీళ్ళే మిగిలించినదీ రాత్రి
No comments
Post a Comment