చిత్రం: పెద్దకాపు (2023) సంగీతం: మిక్కి జే మేయర్ నటీనటులు: విరాట్ కర్ణ, ప్రగతి శ్రీ వాత్సవ్ దర్శకత్వం: శ్రీకాంత్ అడ్డాల నిర్మాత: మిరియాల రవీంద్ర రెడ్డి విడుదల తేది: 29.09.2023
Songs List:
చనువుగా చూసినా పాట సాహిత్యం
చిత్రం: పెద్ద కాపు (2023) సంగీతం: మిక్కి జే మేయర్ సాహిత్యం: కళ్యాణ్ చక్రవర్తి గానం: చైత్ర అంబలపూడి, అనురాగ్ కులకర్ణి హృదయములో అలజడి వానా ఆ ఆ ఆ కురిసెనే ఇలా నీ వలనా అరెరే అరెరే తన వాటమే అసలే పడదే మొహమాటమే పలుచగ వేసిన పావడ గోడ దాటిన జరపదు ఎందుకో తెలిసేనా ఆ ఆ చనువుగా చూసినా, హా చూపులతో తినేసిన ఆకలి తీరునా అరిగేనా, ఆ ఆ ఆ వదులుగా వదలడమే వయసుకొక మర్యాదా ఆత్రపడి అడగాల ఆ మాత్రము తెలియదా మహా తప్పేమీ లేదన్న నీకిలా అరె సిగ్గన్నా తడబాటు కావాలా మొదలని ఊరుకున్నా లేక పోతే ఇంకా ఉడికించెయ్ నా చనువుగా చూసినా చూపులతో తినేసిన ఆకలి తీరునా అరిగేనా… ఆ ఆ అడుగుల నాడిలో, ఓ హో పెరిగిన వేడి నీడలే పడకలు చాపెనే పడమటనా అరెరే అరెరే తన వాటమే
# పాట సాహిత్యం
చిత్రం: పెద్ద కాపు (2023) సంగీతం: మిక్కి జే మేయర్ సాహిత్యం: కళ్యాణ్ చక్రవర్తి గానం: అనురాగ్ కులకర్ణి డండక డుం డండక డుం డండక డుం డుం డుం డండక డుం డండక డుం డండక డుండక డుం దిట్టంగా దూకు దిష్టికే ఉప్పొచ్చి నిప్పు తాకెనే దుర్గమ్మ తల్లి కళ్ళకే వెలుగై సమ్మెట్ల సాగు డప్పుకే ఉగ్రాలు ఊరికొచ్చెనే పెద్దమ్మ రంగమెక్కగా ఉడుకై పసుపంటిన కత్తికి కూడా పదునెప్పుడు చివరకు ఎరుపే కల్లోలపు కాష్టం రగిలే చితుకులు చింతలవేలేరా పొలిమేరలు అడవికి ఉన్నా వేటాడగ హద్దులు లేవే పుట్టేందుకు యుద్ధము కారణమేదో సేనకు తెలియదురా రణ నీతినే రాసేందుకు రక్తాన్ని వాడని తావుందా ఒక గీతతో బలహీనత ఆనాడు పోయిందా రణ నీతినే రాసేందుకు రక్తాన్ని వాడని తావుందా ఒక గీతతో బలహీనత ఓనాడు ఓడిందా కడసాగని కాలం ప్రతిసారి వెతికింది ఓ నెత్తుటి దారి అవకాశపు ఆశల నీడలు కమ్మిన కన్నుల చూపులు ఎరవేసి తను వేసిన ఉచ్చులతో పెను ఉత్సవమే అను నిత్యం జత చేసి డండక డుం డండక డుం డండక డుం డుం డుం డండక డుం డండక డుం డండక డుండక డుం ఒడ్డూ వరద కలుసుకొని చెట్టా పట్టాలేసుకొని నవ్వుతుంటె గోదారే కళ్ళు చాలవే నిద్దురలా తానున్నా గుంబనంగ గోదారి కట్టుతప్పి పోయిందా అడ్డే వాడు కనరాడే తడి అడుగుల ఈ నేల తను ఎవరని అడిగిన ఓ వేళ తలవాకిట తీరని తోడుగ కాసిన కొరివికి కాడుకు వెరుపేలా ఎనకటి కథ యేటికి నేర్పాలా ఏడుపు వ్యధ గొంతుకు చెప్పాల చనుబాలకు అంచున చేసిన గాయపు రాతలు చరితను చదవాలా పసుపంటిన కత్తికి కూడా పదునెప్పుడు చివరకు ఎరుపే కల్లోలపు కాష్టం రగిలే చితుకులు చింతలవేలేరా పొలిమేరలు అడవికి ఉన్నా వేటాడగ హద్దులు లేవే పుట్టేందుకు యుద్ధము కారణమేదో సేనకు తెలియదురా రణ నీతినే రాసేందుకు రక్తాన్ని వాడని తావుందా ఒక గీతతో బలహీనత ఆనాడు పోయిందా రణ నీతినే రాసేందుకు రక్తాన్ని వాడని తావుందా ఒక గీతతో బలహీనత ఓనాడు ఓడిందా కడసాగని కాలం ప్రతిసారి వెతికింది ఓ నెత్తుటి దారి అవకాశపు ఆశల నీడలు కమ్మిన కన్నుల చూపులు ఎరవేసి తను వేసిన ఉచ్చులతో పెను ఉత్సవమే అను నిత్యం జత చేసి దిట్టంగా దూకు దిష్టికే, ఓయ్ ఉప్పొచ్చి నిప్పు తొక్కెనే దుర్గమ్మ తల్లి కళ్ళకే వెలుగై ఓ ఓ, సమ్మెట్ల సాగు డప్పుకే ఉగ్రాలు ఊరికొచ్చెనే పెద్దమ్మ రంగమెక్కగా ఉడుకై డండక డుం డండక డుం డండక డుం డుం డుం డండక డుం డండక డుం డండక డుండక డుం
No comments
Post a Comment