చిత్రం: పిచ్చిమారాజు (1976) సంగీతం: కె.వి.మహదేవన్ సాహిత్యం: ఆత్రేయ గానం: పి.సుశీల, యస్.పి.బాలు నటినటులు: శోభన్‌బాబు,మంజుల దర్శకత్వం: వి.బి. రాజేంద్రప్రసాద్ నిర్మాత: వి.బి. రాజేంద్రప్రసాద్ విడుదల తేది:09.01.1976
Songs List:
సింగినాదం జీలకర్రరో పాట సాహిత్యం
చిత్రం: పిచ్చిమారాజు (1976) సంగీతం: కె.వి.మహదేవన్ సాహిత్యం: ఆత్రేయ గానం: పి.సుశీల, యస్.పి.బాలు సింగినాదం జీలకర్రరో అసలు సంగతేమొ గుండుసున్నరో సింగినాధం జీలకర్రలే మన సంగతంత నిండుకుండలే ఆకు తోటకాడ నన్ను ఆకలిగా చూశావు చీకటడే దాక చూస్తూ చెట్టులా నిలిచావు ఎట్టారా.... ఏగేది నీతోటి ఏం చేయమంటావురో చూపుతోటి ఆకు తోటలో ఎట్లా బంతిపువ్వు పూచెననీ అమావాస చీకట్లో జాబిలేట్టా వచ్చెననీ చూసుండిపోయానే.... నీ వైపు నీ చూపుల్లో వున్నదే ఆ కైపు జొన్న చేను బాగుండి రమ్మంటే వచ్చాను మంచె దించమంటే నీ మొలపట్టి దించాను నా వైపు చూశావు జాణల్లె నవ్వేసి వెళ్లావు మెరుపల్లె కంకి చూచెన నీకు కాక పుటువనుకున్నా నడుం పట్టినపుడైనా నలిగి పోతాననుకున్నా నరాలో పులుపులేని చిన్నోడా నవ్వకేం చేసేది పిచ్చోడా
నిక్కి నిక్కీ చూశావో పాట సాహిత్యం
చిత్రం: పిచ్చిమారాజు (1976) సంగీతం: కె.వి.మహదేవన్ సాహిత్యం: ఆత్రేయ గానం: యస్.పి.బాలు చర్ - బొప్పాయ్ గుండూ నిక్కి నిక్కీ చూశావో నీ డొక్క చించుతారో డోలు కడతారో ఈగను మింగే కప్పుందీ కప్పను మింగే పాముందీ పామును తన్నుకు పోయేటందుకు గద్ద ఎప్పుడూ ఎగురుతు ఉంది ఈ పరమ రహస్యం తెలియకపోతే కుక్క కాటుకు చెప్పుదెబ్బరోయ్ చరు గుడు చడు గుడు నీ అబ్బ చచ్చినాడు వాడబ్బి చచ్చినాడూ ఎవడూ ఏదీ పోతూ పోతూ కట్టుకు పోలేడూ బ్రతికేవాడికి చావుందీ - చచ్చేవాడికి బ్రతుకుందీ చచ్చినవాడు బ్రతికినవాడు చేరేచోటు ఒకటుందీ ఈ పరమ రహస్యం తెలియకపోతే కుక్క కాటుకు చెప్పుదెబ్బరోయ్ చడు గుడు చడు గుడు చేనును మేసే కంచుందీ - కంచెను నరికే కత్తుంది కత్తులు నూరే కసాయివాణి చిత్తుగ దంచే చెయ్యుందీ ఈ పరమ రహస్యం తెలియకపోతే కుక్క కాటుకు చెప్పుదెబ్బరోయ్ చడు గుడు చదు గుడు
ఓ కుర్రవాడా - వెర్రివాడా పాట సాహిత్యం
చిత్రం: పిచ్చిమారాజు (1976) సంగీతం: కె.వి.మహదేవన్ సాహిత్యం: ఆత్రేయ గానం: యస్.పి.బాలు, పి.సుశీల ఓ కుర్రవాడా - వెర్రివాడా ఎందుకిలా నువ్వెందుకిలా నన్నొదిలి యిలా పారిపోతావు ఓ కుర్రదానా - వెర్రిదానా ఎందుకిలా - నువ్వెందుకిలా నన్నొదలకిలా తరుముకొస్తావూ నేలకు నింగికి కలవదమ్మా నీకు నాకు పొ త్తెపుడు కుదరదమ్మా నింగిలోని వెన్నెలంత నేలకే సొంతము నీకూ నాకూ ఉన్నది అదే బంధము చల్లగాలి ఊరుకోదూ - పిల్ల మనసు ఓర్చుకోదుగా ఓర్చుకోనీ పిల్ల దాన్ని ఓపలేను ఆపలేను ఏం చేయమంటావు నన్ను నన్నెలా వదలమంటావు నిన్ను అందాలతో నాక బంధాలు వేయకు పిచ్చివాణ్ణి మరీ మరీ రెచ్చగొట్టకు రెచ్చితే పిచ్చి ఎంతో ముచ్చటగ ఉంటుంది ముచ్ఛటైన కౌగిట్లో పిచ్చి కుదిరిపోతుంది
ఎలుక తోలు తెచ్చి పాట సాహిత్యం
చిత్రం: పిచ్చిమారాజు (1976) సంగీతం: కె.వి.మహదేవన్ సాహిత్యం: ఆత్రేయ గానం: పి.సుశీల, యస్.పి.బాలు ఎలుక తోలు తెచ్చి ఏడాది ఉతికినా అయ్యో కుక్కతోక పట్టి గోదావరి ఈదినా ఏమిఫలము రామరామా విశ్వదాభి రామరామా అయ్యో రామరామా రామరామా పాలతో కడిగినా బొగు తెల గరాదు పూలతో కలిసినా నార పువ్వయిపోదు బొగ్గు మారీ మారి రత్నమవుతుందీ పూవు వాసన కాస్త వారకొస్తుందీ మతిలేని వాడికీ పసిపిల్ల వాడికీ మట్టి బొమ్మిచ్చినా మనసిచ్చినా ఒకటే మనుషికి బొమ్మకూ మనసొకటె తేడా అది తెలియనప్పుడు బ్రతుకే బొమ్మల ఆటా కళ్ళలోని ఎరుపు కోపాని కర్దమూ కన్నె మనసున ఉన్న తాపాని కద్దమా ఎ రుపు జీరల కళ్లు వలపుటద్దాలు కలిపి చూస్తేకాని తెలియవర్ధాలు
కొత్త పిచ్చోడూ పొద్దెరగడు పాట సాహిత్యం
చిత్రం: పిచ్చిమారాజు (1976) సంగీతం: కె.వి.మహదేవన్ సాహిత్యం: ఆత్రేయ గానం: పి.సుశీల, యస్.పి.బాలు కొత్త పిచ్చోడూ పొద్దెరగడు కొంగులాగి - లొంగదీసి కొంప ముంచేట్టు ఉన్నాడు కొత్త పిచ్చోడూ పొద్దెరగడు కొంగులాగీ - లొంగదీసి కొంప ముంచేట్టు ఉన్నాడు హద్దు, హద్దంటే - అది వద్దువదంటూ వస్తాడు వద్దు వద్దంటే ఒక ముద్దు ముద్దంటూ ఇస్తాడు హద్దు చూశావో - నీ ముద్దు మనసిచ్చినప్పుడు ఒద్దిక య్యాక - ఇది పొద్దు కాదంటే ఊరుకోడు పిచ్చి కుదిరింది - ఇక పెళ్ళి కావాలి అన్నాడు పెళ్ళి కుదిరింది సరికొత్త పిచ్చాడు అయ్యాడు చూడు చూడండె కళ్ళు మూసుకున్నాడు అప్పుడు చూడ వద్దంటే కన్నుగీటి పిలిచాడు ఇప్పుడు పట్టపగలంటె జడుపేల దరిచేరమంటాడు బట్టబయలంటే నాపైట తెరమరుగు చేస్తాడు నీ నగలు చూస్తుంటే - యీ పగలే రేయల్లె తోస్తుంది. మాట ఏదైనా అది మనసు గుట్టంతా చెపుతుందీ
ఆ గుట్టు ఈగుట్టు పాట సాహిత్యం
చిత్రం: పిచ్చిమారాజు (1976) సంగీతం: కె.వి.మహదేవన్ సాహిత్యం: ఆత్రేయ గానం: పి.సుశీల, యస్.పి.బాలు ఆ గుట్టు ఈగుట్టు పై గుట్టు లో గుటు పెరుమాళ్ల కెరుకరో నాపట్టు నాగుట్టు నాతోటి జతకట్టు మొనగాళ్ల కెరుకరో కుర్రదాని గుండెలో దూరలేవు దూరినా గుట్టంతా దోచలేవు ఆడదాని వయసు చూసీ అయ్యయ్యో ఆశ పడకు దాని మనసేంటో తెలుసుకోకా అమ్మమ్మా ఆడుకోకు తాగు తాగించు; నిషా ఎక్కించు మజా చూపించు; ఖుషీ చేయించు ఏం చేశినా ఆడుకున్న కాసేపే గమ్మత్తురో ఆపైన నీ ఆట గల్లంతురో ఎంతెంత మగధీరులో మీసాలు దువ్వినారు దీని అంతు తేల్చుకుందామనీ వేషాలు మార్చినారు మధువు పోశాను పెదవి కలిపాను వగలు పోయాను శెగలు లేపాను ఏం చేసినా వంగతోటకాడ మాత్రం బావ కాదురోయ్ పందెమేసి ఎవ్వడూ నిలువ లేదురోయ్
No comments
Post a Comment