చిత్రం: సొమ్మొకడిది సోకొకడిది (1978) సంగీతం: రాజన్-నాగేంద్ర సాహిత్యం: వేటూరి సుందరరామమూర్తి (All) గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల, యస్.జానకి నటీనటులు: కమల్ హసన్, జయసుధ, రోజారమణి మాటలు: జంధ్యాల దర్శకత్వం: సింగీతం శ్రీనివాసరావు నిర్మాత: బి.రాగ మనోహరి విడుదల తేది: 05.01.1979
Songs List:
ఆకాశం నీ హద్దురా పాట సాహిత్యం
చిత్రం: సొమ్మొకడిది సోకొకడిది (1978) సంగీతం: రాజన్-నాగేంద్ర సాహిత్యం: వేటూరి సుందరరామమూర్తి గానం: యస్.పి.బాలు ఆకాశం నీ హద్దురా అవకాశం వదలొదురా పరువాల తొలిపొద్దులో హమేషా తమాషా చెయ్యరా నేలవిడిచి సాములెన్నో చెయ్యరా మబ్బుల్లో మెరుపంతా నీదిరా నిలబడి తాగే నీళ్ళు చేదురా పరుగెత్తయినా పాలు తాగరా బ్రతుకంటే బస్తీమే సవాల్రా ప్రపంచమే మాయా బజారురా.... గురి చూసి కొట్టాలిరా సిరి చూసి పట్టాలిరా నీ ఎత్తు ఎదగాలంటే ఎత్తులో జిత్తులో వెయ్యరా... నుదుటి రాత నువ్వు మార్చి రాయరా నూరేళ్ళ అనుభవాలు నీవిరా అనుకున్నది పొందడమే నీతిరా మనకున్నది పెంచడమే ఖ్యాతిరా మనిషి జన్మ మరువలేని ఛాన్సురా ఈ రేసులో జాక్పాట్ కొట్టాలిరా సుడిలోకి దూకాలిరా కడదాకా ఈదాలిరా నీ ఒడ్డు చేరాలంటే తడాకా మజాకా చూపాలిరా
ఓ బాలరాజా ప్రేమే ఎరుగవా పాట సాహిత్యం
చిత్రం: సొమ్మొకడిది సోకొకడిది (1978) సంగీతం: రాజన్-నాగేంద్ర సాహిత్యం: వేటూరి సుందరరామమూర్తి గానం: పి.సుశీల ఓ బాలరాజా ప్రేమే ఎరుగవా అందమైన ఆడపిల్ల చెంతచేరి సందెవేళ అడగలేక అడగరాని దడుగుతుంటే జాలిలేదా బాలరాజా మల్లెపువ్వు ఎర్రగుంటది - ఎన్నెలైన ఎండగుంటది వయసువచ్చి వొళ్ళు చేస్తది వగలు రేపి ఏడిపిస్తది నాడి చూస్తావో రాజా - నాటు మందే వేస్తావో నీటుగాడా ఘాటు ప్రేమ - థాటి చూస్తావో పొద్దుటేళ నిద్దరొస్తది కొత్త బరువు కోక కొస్తది రాతిరేళ జాతరౌతది - లేత సొగసు కోత కొస్తది మాత్ర వేస్తావో వాటు మంత్ర మేస్తావో మోజుతీరే ఫీజుయిస్తే పుచ్చుకుంటావో
అబ్బో నేరేడు పళ్ళు పాట సాహిత్యం
చిత్రం: సొమ్మొకడిది సోకొకడిది (1978) సంగీతం: రాజన్-నాగేంద్ర సాహిత్యం: వేటూరి సుందరరామమూర్తి గానం: యస్.పి.బాలు, యస్.జానకి అబ్బో నేరేడు పళ్ళు అబ్బాయి కళ్ళు అల్లో నేరేడు పళ్ళు పులుపెక్కే పోకళ్ళు కైపెక్కే ఆ కళ్ళు లేలేత కొబ్బరి నీళ్ళు ఆమ్మో గులాబి ముళ్ళు అమ్మాయి కళ్ళు గుచ్చే గులాబీ ముళ్ళు ఎరుపెక్కే చెక్కిళ్ళు ఎదలోన ఎక్కిళ్ళు కోరేది కొబ్బరి నీళ్ళు ఆ గిరజాల సరదాలు చూస్తుంటే అబ్బా విరజాజి విరబూసి పోతుంటే నూనూగు మీసాలు చేస్తున్న మోసాలు నే తాళ లేనమ్మో ఈ రోజు - నే సైపలేనమ్మో ఆ పోజు పగటిచుక్క అమ్మాయి - వగలమారి సన్నాయి మోహాలు దాహాలు - నాలో చెలరేగుతున్నాయి ఆ జడ పొడుగు మెడనునుపు చూస్తుంటే నా అడుగడుగు నీ వెనకే పడుతుంటే నీలోని అందాలు వేస్తున్న బంధాలు నే నోపలేనమ్మ ఈరోజు - నే నాపలేవమ్మ ఆ మోజు పదును చూపు అబ్బాయి పగలుచుక్క రాదోయి మూడు ముళ్ళూ పడేదాకా కాస్త నువ్వు ఆగవోయి
ఆ పొన్ననీడలో పాట సాహిత్యం
చిత్రం: సొమ్మొకడిది సోకొకడిది (1978) సంగీతం: రాజన్-నాగేంద్ర సాహిత్యం: వేటూరి సుందరరామమూర్తి గానం: యస్.పి.బాలు, పి.సుశీల ఆ పొన్ననీడలో ఈ కన్నెవాడలో వున్నా వేచివున్నా కదలి రావేలనే నా అన్నులమిన్న.... వ్రేపల్లె వాడలో గోపమ్మ నీడలో వెన్న దోచుకున్నా కథలు విన్నానులేరా అల్లరికన్న.... రాధమ్మ మనసు రాగాలు తెలుసు అది తీపికోపాల వయసు కన్నయ్య వయసు గారాలు తెలుసు అది మాయ మర్మాల మనసు అల్లరి ముద్దు హద్దులు వద్దు ఇద్దరమంటే ముద్దుకు ముద్దు పదహారు వేల సవతులు వద్దు ఆ పదహారు వేల సంకెళ్ళు వద్దు.... ఈ రాసలీల నీ ప్రేమగోల ఎవరెనా చూసారీ వేళ నీ మేనులోన నా ప్రేమవీణ సరిగమలే వింటా నీవేళ వేసవి చూపు వెన్నెలకాపు ఆశలు రేపు బాసలు ఆపు కలహాలు పెంచే కౌగిలి ముద్దు ఈ కలషాలు పెంచే కవ్వింత ముద్దు....
తొలి వలపు తొందరలు పాట సాహిత్యం
చిత్రం: సొమ్మొకడిది సోకొకడిది (1978) సంగీతం: రాజన్-నాగేంద్ర సాహిత్యం: వేటూరి సుందరరామమూర్తి గానం: యస్.పి.బాలు, యస్.జానకి తొలి వలపు తొందరలు ఉసిగొలిపే తెమ్మెరలు చెలితో నేను చలితో నీవు చేసే అల్లరులు పిలిచే నీ కళ్ళు.. తెలిపే ఆకళ్ళు కరగాలి కౌగిళ్ళలో వలపించే వళ్ళు.. వలచే పరవళ్ళు కదిలే పొదరిళ్ళలో తెరతీసే కళ్ళు.. తెరిచే వాకిళ్ళు కలవాలి సందిళ్ళలో పూసే చెక్కిళ్ళు.. మూసే గుప్పిళ్ళు బిగిసే సంకెళ్ళలో నీలో అందాలు.. నేనే పొందాలి నాకే చెందాలిలే కురిసే ఈ వాన.. తడిసే నాలోనా రేపిందిలే తపన పలికే పరువాన.. వలపే విరివాన నీవే ఆలాపనా వణికే నీ మేన.. సణిగే నా వీణ.. పలికిందిలే మోహన విరిసే నా నవ్వు.. విరజాజీ పువ్వు సిగలో నేనుంచనా నీలో రాగాలు.. నాలో రేగాలి నేనే ఊగాలిలే
No comments
Post a Comment