చిత్రం: SPARK (2023) సంగీతం: హేషం అబ్దుల్ వాహెబ్ నటీనటులు: విక్రంత్ రెడ్డి, మెహరీన్ ఫిర్జాద, రుక్షార్ దిల్షాద్ దర్శకత్వం: విక్రంత్ నిర్మాత: లీలా రెడ్డి విడుదల తేది: 2023
Songs List:
ఏమా అందం పాట సాహిత్యం
చిత్రం: SPARK (2023) సంగీతం: హేషం అబ్దుల్ వాహెబ్ సాహిత్యం: అనంత్ శ్రీరామ్ గానం: సిద్ శ్రీరామ్ ఏమా అందం ఏమా అందం భామ నీకు భువితో ఏమి సంబంధం, ఏం సంబంధం ఏమా అందం ఏమా అందం భామ నీకు భువితో ఏమి సంబంధం, ఏం సంబంధం గ్రామాలలో ఏ నగరాలలో ఈ మాదిరరందాన్నిలా ఏ మానవుడు చూడనేలేదే ఈ సొగసే ఇలకే ఓ గ్రంధం ఏమా అందం ఏమా అందం భామ నీకు భువితో ఏమి సంబంధం, ఏం సంబంధం వన్నెల విల్లై నీ తనువుందే కన్నులపై అది విరి బాణమైందే వెన్నెల జల్లై చిరు నగవుందే పున్నమిలా నను చేరిందే ఏమా అందం ఏమా అందం భామ నీకు భువితో ఏమి సంబంధం, ఏం సంబంధం గ్రామాలలో ఏ నగరాలలో ఈ మాదిరరందాన్నిలా ఏ మానవుడు చూడనేలేదే ఈ సొగసే ఇలకే ఓ గ్రంధం
ఇది ఇది మాయా పాట సాహిత్యం
చిత్రం: SPARK (2023) సంగీతం: హేషం అబ్దుల్ వాహెబ్ సాహిత్యం: అనంత్ శ్రీరామ్ గానం: శ్రేయా ఘోషల్, హేషం అబ్దుల్ వాహెబ్ అలపొద్దని పక్కకి వంచీ నీవీ నింగిని నిలువున చించీ మేఘమాలలో మెరుపులు తెంచీ ధూళి గాలుల దురుసులు తెంచి దూసుకొచ్చాను నీ ముందుకే చెయ్యి అందించు చాటెందుకే ఇది ఇది మాయా మాయా ఇది నిజమా మెలకువలాగే తోచే తన మహిమా ఏమి తెచ్చావు చుక్కల తోటలనుంచి రెండు తోకచుక్కలు కోసుకొనచ్చా నీ చెవుల చివరిలో గవ్వలుగా గుచ్చా ఏమి తెచ్చావు వేకువ అంచుల నుంచి ఎర్ర రంగు వెలుగులు దువ్వుకొనొచ్చా నీ చెంప ఛాయతో చాల్లేదని విడిచా కృష్ణబిలాన్ని వెంటేసుకొచ్చేది దేనికనీ దిష్టి చుక్కగా నీ బుగ్గమీద దిద్దాలనీ ఊహలో హాయి ఉన్న ఫలంగా కళ్ళముందుంటే నమ్మేదెలా చెప్పుమా విశ్వాసముంటే విశ్వాన్ని కూడా శాశించగలదే నీలో ప్రేమా ఇది ఇది మాయా మాయా ఇది నిజమా మెలకువలాగే తోచే తన మహిమా
జ్ఞాపకాలు కొన్ని చాలు పాట సాహిత్యం
చిత్రం: SPARK (2023) సంగీతం: హేషం అబ్దుల్ వాహెబ్ సాహిత్యం: అనంత్ శ్రీరామ్ గానం: కృష్ణ లాశ్య, హేషం అబ్దుల్ వాహెబ్ జ్ఞాపకాలు కొన్ని చాలు ఊపిరున్నన్నాళ్ళు గుండెల్లో పూలు జ్ఞాపకాలే సంతకాలు సంతోషాన్నే చూపే లోపలి దీపాలు ఒక్కో జ్ఞాపకం ఒక్కోలా నిన్నే దగ్గర చేసిందే నువ్వే జ్ఞాపకముండేలా మంతరమేసిందే తుళ్ళే కాలమే తెల్ల కాగితం ఒక్కో జ్ఞాపకం ఒక్కో రంగవుతూ ఉందే జ్ఞాపకాలు కొన్ని చాలు ఊపిరున్నన్నాళ్ళు గుండెల్లో పూలు జ్ఞాపకాలే సంతకాలు సంతోషాన్నే చూపే లోపలి దీపాలు నీతో చెప్పే ఏ మాటైనా నాకో జ్ఞాపకమే మౌనం కూడా ఇంకో జ్ఞాపకమేలే తియ్యని జ్ఞాపకమే, ఇది తగువు చల్లని జ్ఞాపకమే, ఇది నగవు చేతులు చాచిన వయసుకి కౌగిలి వెచ్చని జ్ఞాపకమే నువ్వు మేఘానివై… తాకే చోటులో ఒక్కో జ్ఞాపకం… ఒక్కో చినుకవుతోందే జ్ఞాపకాలు కొన్ని చాలు ఊపిరున్నన్నాళ్ళు గుండెల్లో పూలు జ్ఞాపకాలే సంతకాలు సంతోషాన్నే చూపే లోపలి దీపాలు నీపై ఇష్టం పెంచే పయనం నాకో జ్ఞాపకమే ఆపై మజిలీ ఇంకో జ్ఞాపకమేలే ఆశకి జ్ఞాపకమే, ప్రతి స్పర్శ ధ్యాసకి జ్ఞాపకమే, ప్రతి వరసా నీ పెదవంచుకి నా పెదవంచుల లాలన జ్ఞాపకమే నువ్వే నేనుగా తోచే వేళలో ఒక్కో జ్ఞాపకం ఒక్కో గ్రంధమయ్యిందే ఒక్కో జ్ఞాపకం ఒక్కోలా నిన్నే దగ్గర చేసిందే నువ్వే జ్ఞాపకముండేలా మంతరమేసిందే తుళ్ళే కాలమే తెల్ల కాగితం ఒక్కో జ్ఞాపకం ఒక్కో రంగవుతూ ఉందే జ్ఞాపకాలు కొన్ని చాలు ఊపిరున్నన్నాళ్ళు గుండెల్లో పూలు జ్ఞాపకాలే సంతకాలు సంతోషాన్నే చూపే లోపలి దీపాలు
లేఖా లేఖా పాట సాహిత్యం
చిత్రం: SPARK (2023) సంగీతం: హేషం అబ్దుల్ వాహెబ్ సాహిత్యం: అనంత్ శ్రీరామ్ గానం: అర్మాన్ మాలిక్ ఎందుకో నిను కలుసుకున్న ఇందుకే అని తెలుసుకున్న చిన్నగా చిన చిన్నగా నే నీకు దగ్గరవుతున్న ఒంటరై నీ పిలుపు విన్నా జంటనై నే పలుకుతున్నా మెల్లగా మెలమెల్లగా నే నీకు సొంతమవుతున్నా లేఖా లేఖా నీతోనే చివరిదాక లేఖా లేఖా నీ కన్న ఎవరే ఇంకా నిసాగరిసా సరి సరి సరి నిసాగరిసా నా నిన్నల్లో నీ నీడైనా లేదే నా రేపు మాత్రం నువ్వు లేకపోతే రాదే నేననే తీరానికి ఓ దారిలాగ నిలిచావే లేఖా లేఖా నీతోనే చివరిదాక లేఖా లేఖా నీ కన్న ఎవరే ఇంకా
రాధేశా పాట సాహిత్యం
చిత్రం: SPARK (2023) సంగీతం: హేషం అబ్దుల్ వాహెబ్ సాహిత్యం: అనంత్ శ్రీరామ్ గానం: శ్వేతా మోహన్ కనబడు కంటికి తొందరగా కనుగొల లేను ఇక అంత ఇదిగా కనబడు కంటికి తొందరగా నిన్ను వెతికేదేట్టు నేరుగా కనబడు కంటికి తొందరగా వెనకేం దగవుగా ఏ చిలిపి కోనలోన కిమ్మనక ఉన్నావూ ఏ వెదురు కాణాల్లో ఎదురై వేణువూదేవూ ఏ కోలను తీరంలో కొమ్మలకు ఊగేవు కూకలను దోచేస్తూ మరచితివా దోచిన మనసుని రాధేశ కనబడు రాధేశ కందినది కన్నె చూపు కునుకుండా నీదు కదా నీ ధ్యాస రాధేశ కనబడు రాధేశ కాలమిక లేదు అంటూ తరిమేస్తూ ఉంది కదా నా శ్వాశ రారా వేణు గోపాబాలా రాజిత సద్గుణ జయశీలా రారా వేణు గోపాబాలా రాజిత సద్గుణ జయశీలా సారా శాఖా నేరమేని మరుబాధ ఒరవలేవురా రారా వేణు గోపాబాలా రాజిత సద్గుణ జయశీలా రాధేశా జాతబడు రాధేశా జన్మకొక స్వప్నముంది అది సత్యమైంది కదా ప్రాణేశ రాధేశా జాతబడు రాధేశా జన్మ మరు జన్మ జన్మ ప్రతి జన్మ నీకు ఈహా రాసేశా
No comments
Post a Comment