చిత్రం: శృంగార రాముడు (1979) సంగీతం: కె.వి.మహాదేవన్ సాహిత్యం: ఆత్రేయ (All) గానం: యస్.పి.బాలు, పి.సుశీల, వాణిజయరాం నటీనటులు: యన్.టి.రామారావు, శరత్ బాబు, లత, జయమాలిని దర్శకత్వం: కె.శంకర్ నిర్మాత: రామమూర్తి విడుదల తేది: 22.11.1979
Songs List:
ఈ రోజు ఈ రోజే పాట సాహిత్యం
చిత్రం: శృంగార రాముడు (1979) సంగీతం: కె.వి.మహాదేవన్ సాహిత్యం: ఆత్రేయ గానం: యస్.పి.బాలు ఈ రోజు ఈ రోజే - ఇది నిన్నా కాదు - రేపూ కాదు... అదే దీని మోజు ప్రతి మనిషి తనకే తెలియక పుడతాడొకరోజు తానొకడే పుట్టినట్టు - చేస్తాడు పుట్టినరోజు రోజులు తెలియని పుట్టుకలున్నాయ్ పుట్టుకలేని రోజే లేదోయ్ పుట్టటమే ఒక గొప్పకాదు - పుట్టి గొప్పకావాలి- ఈరోజే నా రోజని అనుకుంటే - ప్రతిరోజు ఒక పండగే రేపూ రేపని వూరుకుంటే - ఈ రోజూ ఒక దండగే ఇరవైనాలుగు గంటలు కాదోయి - ఈ క్షణమొకటే నీకొక రోజోయి అనుభవించు వున్న క్షణాన్ని అందినంత ఆనందాన్ని
హౌ ఆర్ యు పాట సాహిత్యం
చిత్రం: శృంగార రాముడు (1979) సంగీతం: కె.వి.మహాదేవన్ సాహిత్యం: ఆత్రేయ గానం: యస్.పి.బాలు హౌ ఆర్ యు ... హవ్ డూయూడు అని అడగాలి ఫ్లవరంటే అమ్మాయి షవరల్లే నవ్వాలి - రివరల్లే వురకాలి హాపీ టు మీట్.. యు సర్ - వెరీ వెరీ హాపీ - టు సర్వ్ యు సర్ ఎప్పుడేమి కావాలో ఎలా ఎలా చెయ్యాలో మీ రుచులు ఏమిటో అభిరుచులు ఏమిటో చెబితే చేసేందుకున్నాను ఒకసారి చేశాక చెప్పకనే చేసేస్తానని చెప్పాలి. కష్టపడి వచ్చారు కాసేపు పడుకోండి నీరసంగ వున్నారు ఈ పళ్ళరసం తాగండి వేడి తగ్గిపోతుంది స్నానం చెయ్యండి పడుకోబోయే ముందు పాలు తాగండి వూరుగాని వూరొచ్చిన మీకు వుపచారాలు చెయ్యాలి అ తారింటో అలుడిలా అడిగిందంతా యివ్వాలి - మీరడిగిందంతా యివ్వాలి ఐ లైక్ యు, డూ యు లైక్ మి - ఇఫ్ ఐ లవ్ యు విల్ యు లవ్ మి అందాక వచ్చాక అడగకనే నేనడిగేలా చెయ్యాలి.
నందమూరి అందగాడా పాట సాహిత్యం
చిత్రం: శృంగార రాముడు (1979) సంగీతం: కె.వి.మహాదేవన్ సాహిత్యం: ఆత్రేయ గానం: యస్.పి.బాలు, వాణిజయరాం నందమూరి అందగాడా నేనందుకున్న చందురూడా కాశ్మీరు కన్నెపిల్లా నే కట్టుకున్న ప్రేమఖుల్లా ఇద్దరం కలిశాము యీ వేళా.…ఎండలో కాస్తుంది పండువెన్నెలా.... మంచితనం చక్కదనం ఒక్కటైన చోటా పూస్తుంది దానిమ్మ తోట పూతోట పడుచుతనం గడుసుదనం పాడేది పాట పలుకుతుంది ప్రతి పిట్ట నోట మంచుమీది ఆట మనకు ముచ్చట మనమంటే మంచుకే ఎంతో ముద్దు మంచుకొండమీద శివుడు నాట్యమాడినాడు పార్వతికి తనలోని సగమిచ్చినాడు. అదే మంచుమీద కలిసి ఆడాము నేడు ఆది దంపతులం మనం ఏనాడూ పుటినిలు మెట్టినిలు యీ పడవలోనే మొదటి రాత్రి పడకటిల్లు కొలనులోనే ఆకాశం కడుతుంది తారల జలతారు గులాబీలు చల్లుతాయి పన్నీరు నీకు నాకు సాటిలేరు ఎవ్వరు నువ్వూ నేనే ప్రేమకు మారు పేరు ....
చీటికి ప్రాణం చేవ్రాలు పాట సాహిత్యం
చిత్రం: శృంగార రాముడు (1979) సంగీతం: కె.వి.మహాదేవన్ సాహిత్యం: ఆత్రేయ గానం: వాణిజయరాం చీటికి ప్రాణం చేవ్రాలు -ఆ చీటీలన్నవి రెండు రకాలు చిరిగి ముక్కలై పోయేవి చెరగక మక్కువ దోచేవి నా వయసొక చీటీ నా సొగసోక చీటీ వాటికి ప్రాణం పోయి నీ చేవ్రాలతోటి నీ భాషొకటి నా భాషొకటి- ఇద్దరి కళ్ళకు లిపి వొకటి అది చేసే భాసలు శతకోటి ఈ పెదవులు చూడు - ఆ మధువులు చూడు రెంటికి యిచ్చేయ్ ఓ ముదులు చీటీ నీ కలశొకటి ఇద్దరమాడే ఆటొకటి ఇది నీకూ నాకూ తొలి పోటీ....
ఆడేదే ఆడది పాట సాహిత్యం
చిత్రం: శృంగార రాముడు (1979) సంగీతం: కె.వి.మహాదేవన్ సాహిత్యం: ఆత్రేయ గానం: పి.సుశీల ఆడేదే ఆడది ఆడించే చెయ్యెవరిది .....? నీది నాదీ కానిది ఏమిటది....? ఎవ్వరి పాటో పాడుతున్నాను ఏ తాళానికో ఆడుతున్నాను పెదవికి మధువును అందిస్తూ- వయసుకు సొగసును చూపిస్తూ నాలో నేను ఏమవుతున్నది - మీలో ఎవరికి చెప్పను. కన్నెసొగసులో కైపులున్నాయి కన్నుల గిన్నెల నింపుతున్నాయి. గబ గబ గడ గడ తాగండి అడుగులు తడబడి తూలండి తెల్లారాక తెలివొచ్చాక - ఏమవుతుందో చెప్పను
వస్తానన్నావు పాట సాహిత్యం
చిత్రం: శృంగార రాముడు (1979) సంగీతం: కె.వి.మహాదేవన్ సాహిత్యం: ఆత్రేయ గానం: యస్.పి.బాలు, వాణిజయరాం వస్తానన్నావు - వస్తే చూస్తానన్నాను పిచ్చిదాన్ని వచ్చుంటావని నేనే ముందుగ వచ్చాను వస్తానన్నాను - వ స్తే చూస్తానన్నావు పిచ్చిదాని కంగారంతా - ముందే వచ్చి చూశాను మగాడు ముందే రావాలి - ఆడది వచ్చి చేరాలి. అప్పుడే ఈడూ జోడూ కలవాలి జన్మలుంటాయి - మన జంట కలిసేందుకు కాలముంటుంది - మన వెంట నడిచేందుకు దేవుడుంటాడు రాసిందే రాసేందుకు ఎవరిచేతవును మన రాత మార్చేందుకు పవిత్ర ప్రేమకు యిన్నేళ్ళు చరిత్ర రాసిన కన్నీళ్ళు నిజాలు కావు మనకు - ఆ విషాద గీతాలు గంగా పొల్లాతో కలవాలి - మన ప్రేమతో తూర్పు పడమరలు చేరాలి ఒక రంగులో ముంతాజ్ పుట్టింది - షాజహాను వలచేందుకు షాజహాను బ్రతికాడు – తాజ్ మహల్ కట్టేందుకు నీ మనసే నాకు మహలై వుంటే - మరణ మెక్కడిది... మరణం లేని మమతలకెందుకు మహల్లు కట్టేది యుగాలు ముందు వున్నాము ముందు యుగాలు వుంటాము ప్రేమకు వేరే వేరే పేర్లు పెడతామా.... ప్రేమ ఏలాలి దేశాల రాజ్యాంగము పేద మహారాజు ఎక్కాలి ఒక పీఠము ప్రపంచమంతా ప్రతిరోజూ వసంత రుతువై పూస్తుంది అనంతమైన ఆనందం నిరంతరంగా వుంటుంది.
No comments
Post a Comment