చిత్రం: చదువు సంస్కారం (1975) సంగీతం: రమేశ్ నాయుడు సాహిత్యం: రాజశ్రీ నటీనటులు: రంగనాథ్, కైకాల సత్యనారాయణ, గుమ్మడి దర్శకత్వం: రాజశ్రీ నిర్మాత: కె. రాఘవ విడుదల తేది: 14.02.1975
Songs List:
ఆగండి ఆగండి మన సంస్కతికే పాట సాహిత్యం
చిత్రం: చదువు సంస్కారం (1975) సంగీతం: రమేశ్ నాయుడు సాహిత్యం: రాజశ్రీ గానం: యస్.పి.బాలు & కోరస్ పల్లవి: ఆగండీ - ఆగండి – మన సంస్కృతికే ఇది మచ్చండి, దేశానికి వెన్నెముకలయిన మన విద్యార్థుల కిది. తగదండీ | అడపిల్లలను తోబుట్టువులా-అభిమానంతో చూడండీ! చరణం: 1 ఎవరి చెల్లినో అలరిచేసి ఆనందించావా రోజు, నీ చెల్లి నే అల్లరిచేసి - బాధపడేవూ ఈ రోజు, చదువు - సంస్కారం - ప్రతి మనిషికి అవసరం, రెండూ నిండుగా ఉంటేనే - పురోగమించును సమాజం చరణం: 2 స్వలాభానికై స్వార్ధనాయకులు చెప్పే మాటలు వినకండి ఉద్రేకంలో మన సంపదను - మనమే కాల్చుట వలదండీ । చూశారా-చూశారా-ఈ దగాపడిన మనతమ్ముడు, అమానుషంగా - అనామకంగా ప్రాణాలను కోల్పోయాడు, ఏదో ఏదో సాధిస్తాడని - ఎన్నో ఆశలు పెట్టుకుని గలూ - రేయీ కష్టపడి, చదివించిందీ బిడ్డను ఈ తలి గోడు వినువారెవరు ? బూరా ? మీరా! ఆ నాయకులా ? ఎవరు ? చరణం: 3 మనం ఎవరిమో తెలుసుకుని - మన బాధ్యత గుర్తుంచుకొని, కన్నవారి బంగారు కలలకూ రూపం దిద్దాలీ మనను కన్న దేశాన్ని సౌభాగ్యంతో తీర్చిదిద్దాలీ చదువూ సంస్కారం - ప్రతి మనిషికి అవసరం, రెండు ఉంటేనే పురోగమించును సమాజం
దీపానికి కిరణం ఆభరణం..పాట సాహిత్యం
చిత్రం: చదువు సంస్కారం (1975) సంగీతం: రమేశ్ నాయుడు సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి గానం: పి.సుశీల పల్లవి: ఉమ్.. ఊఁ.. ఆ.. ఆ.. దీపానికి కిరణం ఆభరణం.. రూపానికి హృదయం ఆభరణం హృదయానికి.. ఏనాటికీ.. తరగని సుగుణం.. ఆభరణం తరగని సుగుణం.. ఆభరణం దీపానికి కిరణం ఆభరణం.. రూపానికి హృదయం ఆభరణం చరణం: 1 నిండుగ పారే యేరు.. తన నీటిని తానే తాగదు జగతిని చూపే కన్ను.. తన ఉనికిని తానే చూడదు పరుల కోసం.. బ్రతికే మనిషి.. పరుల కోసం బ్రతికే మనిషి.. తన బాగు తానే కోరడు.. తన బాగు తానే కోరడు.. దీపానికి కిరణం ఆభరణం.. రూపానికి హృదయం ఆభరణం చరణం: 2 తాజమహలులో కురిసే వెన్నెల.. పూరి గుడిసెపై కురియదా బృందావనిలో విరిసే మల్లియ.. పేద ముంగిట విరియదా మంచితనము పంచేవారికి.. మంచితనము పంచేవారికి.. అంతరాలతో పని ఉందా.. అంతరాలతో పని ఉందా.. దీపానికి కిరణం ఆభరణం.. రూపానికి హృదయం ఆభరణం హృదయానికి.. ఏనాటికీ.. తరగని సుగుణం.. ఆభరణం తరగని సుగుణం.. ఆభరణం చరణం: 3 వెలుగున ఉన్నంత వరకే.. నీ నీడ తోడుగా ఉంటుంది చీకటిలో నీవు సాగితే.. అది నీకు దూరమవుతుంది ఈ పరమార్థం తెలిసిన నాడే.. ఈ పరమార్థం తెలిసిన నాడే.. బ్రతుకు సార్థకమౌతుంది.. బ్రతుకు సార్థకమౌతుంది.. దీపానికి కిరణం ఆభరణం.. రూపానికి హృదయం ఆభరణం హృదయానికి.. ఏనాటికీ.. తరగని సుగుణం.. ఆభరణం తరగని సుగుణం.. ఆభరణం
నేను ఎవ్వరో అడగకు పాట సాహిత్యం
చిత్రం: చదువు సంస్కారం (1975) సంగీతం: రమేశ్ నాయుడు సాహిత్యం: రాజశ్రీ గానం: పి.సుశీల పల్లవి: నేను ఎవ్వరో అడగకు, నువ్వు ఎవ్వరో అడగను నీ కొరకే ఈ సందడి, తెలవారేవర కే ఈ ముడి .... ఈ సందడి నేను చరణం: 1 వయసు - ఇంద్రధనుసు, .క్షణకాలం - దాని సొగసు, తెలుసు - నాకు తెలుసు, ఈ నిజం - నీకూ తెలుసు, మధురమైన పెదవులుండగా, మధువు ఎందుకూ దండగ దండ చరణం: 2 కాలం కడలి కెరటం, ఆగవులే ఎవరికోసం, పరువం - కన్నెపరువం పాడేనూ ... తోడుకోసం, తలుపులేలేని కోటనూ, తలపులున్న వారి బాటను వలపుబాటను నేను
లవ్ ఈజ్ బ్లైండ్ పాట సాహిత్యం
చిత్రం: చదువు సంస్కారం (1975) సంగీతం: రమేశ్ నాయుడు సాహిత్యం: రాజశ్రీ గానం: పి.సుశీల పల్లవి: లవ్ ఈజ్ బ్లైండ్' - ప్రేమ గుడ్డిదీ, యూత్ ఈజ్ మాడ్' వయసు పిచ్చిది, పిచ్చి వయసులో - గుడ్డి ప్రేమలో, హేపీ, బి హేపీ, బి హేపీ - హేపీ, హేపీ ... ! చరణం: 1 ఎటు చూసినా మండే ఎండలు, నా చూపులూ - చల్లని జల్లులూ, నువ్వూ నేనూ చేపల్లాగా ఈదులాడాలీ నువ్వో - నేనో తేలేదాకా పోటీ చెయ్యాలి; అందుకే నన్నందుకో, నా నా కళ్ళలో నిను చూసుకో చరణం: 2 చిటపట కురిసెను చినుకులూ, అవి చినుకులు కావు, అవి కులుకులూ, నా కులుకులూ, పాల పొంగులాగా పొంగుతుంది మోహం, రేయి - పగలు నీతో, కోరుతుంది స్నేహం॥ అందుకే, నన్నందుకో నా కళ్ళలో నిను చూసుకొ లవ్ ఈజ్ బ్లైండ్ చరణం: 3 చలి .... చలి చలి చలిగాలిలో, నెచ్చెలి చెక్కిలి, నెచ్చెలి ఇచ్చెనూ, వెచ్చని కౌగిలి, కోడెనాగులా, కొండవాగులా కోరిక రేగింది తోడూ - నీ డె, నాతో ఉంటే తీరిపోతుందీ, మోజు తీరిపోతుంది అందుకే, నన్నందుకో, నా కళ్ళలో నిను చూసుకో
వద్దు వద్దు పెళ్ళొద్దు పాట సాహిత్యం
చిత్రం: చదువు సంస్కారం (1975) సంగీతం: రమేశ్ నాయుడు సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి గానం: పి.సుశీల, యస్.పి.బాలు వద్దూ - వద్దు పెళ్ళొద్దు - నీతో నా పెళ్ళొద్దు వద్దు వద్దు వద్దు వద్దు - పెళ్ళొద్దు. వద్దూ - వద్దు అనొద్దు వద్దు వద్దు వద్దు వద్దు అనొద్దు. 'ఆఁ' అంటే - ఊ అంటే ఆరా తీస్తావు, ఏదో ఏదో ఏదో సాకు చెప్పి, సోదా చేస్తావు ఆ మాట నువ్వు అనొద్దు చట్టాలంటావు, దొంగను పట్టాలంటావు పడుకున్నా - ఆ గొడవే పలవరిస్తూ వుంటావు సూటిగా గుండెలో దూరి సోదాచేస్తాను, వాడి వాడి చూపులతో బేడీలు వేస్తాను, కౌగిలి చెరసాలలో నిన్ను, నిన్నే ఖైదీ చేస్తాను కనీ - వినీ యెరుగని కఠిన శిక్ష వేస్తాను వద్దా.....వద్దు ప్రేమంటే విలువైన జాతిరత్నం పెళ్ళంటే దాన్ని పొదిగే పసిడి ఉంగరం, ఉంగరాన ఉంటేనే రతనానికి అందం, ఇద్దరూ ఒకటైతే, ఇద్దరూ ఒకటైతేనే హద్దులేని ఆనందం వద్దా.... వద్దు. ఇద్దరమన్నది మనలో ఎపుడో రద్దయిపోయిందీ, అల్లరి మనసుల అల్లికలోనే పెళ్ళయిపోయిందీ అందుకే - వద్దన్నానందుకే వద్దన్నా గాని అసలొద్దన్నానా, ఈ నిమిషంలో పెళ్ళన్నా నే కాదంటానా. వద్దు మనం అనొద్దు, పెళ్ళొద్దనీ అనొద్దు, వద్దు వద్దు వద్దు వద్దు అనొద్దు.
సొగసైన చిన్నది పొగ రేగుతున్నది పాట సాహిత్యం
చిత్రం: చదువు సంస్కారం (1975) సంగీతం: రమేశ్ నాయుడు సాహిత్యం: రాజశ్రీ గానం: యస్.పి.బాలు సొగసైన చిన్నది పొగ రేగుతున్నది
No comments
Post a Comment