చిత్రం: దీపారాధన (1981) సంగీతం: కె.చక్రవర్తి సాహిత్యం: దాసరి నారాయణ రావు గానం: యస్.పి.బాలు, పి.సుశీల, ఆనంద్, రమేష్, పుష్పలత నటీనటులు: శోభన్ బాబు, జయప్రద, మురళీమోహన్, మోహన్ బాబు, దీప, శివరంజని (నూతన నటి) దర్శకత్వం: దాసరి నారాయణ రావు నిర్మాత: నన్నపనేని సుధాకర్ విడుదల తేది: 11.04.1981
Songs List:
సన్నగా.. సన సన్నగా... పాట సాహిత్యం
చిత్రం: దీపారాధన (1981) సంగీతం: కె.చక్రవర్తి సాహిత్యం: దాసరి నారాయణ రావు గానం: యస్.పి.బాలు, పి.సుశీల పల్లవి: సన్నగా.. సన సన్నగా... సన్నగా.. సన సన్నగా..వినిపించే ఒక పిలుపు సన్నగా .. కను సన్నగా.. కనిపించే ఒక మెరుపు ఆ పిలుపు మెరుపుదో.. ఆ మెరుపే పిలుపుదో చరణం: 1 కోరికమ్మ గుడిలో కోయిలమ్మ కూసిందో జాజులమ్మ తోటలో గాజులమ్మ పిలిచిందో జాజులు జాజులు చేరి గుసగుసమన్నాయి.. ల.. ల.. ల.. ల గాజులు గాజులు చేరి గలగలమన్నాయి అన్నాయి అమ్మాయి నీ నడుమే సన్నాయి విన్నాయి అబ్బాయి ఈ నీ మాటల సన్నాయి సన్నగా.. సన సన్నగా..వినిపించే ఒక పిలుపు సన్నగా .. కను సన్నగా.. కనిపించే ఒక మెరుపు ఆ పిలుపు మెరుపుదో.. ఆ మెరుపే పిలుపుదో ఆ.. ఆహాహా... ఆహాహా.. ఆహహాహా చరణం: 2 చుక్కలమ్మ వాకిట్లో జాబిలమ్మ పూచిందో మబ్బులమ్మ పందిట్లో ఉరుములమ్మ ఉరిమిందో మబ్బు మబ్బు కలిసి మంచం వేశాయి.. ఆహాహా.. చుక్క చుక్క కలిసి పక్కలు వేశాయి వేశాయి అబ్బాయి ప్రేమకు పీటలు వేశాయి వేశాయి అమ్మాయి పెళ్ళికి బాటలు వేశాయి సన్నగా .. కను సన్నగా.. కనిపించే ఒక మెరుపు సన్నగా.. సన సన్నగా..వినిపించే ఒక పిలుపు ఆ పిలుపు మెరుపుదో.. ఆ మెరుపే పిలుపుదో ఆ.. ఆహాహా... ఆహాహా..ఆహహాహా
మనిషికి సర్వం ప్రాణం పాట సాహిత్యం
చిత్రం: దీపారాధన (1981) సంగీతం: కె.చక్రవర్తి సాహిత్యం: దాసరి నారాయణ రావు గానం: యస్.పి.బాలు, ఆనంద్, రమేష్ మనిషికి సర్వం ప్రాణం
వెన్నెలవేళ మల్లెలనీడ పాట సాహిత్యం
చిత్రం: దీపారాధన (1981) సంగీతం: కె.చక్రవర్తి సాహిత్యం: దాసరి నారాయణ రావు గానం: యస్.పి.బాలు, పి.సుశీల వెన్నెలవేళ మల్లెలనీడ
సీతాదేవి కళ్యాణం పాట సాహిత్యం
చిత్రం: దీపారాధన (1981) సంగీతం: కె.చక్రవర్తి సాహిత్యం: దాసరి నారాయణ రావు గానం: జి. ఆనంద్, మాధవపెద్ది రమేష్ సీతాదేవి కళ్యాణం చూసిందెవరో చెప్పండి
తూరుపు తిరిగి దండం పెట్టు పాట సాహిత్యం
చిత్రం: దీపారాధన (1981) సంగీతం::చక్రవర్తి రచన::దాసరి గానం::బాలు,P.సుశీల తూరుపు తిరిగి దండం పెట్టు అన్నారండి మావారు తూరుపు తిరిగి దండం పెట్టు అన్నారండి మావారు ఆ తూరుపెక్కడో చెప్పాలండి..మీలో...ఒక్కరు ఆ..ఎవరో...ఒక్కరూ.. ముక్కుకు సూటిగ పోతే నీకు ఉత్తరం మొస్తుండీ ముక్కుకు సూటిగ పోతే నీకు ఉత్తరం మొస్తుండీ ఆ పక్కకు తిరిగి వెనక్కు చూస్తె తూరుపు వుంటుందీ...తూరుపు వుంటుందీ..హ్హా..హ్హా.. అమ్మాయి..పుడితే..పేరేమి..అన్నాను..తప్పా..ఆ ఆ అబ్బాయి..పుడితే..పేరేమి..అన్నాను..తప్పా..ఆ ఆ అబ్బాయే..ఎందుకు పుట్టాలీ...అమ్మాయే..ఎందుకు పుట్టాలీ... అబ్బాయే..ఎందుకు పుట్టాలీ...అమ్మాయే..ఎందుకు పుట్టాలీ...అబ్బాయెందుకు పుట్టాలీ ??అమ్మాయెందుకు పుట్టాలీ ??అబ్బాయెందుకు పుట్టాలీ ?? అమ్మాయెందుకు పుట్టాలీ ?? అబ్బాయే..అమ్మాయే..అబ్బాయే..అమ్మాయే.. అబ్బాయే..అమ్మాయే..అబ్బాయే..అమ్మాయే..అమ్మాయి అయితే బొట్టు కాటుక దిద్దొచ్చు..అబ్బా.. తలలో పూవులు పెట్టోచ్చు అబ్బాయి అయితే..చొక్కా లాగు వేయోచ్చు..చక్కగ మీసం పెంచొచ్చు అబ్భా మీసాలంటే నాకు భయమండీ అబ్బాయొద్దు..గిబ్బాయొద్దు..నాకు అమ్మాయే..కావాలి నీకు అమ్మాయే..కావాలా..ఆ..అమ్మాయే..కావాలా..ఆ.. అయితే తూరుపు తిరుగి దండం పెట్టు..హా హ హ హ తూరుపు తిరిగి దండం పెట్టు అన్నారండి మావారు తూరుపు తిరిగి దండం పెట్టు అన్నారండి మావారు ఆ పక్కకు తిరిగి వెనక్కు చూస్తె తూరుపు వుంటుందీ...తూరుపు వుంటుందీ వెళ్ళాలి..మనమూ..తిరపతీ..అన్నాను..తప్పా..ఆ ఆ..వెళ్ళాలి మనమూ..బొంబాయి అన్నాను తప్పా..ఆ.. బోంబాయే ఎందుకు వెళ్ళాలీ ? ఆ..తిరుపతే ఎందుకు వెళ్ళాలీ ? బోంబాయే ఎందుకు వెళ్ళాలీ ? ఈ..తిరుపతే ఎందుకు వెళ్ళాలీ ? బోంబాయ్ ఎందుకు వెళ్ళాలీ...తిరుపతి ఎందుకు వెళ్ళాలీ.. బోంబాయ్ ఎందుకు వెళ్ళాలీ..తిరిపతే..ఎందుకు వెళ్ళాలీ.. తిరుపతే..బోంబాయే..తిరుపతే..బోంబాయే.. తిరుపతే..బోంబాయే..తిరుపతే..బోంబాయే.. బోంబాయ్ అయితే రైలూ..ప్లైను ఎక్కోచ్చు దేశం చుట్టి రావచ్చు.. తిరుపతి అయితే...కోండ మెట్లూ ఎక్కోచ్చు మొక్కి గుండు ఇవ్వొచ్చు..అబ్బో..గుండా..ఆ.. గుండంటే నాకు భంగా..హా..హా..హా.. అయితే..తూరుపు తిరిగి దండం పెట్టండి..హు..హు.. తూరుపు తిరిగి దండం పెట్టు అంటుందండి ఆవిడగారు తూరుపు తిరిగి దండం పెట్టు అంటుందండి ఆవిడగారు ఆ తూరుపెక్కడో చెప్పాలండి..మీలో...ఒక్కరు ఆ..ఎవరో...ఒక్కరూ..
తెల్ల కాగితం మనిషి జీవితం పాట సాహిత్యం
చిత్రం: దీపారాధన (1981) సంగీతం: కె.చక్రవర్తి సాహిత్యం: దాసరి నారాయణ రావు గానం: యస్.పి.బాలు తెల్ల కాగితం మనిషి జీవితం ఒకో అక్షరం ప్రతి నిమిషం చెయ్యి మారితే రాత మారుతుంది చెయ్యి జారితే మచ్చ మిగులుతుంది బాష ఏది ఐనా చూసేందుకు అక్షరాలు కొన్నే అక్షరాలు కొన్నైనా రసేందుకు భవాలు ఎన్నో అనుకున్నవి రాయలేరు కొందరు రాసినా చెయ్యలేరు కొందరు చేసినా పొందలేరు కొందరు పొందినా ఉందలేరు కొందరు బంగారం కురిసినా పట్టెందుకు చేతులు రెండే చెతులెన్ని ఉన్నా తినడానికి నోరు ఒక్కటే తినడానికి లెనివారు కొందరు తిని అరిగించుకొలేనివారు కొందరు ఉండి తినలేనివారు కొందరు తిన్నా ఉండలెనివారు కొందరు
No comments
Post a Comment