చిత్రం: ఎదురీత (1963) సంగీతం: కె.వి.మహదేవన్ సాహిత్యం: ఆచార్య ఆత్రేయ, ఆరుద్ర గానం: పి.బి.శ్రీనివాస్, మాధవపెద్ది సత్యం, పిఠాపురం నాగేశ్వరరావు, ఎస్.జానకి, కె.జమునారాణి నటీనటులు: కాంతారావు, కృష్ణకుమారి, శారద, గిరిజ, హేమలత దర్శకత్వం: బి.ఎస్.నారాయణ నిర్మాత: ఎం.ఎ.వేణు విడుదల తేది: 14.01.1963
Songs List:
ఈ వేళ మనం వ్రాసుకున్న ప్రేమపత్రం పాట సాహిత్యం
చిత్రం: ఎదురీత (1963) సంగీతం: కె.వి.మహదేవన్ సాహిత్యం: ఆచార్య ఆత్రేయ గానం: కె.జమునారాణి, పిఠాపురం నాగేశ్వరరావు ఈ వేళ మనం వ్రాసుకొన్న ప్రేమపత్రము ఖరామ చేసుకొందుము తరులు గిరులు జరులు దరులు దాటిపోదాము తనివిదీర తలపులూర దరులు దాటిపోదాము మనసులనే కాగితాన కనుల భాషతో ఆశతో మమతలనే షరతులతో వ్రాసుకొంటిమి ఉంటిమి పెళ్లి ముద్రవేసి గట్టిచేసుకుందాము - గుట్టు దాచుకుందాము అదే అందము వడ్డీకి వడ్డీ వేసి వలపు పెంచుదాం మించుదాం అసలు తీరిపోకుండ అప్పు నిలుపుదాం కలుపుదాం పిల్లలతో చెల్లు వేసుకుందాము, మళ్ళీ వ్రాసుకుందాం ఈ వేళ మనం వ్రాసుకున్న ప్రేమపత్రము ఖరారుచేసుకుందము
ఉన్నవారికన్న మనం ఎక్కువేలే పాట సాహిత్యం
చిత్రం: ఎదురీత (1963) సంగీతం: కె.వి.మహదేవన్ సాహిత్యం: ఆరుద్ర గానం: పి.బి.శ్రీనివాస్ ఉన్నవారికన్న మనం ఎక్కువేలే మన హృదయంలో అందరిపై మక్కువేలే పాటువడి అలుపు తీర్చు ఆటలాడుదాం బాధలన్ని ఎగిరిపోవు పాటపాడుదాం కోటికి పడగెత్తలేము కొరతేలేదు నోటిమాట జారబోము లోటే రాదు పాటుపడగ ఒళ్ళు మనం దాచుటలేదు పరుల దోచుటలేదు చేయి చాచుటలేదు అయిదువేళ్లు నోటిలోకి పోవుటలేదు అందుచేత కాని పనులు చేయుటలేదు. రోజుకొక్క జోడుకట్టి వలచుటలేదు మోజుదీరి చిన్నదాన్ని విడుచుటలేదు కళ్ళలోన దుమ్ముకొట్టి బతుకుటలేదు కాళ్ళకింద గోతులు తవ్వుట లేదు మనకెందుకు వద్దులే యితరుల ఊసు మనకు లేదులే యీసు మన బ్రతుకే నైసు
ఒకే మాట ఒకేమాట పాట సాహిత్యం
చిత్రం: ఎదురీత (1963) సంగీతం: కె.వి.మహదేవన్ సాహిత్యం: ఆచార్య ఆత్రేయ గానం: పి.బి.శ్రీనివాస్, ఎస్.జానకి ఒకేమాట ఒకమాట అడగనా చెలీ ఒకే బదులు ఒకే బదులు చెప్పినామరి పరుగులెత్తు పరువానికి ఏది పగ్గము పలుకరించు కనులలోని చిలిపి అందము పగటివేళ కాంచు కలలకేమి అర్థము మధుర మధుర భావములకు మారు రూపము దినం దినం కొత్తదనం దేనికున్నది చెలికన్నుల చెరలాడే చెలిమి కున్నది వెన్నెలలే వేడిగా వేచు డెపుడు వెన్నంటి కన్నెకొరకు వేచినప్పుడు అందిన కనిపించి అందనిదేది అందానికి సహజమైన అందమే అది లోకమంత ఏకమైన లొంగని దెవరు ఏకమై లోకమే ఏలు జంటలు
ధనంలొనే జగం ఉన్నది పాట సాహిత్యం
చిత్రం: ఎదురీత (1963) సంగీతం: కె.వి.మహదేవన్ సాహిత్యం: ఆచార్య ఆత్రేయ గానం: మాధవపెద్ది సత్యం పల్లవి: ధనంలోనే జగం ఉన్నది నిజం నిజం ధనం ముందు గుణం చిన్నది నిజం నిజం అనుపల్లవి: కలవాడే మొనగాడీ కాలంలో ధనం లేనివాడు అందరికీ కానివాడు ధరలో చరణం: కలిమిలోన పూలు చల్లి పూజచేతురు లేమిలో రాళ్లు దువ్వి తరిమి వేతురు కాలచక్రమిటే మారిపోవునని ఎరుగరు గతం మరచి గంతులేయు మూఢమనుజులు మంచితనం చేతకాని తనమీ నాడు మానవత్వమున్న బ్రతుకలేదు ఎవడు ఉన్ననాడె అందరు మనకు ఆప్తులు చెరువు నిండినప్పుడు చేరు కప్పలు
పూవు పుట్టగానే తాను పరిమళించును పాట సాహిత్యం
చిత్రం: ఎదురీత (1963) సంగీతం: కె.వి.మహదేవన్ సాహిత్యం: ఆరుద్ర గానం: పి.బి.శ్రీనివాస్, ఎస్.జానకి పువ్వు పుట్టగానే తాను పరిమళించును నువ్వు నన్ను చేర మనసు పరవశించును చందమామ మోముచూచి జలధి పొంగును అందగత్తె అంతకన్న ఆశగొలుపును చేతిలోన చేయి చేయి చింతతీరును చెలియగాలి సోకి మనసు నేద తీరును స్వాతి వానకొరకు చేను ఎదురు చూచును లేత మనసు ప్రియునికొరకు వేచియుండును నీరు వీడి చేపకున బ్రతుకనేరదు నిన్ను విడిచి నాదుమేను నిలువజాలదు నీటిమబ్బు మూయగానే నెమలి ఆడును గూటిలోన పావురాళ్లు కొసరి పాడును మనసులోని కలలు పండి తనివి తీరును మరల మరల నిన్నుచూడ మత్తు గలుగును మల్లెపూల తేనెటీగ పలుకరించును చల్లగాలి వీచి జంట పులకరించును పువ్వు పుట్టగానే తాను పరిమళించును నువ్వు నన్ను చేర మనసు పరవశించున
ఎవరికెవరురా బంధువులు పాట సాహిత్యం
చిత్రం: ఎదురీత (1963) సంగీతం: కె.వి.మహదేవన్ సాహిత్యం: ఆరుద్ర గానం: పి.బి.శ్రీనివాస్ ఎవరికెవరురా బంధువులు ఎటు చూపే అటు మోసాలు చివికిన చీకటి జీవిత మందున చెదిరే నాలుగు స్తంభాలు చేతిలో కనకం ఉన్నంతనేపే కాకి బలగమంట - ఆ చేతిలో కనకం తీరిన వెనుక తిరిగి చూడరంట రాసులు చేర్చగ మోసంచేస్తే రాజభోగమంట రంగులు మార్చే ఊసరవెల్లికి రత్నపీఠ మంట తల్లీ తోడే ఎల్లాగున్నా తలచుకొందురంట తక్కిన వాళ్లో ధనహీనుణ్ణి తరిమి వేతురంట
No comments
Post a Comment