Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Intinti Ramayanam (1979)




చిత్రం: ఇంటింటి రామాయణం (1979)
సంగీతం: రాజన్ - నాగేంద్ర
సాహిత్యం: ఆరుద్ర, వేటూరి, కొంపెల్ల శివరాం
గానం: యస్.పి.బాలు, పి.సుశీల, ఎస్.జానకి
నటీనటులు: చంద్రమోహన్, రంగనాథ్, జయసుధ, ప్రభ
దర్శకత్వం: పి.సాంబశివరావు
నిర్మాత: నడింపల్లి కృష్ణంరాజు
విడుదల తేది: 23.06.1979



Songs List:



ఇంటింటి రామాయణం వి పాట సాహిత్యం

 
చిత్రం: ఇంటింటి రామాయణం (1979)
సంగీతం: రాజన్ - నాగేంద్ర
సాహిత్యం: ఆరుద్ర
గానం: యస్.పి.బాలు, పి.సుశీల 

ఇంటింటి రామాయణం వింతైన ప్రేమాయణం
కలిసుంటే సల్లాపము విడిపోతే కల్లోలము
ఇంటింటి రామాయణం వింతైన ప్రేమాయణం
కలిసుంటే సల్లాపము విడిపోతే కల్లోలము
సీతమ్మ చిలకమ్మ రామయ్య గోరింక
వలపుల తలపుల సరాగం
ఇంటింటి రామాయణం వింతైన ప్రేమాయణం అహహ

చరణం: 1
నీవుంటే నందనవనము లేకుంటే అశోకవనము
నీవుంటే నందనవనము లేకుంటే అశోకవనము
నీవాడే ఊసులన్ని రతనాల రాశులే
నీవుంటే పూలబాట లేకుంటే రాళ్ళబాట
నీవుంటే పూలబాట లేకుంటే రాళ్ళబాట
నీతోటి ఆశలన్ని సరసాల పాటలు ముత్యాల మూటలు
అల్లల్లే ఎహే

ఇంటింటి రామాయణం వింతైన ప్రేమాయణం
కలిసుంటే సల్లాపము విడిపోతే కల్లోలము
చిలకమ్మ గోరింక
అ సిరిమల్లే అ పొదరినట
చిలకమ్మ గోరింక సిరిమల్లే పొదరింట నవ్వాలి నవ్వాలి
కలిసి కిలకిల నవ్వాలి
కలిసి కిలకిల నవ్వాలి
ఇంటింటి రామాయణం వింతైన ప్రేమాయణం

చరణం: 2
సరి అంచు చీరలు తెస్తా కవరింగు సరుకులు పెడతా
సరి అంచు చీరలు తెస్తా కవరింగు సరుకులు పెడతా
తెమ్మంటే మాయలేడి తేలేనే నిన్నొదిలి
ఓ ఓ ఓ ఓ ఒహొహొహొహొ హొయ్
మబ్బుల్లో నీళ్ళు చూసి ముంత ఒలకబోసుకోను
మబ్బుల్లో నీళ్ళు చూసి ముంత ఒలకబోసుకోను
కీచులాడుకున్న నువ్వు రోషమొచ్చి పోకురా కలిసి మెలిసి ఉండరా
ఇంటింటి రామాయణం వింతైన ప్రేమాయణం ఓయ్

చరణం: 3
ఇల్లేకద స్వర్గసీమ ఇద్దరిది చెరగని ప్రేమ
ఇల్లేకద స్వర్గసీమ ఇద్దరిది చెరగని ప్రేమ
కలతలేని కాపురాన కలలన్ని పండాలి
అహహహహ మోజున్న ఆలుమగలు కులకాలి రేయిపగలు
మోజున్న ఆలుమగలు కులకాలి రేయిపగలు
మన ఇద్దరి పొందికచూసి ఈ లోకం మెచ్చాలి దీవెనలే ఇవ్వాలి

ఇంటింటి రామాయణం వింతైన ప్రేమాయణం
కలిసుంటే సల్లాపము విడిపోతే కల్లోలము
సీతమ్మ చిలకమ్మ రామయ్య గోరింక
వలపుల తలపుల సరాగం
ఇంటింటి రామాయణం వింతైన ప్రేమాయణం
కలిసుంటే సల్లాపము విడిపోతే కల్లోలము
అహహ చిలకమ్మ గోరింక సిరిమల్లే పొదరింట నవ్వాలి నవ్వాలి
కలిసి కిలకిల నవ్వాలి
కలిసి కిలకిల నవ్వాలి
ఇంటింటి రామాయణం వింతైన ప్రేమాయణం
కలిసుంటే సల్లాపము విడిపోతే కల్లోలము
కలిసుంటే సల్లాపము విడిపోతే కల్లోలము




మల్లెలు పూసే వెన్నెల కాసే పాట సాహిత్యం

 
చిత్రం: ఇంటింటి రామాయణం (1979)
సంగీతం: రాజన్ - నాగేంద్ర
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు, పి.సుశీల 

మల్లెలు పూసే వెన్నెల కాసే ఈ రేయి హాయిగా
మల్లెలు పూసే వెన్నెల కాసే ఈ రేయి హాయిగా
మల్లెలు పూసే వెన్నెల కాసే ఈ రేయి హాయిగా
మమతలు వేయిగ పెనవేయి నన్ను తీయగా
మల్లెలు పూసే వెన్నెల కాసే ఈ రేయి హాయిగ

ముసి ముసి నవ్వులలో గుస గుస లాడినవే
నా తొలి మొజులలో నీ విరజాజులై
ముసి ముసి నవ్వులలో గుస గుస లాడినవే
నా తొలి మోజులలో నీ విరజాజులై...
మిస మిస వన్నెలలో మిల మిల మన్నవిలె
ఈ బిగి కౌగిలిలో జాబిలి రాత్రులే
కాటుకలంటుకున్న కౌగిలింత లెంత వింతలే
మనసులు పాడే మంతనమాడే ఈ పూట జంటగా
మమతలు వేయిగ పెనవేయి నన్ను తీయగా

మల్లెలు పూసే వెన్నెల కాసే ఈ రేయి హాయిగా..హాహా..హాహా..ఆ
తొలకరి కోరికలే తొందర చేసినవే
ఈ విరి సెయ్యకే ఆవిరి తీరగా
తొలకరి కోరికలే తొందర చేసినవే
ఈ విరి సెయ్యకే ఆవిరి తీరగా
సొగసరి కానుకలే సొద పెడుతున్నవిలే
యే తెర చాటునో ఆ చెఱ వీడగా
అందిన పొందులోనె అందలేని విందులీయవె
కలలిక పండే కలయిక నేడే కావాలి వేడిగా
మమతలు వేయిగ పెనవేయి నన్ను తీయగా

మల్లెలు పూసే వెన్నెల కాసే ఈ రేయి హాయిగా
మమతలు వేయిగ పెనవేయి నన్ను తీయగా
మల్లెలు పూసే వెన్నెల కాసే ఈ రేయి హాయిగా



వీణ వేణువైన సరిగమ విన్నావా పాట సాహిత్యం

 
చిత్రం: ఇంటింటి రామాయణం (1979)
సంగీతం: రాజన్ - నాగేంద్ర
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు, ఎస్.జానకి

పల్లవి:
వీణ వేణువైన సరిగమ విన్నావా
ఓ ఓ ఓ తీగ రాగమైన మధురిమ కన్నావా
తనువు తహతహలాడాల చెలరేగాల చెలి ఊగాల ఉయ్యాలలీవేళలో
వీణ వేణువైన సరిగమ విన్నావా
ఓ ఓ ఓ తీగ రాగమైన మధురిమ కన్నావా

చరణం: 1
ఊపిరి తగిలిన వేళ నే ఒంపులు తిరిగిన వేళ
నా వీణలో నీ వేణువే పలికే రాగమాల
ఆ ఆ ఆ ఆ లలలా ఆ ఆ
చూపులు రగిలిన వేళ ఆ చుక్కలు వెలిగిన వేళ
నా తనువున అణువణువున జరిగే రాసలీల ఆ ఆ
వీణ వేణువైన సరిగమ విన్నావా
ఓ ఓ ఓ తీగ రాగమైన మధురిమ కన్నావా

చరణం: 2
ఎదలో అందం ఎదుట ఎదుటే వలచిన వనిత
నీ రాకతో నా తోటలో వెలసే వన దేవత
ఆ ఆ ఆ ఆ లలలా ఆ ఆ
కదిలే అందం కవిత అది కౌగిలికొస్తే యువత
నా పాటలో నీ పల్లవే నవత నవ్య మమత ఆ ఆ

వీణ వేణువైన సరిగమ విన్నావా
ఓ ఓ ఓ తీగ రాగమైన మధురిమ కన్నావా
తనువు తహతహలాడాల చెలరేగాల చెలి ఊగాల ఉయ్యాలలీవేళలో
వీణ వేణువైన సరిగమ విన్నావా
ఓ ఓ ఓ తీగ రాగమైన మధురిమ కన్నావా




ఈ తరుణము..వలపే శరణము పాట సాహిత్యం

 
చిత్రం: ఇంటింటి రామాయణం (1979)
సంగీతం: రాజన్ - నాగేంద్ర
సాహిత్యం: కొంపెల్ల శివరాం
గానం: యస్.పి.బాలు, పి.సుశీల

పల్లవి:
ఏ..హే..హే హే..ఏ..
ఆ..హా..ఆ..హా..ఆహా..ఆ ఆ

ఈ తరుణము..వలపే శరణము
జగములే సగముగా..యుగములే క్షణముగా
మౌనంగ..సాగనీ..తనువంతా రేగనీ
మౌనంగ..సాగనీ..తనువంతా రేగనీ
ఈ తరుణము..వలపే శరణము
జగములే సగముగా..యుగములే క్షణముగా

చరణం: 1
అరవిరిసిన పూలలోనే..నీ అందం తూచనా
ఊరించే మోవిలోనే..తేనియలే దోచనా
కలసిన మన చూపుతోనే..కాలాన్నే ఆగనీ
బంధించే చేతులందూ..ఊయలనై ఊగనీ
నీ దోరనవ్వు విరజాజిపూవు పరువాలు రువ్వు పాలపొంగులో

ఈ తరుణము..వలపే శరణము
జగములే సగముగా..యుగములే క్షణముగా
మౌనంగ..సాగనీ..తనువంతా రేగనీ
మౌనంగ..సాగనీ..తనువంతా రేగనీ
ఈ తరుణము..వలపే శరణము
జగములే సగముగా..యుగములే క్షణముగా

చరణం: 2
ఉసిగొలిపే కొండగాలీ..వేడంత పంచనా
కవ్వించే పొంగులన్నీ..రవికై బిగియించనా
చిరుచెమటలు పోయువేళా..గుండెల్లో నిండిపో
గుండెల్లో నిండిపోయీ..ఊపిరివై ఉండిపో
ఈ కొండకోన అందాలలోన..సుధలొలకబోవుపూలబాటలో

ఈ తరుణము..వలపే శరణము
జగములే సగముగా..యుగములే క్షణముగా
మౌనంగ..సాగనీ..తనువంతా రేగనీ
మౌనంగ..సాగనీ..తనువంతా రేగనీ
ఈ తరుణము..వలపే శరణము
జగములే సగముగా..యుగములే క్షణముగా
లలలలా..లలలలా..లలలలా  




శ్రీ రామ నామమ్ము సర్వస్వం అని (హరికథ) పాట సాహిత్యం

 
చిత్రం: ఇంటింటి రామాయణం (1979)
సంగీతం: రాజన్ - నాగేంద్ర
సాహిత్యం: ఎమ్.వి.ఎల్,  కొంపెల్ల శివరాం
గానం: 

శ్రీ రామ నామమ్ము సర్వస్వం అని ....... (హరికథ)




ఉప్పూ కారం పాట సాహిత్యం

 
చిత్రం: ఇంటింటి రామాయణం (1979)
సంగీతం: రాజన్ - నాగేంద్ర
సాహిత్యం: వేటూరి
గానం: 

ఉప్పూ కారం 

No comments

Most Recent

Default