చిత్రం: జగత్ జెట్టిలు (1970) సంగీతం: ఎస్.పి.కొదండపాణి సాహిత్యం: దేవులపల్లి కృష్ణ శాస్త్రి, కోసరాజు రాఘవయ్య చౌదరి, కోడకండ్ల అప్పలచార్య గానం: యస్.పి.బాలు, మాధవపెద్ది సత్యం, పి.సుశీల, ఎల్.ఆర్. ఈశ్వరి నటీనటులు: శోభన్ బాబు, వాణిశ్రీ, రేణుక, విజయలలిత, చంద్రమోహన్, స్నేహ ప్రభ (నూతన తార) కథ: విజయబపినీడు అసోసియేట్ డైరెక్టర్స్: దాసరి నారాయణరావు, ఎం.ఎస్. కోటా రెడ్డి దర్శకత్వం: కె.వి. నందనరావు నిర్మాతలు: పి.ఏకామ్రేశ్వరరావు, కె. రాఘవ విడుదల తేది: 18.06.1970
Songs List:
జానీ జింజర్ జానీ జింజర్ పాట సాహిత్యం
చిత్రం: జగత్ జెట్టిలు (1970) సంగీతం: ఎస్.పి.కొదండపాణి సాహిత్యం: కోసరాజు రాఘవయ్య చౌదరి గానం: ఎల్.ఆర్. ఈశ్వరి జానీ జింజర్ జానీ జింజర్ సైరా సర్దారు వారే వారే వా వా | భలే హుషారు | తిరుగులేదు మనదెబ్బకు తిరుగులేదురా తిరుగులేదు మన దెబ్బకు తిరుగులేదురా! రాయి రాయి రాసుకుంటే నిప్పు పుడతదీ । మీ చేయి చేయి కలిపితే డబ్బూడిపడతదీ నిప్పుకు గాలికి యిప్పుడు నేస్తమయ్యింది ఇక చూస్కో నారాజా మజాగుంటదీ॥ కొండనైన పిండిపిండిగ కొట్టేస్తారూ । అ కొండమీద కోతినైన దింపేస్తారూ|| సాటిలేని మేటి వీరసింహులుమీరు మీ ధాటి కెదురులేరు ! ఎదురైతే బ్రతికిపోరు పడుచుపిల్ల కాస్త ప్రక్కనుంటేచాలు | ఎంతపనినైనా చిటికెలోన చెయ్యగవీలు|| మన ముగ్గురమొకటైతే ఇంకేముందీ । అనుకున్నది చేతిలోకి చిక్కిపోతుందీ | మనకు దక్కిపోతుందీ
చిరునవ్వు దివ్వె ఏమన్నది పాట సాహిత్యం
చిత్రం: జగత్ జెట్టిలు (1970) సంగీతం: ఎస్.పి.కొదండపాణి సాహిత్యం: దేవులపల్లి గానం: పి.సుశీల, ఎల్. ఆర్. ఈశ్వరి & బృందం చిరునవ్వు దివ్వె ఏమన్నదీ అరమోడ్పు కన్నులేమన్నదీ తనకున్న మున్నె మగడున్నచోటికి మనసుపోయేనంటున్నదీ లేడిలా మనసు పరుగిడినా వగలాడి ఆ బిగువెందులకే వేడికోరికల దాడులకే పూబోణి రవ్వంత జంకెనులే తొలినాటివేనే ఈ బిగువు| ఒక రాతిరేనే ఈ బెదురు ఆ పైన మనవైపు చూడదులే ఇంతి ముంగురులు సరదవే వెన్నెల రాసి నొకపరి చూడాలి ఎంతమురిపాలె అన్నకు తన చెల్లి సొగసులు చూసుకొని అల్లారు మేనల్లు నెత్తుకొని అంతలో తిరిగివచ్చుననీ శ్రీవారితో ముందే చెప్పాలనీ కలికిరో కలువరేకులలో కనిపించు ఆ మంచు ఎందులకే కమ్మగా వరుని విరిపాన్పు రమ్మంటే వలపుల విందులకు వింత తళుకులూ విరిశాయి ఏదో విశేష మీరేయీ కదలవే మదనుకొలువునకు
షోకైన మల్లెపువ్వుమీద పాట సాహిత్యం
చిత్రం: జగత్ జెట్టిలు (1970) సంగీతం: ఎస్.పి.కొదండపాణి సాహిత్యం: అప్పలాచార్య గానం: ఎల్. ఆర్. ఈశ్వరి (Note: ఇది ఆడియో వెర్షన్, వీడియో వెర్షన్ లో కొన్ని మర్పులు చేశారు) షోకీల్లా పిల్లా బుగ్గమీద ముద్దిచ్చే మోజు నీకులేదా ఉంటేలే-లే-లేచి రా-రా- రా నీకు వైకుంఠమే చూపుతా ఈ మగువ నవ్వులలో నా బిగువు కౌగిలిలో మత్తు ఉందీ | గమ్మత్తు ఉంది. రంజైన సుఖముంది రా ఒక్కసారీ చిక్కితేనూ ఇక పైన పోలేవురా ఈ మేని ఒంపులలో లేమెరుపు చూపిస్తా తేనెలూరే వయసులోని రుచి నీకు అందించుతా నిన్నలేదు రేపుదూ జల్సాగ జీవించరా
అంబ పలుకవే జగదంబ పలకవే పాట సాహిత్యం
చిత్రం: జగత్ జెట్టిలు (1970) సంగీతం: ఎస్.పి.కొదండపాణి సాహిత్యం: కొసరాజు గానం: యస్.పి.బాలు, మాధవపెద్ది సత్యం, పి.సుశీల అంబ పలకవే జగదంబ పలకవే కొండకింద కోటమ్మ పలకవే ఎక్కడ వున్నావే తల్లీ ఏమైపోయినావే ఎక్కడ వున్నావే తల్లీ ఏమైపోయినావే టక్కుటమారం నేర్చినోళ్ళు నిను చిక్కించుకోను చూస్తారే పక్కన పొంచులు వేస్తారే బొందిలో ప్రాణం ఉండువరకు ఆ చవటల ఆటలు సాగనియ్యమే ఆ చవటల ఆటలు సాగనియ్యమే ఎదురుగానే నీవున్నావా. ఎవరికి కనపడకున్నావా లోకోద్ధరణకు పుట్టావమ్మా నీకు సాటి ఎవరమ్మా బొమ్మా నీదయ మాపై ఉంటేచాలు మట్టినైన మాణిక్యం చేస్తాం రాళ్ళనైన రత్నాలుగ చేస్తాం దేశద్రోహుల నాశంచేసి ఆశాజ్యోతుల వెలిగిస్తాం
No comments
Post a Comment